• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?

జ: ఆర్టికల్స్‌ 25 - 28
 

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

జ: ఆర్టికల్‌ 25
 

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.

1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.

3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.

4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)
 

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?

జ: ఆర్టికల్‌ 27
 

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?

జ: ఆర్టికల్‌ 28
 

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?

1) హిందువులు                   2) జైనులు, బౌద్ధులు

3) సిక్కులు                        4) అందరూ

జ: 4 (అందరూ)
 

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?

జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం
 

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ: ఆర్టికల్‌ 29
 

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?

జ: ఆర్టికల్‌ 30
 

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.

జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం
 

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం
 

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం
 

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31
 

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
 

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌
 

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)
 

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                             
2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
 

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం
 

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌
 

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో
 

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌
 

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ                                2) ప్రొహిబిషన్‌
3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌                4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)
 

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌
 

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు
 

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి
 

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌
 

27. PIL అంటే?
జ: Public Interest Litigation
 

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా
 

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి
 

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

31. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు గురించి పేర్కొన్నారు? 

జ: ఆర్టికల్స్‌ 19 నుంచి 22


32. కిందివాటిలో సరైనవి ఏవి?

a)  ఆర్టికల్‌ 19 (1A) - పత్రికా స్వాతంత్య్రం

b) ఆర్టికల్‌  19 (1B) - ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు

c) ఆర్టికల్‌ 19 (1C) - భావప్రకటనా స్వేచ్ఛ

d) ఆర్టికల్‌  19 (1D) - సంచార స్వేచ్ఛ

జ:  a, b, d


33. కిందివాటిలో సరైనవి ఏవి?

a) ఆర్టికల్‌ 29 (1C) - సంఘాలు, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ

b) ఆర్టికల్‌ 19 (1D) - ఆస్తి సంపాదన, అనుభవించడం

c) ఆర్టికల్‌ 19 (1E) - స్థిర నివాస స్వేచ్ఛ

d) ఆర్టికల్‌ 19 (1G) - ఇష్టమైన వృత్తి, వ్యాపారాన్ని చేపట్టే స్వేచ్ఛ.

జ: a, c, d
 

34. బంద్‌లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

జ: భరత్‌ కుమార్‌ vs CPI(M) కేసు


35. విదేశీ/ బాహ్య కారణాల వల్ల భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏ ఆర్టికల్‌లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సహజంగానే రద్దవుతాయి?

జ:  ఆర్టికల్‌ 19     

36. జాతీయ అత్యవసర పరిస్థితిలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సహజంగా రద్దుకావని, రాష్ట్రపతి చేసే ప్రత్యేక ప్రకటన ద్వారానే రద్దవుతాయని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నిర్దేశించారు?

జ:  44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

37. 1978లో ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కులోని ఆర్టికల్‌ 19 (1F) ను తొలగించారు?

జ: మొరార్జీ దేశాయ్‌    

38. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

జ:  టి.కె.రంగరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసు


39. నేరం చేయకుండా ఏ వ్యక్తినీ శిక్షించకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ: ఆర్టికల్‌ 20(1)

40. ఒక వ్యక్తిని బలవంతంగా అతడికి వ్యతిరేకంగా అతడ్నే  సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయకూడదని, అది రాజ్యాంగ విరుద్ధమని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

జ: ఆర్టికల్‌ 20(3)      

41. బలవంతపు సాక్ష్యం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

జ: నందినీ శతపతి vs పి.ఎల్‌.దాని కేసు


42. ‘నార్కో అనాలసిస్‌ పరీక్ష’ ద్వారా వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

జ:  సెల్వీ vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు

43. Indian Penal Code (IPC) లోని సెక్షన్‌ 309 దేన్ని నేరంగా పరిగణిస్తుంది?

జ:  ఆత్మహత్యాయత్నం  


44. ‘జీవించే హక్కు అంటే కేవలం భౌతికంగా జీవించడం మాత్రమే కాదు, మానవ మర్యాదలతో జీవించడం’ అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

జ:  మేనకాగాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

45. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్‌ 21(A) ను రాజ్యాంగానికి చేర్చింది?

జ:  86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002

46. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం, 2009 కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

a) డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం రూపొందింది.

b) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు.

c) బలహీనవర్గాల పిల్లలకు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి.

d) ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1 : 30.

జ:  పైవన్నీ


47. ఆర్టికల్‌ 21(A) లో పేర్కొన్న ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం’ మనదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 2010, ఏప్రిల్‌ 1 


48. మేనకాగాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో అమెరికాలో అమల్లో ఉన్న ఏ శాసన ప్రక్రియ అంశాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది?

జ:  డ్యూ ప్రాసెస్‌ ఆఫ్‌ లా


49. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్, ఒక దానితో మరొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని సుప్రీంకోర్టు మేనకాగాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో పేర్కొంది?

జ:  ఆర్టికల్స్‌ 14, 19, 21 


50. ఏ ఆర్టికల్‌ ఆధారంగా రూపొందే శాసనాలు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది?

జ:  ఆర్టికల్‌ 21 

51. సహజ న్యాయ సూత్రం అంటే?

1) ఏ ఒక్కరూ తన సొంత కేసుకు తానే జడ్జిగా ఉండకూడదు.

2) ప్రతి వ్యక్తికి విన్నవించుకునే హక్కు ఉంది.

3) ప్రతి అధికార వ్యవస్థ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలి.

4) పైవన్నీ 

జ: పైవన్నీ

 
52. వ్యక్తి ప్రాణానికి చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప, ఇతర మార్గాల్లో హాని తలపెట్టకూడదని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది? 

జ:  ఆర్టికల్‌ 21     


53. కారణం చెప్పకుండా వ్యక్తులను అరెస్టు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

జ:  ఆర్టికల్‌ 22

54. క్రీ.శ. 1215లో ఇంగ్లండ్‌ రాజు జాన్‌ ఎడ్వర్డ్‌-I తన దేశ ప్రజలకు హక్కులను ప్రకటిస్తూ ఒక ప్రకటనను వెలువరించాడు. దీన్ని చరిత్రలో ఏ విధంగా పేర్కొంటారు?

జ‌: మాగ్నాకార్టా    

55. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ‘బిల్‌ ఆఫ్‌ రైట్స్‌’ అని పేర్కొంటారు.

బి) 1789లో ఫ్రెంచ్‌ జాతీయసభ మానవ హక్కుల ప్రకటనను వెలువరించింది.

సి) ఐక్యరాజ్యసమితి 1948, డిసెంబరు 10న ‘విశ్వమానవ హక్కుల ప్రకటనను’ వెలువరించింది.

డి) జపాన్‌ జాతీయ అసెంబ్లీ 1926లో ప్రాథమిక హక్కుల ప్రకటనను వెలువరించింది.

జ‌:  ఎ, బి, సి     


56. 1931లో కరాచీలో జరిగిన ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ సమావేశంలో ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానాలపై తీర్మానాన్ని ఆమోదించారు. దీనికి ఎవరు అధ్యక్షత వహించారు?

జ‌: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 


57.  రాజ్యాంగసభ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అధ్యక్షతన ‘ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని’ ఎప్పుడు ఏర్పాటు చేసింది?

జ‌: 1947, జనవరి 24

58. రాజ్యాంగసభ ఏర్పాటు చేసిన ‘ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి’ అధ్యక్షులుగా  వ్యవహరించింది ఎవరు?

జ‌: జె.బి.కృపలాని


59.194445లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ‘ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘానికి’ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

జ‌: సర్‌ తేజ్‌బహదూర్‌ సప్రూ    


60. భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో గాంధీజీ ఆంగ్లేయులను డిమాండ్‌ చేశారు? (ఇది 1931లో లండన్‌లో జరిగింది.)

జ‌: రెండో 

61. కేవలం భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?

జ‌: ఆర్టికల్స్‌ 15, 16, 19, 29 


62. భారతీయులతో పాటు, భారత్‌లో నివసిస్తున్న విదేశీయులకు కూడా లభించే ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24 

2) ఆర్టికల్స్‌ 25, 26, 27, 28

3) ఆర్టికల్స్‌ 16, 19, 20, 21, 22 

4) 1, 2

జ‌: 1, 2


63. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు/ శాసనాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉండకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ‌: ఆర్టికల్‌ 13(2)

64. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎక్కడ పేర్కొన్నారు?

జ‌:  IIIవ భాగం, ఆర్టికల్స్‌ 12 నుంచి 35


65. భారత రాజ్యాంగంలో ‘సమానత్వపు హక్కు’ను ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?

జ‌:  ఆర్టికల్స్‌ 14 నుంచి 18 

66. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) ఆర్టికల్‌ 14(A) : చట్టం దృష్టిలో సమానత్వం గురించి వివరిస్తుంది.

బి) ఆర్టికల్‌ 14(B): చట్టం మూలంగా సమాన రక్షణ గురించి వివరిస్తుంది.

సి) చట్టం దృష్టిలో సమానత్వం అనే భావనను బ్రిటన్‌ నుంచి గ్రహించారు.

డి) చట్టం  మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.

జ‌: పైవన్నీ 


67. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ప్రకారం ఏ రకమైన వివక్షను నిషేధించారు?

జ‌:  కుల, మత, జాతి, లింగ, జన్మ 

68. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(3) ప్రకారం ఎవరికి కల్పించిన ప్రత్యేక రక్షణలను వివక్షగా పరిగణించకూడదని పేర్కొన్నారు?

జ‌: మహిళలు, బాలలు 


69. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివక్ష చూపకూడదని, అన్ని వర్గాలవారికి సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

జ‌:  ఆర్టికల్‌ 16(1)

70. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ‌:  ఆర్టికల్‌ 16(4) 


71. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రాంతం వారికి ప్రత్యేక రక్షణలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘ముల్కీ నిబంధన’లకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది?

జ‌:  32వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973

72. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక రక్షణలను కల్పిస్తూ రాజ్యాంగానికి చేర్చిన ఆర్టికల్‌ ఏది?

జ‌:  ఆర్టికల్‌ 371(D)  

73. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 17 అమలు కోసం భారత పార్లమెంట్‌ 1955లో రూపొందించిన చట్టం ఏది?

జ‌:  అస్పృశ్యత నేరనిషేధ చట్టం (The Untouchability offences actz

74. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) అస్పృశ్యత నేరనిషేధ చట్టం 1955, నవంబరు 19 నుంచి అమల్లోకి వచ్చింది.

బి) అస్పృశ్యత నేరనిషేధ చట్టాన్ని 1976లో ‘పౌరహక్కుల పరిరక్షణ చట్టం’గా మార్చారు.

సి) అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.

డి) అస్పృశ్యత గురించి ఆర్టికల్‌ 17(5) లో నిర్వచించారు.

జ‌: ఎ, బి, సి      


75. భారత పార్లమెంట్‌ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

జ‌:1989  


76. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఈ చట్టం 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.

బి) దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం నేరం.

సి) ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నిందితులకు మరణశిక్ష కూడా విధిస్తారు.

డి) ఈ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు నివసిస్తున్న ప్రాంతాల్లో చెత్త, జంతు కళేబరాలను వేయడం నేరం.

జ‌: పైవన్నీ

77. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలంటే ఏ స్థాయి అధికారి విచారణ తప్పనిసరి?

జ‌: డీఎస్పీ స్థాయి అధికారి


78. విద్య, సైనిక రంగాల్లో ప్రతిభ చూపిన వారికి తప్ప, మిగిలిన వారికి ఎలాంటి బిరుదులను ఇవ్వకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ‌:  ఆర్టికల్‌ 18

79. సామాజిక, సేవారంగాల్లో ప్రతిభ చూపిన వారిని ప్రోత్సహించేందుకు ‘భారతరత్న’ లాంటి పౌరపురస్కారాలను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ‌: 1954 

80. భారతరత్న లాంటి పౌరపురస్కారాలను 1977లో ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?

జ‌: మొరార్జీ దేశాయ్‌ 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ‘ఏ వ్యక్తికి అయినా ఒక నేరానికి ఒకసారికి మించి శిక్ష వేయకూడదు’ అని పేర్కొంది?  (APPSC, Group-II, 2019)

జ: ఆర్టికల్‌ 20   

2. 21వ అధికరణ దేని గురించి పేర్కొంటోంది?  (AEE’s,- 2010)

జ:  జీవించే హక్కు 

3. ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది? (APPSC, Group-I, 1994)

జ: రాష్ట్రపతి     


4. స్వేచ్ఛాహక్కు ఏ ఆర్టికల్‌లో ఉంది?  (AEE’s, 2008)

జ: ఆర్టికల్‌ 19   


5. ‘ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా గుర్తించే రాజ్యాంగ నిబంధన ఏది? (APPSC, Junior stenos, 2012)

జ: ఆర్టికల్‌ 21(A)

6. నివాస స్వేచ్ఛ, స్థావరాల్లో స్వాతంత్య్రానికి హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ ఏది? (Technical Asst. 2012)

జ: ఆర్టికల్‌ 19   


7. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి కొత్తగా చేర్చిన ఆర్టికల్‌ ఏది? (Technical Asst. 2012)

జ:  ఆర్టికల్‌ 21(A)


8. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరుడి జీవన హక్కును ప్రకటించింది? (Polytechnic Lecturers, 2012; FRO, 2012)

జ:  ఆర్టికల్‌ 21     

9. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించింది? (APPSC, Jr. Asst. 2012)

జ:  ఆర్టికల్‌ 370     

10. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరులకు 6 రకాల స్వేచ్ఛలను కల్పించింది? (APPSC, Vaidya Vidhana Parishad, 2012)

జ:  ఆర్టికల్‌ 19 


11. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను సస్పెండ్‌ చేయడానికి వీల్లేదు?  (TS - SI Prelims, 2016)

జ:  ఆర్టికల్‌ 21 

12. కిందివాటిలో సరైనవి ఏవి?  (TS - SI Prilims, 2016)

a) విద్యాహక్కు చట్టం ‘విద్య’ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది.

b) విద్యాహక్కు చట్టాన్ని 2009లో ఆమోదించారు.

c) 6-14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం పేర్కొంది.

జ: a, b, c

13. రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరుల హక్కులను క్రమబద్ధం చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు  కల్పిస్తుంది? (APPSC, Group-II, Mains 2017)

జ: ఆర్టికల్‌ 13

14. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు హామీ ఇచ్చిన అధికరణ? 

జ:  16  

15. ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు? 

జ:  3   


16. భారత రాజ్యాంగంలోని 3651 మధ్య ఉన్న అధికరణలు దేనికి సంబంధించినవి?      

జ:  ఆదేశిక సూత్రాలు 

17. కిందివాటిలో ఏ విషయంలో భారత్, అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి?

1) ప్రాథమిక హక్కులు

2) ఆదేశిక సూత్రాలు

3) సమన్యాయ పాలన 

4) రాజ్యాంగ దృఢత్వం

జ: ప్రాథమిక హక్కులు


18. రాజ్యాంగం ప్రకారం సమానత్వపు హక్కులో భాగం కానిది?

జ:  ఆర్థిక సమానత్వం


19. భారత రాజ్యాంగంలో కింద పేర్కొన్న ప్రకరణల్లో ఉన్న ఏ ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి?

ఎ) ఆర్టికల్‌ 15     బి) ఆర్టికల్‌ 16       సి) ఆర్టికల్‌ 19       డి) ఆర్టికల్‌ 29

జ:  పైవన్నీ


20. రాజ్యాంగంలోని ఏ అధికరణ మహిళలకు, బాలికలకు ప్రత్యేక వసతులను కల్పించడానికి వెసులుబాటు కల్పిస్తుంది?

జ: 15(3) 


21. అస్పృశ్యత నివారణ చట్టం, 1955 పేరును ‘పౌరహక్కుల సంరక్షణ చట్టంగా’ ఎప్పుడు మార్చారు?

జ: 1976 

*******

1. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌ మధ్య విద్యా, సాంస్కృతిక హక్కు గురించి వివరించారు? 

జ:  ఆర్టికల్స్‌ 29, 30


2. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

జ:  ఆర్టికల్‌ 29      


3. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ:  ఆర్టికల్‌ 30       


4. ఆర్టికల్‌ 29 (2) ప్రకారం ప్రభుత్వం లేదా ప్రభుత్వ ధన సహాయంతో నిర్వహించే విద్యాసంస్థల్లో ఏ రకమైన వివక్షను నిషేధించారు?

1) మతం, కులం       2) జాతి       3) భాష       4) పైవన్నీ

జ:  పైవన్నీ


5. మైనారిటీ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తప్పనిసరిగా తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

జ:  ఆర్టికల్‌ 30 (1) (A)


6. మైనారిటీ వర్గాల హక్కుల రక్షణ కోసం ఆర్టికల్,  ఆర్టికల్‌ 30 (1) (A) ను రాజ్యాంగానికి ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారు?

జ:  44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978


7. ‘అల్పసంఖ్యాక’ వర్గాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) వీరికి కల్పించిన హక్కుల ముఖ్య ఉద్దేశం సమానత్వాన్ని సాధించడం.

బి) వీరికి కల్పించిన హక్కులు సంపూర్ణమైనవి కావు.

సి) రాజ్యాంగంలో ఈ వర్గాల గురించి నిర్వచనం ఉంది.

డి) రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక రక్షణలు ఉన్నాయి.

జ:  ఎ, బి, డి       


8. మనదేశంలో చట్టబద్ధంగా ఉన్న మైనారిటీల వర్గీకరణలు ఏవి?

జ:  మతపరమైన, భాషాపరమైన


9. ఆర్టికల్, 350 (A) ప్రకారం భాషాపరమైన మైనారిటీలు తమ ప్రాథమిక విద్యను వారి మాతృభాషలో కొనసాగించేందుకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించేది ఎవరు?

జ:  భారతదేశ రాష్ట్రపతి   


10. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్‌ 350్బత్శిని రాజ్యాంగానికి చేర్చారు?

జ: 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956


11. మన దేశంలో ‘మతపరమైన మైనారిటీలను’ (Religious based minorities) గుర్తించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు?

జ:  దేశం    


12. మనదేశంలో ‘భాషాపరమైన మైనారిటీలను’ (Linguistic based minorities) గుర్తించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు?

జ:  రాష్ట్రం    

13. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350 (B) లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.

ఎ) మైనారిటీ భాషల పరిరక్షణకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు.

బి) ఈ అధికారి తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు.

సి) రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.

డి) పార్లమెంట్‌ ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది.

జ:  ఎ, బి, సి       


14. మైనారిటీ విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకునే, చేసుకోకూడని సందర్భాల గురించి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

జ:  టీఎంఏ పాయ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక


15. టీఎంఏ పాయ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాన్ని గుర్తించండి.

ఎ) మైనారిటీ అనే పదంలో భాషా, మతపరమైన మైనారిటీలు ఉంటారు.

బి) మైనారిటీలను నిర్ధారించడానికి రాష్ట్ర జనాభాను యూనిట్‌గా తీసుకోవాలి.

సి) ఆర్టికల్‌ 29(1) కింద లభించే రక్షణ మైనారిటీల లిపి, సంస్కృతులకు సంబంధించింది; వారి మతానికి సంబంధించింది కాదు.

డి) ఆర్టికల్‌ 30 ప్రకారం మైనారిటీ వర్గాలవారు ‘ప్రొఫెషనల్‌’ విద్యా సంస్థలను కూడా స్థాపించవచ్చు.

జ:  పైవన్నీ


16. టీఎంఏ పాయ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మైనారిటీ విద్యాసంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం ఏ సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చు?

ఎ) ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు

బి) కాలనిర్ణయ పట్టిక తయారీ విషయంలో

సి) విద్యా ప్రమాణాలను సంరక్షించే సందర్భంలో

డి) విద్యాసంస్థ అక్రమాలకు పాల్పడినప్పుడు

జ:  ఎ, సి, డి           


17. 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన మౌలిక రాజ్యాంగంలో ‘ఆస్తి హక్కు’ను ప్రాథమిక హక్కుగా పేర్కొన్న ఆర్టికల్‌ ఏది?

జ:  ఆర్టికల్‌ 31   


18. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన ప్రధాని ఎవరు?

జ:  మొరార్జీదేశాయ్‌


19. సంరక్షించిన చట్టాలు (Saving of certain Laws) గా వేటిని పేర్కొంటారు?

జ: ఆర్టికల్స్‌ 31(A), 31(B), 31(C)    


20. రాజ్యాంగంలోని XIIవ భాగంలో, ఆర్టికల్‌ 300(A)లో పేర్కొన్న ఆస్తిహక్కు ‘సాధారణ చట్టబద్ధమైన హక్కు’గా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 1979, జూన్‌ 20   


21. భూ సంస్కరణల అమలు కోసం పార్లమెంట్‌ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలను ఏ న్యాయస్థానంలోనూ సవాల్‌ చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

జ: ఆర్టికల్‌ 31(A)       


22. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్స్‌ 31(A), 31(B)లను చేర్చింది?

జ: 1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951    


23. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్‌ 3(C)ను చేర్చింది?

జ: 25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971    


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని కింది ఏ ప్రకరణం, భాగంలో ఆస్తిహక్కును పొందుపరిచారు? (ఏపీ ఎస్‌ఐ, 2018)

జ:  ప్రకరణ 300(A), Part-XII   


2. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ? (టి.ఎస్‌. ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్, 2016)

జ: 44వ    


3. కిందివాటిలో అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో సరికానిది?    (ఏపీపీఎస్సీ గ్రూప్‌2, మెయిన్స్‌ 2018)

1) అల్పసంఖ్యాక హోదా రాష్ట్ర జనాభా వివరాలపై ఆధారపడి ఉంటుంది.

2) వారికి సొంత విద్యాసంస్థలు స్థాపించుకునే హక్కు ఉంటుంది.

3) అల్పసంఖ్యాకుల హక్కులు సమానత్వం సాధించడానికి ఉద్దేశించినవి.

4) అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి.

జ: అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి.


4. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలోనే అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ఆదేశిస్తుంది? (ఏపీపీఎస్సీ గ్రూప్‌-2, 2016)

జ: ఆర్టికల్‌ 350(A)


5. ఆస్తిహక్కు ఒక....  (ఏఈఈ, 2012)

జ:  న్యాయబద్ధమైన హక్కు


6. కిందివాటిలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి దేన్ని తొలగించారు? (ఎండోమెంట్‌ ఆఫీసర్స్, 2008)

1) వాక్‌స్వాతంత్య్రపు హక్కు    2) మత స్వేచ్ఛ హక్కు

3) ఆస్తి హక్కు    4) న్యాయస్థానాలకు వెళ్లే హక్కు

జ: ఆస్తి హక్కు


7. ప్రాథమిక హక్కుల చాప్టర్‌లో సాంస్కృతిక, విద్యా హక్కుల ముఖ్య ఉద్దేశం? (ఏఈఈ, 2007)

జ: అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడటం


8. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు? (ఏపీపీఎస్సీ గ్రూప్‌-2, 1987)

జ: 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

Posted Date : 16-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌