• facebook
  • whatsapp
  • telegram

పెడగోజీ   

ముఖ్యమైన ప్రశ్నలు

1. బ్రెయిలీ లిపి ద్వారా విద్యను అందించడం ఎవరికి సరైన పద్ధతి?
జ: దృష్టి లోపం ఉన్నవారు

 

2. కిందివారిలో 'డన్' వర్గీకరణకు చెందనివారు?
     1) అంగవైకల్యం ఉన్నవారు           2) దీర్ఘకాల అనారోగ్యం ఉన్నవారు
     3) ప్రతిభావంతులు                      4) సగటు ప్రతిభావంతులు
జ: 4 (సగటు ప్రతిభావంతులు)

 

3. పిల్లలకు ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉండటాన్ని ఏ వైకల్యం అంటారు?
జ: బహుళ వైకల్యం

 

4. మానసిక వైకల్యానికి కారణం ఏమిటి?
     1) జన్యుపర లోపం      2) మేనరిక వివాహం     3) అపరిపక్వ జననం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

5. బుద్ధిమాంద్యులకు అవసరమైన విద్యా ప్రణాళిక ఏది?
     1) సమైక్య విధానం      2) ఆశ్రమ పాఠశాలలు      3) గృహ శిక్షణ      4) అన్నీ
జ: 4 (అన్నీ)

6. కిందివాటిలో బుద్ధిమాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి చేసే పద్ధతులకు చెందనిది ఏది?
     1) ఆకృతీకరణం      2) క్రమీణ అస్తిత్వం      3) సాధారణ బోధన      4) గొలుసు విధానం
జ: 3 (సాధారణ బోధన)

 

7. బుద్ధిమాంద్యులకు ఏ గొలుసు విధాన పద్ధతి ఉపయోగకరం?
జ: ఆరోహణా గొలుసు విధానం

 

8. బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక నిర్దేశిత లక్ష్యం చేరే వరకు క్రమంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది
జ: క్రమీణా అస్తిత్వం

 

9. ప్రపంచంలోనే మొదటిసారిగా 1784లో ప్యారిస్‌లో అంధుల కోసం పాఠశాలను స్థాపించినవారు
జ: వాలెంటీన్ హ్యూ

 

10. 'పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్‌'ను ఎప్పుడు రూపొందించారు?
జ: 1995

 

11. అంధులకు ప్రత్యేక విధాన సూత్రాలు ఏవి?
     1) మూర్తత్వం      2) స్వీయకృత్యాలు      3) ఏకీకృత బోధన      4) అన్నీ
జ: 4 (అన్నీ)

12. పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం ఎన్ని డెసిబుల్స్ వరకు వినలేని వారిని పూర్తి వినికిడి లోపం ఉన్నవారిగా గుర్తించాలి?
జ: 60

 

13. ముద్రిత భాషను చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థిలోని సమస్యను ఏమంటారు?
జ: డిస్‌లెక్సియా

 

14. గణితపరమైన సమస్యను ఎదుర్కోవడం అనేది
జ: డిస్‌కాల్కులియా

 

15. ఒకరు వ్యక్తపరచిన భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం
జ: డిస్‌ఫేసియా

 

16. రాయడంలో ఇబ్బంది పడటం అనేది ఏ అభ్యసన వైకల్యం?
జ: డిస్‌గ్రాఫియా

 

17. కిందివాటిలో బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి ఏది?
      1) 3 R పద్ధతి       2) TLM పద్ధతి       3) VAKT పద్ధతి       4) గొలుసు విధానం
జ: 3 (VAKT పద్ధతి)

 

18. ప్రతిభావంతులకు ఉపయోగించే విద్యాప్రణాళిక
     1) త్వరణం      2) పృథక్కరణం      3) సంవృద్ధిమత్వం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

19. బాలుడి కాళ్లు, చేతుల్లో అసంకల్పితంగా కదలిక ఉండటం అనేది ఏ సమస్య?
జ: ఎథెటోసిస్

 

20. కండరాల కదలిక ఒక వైపు చూపితే మరో వైపు కదలడం అనేది ఏ సమస్య?
జ: స్పాస్టిసిటీ

 

21. ఒక వ్యక్తి సమావస్థ శక్తిని కోల్పోవడం వల్ల ప్రాదేశిక సంబంధాలు తక్కువగా ఉండటం
జ: అటాక్సియా

 

22. కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలను సరిగ్గా కదల్చలేకపోవడం అనేది
జ: అనమ్యత

 

23. టెర్మన్ ప్రకారం నాయకుల్లో ఉండాల్సిన లక్షణాలెన్ని?
జ: 79

 

24. అందరి అభిప్రాయాలను గౌరవించే నాయకత్వం
జ: సహభాగి నాయకత్వం

 

25. నాయకుడే అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం
జ: నిర్దేశిత నాయకత్వం

 

26. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందే స్థాపితమై, నిర్వహణలో ఉన్న పాఠశాల షెడ్యూలులోని ప్రామాణికాలను పాటించేందుకు ఇచ్చే గడువు ఎన్ని సంవత్సరాలు?
జ: 3

27. బాలలను శారీరక హింసకు గురిచేయకూడదని, అలా శిక్షించినవారి పై క్రమశిక్షణా చర్యలు తప్పవని విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తోంది?
జ: సెక్షన్ - 17

 

28. కిందివాటిలో పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కానిది ఏది?
     1) బడి పనితీరు పర్యవేక్షణ          
     2) పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం
     3) బడి అభివృద్ధి ప్రణాళిక తయారుచేసి సిఫార్సు చేయడం    
     4) నిధుల వినియోగం - పర్యవేక్షణ
జ: 2 (పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం)

 

29. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం గురించి విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తోంది?
జ: సెక్షన్ - 29

 

30. విద్యాహక్కు చట్టం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర వాటాల నిష్పత్తి 68 : 32 అని తెలియజేసే సెక్షన్?
జ: సెక్షన్ - 7

31. ఆర్‌టీఈ యాక్ట్ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయిలో టీపీఆర్ ఎంత?
జ: 1 : 35

 

32. విద్యాహక్కు పరిరక్షణ అథారిటీ ఏర్పాటును తెలియజేసే సెక్షన్
జ: సెక్షన్ - 31

33. 6 - 14 ఏళ్ల బాలలను ఎలిమెంటరీ విద్యలో చేర్పించడం తల్లిదండ్రులు, సంరక్షకుల -
జ: విధి

 

34. బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్ట పరిధి
జ: జమ్మూ కశ్మీర్ మినహాయించి దేశవ్యాప్తంగా

 

35. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వేటికి అవకాశం కల్పించాలి?
జ: ప్రశ్నలు, చర్చలకు

 

36. కిందివాటిలో ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం సరికాని ప్రవచనం
     1) త్రిభాషా సూత్రాన్ని మరోసారి సమీక్షించడం          2) ఇతర భారతీయ భాషల సరసన ఆంగ్లానికి స్థానం
     3) అనుభవరహిత అభ్యసనాన్ని ప్రోత్సహించడం       4) గణిత బోధనను అవగాహన చేయడం
జ: 3 (అనుభవరహిత అభ్యసనాన్ని ప్రోత్సహించడం)

 

37. కిందివాటిలో గణితీకరణం అంటే ఏదికాదు?
      1) తాత్వికంగా ఆలోచించడం          2) అమూర్త భావన అన్వయం అనేది ప్రధానంగా ఉండటం
      3) ఇంటిపని అధికంగా ఇవ్వడం      4) గణిత సమస్యల పరిష్కార శక్తిని పెంపొందించడం
జ: 3 (ఇంటిపని అధికంగా ఇవ్వడం)

 

38. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది?
జ: దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య

39. కిందివారిలో ఎలాంటి విద్యార్థులను ప్రోత్సహించాలి?
     1) పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకునేవాళ్లు                    2) సొంత పదాల్లో నేర్చుకునే విద్యార్థులు
     3) పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకునేవాళ్లు, సొంత పదాల్లో నేర్చుకునే విద్యార్థులు      
     4) ఏదీకాదు
జ: 3 (పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకునేవాళ్లు, సొంత పదాల్లో నేర్చుకునే విద్యార్థులు)

 

40. ఉపాధ్యాయుల్లో వేసే పాఠ్యప్రణాళిక ఎలా ఉండాలి?
జ: విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేలా

 

41. సిలబస్‌ల విషయంలో ప్రధాన లోపం ఏమిటి?
జ: ఏళ్ల తరబడి మార్పునకు నోచుకోకపోవడం

 

42. విద్యలో భాషకు సంబంధించిన విధానం?
జ: త్రిభాషా విధానం

 

43. ఉన్నత పాఠశాలలో గణితం ప్రాముఖ్యం?
జ: అనువర్తనం

 

44. నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?
జ: ఎన్‌సీఈఆర్‌టీ

 

45. నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ నివేదిక అంశం ఏమిటి?
జ: లెర్నింగ్ వితవుట్ బర్డెన్

46. 1976 వరకు విద్య, రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉండేది?
జ: రాష్ట్ర జాబితా

 

47. పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యావిధానం పేర్కొంది?
     1) ప్రాథమిక      2) ఉన్నత      3) కళాశాల స్థాయి      4) అన్ని విద్యా దశల్లో
జ: 4 (అన్ని విద్యా దశల్లో)

 

48. విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: ఏప్రిల్ 1, 2010

 

49. విద్యాహక్కు చట్టంలోని నిర్వచనాల ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందని పాఠశాల ఏది?
జ: మండల పరిషత్ పాఠశాల

 

50. బాలల హక్కుల చట్టంలో ఉచిత నిర్బంధ విద్య గురించి ఎన్ని అధ్యాయాలు తెలియజేస్తున్నాయి?
జ: 7

 

51. ఎలాంటి విద్య లేని పదేళ్ల బాలుడు పాఠశాలలో తన వయసుకు తగిన తరగతిలో చేర్చుకోమని కోరితే ప్రధానోపాధ్యాయుడు...
జ: వెంటనే చేర్చుకోవచ్చు

 

52. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 5 దేన్ని వివరిస్తుంది?
జ: విద్యార్థికి ఆ పాఠశాల నచ్చకపోతే బదిలీ సర్టిఫికెట్ పొందవచ్చు

53. జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

 

54. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలల ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు
జ: ఏ తరగతిలోనూ మళ్లీ కొనసాగించరాదు

 

55. గుర్తింపు రద్దయిన పాఠశాలకు లక్ష రూపాయల జరిమానా విధించాక కూడా అది కొనసాగితే ఏం చేయాలి?
జ: రోజుకు రూ.10 వేల జరిమానా

 

56. కిందివాటిలో పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కానిది
     1) బడి పనితీరు పర్యవేక్షణ                              
     2) బడి అభివృద్ధి ప్రణాళిక తయారుచేసి, సిఫార్సు చేయడం
     3) పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం     
     4) ప్రభుత్వం నుంచి అందిన నిధుల వినియోగం పర్యవేక్షణ
జ: 3 (పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం)

 

57. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను కింది ఏ విద్యేతర విధులు చేసేందుకు అనుమతించరు?
     1) గణన పనులు                                    2) ఎన్నికల విధులు
     3) ప్రకృతి వైపరీత్య సహాయ విధులు         4) మండల కార్యాలయంలో బిల్లులు చేయడం
జ: 4 (మండల కార్యాలయంలో బిల్లులు చేయడం)

58. కిందివాటిలో విద్యాహక్కు చట్టం ప్రకారం సరైన వ్యాఖ్యను గుర్తించండి.
     1) ప్రాథమిక విద్యను పూర్తి చేయాలంటే బోర్డు పరీక్షకు హాజరు కావాలి.
     2) అవసరాన్ని బట్టి విద్యార్థిని దండించవచ్చు.
     3) వయసు ధ్రువీకరణ పత్రం లేకుంటే బడిలో ప్రవేశాన్ని తిరస్కరించాలి.
     4) బడిలో చేరడానికి గుర్తింపు పత్రం తప్పనిసరి కాదు.
జ: 4 (బడిలో చేరడానికి గుర్తింపు పత్రం తప్పనిసరి కాదు.)

 

59. విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతుల లోపు 60 మంది పిల్లలకు ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
జ: 2

 

60. మొదటి ఎన్‌సీపీసీఆర్ ఛైర్‌పర్సన్ ఎవరు?
జ: డాక్టర్ శాంతాసిన్హా

61. '14 ఏళ్ల లోపు బాలలను పరిశ్రమలు, గనులు లేదా ఇతర ప్రమాదకర పనుల్లో నియమించడం నిషేధం' అని తెలిపే ప్రకరణ ఏది?
జ: 24

 

62. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే
జ: అయిదుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి

63. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1 నుంచి 2 తరగతులకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన పనిదినాలెన్ని?
జ: 200

 

64. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన పనిదినాలు
జ: 220

 

65. కిందివారిలో 'మార్గదర్శకత్వం' ఎవరికి అవసరం?
      1) పదోతరగతి పూర్తయిన వారికి మాత్రం అవసరం      
      2) విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే వారికి మాత్రం అవసరం
      3) ప్రతి విద్యార్థికి అవసరం
      4) సమస్యలతో సతమతమయ్యే వారికి మాత్రమే అవసరం
జ: 3 (ప్రతి విద్యార్థికి అవసరం)

 

66. ఒక వ్యక్తి ప్రజ్ఞకు సరిపోయే కోర్సులో చేరేందుకు అవసరమయ్యే మార్గదర్శకత్వం
జ: విద్యావిషయక మార్గదర్శకత్వం

 

67. ఉద్యోగ స్థిరత్వం, ఉద్యోగ భద్రత, ఉద్యోగ సంతృప్తి, సహోద్యోగులతో మసులుకునే విధానం లాంటి వాటికి ఎలాంటి మార్గదర్శకత్వం అవసరం?
జ: ఔద్యోగిక మార్గదర్శకత్వం

 

68. కిందివాటిలో సహభాగి నాయకత్వానికి సంబంధించి సరికానిది ఏది?
      1) భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది                        2) నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు
      3) అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటారు
      4) విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి దోహదపడుతుంది
జ: 2 (నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు)

 

69. ఉపాధ్యాయుడు ఏ నాయకత్వాన్ని అనుసరిస్తే విద్యార్థులు 'ఎవరికివారే యమునాతీరే' అన్నట్లు ఉంటుంది?
జ: అనుమతించే నాయకత్వం

70. బోధనలో ప్రణాళిక దశ అని ఏ దశను అంటారు?
జ: బోధనా పూర్వదశ

 

71. తరగతిలోని ఒక విద్యార్థి చదవడానికి ఇబ్బంది పడుతుంటే దీన్ని మీరు ఎలా గుర్తిస్తారు?
జ: డిస్‌లెక్సియా

 

72. జాతీయ ప్రణాళికా చట్రం - 2005 ప్రకారం గణితంను ప్రవేశపెట్టడంలో ముఖ్య ఉద్దేశం?
జ: విద్యార్థుల్లో తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడం

 

73. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
     1) విద్యార్థి విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైంది నియత మూల్యాంకనం.
     2) విద్యార్థి విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైంది సంకలన మూల్యాంకనం.
     3) విద్యార్థి విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైంది లోప నిర్ధారణ మూల్యాంకనం.
     4) విద్యార్థి విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైంది నిరంతర సమగ్ర మూల్యాంకనం.
జ: 4 (విద్యార్థి విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైంది నిరంతర సమగ్ర మూల్యాంకనం.)

 

74. ఎన్‌సీఎఫ్ - 2005 ముఖ్య ఉద్దేశం
ఎ. సబ్జెక్టుల మధ్య సహసంబంధంతో అంతర్ దృష్టిని ఏర్పరచడం.
బి. మానవీయ దృక్పథం, విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారుచేయడం.
సి. నేర్చుకోవడంలో పిల్లలకు భారం కాని విద్యను అందించడం.
జ: ఎ, బి, సి సరైనవి

75. ''మూల్యాంకనం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది మొత్తం విద్యా వ్యవస్థలో అంతర్భాగమై అన్ని విద్యా లక్ష్యాల్లో అతి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది" అని చెప్పిన కమిషన్
జ: కొఠారి కమిషన్

 

76. పరీక్షలంటే భయపడే రమేష్‌కు ఒక్కోసారి పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు  రాయలేక పోతున్నాడు. అంతేకాకుండా  అతడు చదివింది  మర్చిపోయి  ఏకాగ్రత  లోపం  సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి ఏ మార్గదర్శకత్వం అవసరం?
జ: విద్యా

 

77. సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని రూపొందించినవారు
జ: కార్ల్ రోజర్స్

 

78. ఐశ్వర్య అనే విద్యార్థిని 1002 అనే సంఖ్యను 102గా చదువుతుంటే ఆమె ఏ అభ్యసన వైకల్యానికి చెందింది?
జ: డిస్‌కాల్కులియా

79. సురేష్ అనే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను సన్ డయల్‌ను రూపొందించమని ఆదేశించాడు. ఇది ఏ రకమైన ప్రకల్పన?
జ: నిర్మాణాత్మకమైన ప్రకల్పన

80. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో కాకుండా సాధారణ పాఠశాలల్లో అందరితో కలిపి అందించే విద్య
జ: సహిత లేదా విలీన

 

81. బహుళ వైకల్య భావన
జ: వివిధ రంగాల్లో వైకల్యం ఉండటం

 

82. VAKT పద్ధతిలో T అనేది దేనికి సంబంధించింది?
జ: స్పర్శ

 

83. అన్వేషణ పద్ధతిలో ప్రశ్నలు ఎలా ఉండకూడదు?
జ: లుప్త భాగ ప్రశ్నలు

 

84. కిందివాటిలో ఉత్తమ అభ్యసన అనుభవ లక్షణం కానిది
     1) ఆచరణాత్మకంగా ఉండాలి.
     2) వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకోకూడదు.
     3) నిర్దేశించిన విషయ భాగానికి తగినట్లుగా ఉండాలి.
     4) ఆశించిన మార్పును తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉండాలి.
జ: 2 (వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకోకూడదు.)

85. శిశుకేంద్ర పద్ధతి వల్ల విద్యార్థుల్లో ఏది అభివృద్ధి చెందుతుంది?
     1) సృజనాత్మకత      2) ఆత్మవిశ్వాసం     3) ఆసక్తి      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

86. ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం
జ: స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి.

 

87. బోధనాభ్యాసన సామగ్రి లభ్యమయ్యే కాలాన్ని బట్టి యూనిట్లను ఎన్నుకోవడానికి ఉపయోగపడే పథకం
జ: వార్షిక పథకం

 

88. మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియను ఏమంటారు?
జ: మంత్రణం

 

89. వైద్య విద్య కోర్సు పూర్తిచేసిన అభ్యర్థికి ఒకేసారి స్వదేశంలో ఉద్యోగం, విదేశంలో స్కాలర్‌షిప్ వచ్చినప్పుడు అవసరమయ్యే మంత్రణం
జ: అనిర్దేశిత మంత్రణం

 

90. మార్గదర్శకత్వం, మంత్రణం మధ్య సంబంధం ఎలా ఉంటుంది?
జ: అనులోమానుపాతం

91. మార్గదర్శకత్వానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
      1) వ్యక్తి వికాసానికి, సామర్థ్యాల వినియోగానికి సంబంధించింది.
      2) సర్దుబాటు, మూర్తిమత్వ వికాసానికి సంబంధించింది.
      3) సమస్యా పరిష్కారాన్ని చూపుతుంది.
      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

92. 'సహాయార్థి తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయమే మార్గదర్శకత్వం' అని అభిప్రాయపడినవారు
జ: జోన్స్, రూత్‌స్ట్రాంగ్

 

93. మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించినదెవరు?
జ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఒకేషనల్ గైడెన్స్

 

94. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా ఉపయోగించే మూల్యాంకన సాధనం
జ: మౌఖిక పరీక్ష

 

95. 1986 జాతీయ విద్యావిధానంలో పోల్చదగిన విద్యా ప్రమాణాలను సాధించడానికి చేర్చిన అంశం
జ: కనీస అభ్యసన స్థాయి

96. మూల్యాంకనానికి సంబంధించి కిందివాటిలో సరికానిది
      1) ప్రవర్తన, సహజసామర్థ్యాలను వివరిస్తుంది.
      2) విద్యార్థులు తమ స్వీయ సామర్థ్యాలను తెలుసుకోవడం ద్వారా ప్రేరేపితులు అవుతారు.
      3) వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
      4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

 

97. బోధించిన విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారనే విషయాన్ని వేటి ద్వారా తెలుసుకోగలం?
జ: ఇంటర్వ్యూలు

 

98. ఏదైనా ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ముందు చేసే మూల్యాంకనం?
జ: అభ్యసనం కోసం పరిగణన

 

99. బోధనలో అంతర్భాగంగా ఉండేది
జ: నిరంతర సమగ్ర మూల్యాంకనం

 

100. ఎన్‌సీఎఫ్ - 2005 సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించమంటుంది. ఎందుకంటే పిల్లలకు
      1) సమైక్య జ్ఞాన రుచిని చూపించడం
      2) అవగతం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం
      3) ఎక్కువ మార్కులు లేదా గ్రేడులు సాధించిపెట్టడం
     4) సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, అవగతం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం
జ: 4 (సమైక్య జ్ఞాన రుచిని చూపించడం, అవగతం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం)

101. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం రూపకల్పన, దాని అమలు సమీక్ష ఎవరి ఆధ్వర్యంలో జరగాలని జాతీయ విద్యావిధానం - 1986లో ప్రతిపాదించారు?
జ: NCERT

 

102. 1976లో విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు. అంతవరకు కరిక్యులమ్, ప్రణాళిక లాంటి అన్ని విద్యాపరమైన నిర్ణయాలు ఎవరి పరిధిలో ఉండేవి?
జ: రాష్ట్రం

 

103. కిందివాటిలో విద్యకు సంబంధించి మహాత్మాగాంధీ వ్యక్తపరచని అభిప్రాయం
        1) విద్యార్థి నివసించే పరిసరాల ఆధారంగా బోధన చేయాలి    2) మాతృభాషలో బోధన జరగాలి
        3) చదువులో 'పని' ఒక భాగం కావాలి                                4) స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం
జ: 4 (స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం)

 

104. పిల్లవాడిని ఏ విధంగా చూడటం సరైన ధోరణి అనిపించుకుంటుంది?
జ: నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా

 

105. కిందివాటిలో ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది?
      1) పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం
      2) బయటి ప్రపంచంతో వ్యవహరించడానికి భాషను ఉపయోగించడం
      3) మాతృభాష పట్ల నిర్లక్ష్యం
      4) అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో పొందుపరచడం
జ: 3 (మాతృభాష పట్ల నిర్లక్ష్యం)

106. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం - 2005 మన విద్యావ్యవస్థ గురించి ఎలా అభిప్రాయపడింది?
1) పిల్లల చదువు విషయంలో వర్తమానాన్ని మరిచి, భవిష్యత్తును కేంద్రంగా చేసుకునే విద్యా కార్యక్రమాలు ఉన్నాయి.
2) నేర్చుకోవడం పేరుతో మన విద్యావ్యవస్థలో పిల్లలకు అందించే సమాచారం కొత్త జ్ఞానాన్ని సృష్టించగలిగే మానవ సామర్థ్యాన్ని దెబ్బతీసేలా ఉంది.
3) పాఠశాల విద్యావ్యవస్థ పిల్లల సృజనాత్మకతను దెబ్బతీసేలా ఉంది.
4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

107. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రశ్నపత్రంలోని 25-40 శాతం ప్రశ్నలు ఏ రూపంలో ఉండాలని సిఫార్సు చేసింది?
జ: స్వల్ప సమాధాన ప్రశ్నలు

 

108. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం విద్యారంగంలో చోటుచేసుకున్న మంచి పరిణామాల్లో ఇది కూడా ఒకటి
      1) మధ్యాహ్న భోజన పథకం                                  2) సమ్మిళిత విద్య
      3) పాఠశాలలో భౌతిక సదుపాయాల కల్పన            4) అన్నీ
జ: 4 (అన్నీ)

109. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం పరీక్షల్లో ప్రశ్నలకు పిల్లలు రాసే సమాధానాలు
జ: విభిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించి లక్ష్యాత్మకంగా మూల్యాంకనం చేయవచ్చు.

 

110. బోధనాభ్యాసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే అర్థం ఏమిటి?
జ: పిల్లలు, ఉపాధ్యాయుడి అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడం

 

111. ఎన్‌సీఎఫ్ - 2005 నాణ్యతా ప్రమాణాంశాల్లో కిందివాటిలో దేనికి అధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చింది?
      1) భౌతిక వనరులు         
      2) అర్హతలు, ఉత్సుకత గల ఉపాధ్యాయులు
      3) విద్యార్థి జ్ఞానార్జనకు తోడ్పడే అభ్యసనానుభవాలు
      4) విద్యార్థి అభ్యసనానుభవాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక సంస్కరణ
జ: 4 (విద్యార్థి అభ్యసనానుభవాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక సంస్కరణ)

 

112. కిందివాటిలో విమర్శనాత్మక ఆలోచనలకు స్థానం లేని జ్ఞానంతో కూడింది
      1) గణితశాస్త్రం      2) విజ్ఞానశాస్త్రం      3) సామాజిక శాస్త్రం
      4) పై అన్నింటిలో విమర్శనాత్మక ఆలోచనకు స్థానం ఉంది
జ: 4 (పై అన్నింటిలో విమర్శనాత్మక ఆలోచనకు స్థానం ఉంది)

 

113. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం పాఠశాలల్లో బోధించే సబ్జెక్టులు ఎలా ఉండకూడదు?
జ: వేటికవే స్వతంత్రంగా

114. కింది ఏ అభ్యసన విధానాన్ని ఎన్‌సీఎఫ్ - 2005 బలపరచలేదు?
      1) స్వీయ అభ్యసనం                     2) సహకార అభ్యసనం
      3) పుస్తకాధార అభ్యసనం             4) పరిసరాల్లో అభ్యసనం

జ: 3 (పుస్తకాధార అభ్యసనం)

115. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం అభ్యసనం అంటే
      1) విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది
      2) సామాజిక పరిసరాల్లో చర్యకు పురికొల్పేది
      3) విద్యార్థిలోని మానసిక శక్తుల క్రియాశీల ఫలితం
      4) పైవన్నీ సరైనవే
జ: 4 (పైవన్నీ సరైనవే)

 

116. పిల్లల్లో కుతూహలాన్ని వృద్ధి చేసి, సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యాన్ని ఏ శాస్త్రం నెరవేర్చాలని ఎన్‌సీఎఫ్ - 2005 పేర్కొంది?
జ: విజ్ఞానశాస్త్రాలు

 

117. ప్రాథమిక విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం

118. భాషాపరంగా మైనార్టీలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకునేలా వసతులను ఆయా రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కల్పించాలని నిర్దేశించే రాజ్యాంగ నిబంధన
జ: 350 (ఎ)

 

119. విద్యాహక్కు చట్టం - 2009 కి ఆధారమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఏ సంవత్సరంలో ఆమోదించింది?
జ: 2009

 

120. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన సీట్ల శాతం ఎంత?
జ: 25%

 

121. విద్యాహక్కు చట్టం - 2009పై అవగాహన కోసం నిర్మించిన లఘుచిత్రం ఏది?
జ: రోల్ కాల్

 

122. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం కిందివాటిలో సరికాని ప్రవచనం
      1) నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయాలి.
      2) పాఠశాలలోని మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 10% మించి ఖాళీలు ఉండకూడదు.
      3) ప్రతి 60 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలి.
      4) విద్యార్థిని ఎలాంటి దండనకు గురి చేయకూడదు.
జ: 3 (ప్రతి 60 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలి.)

123. కనీస అర్హతలు లేని ఉపాధ్యాయులు విద్యాహక్కు చట్టం - 2009 అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లోగా అర్హత సాధించాలి?
జ: 5

 

124. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి వారానికి ఎన్ని గంటలు కేటాయించారు?
జ: 45

 

125. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1-5 తరగతులు ఉండే పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 150 పైబడి ఉంటే దానికి అనుగుణంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
జ: 5 + 1 ప్రధానోపాధ్యాయుడు

 

126. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1-5 తరగతుల వారికి బోధనా గంటలు
జ: 800

 

127. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది
జ: శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు

 

128. ఉపాధ్యాయుడి పాత్ర ఇలా ఉండాలి
జ: పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసేలా, పిల్లలు మానవ విలువలను పెంపొందించుకునేలా

129. కిందివాటిలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడికి అవసరం లేని అంశం
       1) భాషలో ప్రావీణ్యం                             2) కౌన్సెలింగ్ నైపుణ్యాలు       
       3) భాషలో ప్రావీణ్యం, కౌన్సెలింగ్ నైపుణ్యాలు         
       4) భాషలో ప్రావీణ్యం, కౌన్సెలింగ్ నైపుణ్యాలు అవసరమైన అంశాలే
జ: 4 (భాషలో ప్రావీణ్యం, కౌన్సెలింగ్ నైపుణ్యాలు అవసరమైన అంశాలే)

 

130. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం పిల్లలను ఎలా విభజించాలి?
జ: ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు, సగటు కంటే తక్కువ విద్యార్థులు, విజేతలు - పరాజితుల్లో ఏదీ వాంఛనీయం కాదు

 

131. ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యలో ఏ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు?
1) కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారు చేయడం
2) ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం
3) ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం
4) కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారు చేయడం, ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం, ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం ఇలా అన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది
జ: 4 (కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారు చేయడం, ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం, ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం ఇలా అన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది)

 

132. ఆర్‌టీఐ అమలులో ఏదైనా లోపం జరిగితే స్థానిక అధికారి ఫిర్యాదు అందిన 3 నెలలకు కూడా సమస్య పరిష్కరించకపోతే అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి?
జ: రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు

 

133. పిల్లల విద్యాహక్కు కల్పనకు సంబంధించిన 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 2002

134. ఉచిత, నిర్బంధ బాలల హక్కు, విద్యాహక్కు చట్టం 2009 వర్తింపు
జ: జమ్మూ కశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తానికి

 

135. కిందివాటిలో విద్యాహక్కు చట్టం - 2009 కు సంబంధించి సరికానిది
   1) 6 - 14 సంవత్సరాల వయసు వారికి సంబంధించింది.
   2) ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి.
   3) విద్యార్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
   4) 14 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది.
జ: 3 (విద్యార్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి సమర్పించాలి.)

 

136. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ విద్యను పూర్తిచేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి?
జ: ప్రాథమిక విద్య

 

137. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఉపాధ్యాయ ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన చర్య
జ: టెట్ నిర్వహణ

 

138. ప్రస్తుతం ప్రాథమిక విద్య అంటే
జ: 1 - 8 తరగతి

139. కిందివాటిలో ఆర్‌టీఈ - 2009 చట్టం లక్ష్యం కానిది
       1) ఉపాధ్యాయులందరికీ ప్రమాణాలు పెంచడం             2) 6-14 సంవత్సరాల పిల్లల్లో డ్రాపవుట్స్ నివారణ
       3) ఉపాధ్యాయులందరికీ జీతాలు సక్రమంగా వచ్చేలా చూడటం
       4) ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు రిజర్వు చేయడం
జ: 3 (ఉపాధ్యాయులందరికీ జీతాలు సక్రమంగా వచ్చేలా చూడటం)

 

140. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 - 09 విద్యా సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సక్సెస్ పథకం కింద ఏ తరగతి నుంచి CBSE ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించింది?
జ: VI

 

141. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఆ పాఠశాలకు నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
జ: 2

 

142. ఏ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు?
జ: నిరంకుశ నాయకత్వం

 

143. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో కింది ఏ వర్గీకరణలో ఉంటాయి?
        1) జీవించే హక్కు         2) అభివృద్ధి చెందే హక్కు        3) స్వేచ్ఛ హక్కు         4) రక్షణ హక్కు
జ: 2 (అభివృద్ధి చెందే హక్కు)

 

144. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం - 2005 ప్రకారం పాఠ్య ప్రణాళికా అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాల్లో లేనిది
       1) అభ్యసనంలో బట్టీ పద్ధతి లేకుండా నిర్ధారించడం
       2) జ్ఞానాన్ని పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయడం
       3) పరీక్షలు నమ్యత కలిగి ఉండి, వాటిని తరగతి గదితో సమైక్యపరచడం
       4) అభ్యసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండటం
జ: 4 (అభ్యసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండటం)

 

145. సాధారణంగా అభ్యసన మదింపు జరిపే బోధనా స్థాయి
జ: పోస్ట్ యాక్టివ్ స్థాయి

146. 'క్రమీణ అస్తిత్వం' అంటే
జ: పిల్లవాడి ప్రగతి ఆధారంగా సహాయం తగ్గించడం

 

147. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం జ్ఞానం పట్ల సరైన దృక్పథం కానిది
     1) క్రమబద్ధమైన అనుభవం      2) ఆచరణ     3) ఒక ఉత్పత్తి   4) ఆలోచనతో కూడిన శారీరక నైపుణ్యం
జ: 3 (ఒక ఉత్పత్తి)

 

148. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం పాఠశాలలో ఆంగ్ల బోధన ఉద్దేశం
జ: బహుభాషావాదం

 

149. ఎన్‌సీఎఫ్ - 2005 ప్రకారం బోధన ఉద్దేశం
జ: శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువగా సాధించేలా చేయడం

 

150. మూల్యాంకనం అంటే
జ: మాపనం, న్యాయ నిర్ణయం

 

151. వెనకబడిన విద్యార్థులకు సహాయాన్ని అందించడంలో ఉపాధ్యాయుడి పాత్ర
జ: మార్గదర్శకుడు

 

152. పాఠశాలలో ఏ విధమైన మూల్యాంకనాన్ని ఆచరణాత్మకమైందిగా ఆర్‌టీఈ నిర్దేశించింది?
జ: రూపణ మూల్యాంకనం

 

153. ఎన్‌సీఎఫ్‌ను రూపకల్పన చేసే సంస్థ
జ: NCERT

154. కింది ఏ మూల్యాంకనంలో ప్రామాణీకృత పరీక్షలు ఉండవు?
      1) సంకలన మూల్యాంకనం       2) వ్యవకలన మూల్యాంకనం
      3) రూపణ మూల్యాంకనం         4) ఏదీకాదు
జ: 3 (రూపణ మూల్యాంకనం)

 

155. బాహ్య పరీక్షలు, అంతర్గత పరీక్షలు దేనికి ఉదాహరణ?
జ: సంకలన మూల్యాంకనం

 

156. బోధనకు ముందు చేసే మూల్యాంకనం
జ: లోప నిర్ధారణ మూల్యాంకనం

 

157. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది?
జ: 86వ

 

158. పాఠశాల నిర్వాహక కమిటీలో మహిళల భాగస్వామ్యం
జ: 50%

 

159. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వత ప్రధానోపాధ్యాయుడు కచ్చితంగా
ఉండాలని ఆర్‌టీఈ నిర్దేశించింది?
జ: 150

160. ఆర్‌టీఈ - 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి?
జ: 1 కి.మీ.

 

161. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం - 2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం, క్రమశిక్షణ, ఒత్తిళ్లతో కూడుకున్నట్లయితే
జ: అభ్యసనానికి అవరోధం అవుతుంది.

 

162. గణితశాస్త్ర ఉపాధ్యాయుడు గది నాలుగు గోడల వైశాల్యాన్ని విద్యార్థులందరితో కొలిపించడంలో దాగి ఉన్న పద్ధతి
జ: అన్వేషణ పద్ధతి

 

163. కిందివాటిలో ఏ చట్టం ప్రకారం 15 ఏళ్ల లోపు బాలలను మోటారు రవాణా రంగంలో నియమించకూడదు?
      1) ఫ్యాక్టరీ చట్టం 1982                                 2) గనుల చట్టం 1952
      3) మోటారు రవాణా కార్మిక చట్టం 1961       4) ప్లాంటేషన్ కార్మిక చట్టం
జ: 3 (మోటారు రవాణా కార్మిక చట్టం 1961)

 

164. కిందివాటిలో విద్యార్థుల్లో సాధన ప్రేరణను పెంపొందించే మార్గాలు
ఎ) విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే తెలియజేయడం
బి) స్థిరమైన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని పెంపొందించడం
సి) లక్ష్య సాధనకు అవసరమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకుని, తమ కాంక్షా స్థాయిని తగిన విధంగా పెంచుకునేలా చేయడం
జ: ఎ, బి, సి

165. కిందివాటిలో అన్వేషణ పద్ధతి లక్ష్యం కానిది
    1) విద్యార్థిలో క్రియాశీల ఆలోచనను ప్రేరేపించడం       2) విద్యార్థి స్మృతి పథాన్ని విస్తృతపరచడం
    3) విద్యార్థిలో క్రియాశీల ఆలోచనను ప్రేరేపించడం, విద్యార్థి స్మృతి పథాన్ని విస్తృతపరచడం     4) ఏదీకాదు
జ: 2 (విద్యార్థి స్మృతి పథాన్ని విస్తృతపరచడం)

 

166. ఏదైనా ఒక విద్యా విషయ అంశంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు, వైఖరులు తెలుసుకోవడంలో సాధ్యపడేది
జ: సర్వే పద్ధతి

 

167. కింది ఏ అంశంలో విభిన్నత గోచరిస్తే దాన్ని అసమ సమూహం అనవచ్చు?
      1) సామాజికాంశాలు       2) వ్యక్తిగత లక్షణాలు      3) సామర్థ్యం       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

168. ఉపాధ్యాయుడు తన బోధనలో ఏ నియమం పాటించకూడదు?
జ: అమూర్త నుంచి మూర్త

 

169. హ్యూరిస్టిక్ పద్ధతి వల్ల
జ: ఉపాధ్యాయుడి సహాయంతో అభ్యసనం జరుగుతుంది.

 

170. ప్రతిభావంతుడిని 5వ తరగతి కాగానే 7వ తరగతిలో చేర్చడం అనేది ఏ విధమైన విద్యా కార్యక్రమం?
జ: త్వరితం

171. 'ఆచరించి నేర్చుకోవడం' అనే సూత్రానికి ఈ పద్ధతి విరుద్ధం
       1) ప్రాజెక్టు పద్ధతి        2) అన్వేషణ పద్ధతి       3) ఉపన్యాస పద్ధతి        4) ఉపన్యాస - ప్రదర్శన పద్ధతి
జ: 3 (ఉపన్యాస పద్ధతి)

 

172. ఒక మొత్తం విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటల్లో చెప్పడం
జ: అవగాహన

 

173. ఒక విద్యార్థి సత్యాన్నే పలకాలని అందరికీ తెలియజేయడం
జ: శీలస్థాపన

 

174. మానసిక చలనాత్మక రంగంలో అతి సులువైన లక్ష్యం
జ: అనుకరణ

 

175. జాతీయ నాయకుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ఏ లక్ష్యం?
జ: గ్రహించడం

 

176. బ్లూమ్స్ లక్ష్యాలను వర్గీకరించిన సంవత్సరం
జ: 1956

 

177. భావావేశరంగం దేనికి సంబంధించింది?
జ: వైఖరులు

178. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం
      1) జ్ఞానం       2) విశ్లేషణ       3) వినియోగం       4) మూల్యాంకనం
జ: 4 (మూల్యాంకనం)

 

179. 'మూల్యాంకనం విద్యావ్యవస్థలో అంతర్భాగమైన లక్ష్యాలతో అతి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది' అని తెలియజేసినవారు
జ: కొఠారి కమిషన్

 

180. విద్యార్థుల్లో నిర్లక్ష్య భావాన్ని పెంచే నాయకత్వం
జ: అనుజ్ఞ నాయకత్వం

 

181. విద్యార్థులందరికీ ద్వేషాన్ని పెంచే నాయకత్వం
జ: నిర్దేశిత నాయకత్వం

 

182. సమ్మిళిత విద్య లక్ష్యం
జ: పిల్లలందరి అవసరాలు తీర్చడం

 

183. ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యలో ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు
  1) కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారుచేయడం
  2) ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం
  3) ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం
  4) కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారుచేయడం, ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం, ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం అన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది
జ: 4 (కరికులమ్, సిలబస్, పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో చూసేలా ఉపాధ్యాయులను తయారుచేయడం, ఉపాధ్యాయులకు బోధనా మాధ్యమంపై పట్టును పెంచడం, ఉపాధ్యాయులను 'మార్పు'నకు ప్రతినిధులుగా తీర్చిదిద్దడం ఇలా అన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది)

184. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం రూపకల్పనలో ప్రధాన ఉద్దేశం
జ: భౌగోళికంగా, సాంస్కృతికంగా దేశవ్యాప్తంగా ఉన్న వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయిలో విద్యావిధానాన్ని రూపొందించడం

 

185. విద్యలో సంస్థాగత సంస్కరణల్లో ప్రధానమైంది
జ: వికేంద్రీకరణ చేయడం

 

186. అభ్యసనం కోసం చేపట్టే మదింపు ప్రధాన ఉద్దేశం
జ: ఏం బోధించాలి

 

187. కిందివాటిలో ఒకటి ప్రవర్తనా సమస్య కాదు
      1) సంఘ వ్యతిరేక ప్రవర్తన                           2) కఠినమైన, ధ్వంసం చేసే ప్రవర్తన
      3) తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన      4) పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకోవడం
జ: 4 (పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకోవడం)

 

188. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2005 ప్రకారం పాఠ్యప్రణాళికా అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాల్లో లేనిది
       1) అభ్యసనంలో బట్టీ పద్ధతి లేకుండా నిర్ధారించడం       
       2) జ్ఞానాన్ని పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయడం
       3) పరీక్షలు నమ్యత కలిగి ఉండి వాటిని తరగతి గదితో సమైక్యం చేయడం
       4) అభ్యసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండటం
జ: 4 (అభ్యసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండటం)

 

189. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం బోధన దేనికి ఉద్దేశించింది?
జ: జ్ఞాన నిర్మాణానికి

190. తన వృత్తిలో సంతృప్తి పొందని ఒక వ్యక్తికి కింది ఏ మార్గదర్శకత్వం అవసరం?

      1) కుటుంబ       2) వృత్తి సంబంధ       3) వ్యక్తిగత       4) విద్యా
జ: 2 (వృత్తి సంబంధ)

 

191. విరామం ఒక హక్కు
జ: పిల్లలందరికీ

 

192. ఆధునిక కాలానుగుణంగా బోధనను ఏ విధంగా పరిగణిస్తారు?
జ: ఒక శాస్త్రం, ఒక కళ

 

193. కిందివాటిలో ఒకటి అభ్యసనానికి ప్రభావంతమైన ప్రేరణ
      1) శిక్షను తప్పించుకోవడానికి అభ్యసనం       2) బహుమతుల కోసం అభ్యసనం
      3) ఆత్మ సంతృప్తికి అభ్యసనం                       4) ర్యాంకు కోసం అభ్యసనం
జ: 3 (ఆత్మ సంతృప్తికి అభ్యసనం)

 

194. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం కింది ప్రవచనాల్లో ఒకటి సరైంది
      1) నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు      
      2) బదిలీ ధ్రువపత్రం లేకపోతే ప్రవేశం తిరస్కరించవచ్చు
      3) బదిలీ ధ్రువపత్రం లేదని ప్రవేశం తిరస్కరించకూడదు
      4) వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు
జ: 3 (బదిలీ ధ్రువపత్రం లేదని ప్రవేశం తిరస్కరించకూడదు)

195. ఇంట్లో సీరియల్‌ను చూసే అలవాటు ఉన్న రాధ ఆ సీరియల్‌లో ఏమేమి జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెబితే అక్కడ సాధించిన లక్ష్యం
జ: జ్ఞానం

 

196. చరణ్ బైకును నేర్చుకునే ముందు అనేక మంది బైక్ నడిపే వ్యక్తులను అనుకరించాడు. ఇక్కడ అతడు సాధించిన లక్ష్యం
జ: అనుకరణ

 

197. విద్యార్థి భారతదేశ చరిత్రకు సంబంధించి మధ్య, ఆధునిక, పూర్వ భారతదేశ చరిత్రలను అన్నింటినీ కలిపి నేర్చుకున్నాడు. ఇక్కడ అతడు సాధించిన లక్ష్యం
జ: సంశ్లేషణ

 

198. శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న పవన్ తాను శాకాహారం భుజిస్తూ ఇతరులను కూడా ప్రేరేపించడం
జ: శీలస్థాపనం

 

199. ఒక విద్యార్థి యుద్ధాల పట్ల వ్యతిరేక వైఖరిని పెంపొందించుకున్నాడు. దీన్ని ఏ రంగంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు?
జ: భావావేశ రంగం

200. ఉపాధ్యాయుడు విద్యార్థి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకునేందుకు వీలైంది?
జ: మూల్యాంకనం

 

201. సహిత విద్యావిధానంలో కిందివాటిలో దేన్ని విద్య అంతర్భాగంగా పరిగణించలేం?
      1) వనరుల గది                2) ఉపాధ్యాయులతో చర్చ
      3) విద్యార్థులతో చర్చ       4) సంచార ఉపాధ్యాయుడు
జ: 2 (ఉపాధ్యాయులతో చర్చ)

 

202. ప్రపంచంలోనే విద్యాహక్కు చట్టంలో అగ్రగామిగా ఉన్న దేశమేది?
జ: చిలీ

 

203. వ్యక్తికి ఆదర్శప్రాయమైన, విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చే అంశంమేది?
      1) అతడిలోని సాధనా ప్రేరణ                         2) ఇతరులకు సాయపడే గుణాలు
      3) అతడిలోని ఉన్నత ఉద్వేగ అంశాలు         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

204. నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకుని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో సముచితంగా అమలు చేయడం అనేది బోధనాంశంలోని ఏ భాగం?
జ: ఆచరణ దశ

రచయిత: కోటపాటి హరిబాబు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు