• facebook
  • whatsapp
  • telegram

గ్రూపు - 14 మూలకాలు

1. కింది వాటిలో గ్రూపు-14 మూలకం కానిది ఏది?

1) కార్బన్‌         2) సిలికాన్‌       3) జెర్మేనియం        4) బోరాన్‌ 

జ: బోరాన్‌


2. కింది వాటిలో కార్బన్‌కు సంబంధించి సరైంది ఏది?

i) కార్బన్‌ మూలక స్థితిలో వజ్రం, గ్రాఫైట్, కోల్‌ మొదలైన రూపాల్లో లభిస్తుంది.

ii) కార్బన్‌ సంయోగస్థితిలో హైడ్రోకార్బన్‌లు, కార్బన్‌డైఆక్సైడ్, లోహ కార్బొనేట్‌లుగా లభిస్తుంది.

iii) ప్రకృతిలో కార్బన్‌ సంయోగస్థితిలో మాత్రమే లభిస్తుంది.

1) i, ii            2) ii, iii        3) i మాత్రమే         4) ii మాత్రమే 

జ: i, ii  


3. కింది వాటిలో కార్బన్‌ ఐసోటోప్‌లు ఏవి?

జ: 4


4. ద్రవ్యరాశి పరంగా భూపటలంలో విస్తృతంగా లభించే మూలకాల్లో రెండోది ఏది?

1) కార్బన్‌          2) సిలికాన్‌            3) అల్యూమినియం          4) ఆక్సిజన్‌

జ: సిలికాన్‌


5. సిలికాన్‌ ప్రకృతిలో ఏ రూపంలో లభిస్తుంది?

1) సిలికా              2) సిలికేట్‌             3) 1, 2        4) బాక్సైట్‌

జ: 1, 2 


6. పింగాణి, గాజు, సిమెంట్‌లలో  అతిముఖ్యమైన అనుఘటకం ఏది?

1) మెగ్నీషియం     2) కాల్షియం              3) సిలికాన్‌         4) సీసం

జ: సిలికాన్‌


7. కింది వాటిలో గెలీనా ఏ మూలకానికి చెందిన  ఖనిజం?

1) సిలికాన్‌            2) సీసం        3) కార్బన్‌               4) బోరాన్‌

జ: సీసం


8. గ్రూపు-14 మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం ఏది?

1) ns2np    2) ns2np5         3) ns2np4       4) ns2np2

జ: ns2np2


9. కింది వాటిలో అర్ధలోహం ఏది?

1) కార్బన్‌      2) లెడ్‌ (సీసం)          3) జెర్మేనియం     4) టిన్‌ (తగరం)

జ: జెర్మేనియం     


10. కింది వాటిలో సరైంది ఏది?

i) 14వ గ్రూపు మూలకాల్లో బాహ్యతమ కర్పరంలో 4 ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. 

ii) 14వ గ్రూపు మూలకాలు +4, +2 ఆక్సీకరణ స్థితులను ప్ర‌ద‌ర్శిస్తాయి.

1) i మాత్రమే       2) ii మాత్రమే               3) i, ii        4) ఏదీకాదు 

జ: i, ii


11. కార్బన్‌ పరమాణువులు ఒకదానితో ఒకటి సమయోజనీయ బంధాల ద్వారా శృంఖలాలను, వలయాలను ఏర్పరిచే ప్రవృత్తిని ఏమంటారు?

1) కాటనేషన్‌        2) రూపాంతరత        3) 1, 2          4) సాదృశ్యం

జ: కాటనేషన్‌


12. కింది ఏ మూలకం అత్యధిక శృంఖలత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది?

1) సిలికాన్‌        2) ఆక్సిజన్‌        3) కార్బన్‌         4) లెడ్‌

జ: కార్బన్‌


13. ఒక మూలకం రెండు, అంత కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభించడాన్ని ఏమంటారు?

1) రూపాంతరత        2) శృంఖలత్వం        3) తాంతవత          4) సాదృశ్యకత 

జ: రూపాంతరత


14. ఘన కార్బన్‌డైఆక్సైడ్‌ను ఏమని పిలుస్తారు?

1) పొడి లవణం     2) పొడి మంచు       3) పొడి ఈథర్‌       4) ఏదీకాదు 

జ: పొడి మంచు


15. సోడానీటిలో కరిగి ఉండే వాయువు ఏది?

1) కార్బన్‌మోనాక్సైడ్‌ (CO)         2) కార్బన్‌డైఆక్సైడ్‌ (CO2)     

3) నైట్రిక్‌ ఆక్సైడ్‌ (NO)        4) నైట్రోజన్‌ (N2)  

జ: కార్బన్‌డైఆక్సైడ్‌ (CO2


16. కార్బన్‌మోనాక్సైడ్‌ అధిక విషస్వభావం కలిగి ఉండటానికి కారణం ఏమిటి?

1) కార్బన్‌మోనాక్సైడ్‌ హిమోగ్లోబిన్‌తో సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరిచే సామర్థ్యం కలిగి ఉండటం

2) కార్బన్‌మోనాక్సైడ్‌ నీటిలో కరగకుండా ఉండటం

3) కార్బన్‌మోనాక్సైడ్‌కు రంగు, వాసన లేక పోవడం

4) కార్బన్‌మోనాక్సైడ్‌లో ఒక ‘సిగ్మా’, రెండు ‘పై’ బంధాలు ఉండటం 

జ: కార్బన్‌మోనాక్సైడ్‌ హిమోగ్లోబిన్‌తో సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరిచే సామర్థ్యం కలిగి ఉండటం


17. నీటిలో కార్బన్‌డైఆక్సైడ్‌ కరగడం వల్ల ఏర్పడే ఆమ్లం ఏది?

1) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం  - H2SP4              2) నైట్రిక్‌ ఆమ్లం - HNO3

3) కార్బొనిక్‌ ఆమ్లం - H2CO3              4) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం - HCl

జ: కార్బొనిక్‌ ఆమ్లం - H2CO3


18. కింది వాటిలో కార్బన్‌డైఆక్సైడ్‌ ఉపయోగాలు ఏవి?

1) ఐస్‌క్రీమ్‌ల తయారీలో శీతలీకారిణిగా ఉపయోగిస్తారు.      2) మృదు పానీయాల తయారీలో వాడతారు

3) మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తారు              4) పైవన్నీ

జ: పైవన్నీ


19. ప్రతిపాదన (A): వజ్రానికి సమయోజనీయ స్వభావం ఉన్నప్పటికీ అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. 

కారణం (R): వజ్రం దృఢమైన కార్బన్‌ - కార్బన్‌ (C - C) బంధాల అల్లికతో త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

1) A నిజం కానీ R తప్పు       2) A  తప్పు కానీ R నిజం

3) A, R రెండూ నిజం, A కి R సరైన వివరణ 

4) A, R రెండూ నిజం, A కి R సరైన వివరణ కాదు

జ: A, R రెండూ నిజం, A కి R సరైన వివరణ 


20. డైమండ్‌లో ప్రతి కార్బన్‌ ఏ సంకరకరణం చెందుతుంది?

1) sp       2) sp2       3) sp3       4) sp3d

జ: sp3


21. కింది వాటిని జతపరచండి.

  కార్బన్‌ రూపాంతరం         నిర్మాణం

A)  వజ్రం     i) సమతల షట్కోణ వలయం

B) గ్రాఫైట్‌     ii) సాకర్‌ బంతి

C) ఫుల్లరిన్‌   iii) టెట్రాహెడ్రల్‌

1) A-iii, B-ii, C-i           2) A-ii, B-i, C-iii   

3) A-iii, B-i, C-ii          4) A-i, B-iii, C-ii

జ: A-iii, B-i, C-ii


22. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?

i) గ్రాఫైట్‌ పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

ii) గ్రాఫైట్‌లో ప్రతి కార్బన్‌ పరమాణువు sp2 - సంకరకరణంలో పాల్గొంటుంది.

1) i మాత్రమే       2) ii మాత్రమే       3) i, ii       4) ఏదీకాదు 

జ: i, ii  


23. కింది వాటిలో సరికానిది ఏది?

1) గ్రాఫైట్‌ - మంచి విద్యుత్‌ వాహకం

2) గ్రాఫైట్‌ - మృదువుగా, జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది.

3) కార్బన్‌ రూపాంతరాలు - కోక్, బొగ్గు

4) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌ - CH4

జ: బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌ - CH4


24. కింది అంశాల్లో సరికానిది ఏది?

i) డైమండ్‌ను దృఢమైన పనిముట్లను పదును చేసేందుకు అపఘర్షకంగా ఉపయోగిస్తారు. 

ii) డైమండ్‌ను కందెనల తయారీలో వాడతారు.

1) i మాత్రమే        2) ii మాత్రమే         3) i, ii           4) రెండూ సరైనవే 

జ: ii మాత్రమే


25. సిలికా రసాయన ఫార్ములా...

1) SiO2       2) SiO4              3) SiH4              4) SeO2

జ: SiO2 


26. కింది వాటిలో సిలికేట్‌ ఖనిజాలు ఏవి?

i) మైకా               ii) ఫెల్డ్‌స్పార్‌ 

iii) జియోలైట్‌     iv) లైమ్‌స్టోన్‌       

v) రాతిఉప్పు     vi) సిన్నబార్‌

1) i, iii, v, vi          2) i, ii, iii         3) iv, v, vi            4) ii, iv, vi

జ: i, ii, iii 


27. Si − O − Si బంధాలు ఉన్న ఆర్గానో సిలికాన్‌ అణుపుంజాలను ఏమంటారు?

1) సిలికేట్‌లు              2) సిలికోన్‌లు         3) సిలేన్‌లు          4) పైవన్నీ

జ: సిలికోన్‌లు


28. కింది వాటిలో సిలికోన్‌ల ధర్మాలకు సంబంధించి సరైంది ఏది?

i) సిలికోన్‌లు మంచి ఉష్ణ, విద్యుత్‌ బంధకాలుగా పనిచేస్తాయి.

ii) సిలికోన్‌లు రసాయన జడత్వాన్ని కలిగి ఉంటాయి.

iii) ఇవి జలవిరోధ స్వభావాన్ని కలిగి ఉంటాయి.

1) i, ii          2) ii, iii        3) i, iii       4) పైవన్నీ

జ: పైవన్నీ


29. కింది వాటిలో సిలికోన్‌ల అనువర్తనాలకు సంబంధించి సరైంది ఏది?

i) సిలికోన్‌ నూనెలను బ్రేక్‌లలో హైడ్రాలిక్‌ ద్రవంగా, ట్రాన్స్‌ఫార్మర్‌ నూనెలుగా ఉపయోగిస్తారు.

ii) సిలికోన్‌ రబ్బర్‌లను గాస్కెట్లు, వ్యోమగాములు ఉపయోగించే బూట్ల తయారీలో ఉపయోగిస్తారు.

1) i మాత్రమే        2) ii మాత్రమే             3) i, ii           4) ఏదీకాదు 

జ: i, ii 


30. సిలికేట్‌లలోని మూల నిర్మాణాత్మక యూనిట్‌ ఏది?

1) SiO-2          2) SiO-44        3) SiO2        4) SiO-33

జ: SiO-44


31. ఈథేన్‌ వాయువు రసాయన ఫార్ములా?

1) CH4              2) C2H6         3) C3H7            4) C2H

జ: C2H6         

32. పెన్సిల్‌లోని లెడ్‌ శాతం ఎంత?

1) 0%       2) 10%          3) 20%        4) 80%

జ: 0%


33. కింది వాటిలో ఏ మూలకం అసంఖ్యాకమైన సమ్మేళనాలను ఏర్పరస్తుంది?

1) సల్ఫర్‌             2) కార్బన్‌         3) ఫాస్పరస్‌          4) కాల్షియం

జ: కార్బన్‌     

   
34. కింది అంశాల్లో సరికానిది ఏది?  

1) మూలకాల రారాజు - కార్బన్‌            2) బ్లాక్‌లెడ్‌ - గ్రాఫైట్‌

3) అతిపురాతనమైన బొగ్గు రకం- ఆంత్రసైట్‌      4) వజ్రం - C60

జ: వజ్రం - C60


35. కింది వాటిలో సరైంది ఏది? 

i) గ్రాఫైట్‌ను బక్కీబాల్స్‌ అని పిలుస్తారు.

ii) గ్రాఫైట్‌ను కందెనలుగా వాడతారు

1) i మాత్రమే      2) ii మాత్రమే         3) i, ii        4) ఏదీకాదు

జ:  ii మాత్రమే


36. గ్రాఫిన్‌ స్టీల్‌ కంటే....

1) బలమైంది          2) తేలికైంది         3) 1, 2             4) బరువైంది, బలహీనమైంది

జ: 1, 2


37. కింది అంశాల్లో సరికానిది ఏది?

1) ఈథేన్‌ - సంతృప్త హైడ్రోకార్బన్‌            

2) బ్యూటేన్‌ - సంతృప్త హైడ్రోకార్బన్‌

3) ఎసిటిలీన్‌ - అసంతృప్త హైడ్రోకార్బన్‌          

4) ఇథిలీన్‌ - సంతృప్త హైడ్రోకార్బన్‌

జ: ఇథిలీన్‌ - సంతృప్త హైడ్రోకార్బన్‌


38. కింది వాటిని జతపరచండి.

హైడ్రోకార్బన్‌     సంకరకరణం

A) ఆల్కేన్‌     i) sp2

B) ఆల్కీన్‌     ii) sp

C) ఆల్కైన్‌     iii) sp3

1) A-i, B-iii, C-ii     2) A-iii, B-ii, C-i     3) A-ii, B-i, C-iii      4) A-iii, B-i, C-ii

జ: A-iii, B-i, C-ii


39. వజ్రం మెరవడానికి కారణం ఏమిటి?

1) అధిక సాంద్రతను కలిగి ఉండటం          2) అధిక వక్రీభవన గుణకం ఉండటం 

3) కార్బన్‌ రూపాంతరం కావడం       4) పైవన్నీ

జ: అధిక వక్రీభవన గుణకం ఉండటం


40. వజ్రం సాంద్రత ఎంత?

1) 2.5 గ్రా/సెం.మీ3         2) 3.5 గ్రా/సెం.మీ3

3) 1.5 గ్రా/సెం.మీ3          4) 0.5 గ్రా/సెం.మీ3

జ: 3.5 గ్రా/సెం.మీ3


41. వాహనాల సైలెన్సర్‌ నుంచి వెలువడే విషవాయువు ఏది?

1) కార్బన్‌డైఆక్సెడ్‌     2) కార్బన్‌మోనాక్సైడ్‌       3) హైడ్రోజన్‌     4) ఏదీకాదు

జ: కార్బన్‌మోనాక్సైడ్‌   

   
42. పొడిమంచు వాయువుగా మారడాన్ని ఏమంటారు?

1) విస్ఫోటనం         2) ఉత్పతనం      3) ద్రవీభవనం         4) బాష్పీభవనం

జ: ఉత్పతనం     


43. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీలో ఉపయోగించే మూలకం ఏది?

1) సోడియం         2) సిలికాన్‌        3) కాల్షియం         4) ప్లాటినం

జ: సిలికాన్‌       


44. అత్యధిక విద్యుత్‌ వాహకతను ప్ర‌ద‌ర్శించే అలోహ పదార్థం ఏది?

1) గ్రాఫైట్‌ (కార్బన్‌)       2) ఆక్సిజన్‌      3) నైట్రోజన్‌          4) క్రోమియం

జ: గ్రాఫైట్‌ (కార్బన్‌)


45. కింది వాటిలో రేడియోధార్మిక కిరణాలను శోషించేది ఏది?

1) లెడ్‌        2) కాపర్‌         3) పొటాషియం        4) క్రోమియం

జ: లెడ్‌       


46. సిలికాన్‌ హైడ్రైడ్‌లను ఏమంటారు?

1) సిలికోన్‌లు        2) సిలికేట్‌లు       3) సిలేన్‌లు         4) పైవన్నీ

జ: సిలేన్‌లు         


47. పెన్సిల్‌ లెడ్‌లో ఉండే మూలకం ఏది?

1) C       2) S       3) O       4) N
జ: C


48. కింది అంశాలను వాటిని జతపరచండి.

హైడ్రోకార్బన్‌     రసాయన ఫార్ములా

A) ప్రొపేన్‌     i) C3H6

B) ప్రొపీన్‌     ii) C3H4

C) ప్రొపైన్‌     iii) C3H8

1) A-iii, B-ii, C-i    2) A-ii, B-i, C-iii
3) A-iii, B-i, C-ii     4) A-i, B-iii, C-ii

జ: A-iii, B-i, C-ii   


49. కింది వాటిలో అరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌ ఏది?

1) బెంజీన్‌     2) టోలీన్‌          3) ఫినాల్‌          4) పైవన్నీ

జ: పైవన్నీ

Posted Date : 28-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌