• facebook
  • whatsapp
  • telegram

 కోడింగ్ - డీకోడింగ్

1. ఒక పరిభాషలో CAT ను DDY గా రాస్తే, BIGను ఏమని రాస్తారు?

జ:   CLL

వివరణ:   దీంట్లో మొదటి పదానికి రెండో పదానికి మధ్య ఉన్న సంబంధం +1, +3, +5.... గా ఉంది

          
2. ఒక పరిభాషలో WORK ను 4567, MAN ను 328 గా రాస్తే, అదే భాషలో WOMAN ను ఎలా రాస్తారు?

జ:   45328

వివరణ:  W O R K ను 4 5 6 7, M A N ను 3 2 8 గా ఇచ్చారు. ఈ రెండింటిలో ఉమ్మడిగా ఏ అక్షరం లేదు కాబట్టి ఏ అక్షరానికి అదే సంఖ్య కోడ్ అవుతుంది. అంటే W = 4, O = 5, R = 6... అప్పుడు W O M A N = 4 5 3 2 8 అవుతుంది.

3. ఒక పరిభాషలో ROBUST ను QNATRS గా రాస్తే అదే భాషలో ZXCMP ను ఏమని రాస్తారు?

జ:   YWBLO

వివరణ: దీంట్లో మొదటి పదంలోని ప్రతి అక్షరం నుంచి -1 చేస్తే రెండో పదం వస్తుంది.

     R   O   B   U   S   T                     Z   X   C   M   P

     -1  -1  -1  -1  -1 -1                    -1  -1  -1  -1  -1

     Q   N   A   T   R   S                     Y   W   B   L   O

4. ఒక పరిభాషలో 2+3 = 32, 4+5 = 54 అయితే 6 +8 = ?

జ:   86

వివరణ: 2 +3 = 32, 4 +5 = 54 

   6 + 8 = 86

5. Z = 52 , ACT = 48 అయితే BAT = ?

జ:   46

వివరణ:  Z = 26 . దీన్ని '2' తో గుణిస్తే 52 అవుతుంది. Z = 26     26 × 2 = 52

ACT = 1 + 3 + 20 = 24       24 × 2 = 48 

   BAT = 2 + 1 + 20 = 23      23 × 2 = 46

6. ఒక పరిభాషలో BANGALORE ను EROLAGNAB గా రాస్తే CHANDIGARH ను ఏమని రాస్తారు?
జ:   HRAGIDNAHC
వివరణ:  BANGALORE ను రివర్స్‌లో రాస్తే రెండో పదం వస్తుంది.
BANGALORE        EROLAGNAB
ఇదే విధంగా CHANDIGARH       HRAGIDNAHC అవుతుంది.

7. ఒక పరిభాషలోDELHI ను EFMIJ గా రాస్తే అదే భాషలో BOMBAY ని ఏమని రాస్తారు?
జ:   CPNCBZ
వివరణ:  దీంట్లో D   E   L   H   I
                     +1 +1 +1 +1 +1 
                       E   F  M   I   J 
                    B   O   M   B   A   Y
                  +1  +1  +1  +1  +1  +1
                    C    P   N    C   B    Z

8. ఒక పరిభాషలో HAND ను SZMW గా రాస్తే అదే భాషలో MILKను ఏమని రాస్తారు?
జ:   NROP
వివరణ: ఇందులో మొదటి పదం డీకోడింగ్ చేస్తే రెండో పదం వస్తుంది. H = 8      (26-8) +1 = 19. ఇదే విధంగా
H A N D        S Z M W
M I L K         N R O P

9. ఒక పరిభాషలో HAPPY ను 51223 గా రాస్తే అదే భాషలో PAHPY ని ఏమని రాస్తారు?
జ:   21523
వివరణ:  H   A   P   P   Y
             5    1    2   2    3            
             P    A   H   P   Y
             2    1    5    2    3

10. ఒక పరిభాషలోMONKEY ని XDJMNL గా రాస్తే అదే భాషలో TIGER ను ఏమని రాస్తారు?
జ:   QDFHS
వివరణ: ఇందులో మొదటి పదంలో మొదటి అక్షరాన్ని -1 చేసి రెండో పదంతో చివరి అక్షరంగా రాశారు. ఈ విధంగా
M O N K E Y        X D J M N L
T I G E R          Q D F H S

11. ఒక పరిభాషలో CRICKET ను FULFNHW గా రాస్తే అదే భాషలో దేన్ని EULGH గా రాస్తారు?
జ:   BRIDE
వివరణ: ఇందులో ముందు పదంలోని ప్రతి అక్షరానికి +3 కలిపితే రెండో పదం వస్తుంది.
               C     R     I       C     K     E      T
             +3    +3   +3   +3    +3   +3   +3
                F    U     L      F     N     H     W
కానీ రెండో దానిలో రెండో పదం ఇచ్చి మొదటి పదాన్ని కనుక్కోనవలసి ఉంది. కాబట్టి అప్పుడు రెండో పదంలో నుంచి -3 చేస్తే మొదటి పదం వస్తుంది.
                   E     U      L      G      H
                  -3    -3     -3    -3    -3
                    B     R       I      D      E

12. ఒక పరిభాషలోRATLAM = 2 అయితే PADMINI = ?
జ:  
వివరణ: R   A  T   L   A   M
18 + 1 + 20 + 12 +1 + 13 = 65   
6 + 5 = 11    1 + 1 = 2
P    A   D   M   I   N   I
16 + 1 + 4 + 13 +9 + 14 + 9 = 66  
6 + 6 = 12   1 + 2 = 3

13. ఒక పరిభాషలో ACNE ని 3-17-29-11 గా రాస్తే అదే భాషలో BOIL ను ఏమని రాస్తారు?
జ:   5 - 31 - 19 - 25
వివరణ: దీంట్లో A విలువ 3 ఇచ్చారు. దీని విలువను 2 తో గుణించి +1 చేస్తే 3 అవుతుంది.
A = 1 ×  2  + 1 = 3 ఈ విధంగా B = 2 ×  2 + 1 = 5
C = 3  ×   2 + 1 = 7 ఈ విధంగా O =15 ×  2 + 1 = 31
N =14  ×   2 + 1 = 29 ఈ విధంగా I = 9 ×  2 + 1 = 19
E = 5  ×   2 + 1 = 11 ఈ విధంగా L =12 ×  2 + 1 = 25

14. ఒక పరిభాషలో GHOST ను HOSTE గా రాస్తే అదే భాషలో HORSE ను ఏమని రాస్తారు?
జ:   ORSEF
వివరణ: దీంట్లో మొదటిపదంలోని G ని -2 చేసి రెండో పదం చివర్లో రాశారు.
GOST       HOSTE
HORSE     ORSEF

15. ఒక పరిభాషలో INDIA ను 95491 గా రాస్తే అదే భాషలో DELHI ని ఏమని రాస్తారు?
జ:   45389
వివరణ:  దీంట్లో I = 9, N = 14     1 + 4 = 5 గా రాశారు.
     I    N   D   I    A
     9    5    4   9    1      (N = 14      1+4 =5)
ఇదే విధంగా
     D    E   L   H   I       (L = 12    1+2=3)
     4     5    3   8   9

16. ఒక పరిభాషలో FRIEND ను HUMJTK గా రాస్తే అదే భాషలో CANDLE ను ఏమని రాస్తారు?
జ:   EDRIRL
వివరణ:   F   R   I     E    N    D                  C     A    N    D    L   E
       +2  +3  +4  +5  +6  +7                +2  +3  +4  +5  +6  +7 
           H    U    M   J    T    K                  E     D    R    I     R    L

17.  ఒక పరిభాషలో INSTITUTION ను NOITUTITSNI గా రాస్తే అదే భాషలో PERFECTIONను ఏమని రాస్తారు?
జ:   NOITCEFREP
వివరణ: దీన్ని 6వ సమస్య మాదిరిగా చేయాలి.

కోడింగ్ - డీకోడింగ్ - I.  >> Page - 8

18. ఒక పరిభాషలో GREEN ను FSDFM గా రాస్తే అదే భాషలో PINKను ఏమని రాస్తారు?
జ:   OJML
వివరణ: మొదటి పదాన్ని వరుసగా -1, +1... చేస్తే
             G   R    E    E     N                        P     I     N     K
      -1   +1   -1   +1   -1                      -1    +1   -1   +1 
             F    S     D    R     M                      O    J      M     L

19. ఒక పరిభాషలో DELHI ను 0405120809, MADRAS ను 130104180119 గా రాస్తే అదే భాషలో BOMBAY ని ఏమని రాస్తారు?
జ:   021513020125
వివరణ: దీంట్లో ఇచ్చిన పదం విలువ రెండు అంకెల్లో రాశారు.                  B     O    M    B    A      Y
                                                                                                         02   15   13   02   01   25
20. ఒక పరిభాషలో KUMAR ను 64 గా రాస్తే అదే భాషలో KUMARI ని ఏమని రాస్తారు?
జ:   73
వివరణ: ఇచ్చిన అక్షరాల విలువలను రాసి కూడితే 64 వస్తుంది.
KUMAR = 11+ 21 +13 +01 +18 = 64 ఇలాగే
KUMARI = 11+21+13+01+18+9 = 73

21. ఒక పరిభాషలో A = 2, B = 3, C = 4 ఈ విధంగా రాస్తే 17, 20, 26, 4, 9, 16, 13, 16, 8, 26 ను ఏమని రాస్తారు?
జ:   PSYCHOLOGY
వివరణ: దీంట్లో ఒక్కో అక్షరం విలువకు +1 చేశారు.
      17   20  26  4    9  16  13  16  8  26
       P    S    Y    C    H  O    L   O  G   Y

22. ఒక పరిభాషలో CRICKETER ను DQJBLDUDS గా రాస్తే PLAYER ను ఏమని రాస్తారు?
జ:   QKBXFQ
వివరణ:  దీన్ని18వ సమస్య మాదిరిగా చేయాలి.

23. ఒక పరిభాషలో BURNER ను CASOIS గా రాస్తే అదే భాషలో ALIMENT ఏమని రాస్తారు?
జ:   EMONIOU
వివరణ: దీంట్లో vowels ఉన్నచోట వాటి తర్వాతి vowel ను రాశారు. మిగిలిన అక్షరాలకు +1 చేశారు.
          BU  R   N   ER                    AL   IM  EN   T
         +1   +1   +1   +1                   +1   +1     +1   +1
          CA   S    O    IS                  EM  ON   IO    U

24. ఒక పరిభాషలో MODERN, ORTHODOXY లను YOUNGS, OGBAOUOML గా రాస్తే METHOD ను ఎలా రాస్తారు?
Ans:  YNBAOU
వివరణ:
ఇచ్చిన పదాలకు కోడ్ కనుక్కోవాలి. తర్వాత ఇచ్చిన పదాన్ని డీకోడ్ చేయాలి.

ఈ రెండింటిలో R డీకోడ్ G ఉంది. అంటే ప్రతి అక్షరం కోడ్‌ను నేరుగా ఇచ్చారు. 

  అవుతుంది

25. ఒక పరిభాషలో CLASSIC ను HZDNNTH గా రాస్తే, NEGLECT ను ఎలా రాస్తారు?
Ans:  DLPZLHP
వివరణ:
CLASSIC కోడ్ HZDNNTH అంటే C కోడ్ H, L కోడ్ Z, A కోడ్ D, S కోడ్ N, I కోడ్ T అని ఇచ్చారు. మనకు కావాల్సింది  NEGLECT  లో C అనేది కుడి నుంచి ఎడమ వైపు వెళితే రెండో స్థానంలో ఉంది. కాబట్టి, C కోడ్ H అని ఇచ్చారు. ఇచ్చిన ఛాయిస్‌లో H ఉంది (B) (D) లలో ఉంది. L కోడ్ Z ఇందులో L మధ్యలో ఉంది. అంటే (B), (D) ఛాయిస్‌లో మధ్య Z ఉంటే అదే మనకు కావాల్సిన జవాబు. అప్పుడు జవాబు (B) అవుతుంది.

26. ఒక పరిభాషలో COFFEE ను EEFFOC గా రాస్తే NOODLES ను ఎలా రాస్తాం?
Ans:  SELDOON
వివరణ:
COFFEE ని తిప్పి రాస్తే EEFFOC అవుతుంది. అలాగే NOODLES ను తిప్పి రాస్తే SELDOON అవుతుంది.

27. ఒక పరిభాషలో 12345671586 ను TERMINATION గా రాస్తే అదే పరిభాషలో 371586 ను ఎలా రాస్తాం?
Ans:  RATION
వివరణ: 


28.
ఒక పరిభాషలో PRABA ను 27595 గా, THILAK ను 368451 గా రాస్తే అదే పరిభాషలో BHARATHI ని ఎలా రాస్తారు?
Ans:  96575368
వివరణ:


29. ఒక పరిభాషలో RATE ను 9 -26 -7 -22 గా రాస్తే అదే పరిభాషలో BANK ను ఎలా రాయాలి? 
Ans:  25-26-13-16
వివరణ: 
R A T E - 9 - 26 -  7 - 22 రావాలంటే R అక్షరానికి వ్యతిరేక దిశలో I ఉంది. దానిపై సంఖ్య 9 ఉంది. అంటే ప్రతి అక్షరానికి వ్యతిరేకంగా ఉన్న అక్షరాన్ని తీసుకుని దానిపై ఉన్న ఒకసంఖ్యను రాశారు.B A N K కు వ్యతిరేకంగా ఉండే అక్షరాలు Y Z M P వీటిపై ఉండే సంఖ్యలు 25 - 26 - 13 - 16.

30. ఒక పరిభాషలో CAR = 22 గా రాస్తే, SCOOTER = ?
Ans:  95
వివరణ: 
  CAR=22 రావాలంటే వాటిపై ఉండే సంఖ్యలను తీసుకుని కూడాలి. C + A + R = 3 + 1 + 18 = 22. అలాగే  SCOOTER = 19 + 3 + 15 + 15 + 20 + 5 + 18 = 95.

31. ఒక పరిభాషలో BOOK - PEN = 8 అయితే PEN - NIB = ?
Ans:  10
వివరణ:
BOOK - PEN  = 8 రావాలంటే 
       (తీసెయ్యాలి)
పైవిధంగా

32. ఒక పరిభాషలో CAT + DOG = 50 అయితే BAT + HEN = ?
Ans:  50
వివరణ: 

33. ఒక పరిభాషలో AT × EAT = 5
               GO × GOAT = 21
                        EAR × TEAR = ?
Ans:  20
వివరణ:
AT × EAT = 5  కావడానికి AT  రెండింటిలో ఉంది. దాన్ని తీసేస్తే మిగిలింది E. దాని విలువ 5 అవుతుంది. 
GO × GOAT = 21 కావడానికి GO రెండింటిలో ఉంది. దాన్ని తీసివేస్తే మిగిలింది AT. దాని విలువ 21 (అంటే A + T = 1 + 20). 
EAR × TEAR = రావాలంటే EAR రెండింటిలో ఉంది. దాన్ని తీసివేస్తే మిగిలింది E. దాని విలువ 5 అవుతుంది.

34. ఒక పరిభాషలో BOMBAY ని MYMYMY గా రాస్తే TAMILNADU ను ఎలా రాస్తాం?
Ans:  MNUMNUMNU
వివరణ:
BOMBAY ని MYMYMY గా రాయడానికి BOMBAY లోని BO ను వదిలి M ను తర్వాత BA ను వదిలి Y ని తీసుకుని అందులో ఎన్ని అక్షరాలున్నాయో అన్నిసార్లు రాశారు. అలాగే TAMILANADU లో TA ను వదిలి Mను తీసుకోవాలి. తర్వాత ILను వదిలి Nను, చివరగా ADని వదిలి U ను తీసుకోవాలి. అప్పుడు MNU అవుతుంది. దాన్ని TAMILNADU లో ఎన్ని అక్షరాలుంటే అన్నిసార్లు రాయాలి. అప్పుడు MNUMNUMNU అవుతుంది.
12. ఒక పరిభాషలో SYSTEM ను SYSMET గా, NEARER ను AENRER గా రాస్తే FRACTION ను ఏమని రాస్తాం?
Ans:  CARFNOIT
వివరణ:
ఇలాంటి ప్రశ్నలకు జవాబు రావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. SYSTEM ను రెండు భాగాలుగా చేసి వాటిని తిప్పి రాశారు.



35-37: ఒక వ్యాపారి తాను అమ్మే వస్తువులకు కొన్ని కోడ్‌లు ఇచ్చాడు. అతడు ఉపయోగించిన కోడ్ OLISPAH = 28 అందులో O = రూ.1, L = రూ.2, I = రూ.3 ... ఈ విధంగా ఉన్నాయి.
35. SOAP ధర ఎంత?
Ans:  రూ.16
వివరణ:
Soap = 4 + 1 + 6 + 5 = రూ.6 

36. OIL యొక్క ముద్రించిన ధర ఎంత?
Ans:   రూ.6
వివరణ:
OIL = 1 + 3 + 2 = రూ.6

37. ఏ వస్తువు ధర రూ.22 గా ఉంటుంది?
Ans:   POLISH
వివరణ:
A)PALE = 5  +6 + 2 +E (ఇవ్వలేదు) (సరైందికాదు)
B)HOPS = 7 + 1 + 5 + 4 = 17 (సరైందికాదు)
C)HAIL = 7 +6 + 3 + 2 = 18 (సరైందికాదు)
D)POLISH = 5 + 1 + 2 + 3 + 4 + 7 = 22 (సరైంది)

38. ఒక పరిభాషలో MASTER 18 - 6 - 24 - 25 - 10 - 23 అయితే SMART = ?
Ans:  24 - 19 - 6 - 23 - 25 
వివరణ:
M    A    S    T    E    R
13    1   19   20  5    18  ప్రతిదానికి '5' కలిపితే
= 18 - 6 - 24 - 25 - 10 - 23 అవుతుంది
అదే విధంగా
SMART = 24 - 19 - 6 - 23 - 25 అవుతుంది.

39. ఒక పరిభాషలో MOBILITY = 46293937 అయితే EXAMINATION = ?
Ans:  56149512965
వివరణ:

మనకు కావాల్సిన జవాబు: 56149512965

40. ఒక పరిభాషలో Fashion ను Foihsan గా రాస్తే Problem ను ఏమని రాస్తాం?
Ans:  Pelborm
వివరణ:
FASHION ను FOIHSAN గా రాశారు. అంటే మొదటి, చివరి అక్షరాలను అదేవిధంగా రాశారు. మిగిలిన వాటిని వెనుక నుంచి ముందుకు రాశారు.

41. ఒక కోడ్ భాషలో MADRAS అనే దాన్ని NBESBT గా రాస్తే BOMBAY ని ఏవిధంగా రాస్తారు?
జ:  CPNCBZ
వివరణ :  ఈ ప్రశ్నలో MADRASను NBESBT అంటే ప్రతి అక్షరం ముందు అక్షరం అవుతుంది.
M    A  D   R   A   S          B  O  M   B   A   Y
+1 +1  +1 +1 +1 +1       +1 +1 +1 +1 +1 +1
N    B   E    S    B  T          C  P   N   C   B    Z

42. ఒక పరిభాషలో ALTERED ను ZOGVIVW గా రాస్తే అదే భాషలో RELATED ను ఎలా రాస్తారు?
జ:  IVOZGVW 
వివరణ :  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం ALTERED ను ZOGVIVW గా రాశారు. మామూలుగా చూస్తే దీనికి సంబంధం కనుక్కోవడం కష్టం. కాబట్టి A కు వ్యతిరేకంగా Z, L కు O. ఈ విధంగా చూస్తే.
A  L  T   E  R  E  D             R  E  L  A  T  E  D
Z  O  G   V  I  V  W            I  V  O  Z  G  V  W

43. ఒక కోడ్ భాషలో CONTRIBUTOR ను RTNOCIROTUB గా రాస్తే అదే భాషలో PROHIBITION ను ఏవిధంగా రాస్తారు?
జ: IHORPBNOITI
వివరణ :  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదానికి కోడ్‌కు సంబంధం ఎలా ఉందంటే ఇచ్చిన పదంలో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి. అందులో మొదటి 5 అక్షరాలను, చివరి 5 అక్షరాలను తిప్పి రాశారు. మధ్యలో ఉన్న ఒక అక్షరాన్ని అదే విధంగా రాశారు. కాబట్టి మనం కనుక్కోవలసిన పదంలో కూడా 11 అక్షరాలు ఉన్నాయి. దీన్ని కూడా పై విధంగా భావించాలి.


44. ఒక పరిభాషలో CORNER ను GSVRIV గా రాస్తే CENTRAL ను ఎలా రాస్తారు?
జ:  GIRXVEP
వివరణ :  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం CORNER ను GSVRIV గా రాయాలి. అంటే C కు +4 అక్షరాలను కలపాలి. ఇలా
O + 4 S, R + 4 V
 C   O    R    N   E   R                C   E   N   T   R   A   L
+4 +4 +4 +4 +4 +4               +4 +4 +4 +4 +4 +4 +4
  G    S   V   R   I   V                 G   I    R    X   V   E   P

45. ఒక పరిభాషలో BOMBAY ను MYMYMY గా రాస్తే TAMILNADU ను ఏ విధంగా రాస్తారు?
జ:   MNUMNUMNU 
వివరణ :  ఈ ప్రశ్నలో BOMBAY ను MYMYMY గా ఎలా రాశారంటే, రెండు అక్షరాలను వదిలి M ను తీసుకున్నారు. తర్వాత రెండు అక్షరాలను వదిలి Y ను తీసుకుని రెండింటిని అంటే MY ని BOMBAY లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు రాశారు. ఈ విధంగా TAMILNADU లో మొదటి రెండు అక్షరాలు వదిలి M ను, తర్వాత రెండు అక్షరాలు వదిలి N ను, మిగతా రెండు అక్షరాలు వదిలి U ను తీసుకుంటే అప్పుడు MNUఅవుతుంది. TAMILNADU లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు MNU వచ్చేలా రాయాలి. TAMILNADU లో 9 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు MNU ను 3 సార్లు రాయాలి. కాబట్టి MNUMNUMNU అవుతుంది.

46. ఒక పరిభాషలో HANGER ను TDIMCG గా రాస్తే అదే భాషలో KURESH ను ఏ విధంగా రాస్తారు?
జ:  JRGEQWJ
వివరణ :  ఈ ప్రశ్నలో HANGER ను TDIMCG గా రాయాలి. అంటే HANGER లో చివరి అక్షరం అంటే R కు బదులు +2 అక్షరం ఉపయోగిస్తే T అవుతుంది. E కి -1 అక్షరం ఉపయోగిస్తే D అవుతుంది. అంటే వెనుక నుంచి +2, -1 అనే విధంగా చేయాలి.



47. ఒక పరిభాషలో PAINT ను 74128, EXCEL ను 93596 గా రాస్తే ACCEPT ను ఏ విధంగా రాస్తారు?
జ:  455978 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన కోడ్‌లు.
P  A  I  N  T     E  X  C  E  L      కావాల్సిన కోడ్   A  C  C  E  P  T   
7   4  1  2  8      9   3  5  9  6                 4  5   5  9   7  8

48. Z = 52, ACT = 48 అయితే BAT ఎంత?
జ: 46
వివరణ:  ఈ ప్రశ్నలో Z = 52 కావాలంటే Z = 26 దాన్ని 2 తో గుణించారు. అంటే ప్రతి అక్షరం విలువను 2 తో గుణించాలి. Z = 2, B = 4 ... Z = 52 కానీ ఇప్పుడు కావాల్సింది
A +  C+ T =  2 + 6 + 40 =  48
B + A + T =  4 + 2 + 40  =  46

49. MAN = 30, CELL = 34 అయితే BANK ఎంత?
జ:   30 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదాల సంబంధాలు MAN  =  (13 + 1 + 14)  + 2  =  30
A మొదటి అక్షరం 1
CELL = (3+5+12+12) +2 = 34
BANK = (2+1+14+11) +2 = 30

50. BRANCH ను 2-18-1-14-3 గా రాస్తే అదే భాషలో BOMBAY ను ఏ విధంగా రాస్తారు?
జ:  2-15-13-2-1-25 
వివరణ:  ఈ ప్రశ్నలో BRANCH ను 2-18-1-14-3-8 గా రాశారు అంటే B విలువ 2 R విలువ 18 ఈ విధంగా రాశారు.         BOMBAY- 2-15-13-2-1-25

51. PRATAP ను 1618120116 గా రాస్తే అదే భాషలో NAVIN ను ఎలా రాస్తారు?
జ:  14122914 
వివరణ:  ఈ ప్రశ్నలో A=1, B=2, C=3... Z=26 అయితే PRATAP = 1618120116 అవుతుంది.
NAVIN = 14122914.

52. MOBILITY ని 46293927 గా రాస్తే అదే భాషలో EXAMINATION ను ఎలా రాస్తారు?
జ:   56149512965 
వివరణ:  ఈ ప్రశ్నలో A = 1, B = 2,.... Z = 26 అయితే MOBILITY లో ఉన్న అక్షరాలను వరుసగా M = 13 = 1 + 3 = 4, O = 15 = 1 + 5 = 6, B = 2, I = 9, L = 12 = 1 + 2 = 3, I = 9, T = 20 = 2 + 0 = 2, Y = 25 = 2 + 5 = 7 అన్నింటిని ఒకే దగ్గర రాస్తే MOBILITY = 46293927 ఈ విధంగా EXAMINATION రాయాలి. E = 5, X = 24 = 2 + 4 = 6, A = 1, M = 13 = 1 + 3 = 4, I = 9, N = 14 = 1 + 4 = 5, A = 1, T = 20 = 2 + 0 = 2, I = 9, O = 15 = 1 + 5 = 6, N = 14 = 1 + 4 = 5, అంటే 9 కంటే ఎక్కువ విలువలు ఉన్న వాటిని కలపాలి.
EXAMINATION = 56149512965 అవుతుంది.

53. X ను 7 గా కోడ్ చేసి; P ని 9గా కోడ్ చేసి; Z ను 6గా కోడ్ చేసి; M ను 5గా కోడ్ చేసి; L ను 3గా కోడ్ చేసి, D ని 2గా కోడ్ చేస్తే PLDXMZ కోడ్ రూపం ఏమిటి?
జ:  932756 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన ప్రకారం కోడ్ రాస్తే సమాధానం సులువుగా వస్తుంది.
P  L  D  X  M  Z
9  3   2   7   5  6

54. NTR ను MOSUQS గా రాస్తే DEVI ని ఏ విధంగా రాస్తారు?
జ:  CEDFUWHJ 
వివరణ:  ఈ ప్రశ్నలో NTR ను MOSUQS గా రాస్తే, అంటే NTR లో 3 అక్షరాలు ఉంటే డీకోడ్‌లో 6 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి N అక్షరానికి ముందు, వెనక ఉన్న అక్షరం MOT కి SUR కి QS అలాగే DEVI లో D కి ముందు, వెనుక అక్షరాలు CE, Eకి DF V కి UW , I కి HJ కాబట్టి DEVI డీకోడింగ్ CEDFUWHJ అవుతుంది.

55. ఒక పరిభాషలో TAP ను SZO గా రాస్తే అదే భాషలో FREEZE ని ఏ విధంగా రాస్తారు?
జ:  EQDDYD

56. JULY ను 9-20-11-24 గా రాస్తే అదే భాషలో AUGUST ను ఏ విధంగా రాస్తారు?
జ:  0-20-6-20-18-19 

57. GO = 32, SHE = 49 అయితే SOME ఎంత?
జ:   56

58. PALAM ను 43 గా రాస్తే అదే భాషలో SANTACRUZ ఎంత?
జ:   123

59. A = 1, B = 2, ... Z = 26 అయితే BIDDIC కోడ్ ఎంత?
జ:   294493 

60. ఒక పరిభాషలో NEOMAN ను OGRQFJ గా రాస్తే అదే భాషలో ఏ పదం కోడ్ ZKCLUP గా రాస్తారు?
జ:   YIZHPJ 

61. ఒక పరిభాషలో MUNICIPALITY ను INMUAPCIYTLI గా రాస్తే అదే భాషలో JUDICIAL ను ఏ విధంగా రాస్తారు?
జ:   IDJULACI

Posted Date : 10-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌