• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

1. ఎన్విరాన్‌మెంట్‌ అనే పదాన్ని కింది ఏ ఫ్రెంచ్‌ భాషా పదం నుంచి గ్రహించారు?

1)  ఎన్విరానర్‌     2)  ఎన్విరాన్‌       3)  1, 2       4)  ఎనర్జీ

జ‌: 1, 2


2. కిందివాటిలో భౌతిక పర్యావరణం కానిది?

1)  జలావరణం      2)  శిలావరణం         3)  వాతావరణం     4)  జీవావరణం

జ‌: జీవావరణం


3. భూఉపరితలం, సముద్ర అడుగు భాగంలో వ్యాపించి ఉన్న మట్టి, ఖనిజాలు, రాతిపొరను ఏమంటారు?

జ‌:  శిలావరణం     


4. కిందివాటిలో ముఖ్యమైన శిలాజాతులు ఏవి?

1)  అగ్ని శిలలు      2)  అవక్షేప శిలలు   3)  రూపాంతర శిలలు  4)  పైవన్నీ

జ‌:  పైవన్నీ


5. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ‌:  పెట్రాలజీ      


6. భూగోళంపై సముద్రాలు సుమారు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి?

జ‌:  71%  


7. జలావరణంలోని మొత్తం నీటిలో ఉప్పు నీటి శాతం ఎంత?

జ‌:  97%  


8. భూమి చుట్టూ వాయువుల మిశ్రమం ఒక పొరలా ఆవరించి ఉంటుంది. దాన్ని ఏమంటారు?

జ‌:  వాతావరణం


9. సముద్రమట్టం దగ్గర వాతావరణ పీడనం ఎంత?

1)  760 mm Hg    2)  76 cm Hg      3)  1, 2      4)  7.6 cm Hg

జ‌:  1, 2

10. కింది వాటిలో సరికాని జత ఏది?

1)  ఆక్సిజన్‌ (O2) -  20.95%

2)  కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2) -  0.04%

3)  నియాన్‌  - 0.0018%

4)  ఆర్గాన్‌  - 3.21%

జ‌: ఆర్గాన్‌  - 3.21%


11. గాలిని ద్రవీకరించేందుకు అవసరమయ్యే పరిస్థితులు ఏవి?

1)  అధిక పీడనం     2)  అల్ప ఉష్ణోగ్రత     3)  అల్ప పీడనం     4)  1, 2

జ‌: 1, 2


12. గాలిని ద్రవీకరించి దానిలోని నైట్రోజన్‌ను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు?

జ‌: అంశిక స్వేదనం


13. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) సముద్ర తీర ప్రాంతాల్లో గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

బి) వాతావరణంలో 0.4% వరకు నీటి ఆవిరి ఉంటుంది.

జ‌: ఎ, బి      


14. కిందివాటిలో ఆక్సిజన్‌కు సంబంధించి సరైంది ఏది?

ఎ) నీటిలో కరుగుతుంది.

బి) దహన దోహదకారి.

జ‌:  ఎ, బి      


15. సముద్ర నీటిలోని సామాన్య లవణీయత శాతం ఎంత?

జ‌:   3.5% 


16. చిత్తడి నేలల నుంచి ప్రధానంగా విడుదలయ్యే వాయువు ఏది?

జ‌:  మీథేన్‌ (CH4)


17. సముద్రంలో అత్యధికంగా లభించే లవణం ఏది?

జ‌: సోడియం క్లోరైడ్‌ 


18. కిందివాటిలో కార్బన్‌ సింక్‌గా దేన్ని పేర్కొంటారు?

1)  సముద్రాలు         2)  అడవులు          3)  అణు రియాక్టర్‌       4)  1, 2

జ‌: 1, 2

 
19. భూమిపై లభించే శిలల్లో 75% ఏ రకానికి చెందినవి?

జ‌:  అవక్షేప శిలలు


20. కింది వాటిలో సరికాని జత?

1)  బొగ్గు - గ్రాఫైట్‌                          2)  ఇసుకరాయి - క్వార్ట్జ్‌

3)  సున్నపురాయి - మార్బుల్‌          4)  గ్రాఫైట్‌ - వజ్రం

జ‌:  గ్రాఫైట్‌ - వజ్రం


21. గ్రానైట్‌ ఏ శిలాజాతికి ఉదాహరణ?

జ‌:  అగ్ని శిలలు       


22. భూమిపై ప్రథమంగా ఏర్పడిన శిలాజాతి ఏది?

జ‌:  అగ్ని శిలలు     


23. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ మ్యాప్‌పై గీసిన ఊహారేఖలను ఏమంటారు?

జ‌:  ఐసోహాలైన్‌       


24. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) వాతావరణ పీడనాన్ని బారోమీటర్‌తో కొలుస్తారు.

బి) వాతావరణంలోని తేమ శాతాన్ని హైగ్రోమీటర్‌తో కొలుస్తారు.

జ‌:  ఎ, బి       


25. కిందివాటిలో బొగ్గుపులుసు వాయువు ఏది?

1)  కార్బన్‌ మోనాక్సైడ్‌ (CO)        2)  కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2)

3)  నైట్రిక్‌ ఆక్సైడ్‌ (NO)               4)  సల్ఫర్‌ డైఆక్సైడ్‌ (SO2

జ‌: కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2)

 
26. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న జడవాయువు ఏది?

జ‌: ఆర్గాన్‌     


27. వాతావరణంలోని ఏ ఆవరణం అధిక సాంద్రతను కలిగి ఉంటుంది?

జ‌:  ట్రోపో 


28. జెట్‌ విమానాలు ఎగిరే ఆవరణం ఏది?

జ‌:   స్ట్రాటో 


29. కింది ఏ వాతావరణ పొరలో ఉల్కాపాతం సంభవిస్తుంది?

1)  ట్రోపో ఆవరణం  2)  మీసో ఆవరణం    3)  స్ట్రాటో ఆవరణం  4)  ఏదీకాదు

జ‌: మీసో ఆవరణం   


30. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

1)  నైట్రిక్‌ ఆక్సైడ్‌లు   2)  సల్ఫర్‌ ఆక్సైడ్‌లు      3)  హైడ్రోకార్బన్‌లు   4)  పైవన్నీ

జ‌: పైవన్నీ


31. కింది ఏ వాతావరణ పొరలో తేమ ఎక్కువగా ఉంటుంది?

1)  ఎక్సో ఆవరణం   2)  థర్మో ఆవరణం     3)  ట్రోపో ఆవరణం  4)  స్ట్రాటో ఆవరణం

జ‌: ట్రోపో ఆవరణం  


32. కార్బన్‌ మోనాక్సైడ్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

i)  కార్బన్‌ ఇంధనాలు అసంపూర్ణ దహన చర్యకు గురైనప్పుడు కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదల అవుతుంది.

ii)  ఇది రంగు, వాసన లేని వాయువు.

iii)  ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌తో  చర్య జరిపి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది.

జ‌: i, ii, iii


33. కార్బన్‌ మోనాక్సైడ్‌ కాలుష్యానికి గురైన రోగికి కార్బోజెన్‌ను ఉపయోగిస్తారు. కార్బోజెన్‌ ఏ వాయువుల మిశ్రమం?

జ‌:   90% ఆక్సిజన్, 10% కార్బన్‌ డైఆక్సైడ్‌


34. కిందివాటిలో వాయుస్థితి గాలి కాలుష్య  కారకాలు ఏవి?

i)  కార్బన్‌ మోనాక్సైడ్‌       ii)  ఫ్లైయాష్‌  

iii)  సల్ఫర్‌ డైఆక్సైడ్‌  iv)  నైట్రోజన్‌ ఆక్సైడ్‌      v)  దుమ్ము

జ‌:  i, iii, iv       


35. PM10 కణాలు అంటే?

జ‌: 10 మైక్రోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉన్న కణస్థితి కాలుష్య కారకాలు.


36. కిందివాటిలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌లకు సంబంధించి సరైనవి ఏవి?

i)  ఉరుములు, మెరుపుల సమక్షంలో నైట్రోజన్, ఆక్సిజన్‌ రసాయన సంయోగం చెంది నైట్రోజన్‌ ఆక్సైడ్‌లుగా మారతాయి.

ii)  వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గిస్తాయి.

జ‌: i, ii     

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిని వాతావరణంలో వాటి పరిమాణాన్ని అనుసరించి అవరోహణ క్రమంలో రాయండి. (ఏపీపీఎస్సీ, గ్రూప్‌-I 2019)

1)  నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డైఆక్సైడ్‌

2)  నైట్రోజన్, కార్బన్‌ డైఆక్సైడ్, ఆర్గాన్, ఆక్సిజన్‌ 

3)  నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్‌ డైఆక్సైడ్, ఆర్గాన్‌

4)  ఆర్గాన్, కార్బన్‌ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్‌

జ‌: నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డైఆక్సైడ్‌


2. వాతావరణంలోని తేమ శాతాన్ని కొలిచే పరికరం ఏది?     (ఏపీపీఎస్సీ, గ్రూప్‌-I 2019)

జ‌:  హైగ్రోమీటర్‌  


3. దిగువ ఇచ్చిన వాతావరణ పొరలను కింది నుంచి పైకి సరైన క్రమంలో రాయండి. (టి.ఎస్‌. పోలీస్‌ కానిస్టేబుల్‌ 2016)

ఎ) ఎక్సో ఆవరణం  బి) ట్రోపో ఆవరణం   సి) స్ట్రాటో ఆవరణం   డి) మీసో ఆవరణం 

జ‌:  బి, సి, డి, ఎ


4. కిందివాటిలో ఏ వాతావరణ పొర రేడియో కమ్యూనికేషన్‌కు సహాయపడుతుంది? (టి.ఎస్‌. పోలీస్‌ కానిస్టేబుల్‌ 2016) 

1)  ట్రోపో ఆవరణం 2)  అయనో ఆవరణం   3)  స్ట్రాటో ఆవరణం  4)  మీసో ఆవరణం

జ‌: అయనో ఆవరణం 


5. కిందివాటిలో వాతావరణంలోని రెండో పొర ఏది? (మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ 2019)

1)  ట్రోపో ఆవరణం  2)  మీసో ఆవరణం   3)  స్ట్రాటో ఆవరణం  4)  థర్మో ఆవరణం

జ‌: స్ట్రాటో ఆవరణం


6. భూమిని ఆవరించి ఉండే పలచటి గాలి పొరలను ఏమంటారు? (ఏపీ, జూ.అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ 2019) 

జ‌:  వాతావరణం     


7. వాతావరణంలోని ఏ ఆవరణంలో ఓజోన్‌ పొర ఉంటుంది?  (ఏపీ, జూ.అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ 2019)

జ‌: స్ట్రాటో 


8. కింది అంశాలను జతపరచండి. (ఏపీ, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్, 2019)

వాయువులు  శాతం
a)  నైట్రోజన్‌ i)  21
b) ఆక్సిజన్‌ ii)  78
c) ఆర్గాన్‌ iii)  0.04
d) కార్బన్‌ డైఆక్సైడ్‌ iv) 0.93

జ‌: a-ii, b-i, c-iv, d-iii

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌