• facebook
  • whatsapp
  • telegram

భారత రక్షణ రంగం

1. డీఆర్‌డీఓ ప్రయోగించిన అణుశక్తి సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ మిస్సైల్‌ను 18 డిసెంబరు 2021 సంవత్సరంలో ఒడిశా తీరం నుంచి ప్రయోగించారు. ఆ మిస్సైల్‌ పేరేమిటి?

1) అగ్ని-P లేదా అగ్ని ప్రైమ్‌       2) ప్రళయ్‌      3) బ్రహ్మోస్‌      4) నాగ్‌

జ: అగ్ని-P లేదా అగ్ని ప్రైమ్‌


2. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిస్సైల్‌ ప్రోగ్రాం అని ఎవరిని పిలుస్తారు?

1) విక్రమ్‌ సారాభాయ్‌       2) ఏపీజే అబ్దుల్‌ కలాం

3) టెస్సీ థామస్‌         4) శివధను పిళ్లై 

జ: ఏపీజే అబ్దుల్‌ కలాం


3. కింది వాటిలో క్షిపణుల గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.

1) బాలిస్టిక్‌ క్షిపణులు పారాబోలా (parabolic) ఆకారంలో ప్రయాణిస్తాయి. ఇవి టేక్‌ ఆఫ్‌ వ్యవస్థకు మాత్రమే ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి.

2) క్రూయిజ్‌ క్షిపణులు సరళ మార్గంలో ప్రయాణిస్తాయి.

3) క్షిపణులు న్యూటన్‌ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి.

4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


4. అగ్నిశ్రేణి క్షిపణుల రూపకల్పనలో ప్రముఖంగా కృషిచేసి, "Agni man of India" గా పేరొందిన వారెవరు?

1) అవినాశ్‌ చందర్‌                 2) శివధను పిళ్లై 

3) టెస్సీ థామస్‌        4) విక్రమ్‌ సారాభాయ్‌

జ: అవినాశ్‌ చందర్‌  ​​​​​​​


5. భారతదేశ రక్షణ రంగంలో ఎంతో కృషి చేసి మిస్సైల్‌ ఉమెన్‌ (అగ్ని పుత్రి)గా ప్రసిద్ధి పొందిన వారెవరు?

1) టెస్సీ థామస్‌                                2) సౌమ్య స్వామినాథన్‌

3) డాక్టర్‌ అపర్ణ ముఖర్జీ              4) డాక్టర్‌ ప్రియా అబ్రహం

జ: టెస్సీ థామస్‌​​​​​​​


6. UAN అంటే....

1) అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్‌                   2) అన్‌యూజ్‌డ్‌ ఎయిర్‌ వెస్సెల్‌

3) అధునాతన తుపాకీ              4) వినూత్న క్షిపణి వ్యవస్థ

జ: అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్‌  ​​​​​​​


7. భద్రతా దళాలకు పెనుముప్పుగా మారుతున్న డ్రోన్ల దాడిని నిలువరించడానికి కావాల్సిన వ్యవస్థను కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన సంస్థ?

1) సీఎస్‌ఐఆర్‌     2) డీఆర్‌డీఓ        3) ఇస్రో         4) ఐఐటీ మద్రాస్‌

జ: ఐఐటీ మద్రాస్‌


8. భారతీయ రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1958        2) 1962         3) 1950         4) 1948

జ: 1958​​​​​​​


9. భారతీయ రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి రంగాలను క్షిపణి ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేయడానికి ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను ఏపీజే అబ్దుల్‌ కలాం ఎప్పుడు ప్రారంభించారు?

1) 1982              2) 1983         3) 1984           4) 1985

జ: 1983​​​​​​​


10. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.

ఎ) ఆకాశ్‌ - మీడియం రేంజ్‌ మల్టీ టార్గెట్‌  మిస్సైల్‌

బి) త్రిశూల్‌ - షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ (SAM)

సి) బ్రహ్మోస్‌ - సూపర్‌ సోనిక్‌ యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌

డి) నాగ్‌ - యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ విత్‌ ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ క్యాపబిలిటీ

1) ఎ, బి        2) ఎ, బి, డి         3) ఎ, బి, సి        4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


11. భారతదేశంలో రక్షణ రంగ పరికరాలకు కావాల్సిన రాడార్‌లను ఎక్కడ తయారు చేస్తారు?

1) ERDE (ఎలక్ట్రానిక్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌) - బెంగళూరు

2) డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ - హైదరాబాద్‌

3) 1, 2               4) పైవేవీ కావు

జ: 1, 2  ​​​​​​​


12. కింది వాటిలో బరాక్‌8 క్షిపణి వ్యవస్థ గురించి సరైన వ్యాఖ్య? 

1) ఈ క్షిపణి వ్యవస్థ అన్ని వాతావరణ పరిస్థితుల్లో (పగలు, రాత్రి) బహుళ లక్ష్యాలను ఛేదించగలిగిన సామర్థ్యం ఉన్న భూ ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించిన మిస్సైల్‌ వ్యవస్థ (LRSAM).

2) ఈ వ్యవస్థను భారత్, ఇజ్రాయెల్‌ దేశాల రక్షణ రంగాలు సంయుక్తంగా భారత ఆర్మీ కోసం రూపొందించాయి.

3) 1 & 2                     4) పైవేవీ కావు 

జ: 1 & 2 ​​​​​​​


13. అడ్వాన్స్‌డ్‌ హైపర్‌ సోనిక్‌ విండ్‌ టన్నెల్‌ టెస్ట్‌ ఫెసిలిటీ (5 machs) అంతకంటే ఎక్కువ కలిగిన ధ్వని వ్యవస్థల కోసం) అనే వ్యవస్థను రూపొందించడం ద్వారా అమెరికా, రష్యా దేశాల సరసన ఇటీవల భారత్‌ చేరింది. ఈ వ్యవస్థను దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) దిల్లీ        2) గువాహటి       3) హైదరాబాద్‌     4) ముంబయి

జ: హైదరాబాద్‌ ​​​​​​​​​​​​​​


14. తేజస్‌ ఎల్‌సీఏ లైట్‌ కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.

1) అత్యంత తేలికైన తక్కువ పరిమాణం కలిగి ఒకే సమయంలో అనేక పనులను చేయగలిగిన సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.

2) భారత వాయుదళ వివిధ అవసరాల కోసం రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌.

3) 2021లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 13వ ఎగ్జిబిషన్‌ లోగో కూడా తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్ఫూర్తితో రూపొందించారు.

4) పైవన్నీ సరైనవి

జ: పైవన్నీ సరైనవి​​​​​​​


15. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) S-400 Triumph అనేది భారత్‌  కోసం రష్యా రూపొందించిన ఎయిర్‌ డిఫెన్స్‌మిస్సైల్‌ సిస్టమ్‌.

బి) ఇది అత్యంత అధునాతన మీడియం లాంగ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ (MLRSAM)

సి) ఈ క్షిపణి వ్యవస్థ ద్వారా ఉపరితలంపై ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్, బాలిస్టిక్, క్రూయిజ్‌ మిస్సైల్‌ లాంటి లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా 400 కి.మీ. దూరం వరకు, 30 కి.మీ. ఎత్తు వరకు గుర్తించగలదు.

డి) ఈ మిస్సైల్‌ వ్యవస్థ అమెరికా రూపొందించిన అధునాతన క్షిపణి (THAAD- Terminal High Altitude Area Defence System) వ్యవస్థ కంటే మరింత మెరుగ్గా పనిచేస్తుంది.

1) ఎ మాత్రమే      2) ఎ, బి మాత్రమే       3) ఎ, సి, డి        4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


16. SMART గురించి సరైన వ్యాఖ్య ఏది? 

ఎ) ఇది భారతదేశ స్వదేశీ నిర్మితమైన సూపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ అసిస్టెడ్‌ టార్పిడో సిస్టం (SMART)

బి) ఇది సంప్రదాయ టార్పిడోల కంటే అత్యంత అధునాతనమైంది, శత్రుదేశ సబ్‌మెరైన్‌లను అత్యంత చాకచక్యంగా గుర్తిస్తుంది.

సి) దీన్ని వీలర్‌ ఐలాండ్‌ నుంచి 13  డిసెంబరు 2021లో ప్రయోగించారు.

డి) టార్పిడో వ్యవస్థను డీఆర్‌డీఓ ప్రయోగశాలలైన డీఆర్‌డీఎల్, ఆర్సీఐ-హైదరాబాద్, ఎడీఆర్‌డీఈ-ఆగ్రా, ఎన్‌ఎస్‌టీఎల్‌-విశాఖపట్నం  రూపొందించాయి.

1) ఎ, బి మాత్రమే       2) ఎ, సి మాత్రమే      3) ఎ, సి, డి       4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


17. కింది వాటిలో సరైన జత ఏది?

ఎ) ABHYAS: డీఆర్‌డీఓ వైమానిక దళ అవసరాల కోసం రూపొందించిన హైస్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ సిస్టమ్‌. 

బి) భారత్‌ శత్రు దేశ సబ్‌మెరైన్‌లను ఎదుర్కొనే ప్రాజెక్టు కార్వెట్‌ వ్యవస్థను 28 యాంటీ సబ్‌మెరైన్‌ల ద్వారా రూపొందించింది

సి) RUDRAM అనే యాంటీ రేడియేషన్‌ మిస్సైల్‌ను దేశీయ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ రూపొందించింది. 

డి) SRIJAN అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్‌స్టాప్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌.

1) ఎ, బి, సి          2) ఎ, బి, డి          3) ఎ, బి          4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


18. కింది వాటిని జతపరచండి.

ఎ) అర్జున్‌ -   i) ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌

బి) పినాక -    ii) ఆర్టిలరీ గన్‌

సి)  ఆకాశ్‌ -    iii) మెయిన్‌ బాటిల్‌ ట్యాంక్‌

డి) ధనుష్‌ -    iv) మల్టీ బారెల్‌ రాకెట్‌ లాంచర్‌

1) ఎ - iii, బి - iv, సి - i, డి - ii        2) ఎ - iv, బి - i, సి - iii, డి - ii

3) ఎ - ii, బి - i, సి - iii, డి - iv       4) ఎ - ii, బి - iii, సి- i, డి - i

జ: ఎ - iii, బి - iv, సి - i, డి - ii​​​​​​​


19. ప్రాజెక్టు-75 గురించి సరైన వ్యాఖ్యానాలను గుర్తించండి. 

ఎ) ఇది భారత నావికాదళం కోసం రూపొందించిన కల్వరి తరగతికి చెందిన సబ్‌మెరైన్‌ వ్యవస్థ

బి) వీటిని ముంబయిలోని మజ్‌గావ్‌డాక్‌ లిమిటెడ్‌లో తయారు చేస్తారు. 

సి) ఈ సబ్‌మెరైన్‌లు యాంటీ సర్పేస్‌ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్‌ గ్యాదరింగ్, ఏరియా సర్వైలెన్స్‌ లక్ష్యాలను నిర్వర్తిస్తాయి.

డి) ఈ తరగతి సబ్‌మెరైన్లలో ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ ఖండెరీ, ఐఎన్‌ఎస్‌ తరంగ్, ఐఎన్‌ఎస్‌ వేల మొదలైనవి భారత నావికాదళానికి సేవలందిస్తున్నాయి. ఐఎన్‌ఎస్‌ వగీర్‌ తయారీ పూర్తయ్యి, సేవలందించడానికి సిద్ధంగా ఉంది. ఈ శ్రేణిలో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్షీర్‌ను భారత నావికాదళంలో చేర్చడానికి కావాల్సిన చర్యలను ఏప్రిల్‌ 2022 నుంచి ప్రారంభించారు.

1) ఎ, బి         2) ఎ, బి, సి           3) ఎ, బి, డి    4) పైవన్నీ

జ: పైవన్నీ


20. మారీచ్‌ (maareech) అంటే...

1) భారత నావికా దళానికి చెందిన అడ్వాన్స్‌డ్‌ టార్పిడో డిఫెన్స్‌ సిస్టమ్‌.

2) సైనిక దళానికి చెందిన అత్యంత అధునాతన గన్‌

3) వైమానిక దళానికి చెందిన అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌

4) భారత్‌ ఇటీవల రూపొందించిన వినూత్న డ్రోన్‌

జ: భారత నావికా దళానికి చెందిన అడ్వాన్స్‌డ్‌ టార్పిడో డిఫెన్స్‌ సిస్టమ్‌.​​​​​​​


21. కింది వాటిలో భారత యుద్ధ ట్యాంక్‌ కానిది ఏది?

1) అర్జున్‌ (lion) MK2                   2) T-90M భీష్మ

3) నిశాంత్‌                        4) T-72 (అజేయ)

జ: నిశాంత్‌​​​​​​​


22. హ్వాసాంగ్‌ (Hwasong) -12 అనే ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను 2022 జనవరి 30న జపాన్‌ మీదుగా ప్రయోగించిన దేశం ఏది?

1) చైనా        2) రష్యా       3) ఉత్తర కొరియా     4) అమెరికా

జ: ఉత్తర కొరియా​​​​​​​


23. కింది వాటిలో భారతదేశ డ్రోన్‌ కానిది ఏది?

1) నిషాంత్‌      2) రుస్తుం     3) వరుణాస్త్ర        4) పంచి 

జ: వరుణాస్త్ర​​​​​​​


24. భారత్‌ రష్యా సంయుక్తంగా నిర్మించిన బ్రహ్మోస్‌ క్షిపణి కోసం ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న దేశం?

1) నెదర్లాండ్స్‌      2) బంగ్లాదేశ్‌       3) నేపాల్‌        4) ఫిలిప్పీన్స్‌

జ: ఫిలిప్పీన్స్‌​​​​​​​


25. అణుసామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌లో నుంచి ప్రయోగించగలిగిన మిస్సైల్‌ ఏది?

1) ఆకాష్‌         2) నాగ్‌          3) k - సాగరిక    4) పృథ్వి

జ: k - సాగరిక​​​​​​

Posted Date : 25-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌