• facebook
  • whatsapp
  • telegram

పాలిమర్‌లు - అనువర్తనాలు

1. పాలిమర్‌లో పునరావృతమయ్యే నిర్మాణాత్మక యూనిట్లను ఏమంటారు?

1) కొల్లాయిడ్‌     2) మోనోమర్‌ 

3) డైమర్‌      4) ఎలాస్టోమర్‌

2. కిందివాటిలో సహజ పాలిమర్‌కు ఉదాహరణ ఏది?

1) స్టార్చ్‌        2) ఉన్ని        3) పత్తి       4) పైవన్నీ

3. కిందివాటిలో సహజ పాలిమర్‌ కానిది?

1) సెల్యులోజ్‌      2) సహజ రబ్బరు 

3) నైలాన్‌      4) పట్టు

4. కిందివాటిలో కృత్రిమ పాలిమర్‌కు ఉదాహరణ?

1) పాలిథిన్‌     2) కొల్లాజెన్‌ 

3) బేకలైట్‌       4) 1, 3

5. ఫిల్లర్లు, ప్లాస్టిసైజర్లు, రంగులు, స్టెబిలైజర్లు కలిపిన పాలిమర్‌లను ఏమంటారు?

1) ద్రవ స్ఫటికాలు  2) కొల్లాయిడ్‌లు 

3) ప్లాస్టిక్‌లు       4) అవలంబనాలు

6. కిందివాటిలో సరిగా జతపరచనిది ఏది?

1) కర్బన పాలిమర్‌ - పాలీవినైల్‌ క్లోరైడ్‌

2) మూలక పాలిమర్‌ - సిలికోన్‌

3) సహజ పాలిమర్‌ - ప్రోటీన్లు

4) కృత్రిమ పాలిమర్‌ - సెల్యులోజ్‌

7. కిందివాటిలో సరైంది ఏది?

i. బలమైన సాగే గుణం, రబ్బరు లాంటి స్థితిస్థాపకత కలిగిన పాలిమర్‌లను ఎలాస్టోమర్‌లు అంటారు.

ii. అధిక తనన సామర్థ్యం కలిగి, పొడవైన తీగ లాంటి పదార్థాలను ఏర్పరిచే పాలిమర్‌లను పోగులు అంటారు.

1) i, ii      2) i మాత్రమే 

3) ii మాత్రమే     4) ఏదీకాదు

8. కిందివాటిలో అకర్బన పాలిమర్‌ (మూలక పాలిమర్‌) ఏది?

1) సిలికోన్‌ రబ్బరు        2) సహజ రబ్బరు

3) కృత్రిమ రబ్బరు       4) టెరిలిన్‌

9. విద్యుత్‌ తీగలపై విద్యుత్‌ బంధకంగా కోటింగ్‌కు ఉపయోగించే పాలిమర్‌ ఏది? 

1) టెఫ్లాన్‌      2) పాలిస్టైరీన్‌ 

3) పాలిథిÇన్‌     4) నైలాన్‌

10. వేడిచేస్తే మెత్తగా అయ్యి, ఏ ఆకారంలోకైనా మారి; చల్లారిస్తే గట్టిపడి ఆ ఆకారాన్ని నిలుపుకొనే పాలిమర్‌ను ఏమంటారు?

1) థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌ 

2) ఉష్ణదృఢ పాలిమర్‌

3) థర్మోసెట్టింగ్‌ పాలిమర్‌ 

4) సహపాలిమర్‌

11. వేడి చేస్తే రసాయన మార్పులు చెంది, గట్టిపడి, తిరిగి ఉపయోగించలేని పాలిమర్‌లను ఏమంటారు?

1) థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌ 

2) ఉష్ణదృఢ పాలిమర్‌

3) సహజ పాలిమర్‌     4) ఏదీకాదు

12. కిందివాటిలో థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌కు ఉదాహరణ?

1) పాలిథిన్‌      2) పాలీవినైల్‌క్లోరైడ్‌ 

3) బేకలైట్‌       4) 1, 2

13. కిందివాటిలో ఉష్ణదృఢ పాలిమర్‌కు ఉదాహరణ?

1) నైలాన్‌      2) పాలిథిన్‌      3) రేయాన్‌ 

4) యూరియా - ఫార్మాల్డిహైడ్‌ రెజిన్‌

14. కిందివాటిలో సరైంది ఏది?

i. ఒకే రకమైన మోనోమర్‌ల నుంచి ఏర్పడిన సంకలన పాలిమర్‌లను సజాతీయ పాలిమర్‌లు అంటారు.

ii. రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు మోనోమర్‌ల నుంచి ఏర్పడిన సంకలన పాలిమర్‌లను సహపాలిమర్‌లు అంటారు.

1) i మాత్రమే     2) ii మాత్రమే

3) i, ii         4) ఏదీకాదు

15. ప్లాస్టిక్‌ చేతిసంచుల తయారీలో ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) టెరిలిన్‌         2) నైలాన్‌    

3) పాలీవినైల్‌క్లోరైడ్‌      4) పాలిథిన్‌

16. ఈథీన్‌ అనే మోనోమర్‌ను పాలిమరీకరణం చెందించి పాలిథిన్‌ అనే పాలిమర్‌ను తయారు చేస్తారు. ఈథీన్‌ రసాయన ఫార్ములా ఏమిటి?

1) C2H     2) C2H6

3)C2H4         4) C6H6

17. టెఫ్లాన్‌ పాలిమర్‌ రసాయన నామం ఏమిటి?

1) పాలీఐసోప్రిన్‌ 

2) పాలీటెట్రాఫ్లోరోఈథీన్‌

3) వినైల్‌క్లోరైడ్‌  4) టెట్రాఫ్లోరోఈథీన్‌

18. నీటిపారుదల పైపుల తయారీలో ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) పాలిథిన్‌     2) పాలీవినైల్‌క్లోరైడ్

3) సిలికోన్‌        4) నైలాన్‌6, 6

19. సహజ రబ్బరు రసాయన నామం?

1) పాలీటెట్రాఫ్లోరోఈథీన్‌

2) పాలీఐసోప్రిన్‌         3) పాలీఎక్రిలోనైట్రైల్‌ 

4) పాలీవినైల్‌క్లోరైడ్‌

20. కిందివాటిలో పాలీఎస్టర్‌కు ఉదాహరణ ఏది?

1) నైలాన్‌       2) బేకలైట్‌

3) టెరిలిన్‌       4) బ్యునాళీ

21. కిందివాటిలో జీవపాలిమర్‌కు ఉదాహరణ ఏది?

1) న్యూక్లిక్‌ ఆమ్లాలు      2) ప్రోటీన్‌లు

3) సెల్యులోజ్‌              4) పైవన్నీ

22. కిందివాటిలో కృత్రిమ సిల్క్‌ అని దేన్ని పిలుస్తారు?

1) టెరిలిన్‌       2) రేయాన్‌  

3) డెకరాన్‌       4) నైలాన్‌

23. సురక్షిత కళ్లజోళ్ల ్బళ్చీ÷’్మ్వ ్ణ్న్ణ్ణః’(్శ తయారీలో ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) నైలాన్‌-6     2) పాలిథిన్‌

3) పాలీస్టైరీన్‌     4) పాలీకార్బొనేట్‌

24. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) బేకలైట్‌          2) టెఫ్లాన్‌

3) పాలీలాక్టిక్‌ ఆమ్లం 4) ఐసోప్రిన్‌

25. విరిగిపోని పింగాణి పాత్రలను ఏ పాలిమర్‌తో తయారు చేస్తారు?

1) బేకలైట్‌ 

2) మెలమైన్‌ - ఫార్మాల్డిహైడ్‌ రెజిన్‌

3) పాలీవినైల్‌క్లోరైడ్‌ 

4) సిలికోన్‌ రెజిన్‌

26. కిందివాటిలో సంకలన పాలిమర్‌లకు ఉదాహరణ?

i. టెరిలిన్‌     ii. పాలీవినైల్‌క్లోరైడ్‌ 

iii. నైలాన్‌-6, 6   iv. పాలిథిన్‌

v. డెకరాన్‌      vi. టెఫ్లాన్‌

1) ii, iv, vi       2) i, iii, v

3) ii, iii, iv, v     4) i, ii, v, vi

27. కిందివాటిలో కృత్రిమ రబ్బరుకు ఉదాహరణ ఏది?

1) బ్యునా- S      2) బ్యునా - N

3) నియోప్రీన్‌      4) పైవన్నీ

28. కిందివాటిలో వ్యతస్థబంధి పాలిమర్‌కు ఉదాహరణ ఏది?

1) నైలాన్‌     2) బేకలైట్‌ 

3) బ్యునా - S     4) నియోప్రీన్‌

29. సెల్యులోజ్‌ అనే పాలిమర్‌లో ఉండే మోనోమర్‌ యూనిట్లు ఏవి?

1) D - గ్లూకోజ్‌      2) D - ఫ్రక్టోజ్‌ 

3) D - సుక్రోజ్‌      4) L - గ్లూకోజ్‌

30. కూల్‌డ్రింక్స్‌ బాటిళ్ల తయారీలో సాధారణంగా ఉపయోగించేది ఏది?

1) బేకలైట్‌      2) పాలీస్టైరీన్‌ 

3) పాలీవినైల్‌క్లోరైడ్‌ (పి.వి.సి)  

4) పాలీఎథిలీన్‌టెెరిఫ్తాలేట్‌ (పి.ఇ.టి)

31. కిందివాటిలో జీవక్షయీకృత పాలిమర్‌కు ఉదాహరణ ఏది?

1) పాలీగ్లైకాలిక్‌ ఆమ్లం 

2) పాలీలాక్టిక్‌ ఆమ్లం

3) పాలీహైడ్రాక్సీ ఆల్కనోయేట్‌ 

4) పైవన్నీ

32. కిందివాటిలో సరిగా జతపరచనిది ఏది?

1) పెక్సిగ్లాస్‌ - పాలీమిథైల్‌ మిథాక్రిలేట్‌

2) రేయాన్‌ - సెల్యులోజ్‌ ఉత్పన్నం

3) నైలాన్‌ - పేదవాడి పట్టు

4) ఎక్రిలాన్‌ - పాలీఎక్రైలోనైట్రైల్‌

33. కిందివాటిలో ‘పాలీఎమైడ్‌’కు ఉదాహరణ ఏది?

1) టెరిలిన్‌      2) నైలాన్‌-6 

3) నైలాన్‌-6, 6     4) 2, 3

34. కిందివాటిలో పోగులను ఏర్పరిచే పాలిమర్‌ ఏది?

1) టెరిలిన్‌      2) నైలాన్‌-6   

3) బేకలైట్‌       4) 1, 2

35. రేడియో, టెలివిజన్‌ కేబినెట్‌ల తయారీలో ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) టెరిలిన్‌      2) పాలీస్టైరీన్‌

3) బ్యునా- S      4) నైలాన్‌

36. గాజు ధర్మాలను పోలి, గాజుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ప్లాస్టిక్‌ ఏది?

1) సిలికోన్‌      2) టెరిలిన్‌ 

3) పాలీమిథైల్‌ మిథాక్రిలేట్‌ 

4) పాలీక్లోరోప్రిన్‌

37. కిందివాటిలో సరికానిది ఏది?

1) సిలికోన్‌ ద్రవాలను హైడ్రాలిక్‌ ద్రవాలుగా ఉపయోగిస్తారు.

2) సిలికోన్‌ గ్రీజులను విమానాల్లో కందెనలుగా వినియోగిస్తారు.

3) సిలికోన్‌ రబ్బర్‌లను విద్యుత్‌ పరికరాల్లో విద్యుత్‌ బంధకంగా ఉపయోగిస్తారు.

4) సిలికోన్‌ పాలిమర్‌లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు.

38. తొడుగులు(Gloves), హోస్‌ పైపుల తయారీలో ఉపయోగించే పాలిమర్‌ ఏది?

1) బ్యునా - S      2) బ్యునా - N  

3) పాలీస్టైరీన్‌      4) బేకలైట్‌

39. కిందివాటిలో కృత్రిమ రబ్బరు ఏది?

1) పాలీఐసోప్రిన్‌     2) పాలీక్లోరోప్రిన్‌ 

3) బ్యునా-వి      4) 2, 3

40. టూత్‌బ్రష్‌ కుచ్చుల తయారీలో ఉపయోగించే పాలిమర్‌?

1్శ నైలాన్‌-6, 6     2్శ టెఫ్లాన్‌ 

3్శ బ్యునా - S     4్శ నైలాన్‌-6

41. బుల్లెట్‌ ప్రూఫ్‌ ్బ(Bullet Proof) జాకెట్‌ల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్‌ ఏది?

1) డెక్రాన్‌     2) కెవ్లార్‌ 

3) బ్యునా - s     4) గ్లిప్టాల్‌

42. కింది ఏ మోనోమర్‌ల నుంచి బేకలైట్‌ను తయారు చేస్తారు?

1) ఫినాల్‌ + యూరియా

2) మెలమైన్‌ + ఫార్మాల్డిహైడ్‌

3) యూరియా + ఫార్మాల్డిహైడ్‌

4) ఫినాల్‌ + ఫార్మాల్డిహైడ్‌

43. టెరిలిన్‌ లేదా డెక్రాన్‌ తయారీలో  ఏ మోనోమర్‌లను ఉపయోగిస్తారు?

1) ఇథిలీన్‌ గ్లైకాల్‌ + టెరిఫ్తాలిక్‌ ఆమ్లం

2) ఇథిలీన్‌ గ్లైకాల్‌ + ఫార్మాల్డిహైడ్‌

3) మెలమైన్‌ + ఫార్మాల్డిహైడ్‌

4) ఎడిపిక్‌ ఆమ్లం + ఫార్మాల్డిహైడ్‌

సమాధానాలు

1 - 2  2 - 4  3 - 3  4 - 4  5 - 3  6 - 4  7 - 1  8 - 1  9 - 3  10 - 1  11 - 2  12 - 4  13 - 4  14 - 3  15 - 4  16 - 3  17 - 2  18 - 2  19 - 2  20 - 3  21 - 4  22 - 2  23 - 4  24 - 3  25 - 2  26 - 1  27 - 4  28 - 2  29 - 1  30 - 4  31 - 4  32 - 3  33 - 4  34 - 4  35 - 2  36 - 3  37 - 4  38 - 2  39 - 4  40 - 1  41 - 2  42 - 4  43 - 1

రచయిత

డాక్టర్‌ పి. భానుప్రకాష్‌

Posted Date : 04-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌