• facebook
  • whatsapp
  • telegram

సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

మోడల్‌ - 1


1. A, B, C, D, E అనే అయిదుగురు వ్యక్తులు ఉత్తర దిక్కులో కింది విధంగా కూర్చున్నారు.

i) D అనే వ్య‌క్తి C కి ఎడమవైపు ఉన్నాడు.

ii) B అనే వ్య‌క్తి E కి కుడివైపు కూర్చున్నాడు.

iii) A అనే వ్య‌క్తి C కి కుడివైపు ఉన్నాడు.

iv) B అనే వ్య‌క్తి D కి ఎడమవైపు ఉన్నాడు.

v) E ఆ వరుసలో ఒక చివర కూర్చున్నాడు. 

అయితే ఆ వరుసలో మధ్యలో కూర్చున్న వ్య‌క్తి ఎవరు?

1) D             2) E             3) C          4) A

సాధన: దత్తాంశం ఆధారంగా వారు కూర్చున్న వరుస,

పై చిత్రం ఆధారంగా మధ్యలో కూర్చున్న వ్య‌క్తి D.      సమాధానం: 1


2. A, B, C, D, E, F అనే ఆరుగురు పిల్లలు ఒక వరుసలో కూర్చున్నారు. F, D ల మధ్య B ఉండగా; A, C ల మధ్య E కూర్చున్నాడు. F లేదా D తర్వాత A కూర్చోలేదు. D తర్వాత C కూర్చోలేదు. అయితే F కి రెండువైపులా కూర్చున్నది ఎవరు?

1) D, A        2) E, F        3) C, B        4) A, E


సాధన: పై దత్తాంశం ఆధారంగా వారు కూర్చున్న వరుస క్రమం



పై చిత్రం ఆధారంగా F కి రెండు వైపులా C, B కూర్చున్నారు.         సమాధానం: 3


3. A1, A2, A3, A4, A5 అనే అయిదుగురు వ్యక్తులు ఒక మెట్ల వరుసపై కింది విధంగా నిలబడి ఉన్నారు.

i)  A1 పైన A5       ii)  A2 కింద A4       iii)  A2 పైన A1        iv)  A2, A3 మధ్య A4 ఉన్నారు. 

అయితే కింది మెట్టుపై నిలబడిన వ్య‌క్తి ఎవరు?

1) A4      2) A3      3) A2      4) A1

సాధన: దత్తాంశం ప్రకారం,


పై చిత్రం ఆధారంగా కింది మెట్టుపై నిలబడిన వ్య‌క్తి A3.      సమాధానం: 2


మోడల్‌ - 2


1. M, N, O, P, Q, R అనే ఆరుగురు వ్యక్తులు ఎదురెదురుగా రెండు వరుసల్లో ముగ్గురు చొప్పున కూర్చున్నారు. Q అనే వ్య‌క్తి ఏ వరుసలోనూ చివర లేడు. R కి ఎడమవైపు రెండో స్థానంలో P కూర్చున్నాడు. O అనే వ్య‌క్తి Q కి పక్కగా, P కి కర్ణాభిముఖంగా కూర్చున్నాడు. R కి పక్కనే N ఉన్నాడు. అయితే N కి ఎదురుగా కూర్చున్న వ్య‌క్తి ఎవరు?

1) R       2) P       3) M       4) Q

సాధన: దత్తాంశం ప్రకారం, వారు కూర్చున్న క్రమం,


పై చిత్రం ఆధారంగా, N కి ఎదురుగా Q ఉన్నాడు.          సమాధానం: 4


2. A, B, C, D, E అనే అయిదుగురు పురుషులు ఒక వరుసలో దక్షిణ దిశగా కూర్చున్నారు. M, N, O, P, Q అనే అయిదుగురు మహిళలు పురుషులకు సమాంతరంగా రెండో వరుసలో ఉత్తర దిక్కులో కింది విధంగా కూర్చున్నారు.

i) B అనే వ్య‌క్తి Dకి వెంటనే ఎడమవైపు, Q కి ఎదురుగా కూర్చున్నాడు.

ii) C, N లు కర్ణాభిముఖంగా కూర్చున్నారు.

iii) O అనే వ్య‌క్తి E కి ఎదురుగా, Mకి వెంటనే కుడివైపు కూర్చున్నాడు.

iv) P అనే వ్య‌క్తి Q కి వెంటనే ఎడమవైపు, D కి ఎదురుగా కూర్చున్నాడు.

v) M అనే వ్య‌క్తి వరుసలో ఒక చివర కూర్చున్నాడు. 

అయితే O కి కుడివైపు కూర్చున్న మూడో వ్య‌క్తి ఎవరు?

1) O           2) N            3) M           4) Q


సాధన:                              


పై చిత్రం ఆధారంగా, O కి కుడివైపు కూర్చున్న మూడో వ్య‌క్తి N.      సమాధానం: 2


మోడల్‌ - 3


1. ఆషా, పంకజ్, నరేంద్ర, ప్రసాద్, బాబీ, చిత్ర అనే ఆరుగురు వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కింది విధంగా కూర్చున్నారు. 

బాబీ, నరేంద్రల మధ్య ప్రసాద్‌ కూర్చుంటే; చిత్ర, పంకజ్‌ల మధ్య ఆషా ఉంది. బాబీకి వెంటనే ఎడమవైపు చిత్ర కూర్చుంది. అయితే బాబీకి వెంటనే కుడివైపు కూర్చున్నది ఎవరు?

1) ప్రసాద్‌         2) చిత్ర        3) నరేంద్ర          4) ఆషా

సాధన: దత్తంశాన్ని చిత్రం రూపంగా గీయగా,

పై చిత్రం ఆధారంగా బాబీకి వెంటనే కుడివైపు కూర్చున్నది ప్రసాద్‌.     సమాధానం: 1


2. A, B, C, D, E, F, G, H అనే ఎనిమిది మంది వ్యక్తులు వృత్తాకార పటంలో మాదిరి, కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. కూర్చున్న ప్ర‌తి ఒక్కరూ అపసవ్య దిశలో 3 స్థానాలు జరిగితే, B ఏ దిక్కులో ఉంటాడు? 

1) తూర్పు        2) పడమర         3) ఉత్తరం       4) దక్షిణం

సాధన: ప్ర‌తి వ్య‌క్తి అపసవ్యదిశలో 3 స్థానాలు వరుసగా జరిగాక, వారి నూతన స్థానాలు కింది విధంగా ఉంటాయి.

B పడమర దిశలో ఉన్నాడు.         సమాధానం: 2


3. రాధిక, మౌనిక, కామిని, సోనియా, దీప్తి, పూనం అనే ఆరుగురు బాలికలు ఒక వృత్తాకార బల్లపై కూర్చున్నారు. సోనియా, రాధికలు ఎదురెదురుగా ఉన్నారు. కామిని, సోనియాకు కుడివైపు, మౌనికకు ఎడమవైపు కూర్చుంది. దీప్తి, కామిని, మౌనిక, రాధికలు పరస్పరం వారి స్థానాలు మార్చుకుంటే, సోనియాకు ఎదురుగా ఎవరు ఉంటారు?

1) రాధిక        2) దీప్తి       3) మౌనిక        4) పూనం

సాధన: దత్తాంశం ఆధారంగా మొదట వారు కూర్చున్న క్రమం కింది విధంగా ఉంటుంది.


దీప్తి, కామిని, మౌనిక, రాధికలు పరస్పరం వారి స్థానాలు మార్చుకున్నాక, వారు కూర్చున్న క్రమం 


పై చిత్రం ఆధారంగా, సోనియాకు ఎదురుగా కూర్చున్నది మౌనిక.     సమాధానం: 3


మోడల్‌ - 4


1. ఒక త్రిభుజం మూలల వద్ద రవి, దీపక్, మోహిత్‌ అనే ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. రవి, మోహిత్‌కి ఎడమ పైపు ఉన్నాడు. అయితే మోహిత్‌కు కుడివైపు ఉన్నది ఎవరు?

1) దీపక్‌          2) రవి             3) ఇద్దరూ          4) ఎవరూకాదు


సాధన: దత్తాంశం ఆధారంగా,


పై చిత్రం ఆధారంగా మోహిత్‌కు కుడివైపు దీపక్‌ ఉన్నాడు.      సమాధానం: 1


2. రామ్, మధు, బోస్, గోపి, ప్రేమ, గీత, ఉష, సుమ అనే విద్యార్థులు ఒక చతురస్రాకార బల్లపై దాని నాలుగు మూలల్లో, భుజాల మధ్య బిందువు స్థానంలో కూర్చుని, కేంద్రంవైపు చూస్తున్నారు. వారిలో ఉష, మధుకి కర్ణాభిముఖంగా, గీతకి కుడివైపున ఉష ఉంది. రాము, గీతకి ఎడమవైపు, గోపికి కర్ణాభిముఖంగా కూర్చున్నాడు. బోస్‌కి గోపి ఎడమవైపు కూర్చున్నాడు. సుమ, మధుకి కుడివైపు కూర్చోలేదు కానీ, ప్రేమకు ఎదురుగా ఉంది. అయితే బోస్‌కి ఎదురుగా కూర్చుంది ఎవరు?

1) రామ్‌          2) ఉష          3) గీత        4) సుమ

సాధన: దత్తాంశం ప్రకారం,


పై చిత్రం ఆధారంగా, బోస్‌కి ఎదురుగా కూర్చున్నది గీత.      సమాధానం: 3


3. A, B, C, D, E, F అనే ఆరుగురు వ్యక్తులు ఒక షడ్భుజాకార టేబుల్‌ మూలల వెంట కూర్చున్నారు. B, C పక్కన A కూర్చోలేదు. C, E పక్కన D లేడు. B, C లు పక్కపక్కన కూర్చున్నారు. D, C ల మధ్య F ఉన్నాడు. అయితే Eకి కర్ణాభిముఖంగా ఉన్నది ఎవరు?

1) F          2) C            3) E          4) A

సాధన: దత్తాంశం ప్రకారం,


E కి కర్ణాభిముఖంగా ఉన్నది F.     సమాధానం: 1


4. రాధ, షీలా, మహిమ, గీత ఒక దీర్ఘ వృత్తాకార టేబుల్‌పై కింది విధంగా కూర్చున్నారు. షీలాకు కుడివైపు రాధ, సీతకి ఎడమవైపు మహిమ ఉన్నారు. అయితే మహిమకి ఎదురుగా కూర్చున్నది ఎవరు?

1) రాధ        2) షీలా       3) గీత        4) ఎవరూకాదు

సాధన: దత్తాంశం ప్రకారం,


మహిమకి ఎదురుగా కూర్చున్నది - షీలా     సమాధానం: 2


వృత్తాకారంలో ...


1. A, B, C, D, E అనే అయిదుగురు వ్యక్తులు ఒక బల్ల చుట్టూ కూర్చున్నారు. అందులో A, E ఒక వ్యాసం అంచులో ఉండగా, C, D లు A కి రెండువైపులా ఉన్నారు. A కి కుడిపక్కన ఉన్న ఒకే ఒక వ్యక్తి D. అయితే వాళ్లు కూర్చున్న క్రమం?

1) ACEBD       2) ABEDC     3) ADEBC      4) AEDBC

సాధన:   

       


కూర్చున్న క్రమం: ADEBC

సమాధానం: 3


2. A, B, C, D, E, F, G, H లు అదే క్రమంలో ఒక గుండ్రటి బల్ల చుట్టూ సమాన దూరంలో కూర్చున్నారు. వారి స్థానాలు సవ్యదిశలో ఉన్నాయి. G దక్షిణం వైపు కూర్చుంటే, D కూర్చున్న దిశ?

1) తూర్పు      2) ఆగ్నేయం        3) దక్షిణం      4) ఈశాన్యం



సమాధానం: 4


3.  A, B, C, D, E, F లు ఒక వృత్తాకార టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు, అయితే

a) D, F మధ్యలో A ఉన్నారు.

b) C కి ఎదురుగా D ఉన్నారు

c) D, E పక్కపక్క సీట్లలో కూర్చోలేదు.

కింది వాటిలో సరైంది ఏది?

1) A కి ఎదురుగా B ఉన్నారు.           2)  D కి ఎదురుగా C ఉన్నారు.

3) C, B పక్కపక్కన ఉన్నారు.          4) B, C లు పక్కపక్కన లేరు.


B, C లు పక్కపక్కన లేరు. 

సమాధానం: 4


4. ఆరుగురు వ్యక్తులు ఒక వృత్తాకారంలో కూర్చున్నారు. B కి ఎదురుగా A ఉన్నాడు. E కి కుడి వైపుగా, C కి ఎడమ వైపుగా B కూర్చున్నాడు. D కి ఎడమవైపు C, A కి కుడివైపు F ఉన్నారు. D తన సీటును F తో మార్చుకున్నాడు. E తన సీటును B తో మార్చుకున్నాడు. అయితే D కి ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి ఎవరు?


1) B      2) C       3) E      4) A


ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆరుగురు వ్యక్తులు కూర్చున్న విధానం

సీట్లు మార్చుకున్నాక వారు కూర్చున్న తీరు.


 

సమాధానం: 4


 మాదిరి ప్రశ్నలు


I. ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు 

1. నుంచి 4 వరకు సమాధానాలు రాయండి.

i) A, B, C, D, E, F, G లు ఉత్తర దిశగా ఒక వరుసలో కూర్చున్నారు.

ii) E కి కుడివైపు వెంటనే F ఉన్నాడు.

iii) G కి కుడి నుంచి నాలుగో వ్యక్తి E.

iv) B, D మధ్య ఉన్నది C

v) D కి ఎడమ నుంచి మూడో వ్యక్తి ఒక చివరలో ఉన్నాడు

1. A స్థానం ఏది?

1) E కి D కి మధ్య     2) పూర్తిగా ఎడమవైపు     3) మధ్యలో     4) పూర్తిగా కుడివైపు


2. C కి ఎడమ వైపు ఉంది ఎవరు?

1) B మాత్రమే      2) G, B, D     3) G, B      4) D, E, F, A


3. B కి రెండువైపులా ఉన్నది ఎవరు?

1) C, D      2) C, G     3) G, F     4) C, E
 

4. కిందివాటిలో సరికానిది ఏది?

1) D కి ఎడమవైపు వెంటనే ఉంది E       2) A ఏదో ఒక చివరలో ఉన్నాడు

3) B కి ఎడమవైపు వెంటనే ఉంది G       4) D కి F కుడి నుంచి రెండో వాడు


II. ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు 

5 నుంచి 9 వరకు సమాధానాలు రాయండి.

A, B, C, D, E, F, G, H లు ఎనిమిది మంది స్నేహితులు ఒక వృత్తాకారం చుట్టూ సమానదూరంలో ఎదురెదురుగా కూర్చున్నారు.

i) H కి సరిగ్గా ఎదురుగా E కూర్చున్నాడు. 

ii) H కి కుడివైపు రెండో వ్యక్తి B

iii) E, D ల మధ్య A కూర్చున్నాడు

iv) H కి ఎడమవైపు G ఉన్నాడు

v) H కి ఎడమవైపు G లేడు


5. H కు ఎడమవైపు ఉన్నది ఎవరు?

1) F     2) G     3) D      4) B


6. C, G ల మధ్య ఎవరు ఉన్నారు?

1) A     2) D     3) F     4) B
 

7. F కు ఎడమవైపు మూడో వ్యక్తి ఎవరు?

1) D       2) A        3) E         4) H

8. B, Fలు వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే B కు ఎదురుగా ఎవరుంటారు?

1) F      2) C      3) G       4) E


9. G కు ఎదురుగా కూర్చున్నవారు ఎవరు?

1) A       2) H       3) D        4) E
 


III. ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు 

10 నుంచి 12 వరకు సమాధానాలు రాయండి.


అయిదుగురు బాలికలు వృత్తాకారంగా ఎదురెదురుగా నిల్చున్నారు

i) హరిత, లత, శ్రావ్యకు మధ్యలో నిలబడింది

ii) లతకు కుడివైపు వెంటనే మమత నిలబడింది.

iii) శ్రావ్యకు మమతకు మధ్య రజని నిలబడింది.


10. శ్రావ్యకు ఎడమవైపు ఉన్నది ఎవరు?

1) లత     2) రజని     3) మమత     4) హరిత


11. హరిత, మమత తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే హరితకు ఎడమవైపు రెండో వ్యక్తి ఎవరు?

1) మమత     2) శ్రావ్య     3) రజని      4) లత


12. రజని, శ్రావ్య స్థానాలను పరస్పరం మార్చుకొని, మమత, లత స్థానాలను పరస్పరం మార్చుకుంటే లతకు కుడివైపు వెంటనే ఎవరుంటారు?

    1) రజని     2) మమత         3) హరిత      4) శ్రావ్య


13.  A, B, C, D, E, F అనే ఆరుగురు వ్యక్తులు ఒక వృత్తాకారంలో కూర్చొని ఉన్నారు. A అనే వ్యక్తి B, E ల మధ్య,  C అనే వ్యక్తి D, F మధ్య ఉన్నారు. E, Dకి వెంటనే కుడి వైపున ఉంటే, E, C కి మధ్య ఎవరు కూర్చున్నారు.

1) D      2) B     3) C     4) F

14. ఆరుగురు వ్యక్తులు షడ్భుజాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. F,C ల మధ్య B, E, D ల మధ్య A కూర్చున్నారు. F, D కి ఎడమవైపున ఉంటే, A, F ల మధ్య ఎవరు కూర్చుంటారు?

1) E       2) D        3) C        4) B
 


సమాధానాలు

1-4,  2-3,   3-2,   4-1,    5-1,    6-4,   7-3,      8-2,  9-1,  10-2,  11-1,  12-4,  13-1,  14-2  


Some more:

మోడల్‌ - 1

* వృత్తాకార అమరికకు సంబంధించి
   i) వ్యక్తులు వృత్త కేంద్రం వైపు కూర్చుంటే  

   

ii) వ్యక్తులు వృత్త కేంద్రానికి అభిముఖంగా కూర్చుంటే 


1. ఆరుగురు మిత్రులు M, N, O, P, Q, R లు ఒక వృత్తంపై వృత్త కేంద్రం వైపు కింది విధంగా ఉన్నారు. 
    i) O, P ల మధ్య N నిల్చున్నాడు    ii) O, Q ల మధ్య M నిల్చున్నాడు    iii) R, P లు పక్కపక్కన నిల్చున్నారు
    అయితే M, R ల మధ్య ఎవరు నిల్చున్నారు?
వివరణ: పై దత్తాంశాన్ని అనుసరించి

  
పై పటం ఆధారంగా M, R ల మధ్య Q నిల్చున్నాడు. 


2. P, Q, R, S, T లు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. R అనే వ్యక్తి P కు కుడివైపున ఉన్నాడు, S కు ఎడమ నుంచి రెండో వ్యక్తి. T అనే వ్యక్తి P, S ల మధ్య కూర్చోలేదు. R కు ఎడమవైపున కూర్చున్న రెండో వ్యక్తి ఎవరు? 
వివరణ: పై దత్తాంశాన్ని చిత్రీకరించగా 

    పటం ఆధారంగా, 
   ∴ R కు ఎడమ వైపు నుంచి రెండో వ్యక్తి Q. 


మోడల్‌ - 2

* చతురస్ర అమరికకు సంబంధించి 
    i) వ్యక్తులు చతురస్ర కేంద్రం వైపు కూర్చుంటే 


    ii) చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చుంటే 

1. K, L, M, P, Q, R, S, T లు ఒక చతురస్రాకార బల్ల చుట్టూ కింది విధంగా కూర్చున్నారు.

i) చతురస్ర మూలల వద్ద ఉన్న వ్యక్తులు చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు.
ii) చతురస్ర భుజాల మధ్య ఉన్న వ్యక్తులు చతురస్ర కేంద్రం వైపు కూర్చున్నారు.
iii) P అనే వ్యక్తి S కు కుడివైపు నుంచి మూడో వ్యక్తి, చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నాడు.
iv) Q అనే వ్యక్తి M కు ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి. M చతురస్ర భుజం మధ్యలో కూర్చోలేదు. 
v) Q, R ల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. R అనే వ్యక్తి M పక్కన కూర్చోలేదు.
vi) T అనే వ్యక్తి చతురస్ర కేంద్రం వైపు కూర్చున్నాడు.
vii) K అనే వ్యక్తి R పక్కన కూర్చోలేదు. అయితే Q, R ల మధ్య ఎవరు కూర్చున్నారు?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని చిత్రీకరించగా


పై పటం నుంచి P అనే వ్యక్తి Q, R ల మధ్య కూర్చున్నాడు.


మోడల్‌ - 3

* ఒక వరుస ఆధారిత అమరిక ప్రశ్నలు
1. ఒక గ్రూప్‌ ఫొటోలో కుమారుడి తండ్రి అతడికి ఎడమవైపు; కుమారుడి తాతకు కుడివైపున కూర్చున్నాడు. కుమారుడి తల్లి, ఆమె కుమార్తెకు కుడివైపున; అతడి తాతకు ఎడమవైపున కూర్చున్నారు. అయితే ఆ ఫొటో మధ్యలో కూర్చున్న వారెవరు?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని చిత్రీకరించగా


పటం ఆధారంగా ఫొటోలో మధ్యలో కూర్చున్నవారు తాత. 


మోడల్‌ - 4

* రెండు వరుసల ఆధారిత అమరికకు సంబంధించిన ప్రశ్నలు.
1. P, Q, R, S, T, U లు రెండు వరుసల్లో కూర్చున్నారు. వారిలో కొందరు ఉత్తర దిక్కుకు, మరికొందరు దక్షిణ దిక్కుకు అభిముఖంగా కింది విధంగా కూర్చున్నారు.
i) Q అనే వ్యక్తి ఉత్తరం వైపు కూర్చున్నాడు. కానీ S పక్కన కూర్చోలేదు.
ii) S, U లు కర్ణాలకు అభిముఖంగా కూర్చున్నారు.
iii) R అనే వ్యక్తి U పక్కన దక్షిణం వైపు కూర్చున్నాడు.
iv) T అనే వ్యక్తి ఉత్తరం వైపు కూర్చున్నాడు. అయితే P, U ల మధ్య ఎవరు కూర్చున్నారు?
వివరణ: పై దత్తాంశాన్ని చిత్రీకరించగా


∴ P, U ల మధ్య R అనే వ్యక్తి కూర్చున్నాడు.


 

Posted Date : 09-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌