• facebook
  • whatsapp
  • telegram

కోడింగ్ - డీకోడింగ్

* కోడింగ్ అంటే ఒక పదాన్ని లేదా సారాంశాన్ని మూడో వ్యక్తి గుర్తించకుండా సంకేతాలతో ఇవ్వడం. డీకోడింగ్ అంటే అలా సంకేతాలతో ఇచ్చిన పదాలను లేదా సారాంశాన్ని మామూలు పదంగా మార్చడం.

* టెస్ట్ ప్రశ్నలో ఇచ్చిన కోడ్ భాషను అభ్యర్థి గుర్తించి అదే విధంగా డీకోడింగ్ చేయగలుగుతున్నాడా లేదా అనే అంశాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిందే ఈ కోడింగ్, డీకోడింగ్.

* ఇచ్చిన పదాలు, సంఖ్యలు వాటి మధ్య సంబంధాలు నిజమైనవి కావు. అవి ఊహాత్మకమైనవి.

* రహస్య విషయాలు దానికి సంబంధించిన వ్యక్తులకు తప్ప మిగిలినవారికి తెలియకుండా ఉండేందుకు ఈ కోడింగ్ ఉపయోగిస్తారు.

* కోడింగ్, డీకోడింగ్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలను సాధన చేయడానికి ముందు అభ్యర్థికి అల్ఫాబెటికల్ ఆర్డర్‌మీద మంచి అవగాహన అవసరం. అలాగే రివర్స్ ఆర్డర్ మీద కూడా అవగాహన ఉండాలి.


                           


* టేబుల్‌పై మంచి అవగాహన ఉంటే ఇచ్చిన ప్రశ్నలకు సులువుగా సమాధానం రాబట్టవచ్చు.

ఉదా: P అంటే పదహారు ఏళ్ల వయసు అంటే P = 16 ఆ విధంగా మనకు గుర్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. 
 

కోడింగ్ - డీకోడింగ్ రకాలు

1. Letter coding

2. Number coding

3. Number to letter coding

4. Matrix coding

5. Substitution

6. Mixed letter coding

7. Mixed Number coding
 

Letter Coding: దీనిలో ఒక ఇంగ్లిష్ పదాన్ని, దాని కోడ్ రూపాన్ని ఇచ్చి వేరే పదానికి కోడ్ రూపాన్ని లేదా కోడ్ రూపానికి సంబంధించిన పదాన్ని కనుక్కోవాలని అడుగుతారు.
 

Number Coding: దీనిలో సంఖ్యలను, ఆంగ్ల పదాలకు కోడ్‌గా లేదా ఆంగ్లపదాలను సంఖ్యలకు కోడ్‌గా ఇస్తారు.
 

Number to letter coding: దీనిలో ఒక సంఖ్యకు ఒక ఆంగ్ల అక్షరాన్ని కోడ్‌గా ఇస్తే, కొన్ని సంఖ్యల సమూహానికి కోడ్ కనుక్కోవాలి.
 

Matrix Coding: ఇందులో ఒక పదం ఇస్తారు. దానికి సంబంధించిన రెండు matrix ఇస్తారు. అందులో ఉన్న అక్షరానికి నిలువు లేదా అడ్డు వరుసల ద్వారా కోడ్ కనుక్కోవాలి.
 

Substitution: దీనిలో కొన్ని పదాలు లేదా వస్తువులు వేరొక పదంతో కోడ్ చేసి ఉంటాయి.
 

Mixed Letter Coding: దీనిలో 3 లేదా 4 పదాలున్న వాక్యాలను, వాటి కోడ్‌లను ఇచ్చి ఆ వాక్యాల్లో ఉన్న ఏదో ఒక పదం కోడ్ కనుక్కోమంటారు.
 

Mixed Number Coding: దీనిలో కొన్ని సంఖ్యలను ఆంగ్ల పదాలుగా కోడ్‌చేసి ఆ సంఖ్యల్లోని ఏదో ఒక అంకె కోడ్ అడుగుతారు.

మాదిరి ప్రశ్నలు

1.  'FURNITURE'ను కోడ్‌ భాషలో 'ERUTNRUF'గా రాశారు. అదే కోడ్‌ భాషలో ‘FRAGRANCE’ను ఎలా రాస్తారు?

1) FCNAGRFA           2) FARGRACEN 

3) ECNARGARF       4) ARFGNCRE 

సాధన: FURNITURE లోని అక్షరాలను తిప్పి రాస్తే, వచ్చేది ERUTINRUF. అదే విధంగా FRAGRANCE కోడ్‌ ECNARGARF 

సమాధానం: 3

2. DIAMONDకు కోడ్‌ AFXJLKA అయితే ‘JLKHBV’ అనే పదానికి కోడ్‌ ఏది? 

1) MONKER           2) KEYMON 

3) MONITER          4) MONKEY 

సాధన: D I A M O N D
−3| −3| −3| −3| −3| −3| −3|
A F X J L K A

అదే విధంగా

J L K H B V
−3| −3| −3| −3| −3| −3|
M O N K E Y

సమాధానం: 4

3. ఒక కోడ్‌ భాషలో ‘TRIANGLE’ అనే పదాన్ని ‘SSHBMHKF’గా రాస్తే, ఆ కోడ్‌ భాషలో ‘EXAMPLE’ అనే పదం ఎలా ఉంటుంది?

1) DYBNOMD        2) DYZNOMD 

3) DYZNAMD        4) DYZNAMF

సాధన: T R I A N G L E
−1| +1| −1| +1| −1| +1| −1| +1|
S S H B M H K F
అదే విధంగా

E X A M P L E
−1| +1| −1| +1| −1| +1| −1|
D Y Z N O M D

సమాధానం: 2

4. ఒక కోడ్‌ భాషలో ‘PAPER’-ని QCSIWగా రాస్తే, అదే కోడ్‌లో ‘EXAMPLE’ అనే పదాన్ని ఎలా రాస్తారు?

1) FZQUDRL       2) FZDUQRL

3) FZQDUR        4) FZDQURL

సాధన: P A P E R
+1| +2| +3| +4| +5|
Q C S I W

అదే విధంగా

E X A M P L E
+1| +2| +3| +4| +5| +6| +7|
F Z D Q U R L

సమాధానం: 4

5. COLLEGE కోడ్‌ AMJJCEC అయితే UNIVERSITY కోడ్‌ ఏది?

1) VOJWFSTJUZ

2) TMHUDQRHSH

3) SLGTCPQGRW

4) WPKXGTUKVA

సాధన: C O L L E G E
−2| −2| −2| −2| −2| −2| −2|
A M J J C E C

అదే విధంగా

U N I V E R S I T Y
−2| −2| −2| −2| −2| −2| −2| −2| −2| −2|
S L G T C P Q G R W

సమాధానం: 3

6. TABLE కోడ్‌ WDEOH  అయితే BOARD కోడ్‌ ఎంత?

1) CPBSE       2) ERDUG

3) ERFUH        4) ESDVG

సాధన:

సమాధానం: 2

7. FATను 6 + 1 + 20తో సూచిస్తే, లినితివిను ఎలా సూచిస్తారు?

1) 12 + 5 + 1 +  14

2) 12 + 5 + 1 + 13

3) 12 + 4 + 1 + 1 + 14

4) 12 + 6 + 1 + 14

సాధన: ఆంగ్ల వర్ణమాల ప్రకారం

A = 1, B = 2, C = 3, D = 4 ....
x = 24, y = 25, z = 26
FAT = F + A + T = 6 + 1 + 20
LEAN = L + E + A + N
= 12 + 5 + 1 + 14

సమాధానం: 1 

8. A = 26, SUN = 27 అయితే CAT = ....

1) 24      2) 27      3) 57      4) 58

సాధన: వ్యతిరేక అక్షరాలను తీసుకోవాలి.

సమాధానం: 3

9. ZIP = 198, ZAP = 246 అయితే  VIP కోడ్‌ ఏది? 

1) 222          2) 888         3) 174         4) 990 

సాధన:

సమాధానం: 1

10. MOBILITYని 46293927గా కోడ్‌ చేస్తే, EXAMINATIONని ఏ విధంగా కోడ్‌ చేయొచ్చు?

1) 57159413955    2) 45038401854

3) 56149512965    4) 57250623076

సాధన:

సమాధానం: 3

11. ‘SYSTEM’-ని ‘SYSMET’గా, ‘NEARER’-ని ‘AENRER’-గా రాస్తే, ‘FRACTION’-ను ఏ విధంగా రాయొచ్చు?

1) FRACNOIT    2) NOITERAC

3) CARETION    4) CARFNOIT

సాధన: 

సమాధానం: 4

12. ఒక ప్రత్యేక కోడ్‌లో AUTHORని AUOTHRగా రాస్తే, PUBLICని ఎలా రాస్తారు?

1) UBIPLC        2) PUIBLC

3) PUCBIL        4) PBCLUI

సాధన:

సమాధానం: 2

13. ఒక ప్రత్యేక కోడ్‌లో TALENTను LATENTగా రాస్తే, CLOUDSను ఏ విధంగా రాయొచ్చు?

1) CUDLSO      2) SDUCLO

3) OLCUDS      4) OUSDLC

సాధన:

సమాధానం: 3

14. ఒక కోడ్‌ భాషలో LACK అనే పదాన్ని 396గా రాస్తే, BACK అనే పదాన్ని ఎలా రాస్తారు?

1) 66   2) 56   3) 86   4) 72

సాధన:

సమాధానం: 1

15. ఒక కోడ్‌ భాషతో ‘PEPPER’ అంటే ‘@#@@#!’,  ‘AIM’ అంటే ‘^?*’ అయితే ‘PAMPER’ అనే పదాన్ని కింది ఏ విధంగా రాయొచ్చు?

1) @^*@#!       2) @*^@#!

3) @*^@#!      4) @^*@!#

సాధన:

సమాధానం: 1

16. ఒక ప్రత్యేక భాషలో HEARTను @8531గా FEASTను #8541 అని రాస్తే, ఆ కోడ్‌ భాషలో FARTHESTను ఏ విధంగా రాస్తారు?

1) @8543#18        2) #5314@81

3) #5314@81        4) #531@481

సాధన:

సమాధానం: 3

17. ఒక కోడ్‌ భాషలో 123 అంటే “bright little boy”, 145 అంటే“tall big boy”, 637 అంటే “beautiful little flower”.అదే భాషలో ఏ అంకె “Bright”ని సూచిస్తుంది?

1)  1       2) 2       3)  3       4) 4

సాధన:

సమాధానం: 2

రచయిత

డి.దేవేంద్ర


 

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌