• facebook
  • whatsapp
  • telegram

కేంద్రక భౌతికశాస్త్రం

1. కేథోడ్‌ కిరణాలు వేటి ప్రవాహాలు?

జ‌:  ఎలక్ట్రాన్లు     


2. ఎలక్ట్రాన్‌ ఆవేశం విలువను నిర్ధారించిన మిలికాన్‌ ప్రయోగం ఏది?

జ‌:  తైల బిందు (Oil drop) ప్రయోగం 


3. కిందివాటిలో దేనికి ఎక్కువ ఆవేశం ఉంటుంది?

1) ప్రోటాన్‌     2) ఆల్ఫాకణం     3) ఎలక్ట్రాన్‌     4) బీటా కణం

జ‌: ఆల్ఫాకణం 


4. ఉత్సర్గ నాళంలో కేథోడ్‌-ఆనోడ్‌ల మధ్య పొటెన్షియల్‌ 20,000V ఉన్నప్పుడు పీడనం శూన్యం అయితే, దానిలో.....

జ‌: ఉత్సర్గం జరగదు 


5. విశ్వంలో అతి తక్కువ విద్యుత్‌ ఆవేశాన్ని కలిగి ఉండేవి?

జ‌:  క్వార్క్‌లు


6. ఐన్‌స్టీన్‌కి నోబెల్‌ బహుమతి రావడానికి కారణమైన ఆవిష్కరణ ఏది?

జ‌: కాంతి విద్యుత్‌ ప్రభావానికి - వివరణ         


7. ద్రవ్య తరంగాలను ప్రతిపాదించింది డిబ్రాయ్‌. అయితే వీటి ఉనికిని ప్రయోగాత్మకంగా కనుక్కుంది ఎవరు? 

జ‌:  డేవిసన్, జెర్మర్‌ 


8. పరమాణువులో కేంద్రకం ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

జ‌: రూథర్‌ఫర్డ్‌


9. అత్యధిక బంధన శక్తి లేదా స్థిరత్వాన్ని కలిగిన మూలక కేంద్రకం ఏది?

జ‌:  ఇనుము     


10. రేడియోధార్మిక విఘటన రేటు దేనిపై ఆధారపడదు?

1) ఉష్ణోగ్రత     2) పీడనం      3) వాతావరణంలోని తేమశాతం        4) పైవన్నీ

జ‌: పైవన్నీ


11. రేడియం అర్ధ జీవితకాలం 1600 ఏళ్లు. 1 గ్రా. రేడియం 0.115 గ్రా.లుగా తగ్గడానికి ఎన్నేళ్లు పడుతుంది?

జ‌:  4800  


12. కేంద్రక బలాలు....

1) ఆకర్షణ బలాలు            2) అత్యంత బలమైన బలాలు

3) అత్యల్ప వ్యాప్తి బలాలు    4) పైవన్నీ

జ‌:  పైవన్నీ


13. కృత్రిమ రేడియోధార్మికతను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

జ‌:  ఫ్రెడరిక్‌ జోలియట్, ఐరన్‌ క్యూరీ


14. కేంద్రక చర్యలను ప్రారంభించడానికి అత్యంత అనువైన కణం ఏది?

జ‌: న్యూట్రాన్‌     


15. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో, ప్రతి విచ్ఛిత్తికి సగటున ఎన్ని న్యూట్రాన్లు వెలువడతాయి?

జ‌:  2.5


16. ఏ సూత్రం ఆధారంగా కేంద్రక రియాక్టర్‌ పనిచేస్తుంది?

జ‌: నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి 


17. రియాక్టర్ల మితకారి....

జ‌:  న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌