మాదిరి ప్రశ్నలు
1. ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు?
1) బాల గంగాధర్ తిలక్ 2) బిపిన్ చంద్రపాల్
3) అనిబిసెంట్ 4) లాలాలజపతి రాయ్
2. జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?
1) కాసు బ్రహ్మానందరెడ్డి 2) నీలం సంజీవరెడ్డి
3) పి.వి.నరసింహారావు 4) జలగం వెంగళరావు
3. కర్నూలు సర్క్యులర్‌ను ఏ ఉద్యమ కాలంలో రూపొందించారు?
1) వందేమాతరం 2) సహాయ నిరాకరణ
3) ఉప్పు సత్యాగ్రహం 4) క్విట్ ఇండియా
4. పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి?
1) నీలం సంజీవరెడ్డి 2) బెజవాడ గోపాలరెడ్డి
3) కాసు బ్రహ్మానందరెడ్డి 4) పి.వి.నరసింహారావు
సమాధానాలు: 1-2; 2-3; 3-4; 4-2.