* కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వర్తకులు ప్రకటన ధరపై కొంత తగ్గించి అమ్ముతారు. దీన్నే రుసుము లేదా ముదరా అంటారు. ప్రకటన ధర/ ముద్రిత ధర కంటే ఒక వస్తువును తక్కువకు అమ్మితే, ఆ తగ్గింపు విలువను రాయితీ అంటారు.
రాయితీ = ప్రకటన వెల - అమ్మిన వెల
మాదిరి ప్రశ్నలు
1. ఒక వ్యక్తి వస్తువును 20% రాయితీతో రూ.240 లకు కొనుగోలు చేశాడు. అయితే ఆ వస్తువు ప్రకటన ధర ఎంత?
1) రూ.250 2) రూ.350 3) రూ.300 4) రూ.400
2. సుభాష్ ఒక గడియారాన్ని దాని ప్రకటన ధరపై 30% రాయితీతో కొనుగోలు చేశాడు. రాయితీ లేకపోతే రూ.82.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సుభాష్ గడియారాన్ని ఎంతకు కొన్నాడు?
1) రూ.182.50 2) రూ.172.50 3) రూ.185.50 4) రూ.192.50
3. ఒక వస్తువుపై ప్రకటించిన రెండు రాయితీలు వరుసగా 20%, 25%. అయితే ఈ రాయితీలకు సమానమైన రాయితీ ఎంత?
1) 40% 2) 35% 3) 45% 4) 45.5%
4. ఒక వస్తువుపై రెండు రాయితీలు వరుసగా 15%, 10% ఇస్తే, ఈ రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎంత?
1) 25% 2) 24% 3) 23.5% 4) 26%
5. ఒక వస్తువు ప్రకటన ధర రూ.500, దాన్ని 20%, 10% వరుస రాయితీలతో అమ్మితే, ఆ వస్తువు అమ్మిన ధర ఎంత?
1) రూ.340 2) రూ.350 3) రూ.345 4) రూ.360
6. ఒక వ్యాపారి ఒక వస్తువును 20% రాయితీతో అమ్మాడు. ఒకేసారి నగదు చెల్లిస్తే 30% రాయితీ ఇచ్చాడు. వినియోగదారుడు ఆ వస్తువును రూ.2240 చెల్లించి కొనుగోలు చేస్తే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత?
1) రూ.4050 2) రూ.4000 3) రూ.3500 4) రూ.4500
7. ఒక వ్యాపారి ఒక వస్తువుపై రెండు రకాల రాయితీలు ప్రకటించాడు. అవి A. 3%, 7% B. 2%, 8% పై వాటిలో వినియోగదారుడికి ఏది లాభదాయకంగా ఉంటుంది?
1) A 2) B 3) A, B 4) ఏదీకాదు
సాధన: 3 x 7 > 2 x 8
21 > 16
పై రెండింటిలో దేని లబ్ధం కనిష్ఠంగా ఉంటుందో ఆ రకం వినియోగదారుడికి లాభదాయకంగా ఉంటుంది.
సమాధానం: 4
8. ఒక వస్తువు ప్రకటన ధర రూ.900. వస్తువుపై ప్రకటించిన వరుస రాయితీలు 10%, 10% బదులుగా ఆ వ్యాపారి వస్తువుపై 20% రాయితీ ప్రకటిస్తే అతను పొందే లాభం లేదా నష్టం ఎంత?
1) రూ.9 నష్టం 2) రూ.7 నష్టం 3) రూ.9 లాభం 4) రూ.7 లాభం
సాధన: కేస్-1:
9. ఒక వస్తువు ప్రకటన ధరపైౖ ఒక వ్యాపారి రెండు రకాల వరుస రాయితీలు ప్రకటించాడు. అవి మొదటిరకం 30%, 20%, రెండో రకం 40%, 25%. ప్రకటన ధరపై పై రెండు రకాల రాయితీల మధ్య వ్యత్యాసం రూ.33 అయితే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత?
1) రూ.400 2) రూ.350 3) రూ.300 4) రూ.450
సాధన: కేస్-1:
10. ఒక వస్తువు ప్రకటన వెల రూ.1050, రెండు వరుస రాయితీల అనంతరం వినియోగదారుడు ఆ వస్తువుకు రూ.798 చెల్లించాడు. వాటిలో మొదటి రాయితీ 20% అయితే రెండో రాయితీ ఎంత?
1) 10% 2) 5% 3) 15% 4) 20%
రెండో రాయితీ = 5% (100% - 95%) సమాధానం: 2
11. ఒక ఫ్యాన్ ముద్రిత వెల రూ.1500, ప్రకటించిన రాయితీ 20%. వినియోగదారుడు ఆ ఫ్యాన్‌ను రూ.1104లకు కొనుగోలు చేస్తే వినియోగదారుడు పొందిన అదనపు రాయితీ ఎంత?
1) 7% 2) 8% 3) 10% 4) 11%
12. ఒక వస్తువు ధర రూ.25. రెండు సమాన రాయితీల అనంతరం ఆ వస్తువు విలువ రూ.20.25 అయితే ఒక్కొక్క ముదరా ఎంత?
1) 5% 2) 7% 3) 8% 4) 10%
13. ఒక వస్తువు ధరను 30% పెంచి, దానిపై 10% చొప్పున రెండు వరుస రాయితీలు ప్రకటిస్తే ఆ వస్తువు ధరలోని మార్పు ఎంత?
1) 10% పెరుగుదల 2) 5.3% పెరుగుదల 3) 3% తగ్గుదల 4) 5.3% తగ్గుదల
14. ఒక వ్యాపారి ఒక వస్తువు ప్రకటిత వెలపై 10% రాయితీ ఇస్తే 10% లాభం వస్తుంది. ఆ వస్తువు కొన్న వెల రూ.9000 అయితే దాని ప్రకటన వెల ఎంత?
1) రూ.10000 2) రూ.12500 3) రూ.11500 4) రూ.11000
15. ఒక వ్యాపారి వస్తువులపై తాను కొన్న వెల కంటే 25% ఎక్కువగా ప్రకటించి దానిపై 15% రాయితీ ఇచ్చాడు. ఈ లావాదేవీలో అతనికి వచ్చిన లాభ శాతం ఎంత?
16. ఒక టెలివిజన్ ప్రకటన ధర రూ.24,000 ఒక దుకాణదారుడు 20% రుసుము ఇచ్చి 20% లాభాన్ని పొందాడు. రుసుము ఇవ్వకపోతే ఈ లావాదేవీలో అతనికి వచ్చిన లాభశాతం ఎంత?
1) 50% 2) 30% 3) 40% 4) 25%