• facebook
  • whatsapp
  • telegram

నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం,

నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం,  రేడియోధార్మిక కాలుష్యం, 


ఘనవ్యర్థాల నిర్వహణ


1. కిందివాటిలో నీటి కాలుష్యానికి కారణాలు?


1) వ్యవసాయ వ్యర్థాలు     2) పారిశ్రామిక వ్యర్థాలు     3) నివాస స్థలాల నుంచి వచ్చే వ్యర్థాలు   4) పైవన్నీ


2. కింది ఏ భారలోహ అయాన్‌ నీటి కాలుష్యానికి కారణం అవుతుంది?


1 ) సీసం (Pb)      2 ) కాడ్మియం (Cd)        3) పాదరసం   (Hg)    4్శ పైవన్నీ


3. నీటిలో పోషకాలు అధికమై, నీటి మొక్కలు పెరిగి, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ శాతాన్ని తగ్గించే దృగ్విషయాన్ని ఏమంటారు?


1 ) ఆస్మాసిస్‌         2 ) యూట్రోఫికేషన్‌     3 ) డయాలసిస్‌       4 ) ఒలిగోట్రోఫికేషన్‌


4. కిందివాటిలో నీటి నాణ్యతను తెలిపే సూచిక ఏది?


1) ph      2) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌      3 ) రసాయనిక ఆక్సిజన్‌ అవసరం      4 ) పైవన్నీ


5. కిందివాటిలో తాగునీటికి ఆమోదయోగ్యమైన ph విలువలు ఏవి?


1 ) 412      2 ) 714      3 ) 07      4) 68


6. నీటి విద్యుత్‌ వాహకతను కొలవడం వల్ల కలిగే ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?


1 ) నీటి రంగు, వాసనను అంచనా వేయడం


2 ) నీటిలోని బ్యాక్టీరియాను అంచనా వేయడం


3 ) నీటిలో కరిగి ఉన్న లవణాల స్థాయిని అంచనా వేయడం


4 ) నీటిలోని భారలోహ అయాన్‌ల ఉనికిని నిర్ణయించడం


7. తాగునీటిలో కరిగి ఉండే ఘనపదార్థాల మొత్తం (TDS)  ఆమోదయోగ్యమైన గరిష్ఠ గాఢత ఎంత?

1) 50 mg/ l     2) 500 mg/ l     3) 500 ppm    4 ) 2, 3


8. తాగునీటిలో క్లోరైడ్‌ (Cl) ఆమోదయోగ్యమైన గాఢత పరిధి ఎంత?

1) 10-50 ppm    

 2) 50-100     ppm    

3) 500 mg/  కంటే తక్కువ 

4) 250  కంటే తక్కువ

9. కిందివాటిలో నీటిలోని క్రిములను తొలగించే పద్ధతిని ఏమంటారు?


1 ) క్లోరినేషన్‌   2) ఓజోనేషన్‌   3) 1, 2      4) తిరోగామి ద్రవాభిసరణ


10. నీటిలో నైట్రేట్‌ కాలుష్యానికి ప్రాథమిక మూలం?


1 ) పారిశ్రామిక వ్యర్థాలు       2 ) గృహ రసాయనాలు   3 ) ఎరువులు     4 ) 1, 2


11. కింది అంశాలను జతపరచండి.


  జాబితా - I         జాబితా - II


 A ) మి.గ్రా/లీ.       i 1 మోలార్       

B ) 1 మోల్‌/ లీ.       ii 1 మోలాల్‌

C ) 1 మోల్‌/కి.గ్రా.      iii 1ppm
 

1) a-i, b-iii, c-ii    2) a-iii, b-ii, c-i    3) a-iii, b-i, c-ii   4) a-ii, b-i, c-iii
 


12. కిందివాటిలో సరికానిది ఏది?


1) DO - Dissolved Oxygen 

2) COD - Chemical Oxygen Dissolved 

3) BOD - Biochemical Oxygen Demand 

4) PPM - Parts Per Million 

13. తాగునీటిలో సల్ఫేట్‌ అయాన్‌ గాఢత  గరిష్ఠంగా ఎంతవరకు ఉండొచ్చు?

1) 50 ppm    2) 500 ppm    3) 200 ppm   4) 2 ppm 

14. ఫ్లోరోసిస్‌  (fluorosis)  అంటే ఏమిటి?


1 ) ఫ్లోరైడ్‌ కలిగిన పదార్థాలను సుదీర్ఘంగా వాడటం వల్ల కలిగే చర్మ సంబంధ వ్యాధి.


2 ) రక్తప్రవాహంలో ఫ్లోరైడ్‌ అధిక స్థాయిలో ఉండటం వల్ల కలిగే నాడీ సంబంధ రుగ్మత.


3 ) నీటి ద్వారా ఫ్లోరైడ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దంత సమస్యలు.


4 ) ఫ్లోరిన్‌ వాయువును పీల్చడం వల్ల కలిగే శ్వాసకోశ రుగ్మత.


15. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సుల ప్రకారం, తాగునీటిలో ఫ్లోరైడ్‌ స్థాయి ఎంత వరకు ఉండొచ్చు?


1) 0.1 - 0.2 mg/ l    2) 0.5 - 1.0 mg/ l     3) 2.0 - 3.0 mg/ l     4) 5.0 - 10.0 mg/ l 

16. కిందివాటిలో డెంటల్‌ ఫ్లోరోసిస్‌కు కారణం ఏమిటి?


1 ) అధిక ఫ్లోరైడ్‌ స్థాయి ఉన్న నీటిని తాగడం.


2 ) ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం.


3 ) ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.


4 ) పైవన్నీ


17. కింది ఏ జనాభా సమూహం ఫ్లోరోసిస్‌ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు?


1 ) శిశువులు, చిన్న పిల్లల    2 ) 65 ఏళ్లు పైబడిన వృద్ధులు    3 ) గర్భిణులు    4 ) యుక్త వయస్కులు


18. నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి?


1 ) పర్వత ప్రాంతాలు   2 ) తీర ప్రాంతాలు     3 ) ఎడారి ప్రాంతాలు   4 ) ఏవీకాదు


19. అధిక కాలుష్యానికి గురైన వ్యక్తి, నిశ్శబ్ద ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా చెవిలో ఏదో శబ్దం వినపడుతున్నట్లు భావిస్తాడు. ఇలా అనిపించే మానసిక స్థితిని ఏమంటారు?


1 ) టిన్నిటస్‌      2 ) సైనిటస్‌     3 ) బ్రొన్కైటస్‌     4 ) ఏదీకాదు


20. నీటిని శుద్ధిచేసే ప్రక్రియలో ఉత్తేజిత కార్బన్‌ను ఉపయోగిస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనం?


1 ) నీటిలో కరిగిన లవణాలను తొలగిస్తుంది.


2 ) ఆమ్లస్వభావాన్ని తటస్థం చేస్తుంది.


3 ) నీటిలోని ఘన వ్యర్థాలను తొలగిస్తుంది.


4 ) చెడు వాసన, రుచిని తొలగిస్తుంది.


21. నీటిలో కరిగి ఉన్న లవణాలు, ఖనిజాలను తొలగించడానికి కింది ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు?


1 ) వడపోత      2 ) స్వేదనం     3 ) 1, 2     4 ) క్రిమిసంహారం


22. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సున్నం కలపడం వల్ల ప్రయోజనం?


1 ) నీటిలోని  pH విలువను సర్దుబాటు చేస్తుంది.


2 ) చెడు వాసన, రుచిని తొలగిస్తుంది.


3 ) బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తుంది.


4 ) నీటిలో కరిగిన లవణాలను తొలగిస్తుంది.


23. ఘన వ్యర్థాలు అంటే?


1 ) జీవక్షయీకృతం కాని వ్యర్థాలు    


2 ) ద్రవరూపంలో ఉండే వ్యర్థాలు


3 ) ఘనరూపంలో ఉండే వ్యర్థాలు    


4 ) పరిశ్రమల ఉద్గారాలు


24. కిందివాటిలో ప్రమాదకర వ్యర్థాలకు ఉదాహరణ ఏది?


1 ) గాజు సీసాలు    2 ) అల్యూమినియం డబ్బాలు     3 ) ప్లాస్టిక్‌ సంచులు      4 ) బ్యాటరీలు


25. వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాథమిక లక్ష్యం ఏమిటి?


1 ) వ్యర్థాల ఉత్పత్తిని పెంచడం


2 ) వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం


3 ) వ్యర్థాలను పారేయడాన్ని ప్రోత్సహించడం


4 ) ఏదీకాదు


26. కిందివాటిలో జీవక్షయీకృతం చెందే పదార్థం ఏది?


1 ) అన్ని ప్లాస్టిక్‌లు      2 ) అల్యూమినియం    3 ) గాజు      4 ) ఆహార వ్యర్థాలు


27. సేంద్రియ వ్యర్థాలను పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్‌గా మార్చడానికి కింది ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?


1 ) దహనం     2 ) కంపోస్టింగ్‌    3 ) ల్యాండ్‌ ఫిల్లింగ్‌     4 ) పునశ్చక్రీయం


28. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను  (e-waste)  నిర్వహించడానికి ఉత్తమ మార్గం ఏమిటి?


1) దహనం (Combustion) 


2 ) ల్యాండ్‌ఫిల్లింగ్‌ (Land-Filling) 


3 ) పునశ్చక్రీయం (Recycling) 


4 ) కంపోస్టింగ్‌  (Composting) 


29. కిందివాటిలో రేడియోధార్మిక కాలుష్యానికి మూలం ఏది?


1 ) సౌరఫలకలు     2 ) గాలి టర్బైన్‌లు     3 ) అణు విద్యుత్‌ ప్లాంట్లు   4 ) థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు


30. రేడియోధార్మిక కాలుష్యానికి కారణమయ్యే కిరణాలు ఏవి?


1 ) ఆల్ఫా - కిరణాలు     2 ) బీటా - కిరణాలు     3 ) గామా - కిరణాలు   4 ) పైవన్నీ


సమాధానాలు


1-4  2-4  3-2  4-4  5-4  6-3  7-4  8-4  9-3  10-3  11-3  12-2  13-3  14-3  15-2  16-4  17-1  18-1  19-1  20-4  21-2  22-1  23-3  24-4  25-2  26-4  27-2  28-3  29-3  30-3


మరికొన్ని..


1. అణు వ్యర్థాల్లో సాధారణంగా కనిపించే     రేడియోధార్మిక మూలకం ఏది?


1 ) రేడాన్‌     2 ) ప్లుటోనియం     3 ) యురేనియం     4 ) సీసియం


2. అణువిద్యుత్‌ ప్లాంట్‌లలో పనిచేసే కార్మికులు రేడియేషన్‌కు ఎక్కువగా గురవుతారు. దీన్ని  తగ్గించడానికి సాధారణంగా ఉపయోగించే రక్షణ పరికరం ఏది?


1 ) గ్రిగర్‌ కౌంటర్‌      2 ) గ్యాస్‌ మాస్క్‌లు    3 ) సీసంతో తయారుచేసిన యాప్రాన్లు    4 ) సాధారణ యాప్రాన్లు


3. కిందివాటిలో రేడియోధార్మిక కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగించనిది ఏది?


1 ) కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేయడం


2 ) పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం


3 ) అణువ్యర్థాల నియంత్రణ


4 ) బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల వినియోగాన్ని పెంచడం


4. కిందివాటిలో రేడియోధార్మిక కాలుష్యానికి సహజ మూలకం ఏది?


1 ) మెడికల్‌ శ్రీ - కిరణాలు


2 ) అణ్వాయుధాల పరీక్ష


3 ) భూవాతావరణంలోని రేడాన్‌ వాయువు


4 ) అణువిద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాదాలు


5. కిందివాటిలో అత్యధికంగా అణువిద్యుత్‌ ప్లాంట్‌లను కలిగి ఉన్న దేశం?


1 ) చైనా      2 ) రష్యా      3 ) అమెరికా      4 _ ఫ్రాన్స్‌


6. రేడియోధార్మిక కాలుష్యాన్ని కింది ఏ    పరికరాన్ని ఉపయోగించి గుర్తిస్తారు, కొలుస్తారు?


1 ) గ్రిగర్‌ - ముల్లర్‌ కౌంటర్‌    2 ) టెలిస్కోప్‌       3 ) బారోమీటర్‌      4 ) స్పెక్ట్రోస్కోప్‌

సమాధానాలు


1-2    2-3    3-4    4-3    5-3    6-1


రచయిత

డాక్టర్‌ పి. భానుప్రకాష్‌


 

Posted Date : 03-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌