• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం (Learning) 

1. పవన్ అనే విద్యార్థికి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడంటే భయం. ఆ విద్యార్థి క్రమంగా ఈ భయాన్ని గణిత ఉపాధ్యాయుడికి, వ్యాయామ ఉపాధ్యాయుడికి అనుప్రయుక్తం చేసుకుంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు?
జ: సామాన్యీకరణం

 

2. వెంకట్ అనే విద్యార్థికి ఇంజక్షన్ చేయించుకోవడమంటే భయం. క్రమంగా ఈ భయాన్ని డాక్టర్‌కు, హాస్పిటల్‌కు, చివరికి ఆ వీధికి కూడా మార్చుకుంటూ ఉంటే వెంకట్‌లోని ఈ మార్పును ఎలా పేర్కొనవచ్చు?
జ: ఉన్నతక్రమ నిబంధనం

 

3. ఉపాధ్యాయుడు తరగతి గదిలో రేవంత్, హేమంత్ అనే విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందించాలనుకుని, వారిలో మంచి ఉద్దీపనలను ఏర్పాటు చేయడం పావ్‌లోవ్ ప్రయోగంలోని ఏ నియమాన్ని గుర్తుంచుకున్నట్టుగా భావించాలి?
జ: పునర్బలన నియమం

 

4. మౌనిష ప్రతిరోజూ ఇంటిదగ్గర నుంచి పాఠశాలకు సైకిల్‌పై వస్తుంది. ఒకరోజు ఆమె స్కూటర్‌పై పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఉపాధ్యాయుడు 'పాఠశాలకు ఎలా వచ్చావు' అని ప్రశ్నించగా ఉన్నట్లుండి 'సైకిల్‌ పై' అని సమాధానం చెప్పడం పావ్‌లోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: అయత్నసిద్ధ స్వాస్థ్యం

5. వివిధ రకాలైన బాధలు, కుంఠనం కలిగిన కుమార్ అనే వ్యక్తి తనకి తాను స్వాంతన కలిగించుకోవడానికి ఉపయోగించుకునే నియమం ఏది?
జ: విరమణ

 

6. కిందివాటిలో 'అభ్యసన' లక్షణం కానిది ఏది?
     1) అభ్యసనం సంచితమైంది.
     2) వ్యక్తి పరిపక్వతపై అభ్యసనం ఆధారపడుతుంది.
     3) అభ్యసనం విచ్ఛిన్నంగా జరుగుతుంది.
     4) బదలాయింపును ప్రదర్శిస్తుంది.
జ: 3

 

7. హాసిని అనే బాలిక ప్రతిరోజూ వేళ్లు నోట్లో ఉంచుకోవడం, పక్క తడపడం లాంటి పనులు చేస్తుంది. ఈ అలవాట్లను క్రమంగా తగ్గించడానికి మీరు ఏ నియమాన్ని ఉపయోగించాలి?
జ: విలుప్తీకరణం

 

8. కిందివాక్యాల్లో అభ్యసన ప్రక్రియ ఏది?
     1) ప్రీతి తన కుటుంబసభ్యుల నుంచి 'తల్లి, తండ్రిని గుర్తించడం'.
     2) రుతిక్ అనే బాలుడిలో కలిగే శారీరక పెరుగుదల.
     3) హాసినికి క్రమంగా పాలదంతాలు రావడం.
     4) కుసుమ, సుజాత తరగతిలో అందరికంటే మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉండటం.
జ: 1

 

9. కిందివాటిలో అభ్యసనం కాని అంశాన్ని గుర్తించండి.
     1) నిష్పాదన         2) సహజాతాలు  

     3) పరిపక్వత           4) పైవన్నీ
జ: 4

10. మోహిత్ అనే రెండోతరగతి బాలుడు రెండో తరగతి పూర్తి చేసుకుని మూడోతరగతిలోకి ప్రవేశించాడు. అయితే, జులైలో అతడి తండ్రి స్నేహితుడు ఆ విద్యార్థిని నువ్వు ఎన్నో తరగతి అని అడిగితే బాలుడు ఉన్నట్టుండి రెండోతరగతి అని చెప్పాడు. ఇది పావ్‌లోవ్ ఏ రకమైన నిబంధన నియమానికి సంబంధించింది?
జ. అయత్నసిద్ధ స్వాస్థ్యం


11. తెల్లటి చీర ధరించి ఇంజెక్షన్ చేసిన దివ్య అనే నర్సును చూసి భయపడిన రాము అనే బాలుడు తన వీధిలో, పాఠశాలలో తెల్లచీర ధరించిన స్త్రీలెవరిని చూసినా భయాన్ని వ్యక్తం చేయడం అనేది ఏ నియమానికి సంబంధించిన అంశం?
జ. సామాన్యీకరణ నియమం


12. ప్రభుత్వ పాఠశాలలో హాజరుశాతాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం లాంటి అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడంలో ఇమిడి ఉన్న పావ్‌లోవ్ నియమమేది?
జ. పునర్బలన నియమం

13. కింద పేర్కొన్న ప్రవచనాల్లో అభ్యసన ప్రక్రియకు సంబంధించి సరైన దాన్ని పేర్కొనండి.
    1) పావనికి ఆకలికాగానే ఏడ్వటం.
    2) భార్గవి బాగా కష్టించి పని చేయడం వల్ల బాగా అలసి నిద్రపోవడం.
    3) యశోద తడినేలపై అడుగుపెట్టి జారిపడటం.
    4) విజయ తన కుటుంబ సభ్యులందరిలో తన తల్లిని గుర్తించడం.
జ. 4 (విజయ తన కుటుంబ సభ్యులందరిలో తన తల్లిని గుర్తించడం.)


14. విశ్వనాథ్ అనే ఒక అధ్యాపకుడు గణితంలోని క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలతో జోడించి బోధించగా తరగతిలోని విద్యార్థులందరూ ఆనందంతో ఇష్టం వ్యక్తం చేశారు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది?
జ. శాస్త్రీయ నిబంధనం


15. " The work of the Digestive Glands" గ్రంథ రచయిత ఎవరు?
జ. పావ్‌లోవ్


16. పవన్ అనే విద్యార్థి ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఒక పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం ఆ స్కూల్ పక్కన ఉన్న వేరొక కాలేజీలో ఇంటర్ కోర్సులో చేరినా ఒకరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి నేరుగా కాలేజీకి కాకుండా అప్రయత్నంగా పదోతరగతి చదివిన పాఠశాలకు వెళ్లడం అనేది శాస్త్రీయ నిబంధనల్లో ......
జ. అయత్నసిద్ధ స్వాస్థ్యం

17. S - type నిబంధన ప్రక్రియకు సంబంధించి సరైంది?
1) ఒక జాతీయ నాయ‌కుడిని చూసి అదే ప‌నులు చేయ‌డం
2) ఉఫాధ్యాయుడు త‌ర‌గ‌తి గ‌దిలోకి ప్రవేశించ‌గానే విద్యార్థులంద‌రూ లేచి నిల‌బ‌డ‌టం
3) అభ్యస‌నం అంటే జ్ఞాన నిర్మాణంలో ఏర్పడే మార్పు
4) ప్ర‌త్యక్ష పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ ద్వారా భావ‌న‌లు ఏర్పడ‌తాయి
జ. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులందరూ లేచి నిలబడటం.

18. "Educating Exceptional Children" గ్రంథకర్త?
జ: శామ్యూల్ కిర్క్


19. అభ్యసన లక్షణం కానిది గుర్తించండి.
1) అభ్యసనానికి ప్రేరణ రాచబాట                               2) అభ్యసనం నిరంతర ప్రక్రియ
3) అభ్యసనాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయలేం      4) అభ్యసనం ద్వారా వికాసం మార్పులు జరగవు
జ: అభ్యసనం ద్వారా వికాసం మార్పులు జరగవు


20. మూడో తరగతి విద్యార్థి ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, చొక్కా గుండీలు పెట్టుకోవడం లాంటి కృత్యాలు చేస్తుంటే దాన్ని ఏ రకం అభ్యసనంగా చెప్పవచ్చు?
జ: చలన అభ్యసనం


21. తొలి రోజుల్లో శిశువు ఆవు అనే పదాన్ని ఒకసారి, అమ్మా అనే పదాన్ని ఒకసారి విని కొంతకాలం తర్వాత అమ్మా ఆవు వచ్చిందని పలకడం ఏ రకమైన అభ్యసనంగా చెప్పవచ్చు?
జ: శాబ్దిక అభ్యసనం


22. "The Psychology of Learning Instructions" గ్రంథ రచయిత ఎవరు?
జ: హిల్‌గార్డ్

23. అభ్యసనా లక్షణాలకు సంబంధించిన అంశం ఏది?
1) అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ                2) అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు
3) అభ్యసనం సార్వత్రికమై, ప్రతి జీవిలో జరుగుతుంది  4) అభ్యసన ఫలితం ప్రవర్తనలో సంభవించే మార్పు
జ: అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు


24. అభ్యసనం అంతిమ ఫలితంగా దేన్ని చెప్పవచ్చు?
జ: మూర్తిమత్వం అభివృద్ధి


25. ఒకటో తరగతిలో చేరిన రాజు అనే విద్యార్థిని.. ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకు అని అడగ్గా రాయడానికి అని సమాధానమిస్తే ఇది ఏ రకమైన అభ్యసనం అవుతుంది?
జ: ప్రత్యక్ష అభ్యసనం


26. ప్రాథమిక తరగతుల్లో విద్యార్థులకు చిత్రపటాలు, నమూనాల ద్వారా బోధనలు జరుపుతామనేది ఏ రకమైన చింతన?
జ: మూర్త చింతన


27. మనోవిజ్ఞానాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడిగా అమూర్త చింతనా సామర్థ్యానికి సంబంధించిన విషయాలను ఏ దశలో బోధించాలి?
జ: ప్రాథమికోన్నత దశ


28. తరగతిలో జరిపే బోధనాభ్యసన ప్రక్రియలో మొదటి దశగా విద్యార్థులను సంసిద్ధం చేయాలని సోపాన క్రమంలో వ్యక్తీకరించిన విద్యావేత్త ఎవరు?
జ: హెర్బార్ట్

29. శిశువు ఇతరుల దుస్తుల నుంచి తన దుస్తులను గుర్తించడం; కుక్కకు, పిల్లికి మధ్య తేడాలను, పోలికలను గుర్తించడం అనేది ఏ అభ్యసనం అవుతుంది?
జ: విచక్షణా అభ్యసనం


30. అభ్యసన సామర్థ్యానికి, వయసుకు మధ్య ఉండే సంబంధంలో కిందివాటిలో సరైంది? 
1) బాల్యదశ నుంచి వృద్ధాప్యం వరకు ఒకేలా ఉంటుంది
2) బాల్యదశలో సాధారణంగా ఉండి వయసు పెరిగే కొద్దీ అభ్యసనా సామర్థ్యం పెరుగుతుంది.
3) బాల్యదశలో ఎలా ఉంటుందో జీవితాంతం అలానే ఉంటుంది.
4) బాల్యదశలో అధికంగా ఉండి జీవితంలో తగ్గుతూ ఉంటుంది
జ: బాల్యదశలో సాధారణంగా ఉండి వయసు పెరిగే కొద్ది అభ్యసనా సామర్థ్యం పెరుగుతుంది.


31. మనోవిజ్ఞాన శాస్త్రం అభ్యసనా సిద్ధాంతాలను అనుసరించి రెండు, మూడేళ్ల పిల్లలకు 'ఆట పాటల' ద్వారానే అభ్యసనం జరగాలి. దీనికి కారణం?
జ: అభ్యసనం - పరిపక్వత


32. శిశువు జన్మించిన తర్వాత బోర్లాపడటం, తప్పటడుగులు వేయడం, నడవడం, పరిగెత్తడం మొదలైనవి ఏ అభ్యసనానికి చెందినవి?
జ: చలన అభ్యసనం

33. కింది అభ్యసన కారకాల్లో.. ఏది ఒక వ్యక్తిని ఇతర విషయాల నుంచి మరింత అభివృద్ధి చేసేలా చేస్తుంది?
1) భావనాత్మకం                     2) ప్రత్యక్షం                        

3) విచక్షణం                                4) ఏదీకాదు
జ: విచక్షణం


34. రవి అనే విద్యార్థి ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడతాడు, ఎక్కువ సమయాన్ని క్రికెట్‌కే కేటాయిస్తాడు. అయితే ఇతడిలో ఏ అభ్యసనం అధికంగా ఉంది?
జ: వైఖరి అభ్యసనం


35. వ్యక్తి ప్రవర్తనా మార్పుల్లో మొదటి సోపానం ఏది?
జ: గమ్యాన్ని గుర్తించడం


36. వ్యక్తిలోని అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలకు సంబంధించి సరికానిది?
1) సంసిద్ధత                             2) పరిపక్వత                      

3) ప్రేరణ                                     4) పైవన్నీ
జ: ప్రేరణ


37. అభ్యసన ప్రక్రియ అనేది?
జ: ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు


38. అభ్యసనా ప్రక్రియకు సంబంధించి కిందివాటిలో అత్యున్నతమైంది?
1) పరిశీలన                             2) వివేచనం                          

3) సమస్య పరిష్కారం                  4) ఏదీకాదు
జ: సమస్య పరిష్కారం

39. వ్యక్తిలో అభ్యసన ప్రక్రియ చక్కగా జరగడానికి అతడికి ఏ అవసరం మొదట తృప్తిపడాలి?
1) ఆకలి                                        2) నిద్ర                              

 3) దప్పిక                         4) పైవన్నీ
జ: పైవన్నీ


40. ప్రాథమికస్థాయి తరగతుల్లో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత పాఠ్యాంశానికి ముందు అభినయ గేయాలను, కథలు చెప్పడం కింది వాటిలో ఏ నియమానికి చెందింది?
1) ఫలిత నియమం        2) సంసిద్ధతా నియమం            

3) అభ్యసన నియమం                   4) పైవన్నీ
జ: సంసిద్ధతా నియమం


41. వ్యక్తిలో దాదాపు మారకుండా ఉండే శాశ్వత గుణాన్ని ఏమంటారు?
జ: అభ్యసనం


42. కిందివాటిలో అభ్యసనం కాని అంశాన్ని గుర్తించండి.
1) ఎత్తు పెరగడం                      2) సహజాతాలు                  

3) పరిపక్వత                          4) పైవన్నీ
జ: సహజాతాలు


43. కింద తెలిపిన సిద్ధాంతాల్లో దేన్ని ఉద్దీపన - ప్రతిస్పందన సిద్ధాంతమని పిలుస్తారు?
1) శాస్త్రీయ నిబంధనం        2) కార్యసాధక నిబంధనం    

3) యత్నదోష సిద్ధాంతం     4) పరిశీలనా అభ్యసనం
జ: యత్నదోష సిద్ధాంతం


44. విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన గణిత సమస్యను పరిష్కరించలేకపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ సమస్యను మెరుపులాగా వచ్చే ఆలోచన ద్వారా పరిష్కరించగలిగాడు. ఇది ఏ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది?
జ: ప్రత్యక్షాత్మక అభ్యసనం

45. 'ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా' అనే సామెతకు పోలిక గల సిద్ధాంతం ఏది?
జ: పరిశీలనాభ్యసన సిద్ధాంతం


46. 'డింగ్ డాంగ్ బెల్' అనే పద్యాన్ని విద్యార్థి వల్లె వేసి నేర్చుకున్నాడు. ఇది ఏ నియమానికి సంబంధించినదిగా గుర్తించవచ్చు?
జ: అభ్యసన నియమం


47. ఒక తరగతి గదిలో ఒక అభ్యసన అంశంలో కాలం తక్కువగా ఏర్పాటు చేసినప్పుడు విద్యార్థి జ్ఞానేంద్రియాలన్నీ ఆ అంశం పట్ల మాత్రమే సంఘటితమై ఉంటాయని తెలిపే నియమం ఏది?
జ: కాలవ్యవధి నియమం


48. ఒకటో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు మొదట తెలిసిన జంతువులైన పిల్లి, కుక్క గురించి తెలిపిన తర్వాత కంగారు, అడవి బల్లి గురించి బోధించాడు. ఈ సూత్రాన్ని బలపరిచే నియమం ఏది?
జ: సంసిద్ధతా నియమం


49. అభ్యసనం ద్వారా ఒక సమస్యను మొదట చక్కగా పరిష్కరించుకున్న విద్యార్థి అలాంటి సమస్యలు భవిష్యత్‌లో ఎన్నిసార్లు ఎదురైనా పరిష్కరించుకోగలగుతాడని ఏ పద్ధతి తెలియజేస్తుంది?
జ: అంతరదృష్టి

50. వ్యక్తులు తమకిష్టమైనటువంటి ఉపాధ్యాయుడి బోధనా విధానాన్ని లేదా క్రీడాకారుడి ఆట విధానాన్ని అన్ని కోణాల్లో పరిశీలించడం అనేది ఏ అభ్యసనం?
జ: పరిశీలనా అభ్యసనం


51. "Psychological Modeling" గ్రంథకర్త ఎవరు?
జ: ఆల్బర్ట్ బండూరా


52. ఏ సిద్ధాంతాన్ని 'ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ' సిద్ధాంతం అని కూడా అంటారు?
జ: అంతర్‌దృష్టి అభ్యసనం


53. పావ్‌లోవ్ పునర్బలన నియమాన్ని థారన్‌డైక్ ఏ నియమంతో పోల్చవవచ్చు?
జ: అభ్యసన నియమం


54. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని విద్యార్థులతో ఒక కృత్యాన్ని మళ్లీ మళ్లీ అభ్యసనం చేయిస్తున్నాడు. అతడు అవలంబిస్తున్న నియమాన్ని గుర్తించండి.
జ: ఉపయోగితా నియమం


55. "An Animal Intelligence" గ్రంథ రచయిత ఎవరు?
జ: థారన్‌డైక్

56. సెప్టెంబరు 5 అనగానే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గుర్తుకు రావడం అనే ప్రక్రియకు సంబంధమున్న నియమం ఏది?
జ: సామీప్యతా నియమం


57. ఆల్బర్ట్ బండూరా పరిశీలనాభ్యాసనం దేన్ని ఉద్ఘాటిస్తుంది?
జ: నూతన విషయాన్ని అనుకరణ ద్వారా నేర్చుకోవడం


58. పిల్లల్లో అలవాటైన కోపం, దౌర్జన్యం లాంటి వ్యతిరేక ఉద్వేగాలను తొలగించడానికి 'థారన్‌డైక్' ఏ నియమాన్ని అనుసరించవచ్చు?
జ: నిరుపయోగితా నియమం


59. అన్ని అభ్యాసనా సిద్ధాంతాల కంటే కొంత క్లిష్టంగా, సంధానాలు లేని అభ్యసనం ఏది?
జ: అంతరదృష్టి అభ్యసనం


60. డైట్ విద్యాసంస్థ క్విజ్ నిర్వహణలో 'మోహిత్' అనే విద్యార్థి 'సుడోకు' కొత్తపజిల్‌ను ఆసక్తితో పూరిస్తున్నాడు. ఇది ఏ అభ్యసనాన్ని అనుసరిస్తుంది?
జ: అంతరదృష్టి అభ్యసనం


61. "Productive Thinking" గ్రంథ రచయిత ఎవరు?
జ: మాక్స్ వర్థీమర్

62. కిందివాటిలో 'యత్నరహిత అభ్యసనం'గా పిలిచే సిద్ధాంతం ఏది?
1) నమూనా అభ్యసన సిద్ధాంతం        2) S - R టైప్ సిద్ధాంతం      

3) R - S టైప్ సిద్ధాంతం                  4) S టైప్ సిద్ధాంతం


జ: నమూనా అభ్యసన సిద్ధాంత
63. రాజు అనే విద్యార్థికి అతడి తండ్రి పదోతరగతిలో ప్రథమ శ్రేణిలో పాసైతే సైకిల్ కొనిస్తానన్నాడు. బహుమతి కోసం మాత్రమే విద్యార్థి చదవడానికి అలవాటు పడితే ఇది దేనికి ఉదాహరణ?
జ: S టైప్ సిద్ధాంతం


64. మంచి పనులు చేసే విద్యార్థులను ఉపాధ్యాయుడు పొగుడుతున్నాడు. దీన్ని చూసిన ఒక విద్యార్థి మంచి పనులు చేస్తుంటే ఇది...
జ: కార్యసాధక నిబంధనం


65. Eye అనే పదానికి బహువచనం Eyes అని నేర్చుకున్న విద్యార్థి Tooth అనే పదానికి Teeth అని కాకుండా Tooths అన్నాడు. ఇది ఏ రకమైన శిక్షణా బదలాయింపుగా చెప్పవచ్చు?
జ: ప్రతికూల బదలాయింపు


66. గణితం బాగా వచ్చిన అరుణ్ అనే విద్యార్థి భౌతిక శాస్త్రంలోని గణిత పదజాలాన్ని సులభంగా అర్థం చేసుకుంటూ ఉంటే ఈ అభ్యసనా బదలాయింపు..
జ: అనుకూల బదలాయింపు

67. వేగంగా వచ్చిన బంతిని చేతితో వెనక్కి లాగుతూ పట్టుకోవడం అనేది ఏ సిద్ధాంతానికి చెందిన అంశంగా చెప్పవచ్చు?
జ: సామాన్యీకరణ సిద్ధాంతం


68. ప్రతిరోజు షటిల్ ఆడే ఒక విద్యార్థికి ఒకరోజు అనుకోకుండా 'బ్యాడ్మింటన్' ఆడాల్సి వస్తే ఇప్పుడు అతడిలో ఏర్పడే అభ్యసన బదలాయింపు ఏది?
జ: ప్రతికూల బదలాయింపు


69. వరకట్నం తీసుకోకుండా మానవత్వంతో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి తన స్నేహితులు, సమాజంలోని వ్యక్తులందరినీ వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని సూచించడం ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఆదర్శాల సిద్ధాంతం


70. ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడే వ్యక్తికి అనుకోకుండా వాలీబాల్ ఆడాల్సి వచ్చినప్పుడు అతడిలో జరిగే అభ్యాసనా బదలాయింపు ఏది?
జ: ప్రతికూల బదలాయింపు


71. కుడిచేతితో బౌలింగ్ చేసే కుంబ్లే ఎడమ చేతితో కూడా బౌలింగ్ చేయగలిగితే ఇది ఏ బదలాయింపునకు చెందింది?
జ: ద్విపార్శ్వ బదలాయింపు


72. కిందివారిలో అభ్యసనా బదలాయింపును వ్యతిరేకించింది ఎవరు?
1) విలియం జేమ్స్                      2) గ్రే

 3) స్లెట్                                   4) బార్లో
జ: విలియం జేమ్స్

73. వేడి పొయ్యిని తాకి చేయి కాలిన శిశువు నిప్పును చూడగానే భయం అనే స్పందన చూపి తర్వాత నిప్పు అనే పదం విన్నా, ఏ మంటను చూసినా అదే స్పందన చూపుతున్నాడు. ఈ విషయాన్ని పావ్‌లోవ్ ప్రయోగ నియమాల్లో ఏ నియమానికి అనుసంధానించవచ్చు?
జ: ఉన్నత క్రమ నిబంధన


74. కిందివాటిలో అంతరదృష్టి అభ్యసనానికి సంబంధించని అంశం ఏది?
1) ఒక పరిష్కారాన్ని మొదటిసారిగా ఉపయోగించినప్పుడు సాధారణంగా తప్పులతోనే ఉపయోగించడం జరుగుతుంది.
2) అభ్యసనం హఠాత్తుగా జరుగుతుంది.


3) ప్రత్యక్ష పునర్ వ్యవస్థీకరణ పద్ధతి ద్వారా అభ్యసనం అవగతమవుతుంది.
4) పైవన్నీ
జ: ఒక పరిష్కారాన్ని మొదటిసారిగా ఉపయోగించినప్పుడు సాధారణంగా తప్పులతోనే ఉపయోగించడం జరుగుతుంది.


75. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించిన పవన్‌కు ప్రధాన ఉపాధ్యాయుడు ఒక చక్కటి కలం ఇచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత పవన్ మంచి మార్కులే సాధించాడు. దీన్ని ఏ నిబంధన అభ్యసనంగా గుర్తించవచ్చు?
జ: కార్యసాధక నిబంధన


76. మాంసం అంటే అమితంగా ఇష్టపడే కుక్కను మాంసం తింటున్న ప్రతిసారీ తీవ్రంగా దండిస్తే భయపడి కొంతకాలానికి మాంసం తినడం మానుకుంటుంది. అయితే అది ఏ నిబంధన రకానికి చెందింది?
జ: నకారాత్మక నిబంధనం

77. 'హర్రర్ మూవీ' చూసి భయపడిన ఒక విద్యార్థి ఆ తర్వాత ఆ సినిమా హాల్‌ని చూసినా, సినిమా పోస్టర్ చూసినా భయాన్ని వ్యక్తపరిస్తే ఇది శాస్త్రీయ నిబంధనంలో ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
జ: ఉన్నత క్రమ నిబంధనం


78. ఏ నిబంధనను ఉద్గమాల నిబంధనం అంటారు?
జ: కార్యసాధక నిబంధనం


79. నిబంధన క్రమంలో సంసర్గం దేన్ని జతచేయడం ద్వారా జరుగుతుంది?
జ: UCS ను CS తో జతపరచడం


80. పాఠశాలలో ఆటలాడుతున్న సమయాన గాయపడిన స్నేహితుడి రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగున్న ఏ వస్తువును చూసినా భయపడటం అనేది-
జ: సామాన్యీకరణం


81. శాస్త్రీయ నిబంధనలో అవసరం లేని అంశం-
1) జీవికి ఉద్దీపన                      2) జీవికి ప్రేరణ              

3) జీవి క్రియాత్మకత                 4) జీవి ప్రతిచర్య
జ: జీవి క్రియాత్మకత


82. ఏ సిద్ధాంతాన్ని ఉద్దీపనలు ప్రధానంగా లేని, R టైప్ సిద్ధాంతం అంటారు?
జ: కార్యసాధక సిద్ధాంతం


83. సాంఘిక - సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించినదెవరు?
జ: వైగోట్‌స్కీ

84. కార్యక్రమయుత బోధన లక్షణాల్లో చేరనిది?
1) విద్యార్థి వేగంతో అభ్యసించగలగడం        2) అభ్యసనంలో విద్యార్థి మందకొడిగా ఉండటం
3) స్వీయ - అభ్యసన పద్ధతి                      4) విషయాన్ని చిన్న ఫ్రేములుగా విభజించడం
జ: అభ్యసనంలో విద్యార్థి మందకొడిగా ఉండటం


85. ప్రతిరోజూ తెల్లచొక్కా వేసుకుని వచ్చే ఉపాధ్యాయుడికి అలవాటుపడిన విద్యార్థి సెలవుల్లో కూడా తెల్లచొక్కా వేసుకున్నవారిని తమ ఉపాధ్యాయుడు అనుకుని పలకరించడం అనేది -
జ: సామాన్యీకరణం

86. జీవి సహజ ఉద్దీపనకు కాకుండా వేరొక అసహజ ఉద్దీపనకు కూడా ఒక విధంగా ప్రతిస్పందనను చూపడం అనే ప్రక్రియ దేనికి సంబంధించింది?
జ: నిబంధనం

87. 'వైగోట్‌స్కీ' సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు?
1) మనోవిజ్ఞానదాయకమైన మరో వ్యక్తి    2) సామీప్య వికాస మండలం    3) వ్యక్తి సాంఘికీకరణ     4) పైవన్నీ
జ: పైవన్నీ

88. పాఠశాలలో ప్రవేశించిన తొలిరోజు మొదటి గంట కొట్టినప్పుడు ఏ విద్యార్థి కూడా ప్రార్థనకు హాజరుకాడు. కొంతకాలం తర్వాత గంట శబ్దం వినిపించగానే ప్రార్థనకు హాజరు కావడమనేది ఏ నిబంధన అవుతుంది?
జ: శాస్త్రీయ అభ్యసనం

89. వాట్సన్ ప్రయోగంలో గంట శబ్దం అనేది ఏ రకమైన ఉద్దీపన?
జ: సహజ ఉద్దీపన

90. పునర్బలన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మరే ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం అనే అంశం-
జ: ఉద్దీపనా విచక్షణం

91. ఉపాధ్యాయుడు శిక్షించిన ఒకటో తరగతి విద్యార్థి అందరి ఉపాధ్యాయుల పట్ల భయాన్ని పెంపొందించుకుంటాడు. ఇది దేనికి ఉదాహరణ?
జ: నిబంధనా సిద్ధాంతం

92. వాట్సన్ తన ప్రయోగంలో ఆల్బర్ట్‌కు తెల్లని ఎలుకలకు భయపడేలా నిబంధన చేశాడు. ఒకవేళ ఆ శిశువు తెల్లని పిల్లికి కూడా తన భయాన్ని ప్రకటిస్తే అది
జ: ఉద్దీపనా సామాన్యీకరణం

93. వైగోట్‌స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏది?
జ: వ్యక్తిగత భాష

94. వేర్వేరు అభ్యసనా సామర్థ్యాలున్న పిల్లలు తమకు తాముగా స్వయంప్రేరణతో జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది?
జ: కార్యక్రమయుత బోధన

95. సాంఘిక సాంస్కృతిక సందర్భం లేకుండా వైయక్తిక వికాసం ఉండదని పేర్కొన్న సిద్ధాంతం ఏది?
జ: సామాజిక వికాస సిద్ధాంతం

96. "Thought and Language" గ్రంథ రచయిత ఎవరు?
జ: వైగోట్‌స్కీ

97. కిందివాటిలో వైగోట్‌స్కీకి సంబంధించి సరైన భావన ఏది?
1) అభివృద్ధి ప్రక్రియకు, సామాజిక తోడ్పాటుకు ప్రాధాన్యం ఇచ్చాడు
2) సాంఘిక, సాంస్కృతిక సందర్భానికి వైయక్తిక వికాసానికి సంబంధాలను వివరించాడు.
3) సామాజిక వికాస సిద్ధాంతం రూపకర్త
4) పైవన్నీ

జ: పైవన్నీ

98. సహజ ఉద్దీపనలో జత చేర్చడం ద్వారా కృత్రిమ ఉద్దీపన ప్రేరణ కూడా సహజ ప్రేరణ లక్షణాలను సంతరించుకునే ప్రక్రియ ఏ రకమైన అభ్యసనంలో గోచరిస్తుంది?
జ: పావ్‌లోవ్ నిబంధన సిద్ధాంతం

99. కార్యసాధక నిబంధనలో ఉన్నత క్రమ నిబంధనమంటే ఏమిటి?
జ: పేటికలో దీపం వెలిగించినప్పుడు, మీట నొక్కగానే ఆహారం లభించడం

100. తెలుగు భాషను బాగా చదివే హేమంత్ అనే వ్యక్తి కన్నడ భాషలోని అక్షరాలను చదవగలిగితే ఈ వ్యక్తిలో కలిగిన అభ్యసనా బదలాయింపు ఏది?
జ: అనుకూల బదలాయింపు

101. "Logical Structure of Linguistic Theory" గ్రంథకర్త ఎవరు?
జ: కార్ల్ రోజర్స్

 కోటపాటి హరిబాబు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు