• facebook
  • whatsapp
  • telegram

నిజ, కొల్లాయిడ్‌ ద్రావణాలు

1. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు?

1) ద్రావణం         2) ద్రావణి        3) ద్రావితం         4) ఏదీకాదు

జ: 1


2. ద్రావణంలో సాపేక్షంగా అధిక పరిమాణంలో ఉండే అనుఘటకాన్ని ఏమని పిలుస్తారు?

1) ద్రావణి       2) ద్రావితం       3) అవలంబనం       4) పైవన్నీ

జ: 1


3. కింది వాటిలో ద్రావణానికి ఉదాహరణ...

1) సముద్రపు నీరు       2) శీతల పానీయాలు     3) గాలి        4) పైవన్నీ    

జ: 4


4. కింది వాటిని జతపరచండి.

జాబితా - I               జాబితా - II

A) విశ్వద్రావణి            i. కంచు    

B) కర్బన ద్రావణి        ii. నీరు

C) మిశ్రమ లోహం      iii. ఆల్కహాల్‌

1) A-ii, B-i, C-iii      2) A-i, B-iii, C-ii     

3) A-ii, B-iii, C-i      4) A-iii, B-ii, C-i

జ: 3


5. కింది వాటిని జతపరచండి.

జాబితా - I               జాబితా - II

A. ధ్రువద్రావణి            i. క్లోరోఫాం, బెంజీన్‌   

B. అధ్రువ ద్రావణి        ii. నీరు, ఆల్కహాల్‌ 

C. నిజద్రావణం           iii. టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్, సజల ఆమ్లం

1) A-iii, B-i, C-ii     2) A-ii, B-i, C-iii     

3) A-i, B-ii, C-iii      4) A-ii, B-iii, C-i

జ: 2


6. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?

ఎ) ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరుగుతుందో అంతే ద్రావితం కరిగివున్న ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.

బి) ఒక ద్రావణంలో గరిష్ఠంగా కరగగలిగే ద్రావితం పరిమాణం కంటే తక్కువ ద్రావితం కరిగివున్న ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు.

1) ఎ మాత్రమే         2) బి మాత్రమే        3) ఎ, బి         4) ఏదీకాదు

జ: 3


7. కింది వాటిలో సరికానిది ఏది?

1) సముద్రపు నీటి నుంచి ఉప్పు వేరుచేయడం - ఆవిరిపరచడం

2) ముడిచమురు నుంచి పెట్రోల్, డీజిల్‌ను వేరుచేయడం - అంశిక స్వేదనం

3) నీరు, ఆల్కహాల్‌ మిశ్రమాన్ని వేరుచేయడం - స్వేదనం

4) నీటి నుంచి కాపర్‌ సల్ఫేట్‌ లవణాన్ని వేరుచేయడం - వడపోత

జ: 4


8. కింది వాటిని జతపరచండి.

జాబితా - I                        జాబితా - II

A. వాయు ద్రావణం       i. విలీన సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 

B. ద్రవ ద్రావణం           ii. ఇత్తడి, స్టీల్‌ 

C. ఘన ద్రావణం          iii. గాలి

1) A-ii, B-i, C-iii     2) A-iii, B-ii, C-i     

3) A-i, B-iii, C-ii      4) A-iii, B-i, C-ii

జ: 4


9. ఉప్పు కలిపిన నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత... 

1) 100oC     2) < 100oC      3) > 100oC      4) 0oC

జ: 3


10. మంచు నీరుగా మారుతున్నపుడు దాని ఉష్ణోగ్రత?

1) స్థిరం     2) పెరుగుతుంది        3) తగ్గుతుంది     4) స్థిరంగా ఉండదు 

జ: 1


11. కింది ఏ అంశాలపై ద్రావణం బాష్పీభవన రేటు ఆధారపడుతుంది?

1) ఉష్ణోగ్రత      2) ఉపరితల వైశాల్యం       3) ద్రావణంలోని లవణాలు      4) పైవన్నీ

జ: 4


12. కింది వాటిలో నిజద్రావణం కానిదేది?

1) ఉప్పు ద్రావణం     2) రక్తం        3) పాలు     4) 2, 3

జ: 4


13. ఒక ద్రావణిలో వాయువు ద్రావణీయతకు, వాయు పీడనానికి మధ్య పరిమాణాత్మక సంబంధాన్ని సూచించిన శాస్త్రవేత్త ఎవరు?

1) చార్లెస్‌      2) హెన్రీ         3) బాయిల్‌     4) అవగాడ్రో

జ: 2


14. కింది ఏ నియమం ప్రకారం ‘‘ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రావణిలో కరిగే వాయు ద్రావణీయత వాయువు పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది’’.

1) బాయిల్‌ నియమం    2) అవగాడ్రో నియమం     3) హెన్రీ నియమం     4) న్యూటన్‌ నియమం

జ: 3


15. కింది వాటిలో సరైంది ఏది?

ఎ) ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ద్రవాల్లో వాయువుల ద్రావణీయత తగ్గుతుంది.

బి) పీడనం పెరిగేకొద్దీ ద్రవాల్లో వాయువుల ద్రావణీయత పెరుగుతుంది

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే       3) ఎ, బి       4) ఏదీకాదు

జ: 3


16. కింది వాటిలో నీటిలో అధిక ద్రావణీయత ఉన్న వాయువులు ఏవి?

1) కార్బన్‌డైఆక్సైడ్‌         2) అమ్మోనియా        3) హైడ్రోజన్‌ క్లోరైడ్‌      4) పైవన్నీ

జ: 4


17. నీటిలో అత్యల్ప ద్రావణీయత ఉన్న వాయువు ఏది?

1) కార్బన్‌డైఆక్సైడ్‌     2) హైడ్రోజన్‌ క్లోరైడ్‌        3) హైడ్రోజన్‌     4) 1, 2 

జ: 3


18. అన్ని గాఢతల వద్ద రౌల్ట్స్‌ నియమాన్ని పాటించే ద్రావణాలను ఏమంటారు?

1) ఆదర్శ ద్రావణాలు           2) విలీన ద్రావణాలు   

3) పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు       4) పూర్ణ మిశ్రణీయ ద్రావణాలు

జ: 1


19. కింది వాటిలో పాక్షిక మిశ్రణీయ ద్రవ మిశ్రమాలు ఏవి?

1) నీరు, ఫినాల్‌       2) నీరు, ఆల్కహాల్‌       3) బెంజీన్, హెక్సేన్‌        4) క్లోరోఫాం, బెంజీన్‌

జ: 1


20. కింది ఏ పద్ధతుల ద్వారా ద్రావణాల గాఢతను వ్యక్తపరుస్తారు?

1) మొలాలిటీ        2) మొలారిటీ        3) నార్మాలిటీ        4) పైవన్నీ

జ: 4


21. కింది వాటిని జతపరచండి. 

  కణ పరిమాణం                                          ద్రావణం రకం

A) ఒక నానోమీటర్‌ కంటే తక్కువ           i. కొల్లాయిడ్‌ ద్రావణాలు   

B) 1 - 1000                                    ii. అవలంబనాలు నానోమీటర్‌లు            

C) 1000 నానోమీటర్‌ల కంటే ఎక్కువ     iii. నిజ ద్రావణాలు

1) A-iii, B-ii, C-i       2) A-ii, B-i, C-iii     

3) A-iii, B-i, C-ii      4) A-i, B-iii, C-ii

జ: 3

       

22. స్టార్చ్‌ కొల్లాయిడ్‌ ద్రావణంలో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానం వరుసగా?

1) నీరు, స్టార్చ్‌       2) స్టార్చ్, నీరు        3) నీరు, ఉప్పు       4) ఉప్పు, నీరు

జ: 2


23. కింది వాటిలో కొల్లాయిడ్‌ ద్రావణాన్ని ఏర్పరచనివి ఏవి?

1) వాయువులో వాయుపదార్థాలు    2) ద్రవంలో ద్రవపదార్థాలు

3) ద్రవంలో ఘనపదార్థాలు       4) ఘనపదార్థాల్లో ద్రవాలు

జ: 1


24. పొగ ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

1) వాయువులో ఘనపదార్థం     2) వాయువులో ద్రవపదార్థం

3) ఘనపదార్థంలో వాయువు     4) ద్రవపదార్థంలో వాయువు

జ: 1


25. కింది వాటిని జతపరచండి.

కొల్లాయిడ్‌ రకం          విక్షిప్త ప్రావస్థ

A. సోల్‌                   i. ద్రవపదార్థం

B. ఎమల్షన్‌             ii. వాయుపదార్థం

C. ఫోమ్‌                iii. ఘనపదార్థం

1) A-iii, B-ii, C-i      2) A-ii, B-i, C-iii     

3) A-iii, B-i, C-ii      4) A-i, B-iii, C-ii

జ: 3


మరికొన్ని....


1. పెయింట్, ఇంక్‌ ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణాలు?

1) జెల్‌            2) సోల్‌         3) ఎమల్షన్‌      4) ఏరోసోల్‌

జ: 2


2. రక్తం ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

1) ఎమల్షన్‌      2) ఏరోసోల్‌        3) జెల్‌         4) సోల్‌

జ: 4


3. ద్రవపదార్థాల్లో ఘనపదార్థాలను విక్షిప్తం చెందించిన కొల్లాయిడ్‌ ద్రావణాన్ని ఏమంటారు?

1) ఘనసోల్‌     2) ఏరోసోల్‌      3) సోల్‌     4) ఎమల్షన్‌

జ: 3


4. ఏరోసోల్‌లో విక్షిప్త ప్రావస్థ ఘనపదార్థం అయితే విక్షేపణ యానకం ఏమిటి?

1) వాయుపదార్థం      2) ఘనపదార్థం     3) ద్రవపదార్థం        4) పైవన్నీ

జ: 1


5. విక్షిప్త ప్రావస్థ ద్రవపదార్థం, విక్షేపణ యానకం ఘనపదార్థంగా ఉన్న కొల్లాయిడ్‌ రకం ఏది?

1) ఎమల్షన్‌     2) జెల్‌      3) నురుగు     4) ఘనసోల్‌

జ: 2


6. కింది వాటిలో జెల్‌ రకం కొల్లాయిడ్‌కు ఉదాహరణ ఏది?

1) జున్ను      2) జెల్లీ      3) 1, 2       4) రక్తం

జ: 3


7. ఆక్వాసోల్‌లో విక్షేపణ యానకం ఏమిటి?

1) ఆల్కహాల్‌     2) నీరు          3) క్లోరోఫాం      4) 1, 2

జ: 2


8. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?

ఎ) విక్షిప్త  ప్రావస్థకు, విక్షేపణ యానకానికి మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న కొల్లాయిడ్‌లను లియోఫిలిక్‌ కొల్లాయిడ్‌లు అంటారు.

బి) విక్షిప్త ప్రావస్థకు, విక్షేపణ యానకానికి మధ్య తక్కువ సాన్నిహిత్యం ఉన్న కొల్లాయిడ్‌లను లియోఫోబిక్‌ కొల్లాయిడ్‌లు అంటారు.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే       3) ఎ, బి           4) ఏదీకాదు

జ: 3


9. ద్రవప్రియ కొల్లాయిడ్‌లకు ఉదాహరణ.....

1) స్టార్చ్‌ ద్రావణం      2) జిగురు        3) 1, 2         4) లోహ కొల్లాయిడ్‌

జ: 3


10. కింది వాటిలో సరైంది ఏది?

ఎ) ద్రవ విరోధి కొల్లాయిడ్‌లను అనుత్క్రమణీయ కొల్లాయిడ్‌లు అంటారు

బి) ద్రవ విరోధి కొల్లాయిడ్‌లకు స్థిరత్వం తక్కువ

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే       3) ఎ, బి          4) ఏదీకాదు

జ: 3


11. ద్రవ ప్రియ కొల్లాయిడ్‌ల పరిరక్షణ సామర్థ్యాన్ని పరిమాణాత్మకంగా ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) అవగాడ్రో సంఖ్య   2) రెనాల్డ్స్‌ సంఖ్య       3) గోల్డ్‌ సంఖ్య      4) ఏదీకాదు

జ: 3


12. కింది వాటిలో కొల్లాయిడ్‌ ద్రావణాలకు సంబంధించింది ఏది?

1) బ్రౌనియన్‌ చలనం     2) టిండాల్‌ ప్రభావం          3) 1, 2         4) ద్రవాభిసరణం

జ: 3


13. గోల్డ్‌ సంఖ్యను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?

1) రూథర్‌ఫర్డ్‌      2) జిగ్మాండీ       3) లెవోయిజర్‌      4) మేడమ్‌ క్యూరీ

జ: 2


14. కింది వాటిలో సరైంది?

ఎ) గోల్డ్‌ సంఖ్య పెరిగిన కొద్దీ, ద్రవ ప్రియ కొల్లాయిడ్‌ల పరిరక్షణ సామర్థ్యం తగ్గుతుంది

బి) జిలాటిన్‌ అనే కొల్లాయిడ్‌ గోల్డ్‌ సంఖ్య 0.005 - 0.01

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే       3) ఎ, బి      4) ఏదీకాదు

జ: 3

Posted Date : 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌