• facebook
  • whatsapp
  • telegram

క.సా.గు - గ.సా.భా 

క.సా.గు (కనిష్ఠ సామాన్య గుణిజం -  Least Common Multiple): 
* రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల సామాన్య గుణిజాల్లో మిక్కిలి చిన్నదాన్ని ఆ సంఖ్యల ‘క.సా.గు’ అంటారు.


గ.సా.భా (గరిష్ఠ సామాన్య భాజకం - Greatest Common Divisor):

* రెండు లేెదా అంతకంటే ఎక్కువ సంఖ్యల సామాన్య భాజకాల్లో మిక్కిలి పెద్ద దాన్ని ఆ సంఖ్యల గ.సా.భా అంటారు.


క.సా.గు, గ.సా.భా మధ్య సంబంధం:

* ఇచ్చిన రెండు సంఖ్యల లబ్ధం వాటి క.సా.గు, గ.సా.భాల లబ్ధానికి సమానం.

* a, b లు రెండు సంఖ్యలు, వాటి క.సా.గు L, గ.సా.భా G అయితే, 

             a x b = L x G
 

క.సా.గు ను కనుక్కునే పద్ధతులు: క.సా.గు ను మూడు పద్ధతుల్లో కనుక్కుంటారు. అవి:

1. గుణిజాల పద్ధతి 

2. ప్రధాన కారణాంకాల పద్ధతి 

3. భాగాహార పద్ధతి   

ఉదా: 12, 15ల క.సా.గును కనుక్కోండి.

గుణిజాల పద్ధతి:

12కి గుణిజాలు: 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108, 120, ........

15కి గుణిజాలు: 15, 30, 45, 60, 75, 90, 105, 120, 135, ........ 

12, 15ల సామాన్య/ ఉమ్మడి గుణిజాలు 

    = 60, 120, 180, ........ 

* ఇచ్చిన రెండు సంఖ్యల్లో చిన్న సంఖ్య గుణిజం పెద్ద సంఖ్య అయితే, ఆ రెండు సంఖ్యల క.సా.గు పెద్ద సంఖ్య అవుతుంది.

* ఇచ్చిన రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయితే, ఆ రెండు సంఖ్యల లబ్ధం వాటి క.సా.గు అవుతుంది.

* ఇచ్చిన రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే, ఆ రెండు సంఖ్యల లబ్ధం వాటి క.సా.గు అవుతుంది.

ఉదా: 8, 15ల క.సా.గు = 8 x 15 = 120


           
గ.సా.భా ను కనుక్కునే పద్ధతులు: గ.సా.భా ను మూడు పద్ధతుల్లో కనుక్కుంటారు. అవి:

1. కారణాంకాల పద్ధతి 

2. ప్రధాన కారణాంకాల పద్ధతి 

3. భాగాహార పద్ధతి: ఈ విధానాన్ని యూక్లిడ్‌ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు.

ఉదా: 24, 32ల గ.సా.భా కనుక్కోండి.


కారణాంకాల పద్ధతి:

24కి కారణాంకాలు  = 1, 2, 3, 4, 6, 8, 12, 24

32కి కారణాంకాలు = 1, 2, 4, 8, 16, 32

24, 32ల ఉమ్మడి కారణాంకాలు = 1, 2, 4, 8
24, 32ల గ.సా.భా = 8


 

* ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్దసంఖ్య కారణాంకం చిన్నసంఖ్య అయితే ఆ రెండు సంఖ్యల గ.సా.భా చిన్నసంఖ్య అవుతుంది.

ఉదా: 15, 45ల గ.సా.భా = 15 

* ఇచ్చిన రెండు సంఖ్యలు ‘పరస్పర ప్రధాన సంఖ్యలు’ అయితే వాటి గ.సా.భా = 1  

ఉదా: 4, 9 ల గ.సా.భా = 1 


           
* ఇచ్చిన రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయితే వాటి గ.సా.భా = 1

* రెండు వరుస సంఖ్యల గ.సా.భా = 1


మాదిరి ప్రశ్నలు


1. హరిత, లలిత, రమ్య ఒక బాటను చుట్టడానికి వరుసగా 100 సె., 120 సె., 110 సె. సమయం పట్టింది. వారు ముగ్గురూ ఒకేసారి బయలుదేరితే, మళ్లీ ఎంత సమయానికి కలుసుకుంటారు?

1) 1 గం. 45 ని.      2) 1 గం. 30 ని.      3) 1 గం. 50 ని.      4) 1 గం. 40 ని.


2. నాలుగు గడియారాలు 18, 24, 40, 60 నిమిషాల వ్యవధిలో వరుసగా మోగుతాయి. ఆ నాలుగూ ఉదయం 5 గం.లకు ఒకేసారి మోగితే, మళ్లీ అన్నీ ఒకేసారి ఎన్ని గంటలకు మోగుతాయి?

1) ఉదయం 9 గం.       2) ఉదయం 11 గం.      3) ఉదయం 10 గం.      4) ఉదయం 8 గం.


3. కింది సంఖ్యల్లో దేనికి 3 కలిపితే 15, 21, 25 లతో నిశ్శేషంగా భాగితమవుతుంది.

1) 522       2) 525       3) 528       4) 252

4. మూడు సంఖ్యలు 2 : 3 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి క.సా.గు 360 అయితే ఆ మూడు సంఖ్యల మొత్తం ఎంత?

1) 240      2) 250       3) 260      4) 270


5. ఏ గరిష్ఠ మూడంకెల సంఖ్యను 75, 45, 60 తో భాగిస్తే ప్రతిసారి శేషం 4 వస్తుంది?

1) 900       2) 934      3) 904      4) 924

సాధన: 75, 45, 60 ల క.సా.గు


6. 12, 15, 18, 24 లతో భాగితమయ్యే ప్రతి సందర్భంలోనూ శేషం ‘9’ ఇచ్చే 5 అంకెల గరిష్ఠ సంఖ్య?

1) 99792        2) 99279      3) 99739        4) 99720


7. 12, 18, 24 ల గ.సా.భా ఎంత?

1) 18        2) 6        3) 12        4) 4

సాధన: గ.సా.భా అనేది ఇచ్చిన సంఖ్యల్లో చిన్నసంఖ్యకు సమానంగా లేదా చిన్నసంఖ్య కారణాంకాల్లో ఏదో ఒకటిగా ఉంటుంది.

ఇచ్చిన ఆప్షన్స్‌ ప్రకారం 12, 18, 24 లను 6 నిశ్శేషంగా భాగిస్తుంది.

∴ 12, 18, 24ల గ.సా.భా = 6     సమాధానం: 2


8. ఒక గది కొలతలు వరుసగా 12 మీ., వెడల్పు 15 మీ., ఎత్తు 18 మీ. అయితే గది కొలతలన్నింటినీ కచ్చితంగా కొలవగలిగే టేపు గరిష్ఠ పొడవు ఎంత?

1) 2        2) 3         3) 4          4) 12

సాధన: 12, 15, 18 ల గ.సా.భా = 3

12, 15, 18 ని 3 నిశ్శేషంగా భాగిస్తుంది.     సమాధానం: 2


     2    8   64   10


10. రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 4. వాటి గ.సా.భా 4 అయితే క.సా.గు ఎంత?

1) 46       2) 36       3) 48       4) 54 

సాధన: సంఖ్యలు = 3x, 4x

3x, 4x ల గ.సా.భా = x  x = 4

3x, 4x ల క.సా.గు = 3 x X x 4 = 12x 

= 12 x 4 = 48     సమాధానం: 3


గమనిక: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గ.సా.భా, ఆ సంఖ్యల క.సా.గు ను నిశ్శేషంగా భాగిస్తుంది.

* రెండు సంఖ్యల గ.సా.భా 14, అయితే ఈ కింది వాటిలో ఆ రెండు సంఖ్యల క.సా.గు కానిది ఏది?

1) 448      2) 364      3) 336      4) 204

సాధన: 448, 364, 336 లను 14 నిశ్శేషంగా భాగిస్తుంది.

204ను 14 నిశ్శేషంగా భాగించదు కాబట్టి, ఆ సంఖ్యల క.సా.గు 204 కాదు.    సమాధానం: 4

Posted Date : 17-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌