• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ పరిహారపు హక్కు

1. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి? 

ఎ. దీన్ని రాజ్యాంగానికి ‘ఆత్మ’ లాంటిది అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

బి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ఈ హక్కు గురించి వివరిస్తుంది.

సి. దీని ప్రకారం ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుంది.

డి. దీన్ని హక్కులకే హక్కుగా పేర్కొంటారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి

3) ఎ, బి, డి     4) పైవన్నీ

2. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు జారీచేసే ‘రిట్స్‌’కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ. ‘రిట్‌’ (Writ) అంటే ‘ఆజ్ఞ’ అని అర్థం.

బి. ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్‌ను  జారీ చేస్తుంది.

సి. ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్స్‌ను జారీ చేస్తాయి.

డి. ఆర్టికల్‌ 233 ప్రకారం దిగువ న్యాయస్థానాలు రిట్స్‌ను జారీ చేస్తాయి.

1్శ ఎ, సి, డి      2్శ ఎ, బి, సి

3్శ ఎ, బి, డి      4్శ పైవన్నీ

3. ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయస్థానాలు జారీచేసే రిట్స్‌కు సంబంధించి సరికానిది?

1) హెబియస్‌ కార్పస్, ప్రొహిబిషన్‌

2) మాండమస్, కోవారంటొ

3) లోకస్‌ స్టాండి     4) సెర్షియోరరి

4. ఏ రిట్‌ను ఉదారమైన, పురాతనమైన రిట్‌గా పేర్కొంటారు?

1) మాండమస్‌    2) హెబియస్‌ కార్పస్‌ 

3) కోవారంటొ    4) సెర్షియోరరి 

5. కిందివాటిలో హెబియస్‌ కార్పస్‌(Habeas corpus) రిట్‌కు సంబంధించి సరైంది ఏది?

ఎ) హెబియస్‌ కార్పస్‌ పదానికి మూలం లాటిన్‌ భాషలో ఉంది.

బి) హెబియస్‌ అంటే కలిగి ఉండటం (To have) అని అర్థం.

సి) కార్పస్‌ అంటే శరీరం (Body) అని అర్థం.

డి) ఈ రిట్‌ను దిగువ న్యాయస్థానాలు కూడా జారీచేస్తాయి.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి

3) ఎ, సి, డి      4) పైవన్నీ

6. ఒక వ్యక్తి అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా? కాదా? అని న్యాయస్థానాలు ఏ రిట్‌ ద్వారా పరీక్షిస్తాయి?

1) మాండమస్‌           2) ప్రొహిబిషన్‌

3) హెబియస్‌ కార్పస్‌        4) సెర్షియోరరి

7. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేస్తారు?

1) ప్రభుత్వ సంస్థలు (Public Authorities)

2) ప్రైవేట్‌ వ్యక్తులు (Private Individuals)

3) 1, 2

4) అర్ధ న్యాయ సంస్థలు (Semi Judicial Authorities)

8. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఏ రిట్‌ను తాత్కాలికంగా రద్దు చేయొచ్చని ఎ.డి.ఎం.జబల్‌పూర్‌ జు( శుక్లా కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది?

1) హెబియస్‌ కార్పస్‌  2) మాండమస్‌  

3) కోవారంటొ       4) సెర్షియోరరి 

9. ఎవరైనా ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నువ్వు నీ విధిని సక్రమంగా నిర్వహించు’ అని జారీ చేసే రిట్‌?

1) ప్రొహిబిషన్‌      2) మాండమస్‌ 

3) కోవారంటొ      4) సెర్షియోరరి 

10. న్యాయస్థానం ఎవరికి వ్యతిరేకంగా ‘మాండమస్‌ రిట్‌’ను జారీ చేయకూడదు?

1) కార్పొరేషన్‌      2) ట్రైబ్యునల్స్‌

3) ప్రైవేట్‌ సంస్థలు   4) ప్రభుత్వ సంస్థలు

11. న్యాయస్థానం న్యాయస్థానంపైనే జారీచేసే రిట్స్‌ ఏవి?

1) ప్రొహిబిషన్, మాండమస్‌  

2) సెర్షియోరరి, ప్రొహిబిషన్‌  

3) కోవారంటొ, ప్రొహిబిషన్‌ 

4) హెబియస్‌ కార్పస్, సెర్షియోరరి

12. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపి వేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌ ఏది?

1) ప్రొహిబిషన్‌      2) మాండమస్‌ 

3) సెర్షియోరరి      4) కోవారంటొ

13. దిగువ న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క న్యాయస్థానానికి బదిలీ చేయాలని ఏ రిట్‌ సూచిస్తుంది?

1) హెబియస్‌ కార్పస్‌      2) మాండమస్‌ 

3) సెర్షియోరరి         4) ప్రొహిబిషన్‌ 

14. ‘నువ్వు ఏ అధికారంతో ఆ పనిచేస్తున్నావు’ అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీచేసే రిట్‌?

1) కోవారంటొ      2) ప్రొహిబిషన్‌

3) మాండమస్‌      4) సెర్షియోరరి 

15. 1991 నుంచి కింద పేర్కొన్న ఏ సంస్థలపై న్యాయస్థానాలు సెర్షియోరరి రిట్‌ను జారీ చేస్తున్నాయి?

1) పరిపాలనాపరమైన సంస్థలు 

2) గ్రామీణాభివృద్ధి సంస్థలు 

3) ప్రైవేట్‌ సంస్థలు 

4) న్యాయపరమైన సంస్థలు 

16. సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ పార్లమెంట్‌ చట్టం రూపొందించవచ్చని  రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

1) ఆర్టికల్‌ 33      2) ఆర్టికల్‌ 34   

3) ఆర్టికల్‌ 35      4) ఆర్టికల్‌ 36

17. 1950లో రూపొందిన చట్టాన్ని గుర్తించండి.

1) The Nvy Force Act

2) The Airforce Act

3) The Armed Force Act

4) పైవన్నీ

18. భారత పార్లమెంట్‌ 'The Police Force Act'ను ఎప్పుడు రూపొందించింది?

1) 1961            2) 1963          3) 1966            4) 1971

19. భారత పార్లమెంట్‌ 'National Investigation Agency Act) ను ఎప్పుడు రూపొందించింది?

1) 2001           2) 2005             3) 2006          4)  2008

20. ఆర్టికల్‌ 34 ప్రకారం ‘సైనిక శాసనం’ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై ఎవరు పరిమితులు విధించవచ్చు?

1) కేంద్ర ప్రభుత్వం         2) రాష్ట్ర ప్రభుత్వం   

3) స్థానిక ప్రభుత్వాలు       4) పైవన్నీ 

21. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దుచేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.

బి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంది.

సి. ప్రాథమిక హక్కులను పూర్తిగా తొలగించే అధికారం ఎవరికీ లేదు.

డి. ప్రాథమిక హక్కులు నిరాపేక్షమైనవి కావు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి            4) పైవన్నీ 

22. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి.

బి. ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే.

సి. చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు.

1) ఎ, సి           2) బి, సి            3) ఎ, బి          4) ఎ, బి, సి 

23. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

1) గోలక్‌ నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

2) కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

3) ఆర్‌.సి.కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) ఎం.ఆర్‌.మసాని Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

24. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో ‘యథాతథ స్థితిని’ అమలు చేయడానికి న్యాయస్థానం అనుసరించే విధానం ఏది?

1) లోకస్‌ స్టాండి      2) ఇంజంక్షన్‌   

3) పార్డన్‌               4) పునిటివ్‌

25. బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతడి తరఫున వాదించడం కోసం న్యాయస్థానం ద్వారా నియమితులైన వ్యక్తి లేదా అధికారిని ఏమంటారు?

1) సుమోటో              2) లోకస్‌ స్టాండి  

3) అమికస్‌ క్యూరీ        4) రిప్రైవ్‌

సమాధానాలు

1 - 4    2 - 2    3 - 3    4 - 2    5 - 1  6 - 3    7 - 3    8 - 1    9 - 2    10 - 3    11 - 2    12 - 1    13 - 3    14 - 1    15 - 1    16 - 1    17 - 4    18 - 3    19 - 4    20 - 1    21 - 4    22 - 4    23 - 1    24 - 2    25 - 3

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్‌ 32 కింద ‘మాండమస్‌’ రిట్‌ను ఎవరిపై జారీ చేయకూడదు? (APPSC Group-II 2012)

1) ప్రభుత్వ అధికారి 

2) కార్యనిర్వాహక ఆజ్ఞ

3) అర్ధ న్యాయ చట్టం      4) ప్రైవేట్‌ సంస్థ

2. ఒక ప్రభుత్వ అధికారిని తన అధికార విధులను నిర్వర్తించమని ఆదేశిస్తూ జారీచేసే రిట్‌ ఏది? (AP, Sub Inspectors 2018)

1) హెబియస్‌ కార్పస్‌   2) మాండమస్‌  

3) సెర్షియోరరి        4) కోవారంటొ

3. నిర్బంధించిన వ్యక్తిని ఎంత సమయంలోపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి? (AP, Constables 2018)

1) 48 గంటలు              2) 12 గంటలు 

3) 24 గంటలు             4) 28 గంటలు

4. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి జారీచేసే రిట్‌ ఏది? (AP, Constables 2019)

1) హెబియస్‌ కార్పస్‌   2) మాండమస్‌ 

3) కోవారంటొ         4) సెర్షియోరరి

5. ఒక ప్రభుత్వ పదవి నుంచి అనర్హుడైన వ్యక్తిని తొలగించేందుకు జారీచేసే రిట్‌ ఏది? (AP, Sub Inspectors 2018) 

1) కోవారంటొ       2) ప్రొహిబిషన్‌  

3) సెర్షియోరరి       4) మాండమస్‌

6. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లోని కొన్ని హక్కులు ఏ సమయంలో తాత్కాలికంగా రద్దవుతాయి? (AP, Group-II 2018)      

1) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు

2) ప్రభుత్వ ప్రకటన ద్వారా

3) లోక్‌సభ చట్టం చేయడం ద్వారా 

4) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా

7. కిందివాటిలో ఏ రిట్‌ను ప్రైవేట్‌ వ్యక్తిపై కూడా జారీ చేయొచ్చు? (APPSC, Group-II 2016)

1) కోవారంటొ        2) సెర్షియోరరి  

3) హెబియస్‌ కార్పస్‌      4) మాండమస్‌

8. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను రాజ్యాంగానికి ఆత్మ, గుండెగా పరిగణించారు? (APPSC, Group-II 2012, AP, Panchayat Secretary 2014)

1) అధికరణ 1            2) అధికరణ 19 

3) అధికరణ 32             4) అధికరణ 14

9. ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు ఏది? (APPSC, Junior Stenos 2012) 

1) స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు 

2) సమానత్వపు హక్కు 

3) రాజ్యాంగ పరిరక్షణ హక్కు 

4) పీడనాన్ని నిరోధించే హక్కు

10. ప్రాథమిక హక్కులను అమలు చేసేందుకు న్యాయస్థానం జారీచేసేది? (AEE 2007)

1) రిట్‌            2) డిక్రీ 

3) ఆర్డినెన్స్‌     4) నోటిఫికేషన్‌

11. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది? (APPSC, Group-II 2017)

1) ఆర్టికల్‌ 33             2) ఆర్టికల్‌ 19  

3) ఆర్టికల్‌ 21              4) ఆర్టికల్‌ 25

12. ఏ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కుల అమలుకు చట్టం చేయొచ్చు? (APPSC, Group-II 2012)

1) ఆర్టికల్‌ 32               2) ఆర్టికల్‌ 33  

3) ఆర్టికల్‌ 34          4) ఆర్టికల్‌ 35

సమాధానాలు 

1 - 4    2 - 2    3 - 3    4 - 1    5 - 1    6 - 1    7 - 3    8 - 3    9 - 3    10 - 1    11 - 1    12 - 4

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌