• facebook
  • whatsapp
  • telegram

అధ్యయన పద్ధతులు

1. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు అనుకూల పరిస్థితులు, కుటుంబ నేపథ్యం వల్ల పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం, పాఠ్యాంశ అధ్యయనంలో వెనుకబాటుతనాన్ని చూపడం, అమితమైన వ్యాకులత చూపడం లాంటి ప్రవర్తనాపర సమస్యలతో బాధపడటం సహజం. నేటి పరిస్థితిలో ఉత్తమ మనోవిజ్ఞానశాస్త్రం చదివిన ఉపాధ్యాయుడిగా నీవు ఏ మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతిని ఉపయోగించి పై సమస్యను నిర్ధారించి, నివారణ చర్యలు తీసుకుంటావు?
జ: వ్యక్తి అధ్యయన పద్ధతి

 

2. లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్ పద్ధతులు కింది ఏ మనోవిజ్ఞానంలో భాగం?
   1) ప్రయోగ మనోవిజ్ఞానం   2) బాలల మనోవిజ్ఞానం  3) సాంఘిక మనోవిజ్ఞానం   4) వికాసాత్మక మనోవిజ్ఞానం
జ: 4 (వికాసాత్మక మనోవిజ్ఞానం)

 

3. టెట్ పరీక్ష తేది ప్రకటించగానే పరీక్ష రాసే విద్యార్థులందరూ హడావుడిగా పుస్తకాలు పట్టుకొని చదవడం ప్రారంభిస్తారు. ఇందులో పరతంత్రచరం ఏది?
జ: విద్యార్థులు చదవడం

 

4. ప్రేమ్‌జీ అనే అపర మేధావి సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయడం అంటే?
జ: కేస్‌స్టడీ

5. కిందివాటిలో అనుదైర్ఘ్య (Longitudinal) పరిశోధన
1) విద్యా సాధనపై బహుమతుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు
2) కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేసేందుకు ఒక విద్యార్థిని 13 − 18 ఏళ్ల వయసు వరకు పరిశీలించడం.
3) కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేసేందుకు 13 − 18 ఏళ్ల వయసు ఉన్న విజాతీయ సమూహాలను పరిశీలించడం.
4) ఏదీకాదు
జ: 2 (కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేసేందుకు ఒక విద్యార్థిని 13 − 18 ఏళ్ల వయసు వరకు పరిశీలించడం)

 

6. పరతంత్ర చరనానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
      ఎ) స్వతంత్ర చర ఫలితం    బి) ప్రయోగ ఫలితం    సి) జోక్యచరం, ప్రభావం దీనిపై ఉంటుంది
జ: ఎ, బి, సి

 

7. కొన్ని నియమ నిబంధనలు కలిగిన ప్రశ్నావలి యొక్క మౌఖిక రూపమే
జ: సంచరిత పరిపృచ్ఛ

8. కిందివాటిలో నియంత్రిత పరిశీలన కాని దాన్ని గుర్తించండి.
      1) ప్రశాంత్ తన ఇంట్లో ఉన్న అక్వేరియంలోని చేపలను పరిశీలించడం.
      2) రాహుల్ తన ఇంట్లో గొలుసుతో బంధించి ఉన్న కుక్కను పరిశీలించడం.
      3) చేనులో మేస్తున్న ఆవును పరిశీలిస్తున్న సుశాంత్.
      4) ఆకలితో ఉన్న పిల్లిని బోనులో బంధించి పరిశీలిస్తున్న థార్న్‌డైక్ ప్రయోగం.
జ: 3 (చేనులో మేస్తున్న ఆవును పరిశీలిస్తున్న సుశాంత్)

 

9. 'ఒక పిల్లవాడు ఉదయం లేవగానే మమ్మీ నాకు కడుపు నొప్పిగా ఉంది' అని తన తల్లికి చెప్పాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?
జ: అంతఃపరీక్ష పద్ధతి

 

10. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త అధీనంలో ఉండని చరం?
జ: మధ్యస్థ చరం

 

11. విద్యార్థులు సహజంగా ఆటస్థలంలో ఆడుకునేటప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని ఏమంటారు?
జ: సహజ పరిశీలన

 

12. వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకొని మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వీలయ్యే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి
జ: అంతఃపరిశీలన పద్ధతి

13. కిందివాటిలో అంతఃపరిశీలనకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
    1) ఇది ప్రవర్తన అధ్యయన పద్ధతుల్లో పురాతనమైంది.   2) వ్యక్తి నిష్ఠత అధికంగా ఉన్న పద్ధతి.
    3) అత్యంత శాస్త్రీయమైన పద్ధతి.                                  4) దీన్ని ఆటోబయోగ్రఫీ రాయడంలో ఉపయోగిస్తారు.
జ: 3 (అత్యంత శాస్త్రీయమైన పద్ధతి)

 

14. పాఠశాలలో అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాల్గొన్న ఉపాధ్యాయుడు ఆ కార్యక్రమం చివరిలో లోకేష్ అనే విద్యార్థి బాగా పనిచేశాడని చెప్పి అతడికి బహుమతిని ప్రకటించాడు. ఆ ఉపాధ్యాయుడి పరిశీలన కిందివాటిలో ఏ రకమైంది?
   1) సహజ పరిశీలన    2) సహభాగీ పరిశీలన   3) సహభాగేతర పరిశీలన    4) అసహజ పరిశీలన
జ: 2 (సహభాగీ పరిశీలన)

 

15. ప్రయోజ్యుడి ఉద్వేగాలను బట్టి సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించడం ఏ పరిపృచ్ఛలో భాగం?
జ: అసంచిత పరిపృచ్ఛ

 

16. ఒక ఉపాధ్యాయుడు గ్రహణాలు అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించేందుకు వారిని రెండు సమూహాలుగా చేశాడు. మొదటి సమూహానికి ఆ పాఠ్యాంశాన్ని ఉపన్యాసం పద్ధతిలో బోధించి, రెండో సమూహానికి అదే పాఠ్యభాగాన్ని కృత్యాధార ధోరణిలో కొనసాగించాడు. ఆ తర్వాత అదే అంశాన్ని మొదటి సమూహానికి కృత్యాధార విధానంలో, రెండో సమూహానికి ఉపాన్యాస పద్ధతిలో బోధిస్తే, ఇందులో కొనసాగించిన నమూనా ఏది?
జ: భ్రమణ సమూహ నమూనా

17. బీఈడీ శిక్షణను పూర్తి చేసుకున్న ఒక వ్యక్తిని.. ప్రయివేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగానే తాను అడగాలి అనుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకొని వాటి మీద జవాబులను రాబట్టడం
జ: సంచరిత పరిపృచ్ఛ

 

18. ఒక వేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్‌లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడం కోసం జోక్యచరాలను అదుపులో ఉంచలేనని అనుకున్నప్పుడు కింది ఏ సమూహాలకు సభ్యులను కేటాయిస్తాడు?
జ: యాదృచ్ఛిక సమూహ పద్ధతి

 

19. హరి అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో కాంతి పాఠ్యాంశాన్ని సరిగా బోధించలేదనుకుంటే.. ఈ అధ్యయనంలో ఉపయోగపడే అత్యుత్తమ అధ్యయన పద్ధతి ఏది?
జ: అంతఃపరిశీలనా పద్ధతి

 

20. ఏ ముఖాముఖిలో సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకుంటారు?
జ: అనిర్దేశిక

 

21. రాజు అనే విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటనకు వెళ్లి అక్కడ ఉన్న అక్వేరియంలోని చేపలను నిశితంగా పరిశీలిస్తుంటే దాన్ని ఏ పరిశీలనగా గుర్తించాలి?
జ: కృత్రిమ పరిశీలన

22. డీఎస్సీలో టీచర్ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థికి పరీక్షకు రెండు రోజుల ముందు రోడ్డుపై అనుకోకుండా ప్రమాదం జరిగి పరీక్ష రాయలేకపోయాడు. ప్రయోగ పద్ధతిలో ఇలా హఠాత్తుగా జరిగే పరిణామాన్ని దేనితో సూచిస్తారు?
జ: మధ్యస్థ చరం

 

23. కిందివాటిలో సరి కానిది.
    ఎ) స్వతంత్ర చరం ఫలిత పాత్రను పోషిస్తుంది.      బి) పరతంత్ర చరం కారణ పాత్రను పోషిస్తుంది.
    సి) ప్రయోగాన్ని నిర్వహించే వాడు ప్రయోక్తి.       డి) ప్రయోగాన్ని ఎవరిపైన నిర్వహిస్తామో వాడు ప్రయోజ్యుడు.
జ: ఎ, బి

 

24. పిల్లల ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయుడు ఆసక్తి చూపాడు. ఈ అధ్యయనంలో పిల్లల ఆరోగ్యం
జ: పరతంత్ర చరం

 

25. ఒక వ్యక్తి ప్రవర్తన అతడి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అనే ప్రవచనంలో జోక్య చరం ఏది?
జ: వయసు

26. కిందివాటిలో సరికానిది?
      1) వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు చికిత్సా పద్ధతి.
      2) పరిపృచ్ఛా పద్ధతికి మరో పేరు క్లినికల్ పద్ధతి.
      3) అత్యంత వస్తు నిష్ఠత కలిగిన శాస్త్రీయ పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి.
      4) ఆత్మ విమర్శ అంతఃపరిశీలనా పద్ధతిలో జరుగుతుంది.
జ: 2 (పరిపృచ్ఛా పద్ధతికి మరో పేరు క్లినికల్ పద్ధతి)


27. ప్రయోగ పద్ధతిలో ఒక తరగతికి చెందిన విద్యార్థులను మూడు సమూహాలుగా చేశారు. మొదటి సమూహానికి 'మంచినీరు' మాత్రమే ఇచ్చి పరీక్షను రాయమన్నారు. రెండో సమూహానికి శీతలపానీయాలు ఇచ్చి పరీక్ష రాయమన్నారు. మూడో సమూహానికి మంచినీరు, శీతలపానీయాలూ ఇవ్వలేదు. ఇందులో నియంత్రిత సమూహం?
జ: మూడో సమూహం

 

28. కింద పేర్కొన్న అధ్యయన పద్ధతుల్లో 'విశ్వసనీయత' ఎక్కువ నుంచి తక్కువకు అమర్చిన వరుస క్రమం ఏది?
      1) అంతఃపరిశీలనా పద్ధతి, పరిశీలనా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి
      2) ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలనా పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి
      3) వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలనా పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి, ప్రయోగ పద్ధతి
      4) పరిశీలనా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి, ప్రయోగ పద్ధతి
జ: 2 (ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలనా పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి)

29. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు మధ్యమధ్యలో హాస్యాన్ని జోడిస్తున్నాడు. విద్యార్థులంతా హాస్యాన్ని ఆనందించినప్పటికీ అలసట కారణంగా రఫీ అనే విద్యార్థి నిద్రిస్తున్నాడు. ఇతడిపై ప్రభావం చూపిన చరం?
జ: జోక్యం చేసుకునే చరం

 

30. చిన్నపిల్లలను, మానసిక రోగులను, నిరక్షరాస్యులను, మూగవాళ్లను, పశుపక్ష్యాదుల ప్రవర్తనలను అధ్యయనం చేయలేని పద్ధతి?
జ: అంతఃపరీక్షణ

 

31. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదోతరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. దీని కోసం ఉపయోగించాల్సిన సరైన పద్ధతి ఏది?
జ: వైఖరి మాపనం

 

32. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన ప్రభావాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆ ఉపాధ్యాయుడు మంచి పాఠ్య ప్రణాళిక ద్వారా పాఠ్యాంశాలు బోధించి విద్యార్థుల్లో మంచి అభ్యసనా అనుభవాలు పెంపొందించాడు. ఇందులోని జోక్యచరాన్ని గుర్తించండి.
జ: విద్యార్థుల ఏకాగ్రత

33. సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులు స్తబ్దంగా ఉండకూడదని హాస్యాన్ని జోడించి వారిలో గణనీయమైన మార్పును తెచ్చాడు. ఇక్కడ స్వతంత్ర చరం
జ: హాస్యం

 

34. కింది ఏ సందర్భంలో సంరచిత పరిపృచ్ఛను ఉపయోగిస్తారు?
      1) వ్యక్తి ప్రత్యేక మూర్తిమత్వ లక్షణాలను తెలుసుకునేందుకు.
      2) ప్రత్యేక అంశాల్లో వ్యక్తుల వైఖరులను తెలుసుకునేందుకు.
      3) కొన్ని నిర్దిష్ట అంశాలపై వ్యక్తుల నిశ్చిత అభిప్రాయాలను తెలుసుకునేందుకు.
      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

35. కింది ఏ సందర్భంలో ప్రయోగ పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతుంది?
      1) ఒక వ్యక్తి సాధించిన లక్ష్యం గురించి విస్తృత సమాచారం సేకరించేందుకు.
      2) విద్యా బోధనలో బోధనోపకరణాల ఉపయోగం తెలుసుకునేందుకు.
      3) యుద్ధంలో పాల్గొన్న సైనికుల ప్రవర్తనను గోడచాటుగా పరిశీలించేందుకు.
      4) రోజూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థిని అధ్యయనం చేసేందుకు.
జ: 2 (విద్యా బోధనలో బోధనోపకరణాల ఉపయోగం తెలుసుకునేందుకు)

36. కిందివాటిలో వికాసాత్మక మనో విజ్ఞానం నుంచి గ్రహించిన పద్ధతులు?
      1) లాంగిట్యూడినల్ పద్ధతి       2) సంఘటన రచనా పద్ధతి
      3) నిర్ధారణా మాపనాలు         4) ప్రశ్నావళి పద్ధతి
జ: 1 (లాంగిట్యూడినల్ పద్ధతి)

 

37. కొత్తగా విద్యా ప్రక్రియలో విద్యార్థుల హాజరును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే, ఆ చిన్న పరిశోధనలో దేన్ని పరతంత్ర చరంగా చెప్పవచ్చు?
జ: విద్యార్థుల హాజరు

 

38. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యా నిర్ధారణ దశలోని ఉపదశల సరైన క్రమం
      ఎ) సమస్యను గుర్తించడం    బి) ప్రాక్కల్పనలు చేయడం     సి) దత్తాంశాలు సేకరించడం    డి) నిర్ధారించడం
జ: ఎ, బి, సి, డి

 

39. 'విద్యార్థుల అభ్యసనంపై బహుమతుల ప్రభావం'లో పరతంత్ర చరం?
జ: అభ్యసనం

 

40. పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఏ అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రతిపాదించారు?
జ: అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి

 

41. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రవేశపెట్టే చరం
జ: స్వతంత్ర చరం

42. బోధనా పద్ధతులన్నింటిలో ఉత్తమమైన బోధనాపద్ధతి ఏది అనే సందేహం వచ్చిన ఉపాధ్యాయుడు తన సమస్యా పరిష్కారంలో ఉపయోగించే అధ్యయన పద్ధతి ఏది?
జ: ప్రయోగ

 

43. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి పాదయాత్రలు చేపట్టడం ఏ రకమైన పరిశీలన?
జ: సహజ సంచరిత పరిశీలన

 

44. అంతఃపరిశీలన అంటే?
జ: తనను తాను పరిశీలించుకోవడం

 

45. కిందివాటిలో అంతఃపరీక్షణకు సంబంధించి పరిమితి కానిది ఏది?
      1) ఆర్థిక భారం ఉండదు      2) ఒకేసారి రెండు పనులు చెయ్యడం
      3) వ్యక్తి నిష్ఠత గలది            4) పసి పిల్లలకు ఉపయోగించలేం
జ: 1 (ఆర్థిక భారం ఉండదు)

 

46. ఆటల్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవాలనుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ పొందారని తెలిసినట్లయితే వారిని ఆ సమూహం నుంచి తీసేసి ఆటను నిర్వహించడం.
జ: నివారణా పద్ధతి

 

47. బీఈడీ చదివే విద్యార్థులు విహార యాత్రకు వెళ్లినప్పుడు సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిపోయి వారి సాంఘిక లక్షణాలు, ఉద్వేగాలను పరిశీలించడం
జ: సంచరిత పరిశీలన

48. ఇన్ట్రోస్పెక్షన్ అంటే?
జ: స్వయం పరిశీలన

 

49. ఇందూ అనే విద్యార్థిని డీఎస్సీ కోసం రాత్రంతా మేల్కొని చదువుతూ ఉదయం పరీక్ష హాలుకు వెళ్లింది. పరీక్ష హాలులో నిద్ర రావడం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయింది. అయితే ఇందులోని జోక్యచరం ఏది?
జ: నిద్ర రావడం

 

50. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమగ్రంగా అధ్యయనం చేసేవారు
      1) ప్రత్యేక అవసరాలు గల పిల్లలు                                      2) ప్రతిభావంతులైన పిల్లలు
      3) సమస్యాత్మక ప్రవర్తన వల్ల సాధనలో వెనుకబడినవారు       4) అందరూ
జ: 4 (అందరూ)

51. కాపీ కొడుతున్న విషయాన్ని సి.సి. కెమెరాలో పరిశీలించడం
జ: సహజ - అసంచరిత పరిశీలన

 

52. వ్యవసాయదారుడు తన పొలంలో పాములు, నెమలి, కుందేలును పరిశీలిస్తే... అతడి కొడుకు వీటిని జంతు ప్రదర్శనశాలలో చూశాడు. అయితే వ్యవసాయదారుడి కొడుకు చేసే పరిశీలన
జ: నియంత్రిత పరిశీలన

 

53. ఒక సంస్థ ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి కారణాలను లోతుగా అన్వేషించడం ఏ పద్ధతిలో సాధ్యమవుతుంది?
జ: వ్యక్తి అధ్యయన పద్ధతి

 

54. ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్‌లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడానికి జోక్యచరాలను అదుపులో ఉంచలేనని అనుకున్నప్పుడు ఏ సమూహాలకు సభ్యులను కేటాయిస్తాడు?
జ: యాదృచ్ఛిక సమూహ పద్ధతి

 

55. పిల్లల ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయుడు ఆసక్తి చూపాడు. ఈ అధ్యయనంలో పిల్లల ఆరోగ్యం
జ: పరతంత్ర చరం

56. ఆల్‌బర్ట్ అనే 11 నెలల శిశువుపై వాట్సన్ ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా అతడికి తీవ్రమైన జ్వరం రావడంతో పరిశోధన మధ్యలోనే ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా జ్వరం రావడం ఏ చరం?
జ: మధ్యస్థ చరం

 

57. ఒక పరిశోధన విద్యార్థి బి.ఎడ్. కళాశాలలో విద్యార్థుల హాజరును పెంచాలనుకున్నాడు. దీని కోసం ఉచిత పుస్తకాలను, హాజరు శాతాన్ని ఆధారంగా చేసుకుని చక్కటి హాజరు శాతాన్ని పెంచాడు. ఈ పరిశోధనల్లో ఉచిత పుస్తకాలను ఏ చరంగా భావిస్తారు?
జ: స్వతంత్ర చరం

 

58. గాంధీజీ తన గురించి తాను రాసిన గ్రంథం 'మై ట్రూత్', హిట్లర్ తనకు తానుగా రాసిన 'మేన్ క్యాంఫ్ (మై స్ట్రగుల్)' లాంటి గ్రంథాల ఆధారంగా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం ఏ పద్ధతి?
జ: స్వీయ చరిత్ర

 

59. ఇటీవల ప్రముఖ నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారని ముందుగానే తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సివిల్ దుస్తుల్లో అనుమానిత ప్రదేశాల్లో ప్రజల మధ్య సంచరిస్తూ వారిని పసిగట్టే ప్రయత్నం చేయడం?
జ: సంచరిత పరిశీలన

 

60. కొత్తగా విద్యా ప్రక్రియలో విద్యార్థుల హాజరును పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఈ చిన్న పరిశోధనలో దేన్ని పరతంత్ర చరంగా చెప్పవచ్చు?
జ: విద్యార్థుల హాజరు

61. ఉదయం మొత్తం పడుకుని రాత్రి మొత్తం చదువుకుందామని అనుకున్న అరుణ అనే అమ్మాయి చదువు ప్రారంభించిన కొంత సమయానికి అనుకోకుండా కరెంటు పోయి చదువు కొనసాగించలేకపోయింది. ఇందులో కరెంటు పోవడం ఏ రకమైన చరం?
జ: మధ్యస్థ చరం

 

62. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ అతడిని ఏమేం అడగాలో ముందుగానే కొంత సమయం తీసుకుని ప్రశ్నలను సోదాహరణంగా తయారుచేసుకుంది ఒక పద్ధతి ప్రకారం అడిగి సమాధానాలు రాబట్టింది. దీన్ని ఏ రకమైన ఇంటర్వ్యూగా భావించవచ్చు?
జ: సంరచిత ఇంటర్వ్యూ

 

63. సినిమా తీసే దర్శకుడు వర్షం కోసం కాలయాపన చేయకుండా కృత్రిమంగా వర్షాన్ని కురిపించి తన సినిమాలోని పాటలను చిత్రీకరించాడు. అయితే పరిశీలన పద్ధతి ప్రకారం దీన్ని దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: నియంత్రిత పరిశీలన

 

64. గణిత ఉపాధ్యాయుడు కంప్యూటర్, బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాడు. అయితే ఈ చిన్న పరిశోధన మార్పులో పరతంత్ర చరంగా చెప్పవచ్చు?
జ: ఆసక్తి

 

65. డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న విద్యార్థికి పరీక్షకు రెండు రోజుల ముందు రోడ్డుపై అనుకోకుండా, ప్రమాదం జరిగి పరీక్ష రాయలేకపోయాడు. ప్రయోగపద్ధతిలో ఇలా హఠాత్తుగా జరిగే పరిణామాన్ని దేనిగా సూచిస్తారు?
జ: మధ్యస్థ చరం

66. పాఠశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, దొంగతనం చేయడం, దౌర్జన్య స్వభావం, అబద్దాలు చెప్పడం లాంటి పనులు చేసే సమస్యాత్మక ప్రవర్తన ఉన్న పిల్లల గురించి అధ్యయనం చేయడానికి కిందివాటిలో ఏ పద్ధతి శ్రేష్టం?
  1) సమస్యా పరిష్కార పద్ధతి   2) వ్యక్తి అధ్యయన పద్ధతి   3) ప్రయోగ పద్ధతి   4) అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి
జ: 2(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

67. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా రోడ్డుపై బాల్యమిత్రులు కలిసినప్పుడు వారిని కుశల ప్రశ్నలు వేసి వారి బాగోగులను సమయానుకూలంగా అడిగి తెలుసుకోవడం ఏ పద్ధతి?
జ: అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి

 

68. కృత్యాధార పద్ధతి పిల్లల విద్యాసాధనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడే మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి ఏది?
జ: ప్రయోగ పద్ధతి

 

69. విద్యార్థి విహార యాత్రకు వెళ్లి సముద్రంలోని చేపలను పరిశీలిస్తే ఇది ఏ రకమైన పరిశీలన?
జ: అనియంత్రిత పరిశీలన

 

70. చింపాంజీల సాంఘిక ప్రవర్తనను పరిశీలించాలనుకున్న కొహెలర్ వాటి సహజ పరిసరాలైన అడవుల్లోకి వెళ్లి వాటిని పరిశీలించడం
జ: సహజ పరిశీలన

 

71. బీఎడ్ చదివే విద్యార్థులు విహార యాత్రకు వెళ్లినప్పుడు సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలసిపోయి వారి సాంఘిక లక్షణాలు, ఉద్వేగాలను పరిశీలించడం
జ: సంచరిత పరిశీలన

72. 'విద్యార్థుల అభ్యసనంపై బహుమతుల ప్రభావం' అనే ప్రయోగంలో పరతంత్ర చరం
జ: అభ్యసనం

 

73. వ్యాయామ ఉపాధ్యాయుడు ఆటల్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవాలనుకున్నాడు. అయితే కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ పొందారని భావించి వారిని ఆ సమూహం నుంచి తీసివేసి ఆటను నిర్వహించడం ఏ పద్ధతి?
జ: నివారణ పద్ధతి

 

74. బీఎడ్ శిక్షణను పూర్తిచేసుకున్న ఒక వ్యక్తిని ప్రయివేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగానే తాను అడగదలుచుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకుని వాటి మీద జవాబులు రాబట్టడం
జ: సంరచిత పరిపృచ్ఛ

 

75. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహానికి ఇంటిపని చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండో సమూహానికి ఇంటిపని చేసుకుని రాకపోతే దండన ఉంటుందని తెలిపాడు. మూడో సమూహానికి ఇంటిపని ఇచ్చాడు అయితే బహుమానం లేదా దండనం రెండింటిలో దేన్నీ ప్రకటించలేదు. వీటిలో నియంత్రిత సమూహం ఏది?
జ: మూడో సమూహం

 

76. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదో తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అతడు ఉపయోగించాల్సిన సరైన పద్ధతి
1) పరిపృచ్ఛ 2) పరిశీలన 3) వ్యక్తి అధ్యయన పద్ధతి 4) వైఖరి మాపనం
జ: 4(వైఖరి మాపనం)

77. కిందివాటిలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి
    1) వ్యక్తి అధ్యయన పద్ధతి      2) అంతపరీక్షణ పద్ధతి     3) పరిపృచ్ఛ పద్ధతి     4) ప్రయోగాత్మక పద్ధతి
జ: 1(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

78. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వేమంత్రితో టీవీ విలేకరులు చేసే ఇంటర్వ్యూ
జ: అసంరచిత

 

79. ఒక పరిశీలకుడు పులి వేటాడే విధానాన్ని బైనాక్యులర్ కెమెరా సహాయంతో అడవిలో ఒక చెట్టుపై నుంచి పరిశీలిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇందులో ఇతడి పరిశీలన
జ: సహభాగేతర పరిశీలన

 

80. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఏది?
జ: మధ్యస్థ చరం

 

81. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతుల్లో అత్యంత విశ్వసనీయమైంది ఏది
జ: ప్రయోగ పద్ధతి

 

82. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది?
జ: స్వతంత్ర చరం

 

83. అంతపరిశీలన అంటే ఏమిటి?
జ: తనను తాను పరిశీలించుకోవడం

84. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి నమోదు చేసి, విశ్లేషించి వ్యాఖ్యానించడం
జ: వ్యక్తిచరిత్ర పద్ధతి

 

85. పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది?
జ: అసంచరిత పరిశీలన

 

86. సెయింట్ అగస్టీన్ ప్రవేశపెట్టిన మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి ఏది?
జ: అంతపరిశీలనా పద్ధతి

 

87. అనిర్దేశిత ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
జ: కార్ల్ రోజర్స్

 

88. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి 'అబ్జర్వేషన్ డోమ్‌'ను ఏర్పాటు చేసినవారెవరు?
జ: గెస్సెల్

 

89. విద్యార్థులు సహజంగా ఆటస్థలంలో ఆడుకునేటప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని ఏమంటారు?
జ: సహజ పరిశీలన

 

90. ఏ పరిశీలనలో పరిశీలించబడేవారికి తాము పరిశీలించబడుతున్నామని తెలియదు?
జ: సహజ పరిశీలన

 

91. వ్యక్తిని గురించి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయం చేసే మనో విజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి
జ: వ్యక్తి అధ్యయన పద్ధతి

92. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
జ: ప్రయోగం

 

93. కిందివాటిలో చిన్నపిల్లలు, మానసిక రోగులు, నిరక్షరాస్యులు, మూగవాళ్లు, పశుపక్ష్యాదుల ప్రవర్తనలను అధ్యయనం చేయలేని పద్ధతి?
    1) అంతపరిశీలన పద్ధతి     2) వ్యక్తి అధ్యయన పద్ధతి     3) పరిశీలనా పద్ధతి     4) ప్రయోగాత్మక పద్ధతి
జ: 1(అంతపరిశీలన పద్ధతి)

 

94. అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దాన్ని ..... అంటారు.
జ: ఆత్మాశ్రయత

 

95. కిందివాటిలో ఎక్కువ 'ఆత్మాశ్రయత' గల పద్ధతి ఏది?
     1) అంతపరీక్షణ పద్ధతి     2) పరిశీలనా పద్ధతి     3) ప్రయోగాత్మక పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 1(అంతపరీక్షణ పద్ధతి)

 

96. కిందివాటిలో 'లక్ష్యాత్మకత' గల పద్ధతి ఏది?
    1) అంతపరీక్షణ పద్ధతి     2) పరిశీలనా పద్ధతి     3) ప్రయోగాత్మక పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 3(ప్రయోగాత్మక పద్ధతి)

 

97. కిందివాటిలో తక్కువ ఆత్మాశ్రయత ఉన్న పద్ధతి ఏది?
    1) ఇంటర్వ్యూ     2) అంతపరీక్షణ     3) పరిశీలనా పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 4(వ్యక్తి అధ్యయన పద్ధతి)

98. అంతపరీక్షణ పద్ధతి ద్వారా మొదటిసారిగా 'మానసిక ప్రకార్యాలను' గుర్తించినవారు ఎవరు?
జ: సెయింట్ అగస్టీన్

 

99. ఊంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఏది?
జ: అంతపరీక్షణ

 

100. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు
జ: చికిత్సా పద్ధతి

 

101. గెస్సెల్ రూపొందించిన 'అబ్జర్వేషన్ డోమ్' అనేది
జ: అసంచరిత పరిశీలన

 

102. 'ఈగో ఇన్వాల్వ్‌మెంట్' ఎక్కువగా ఉన్న పద్ధతి ఏది?
   1) అంతపరీక్షణ పద్ధతి    2) పరిశీలనా పద్ధతి   3) వ్యక్తి అధ్యయన పద్ధతి   4) ప్రయోగ పద్ధతి
జ: పరిశీలనా పద్ధతి

 

103. ప్రయోజ్యుల అనుభవాల వివరణ అనేది
జ: పరతంత్ర చరం

 

104. చరం అంటే ఏమిటి?
జ: ప్రయోగంలోని మార్పు

 

105. థారన్‌డైక్ పిల్లిపై చేసిన అభ్యసన ప్రయోగాలను ఏ పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: అసహజ పరిశీలన

 

106. కిందివాటిలో కార్యకారణ సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి ఏది?
    1) అంతపరిశీలన     2) పరిశీలనా పద్ధతి     3) ప్రయోగ పద్ధతి     4) ఇంటర్వ్యూ
జ: 3(ప్రయోగ పద్ధతి)

107. కిందివారిలో నిర్దేశిక పరిపృచ్ఛను ప్రాచుర్యంలోకి తెచ్చినవారు ఎవరు?
    1) విలియంసన్     2) మెకాబె     3) కార్ల్ రోజర్స్     4) నోమ్ ఛోమ్‌స్కీ
జ: 1(విలియంసన్)

 

108. కింది ఏ సమూహంలో తక్కువ స్వేచ్ఛ, అధిక ఒత్తిడి ఉంటుంది?
    1) నియంత్రిత సమూహం     2) ప్రయోగ సమూహం     3) పై రెండూ     4) నిర్వచించలేం
జ: 2(ప్రయోగ సమూహం)

 

109. విద్యార్థి అసాధారణ ప్రవర్తనను నమోదు చేయడం
జ: అనెక్‌డోటల్ రికార్డు

 

110. ఏ సమూహంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది?
   1) ప్రయోగ సమూహం    2) నియంత్రిత సమూహం    3) పై రెండూ   4) నిర్వచించలేం
జ: 2(నియంత్రిత సమూహం)

 

111. ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలసి ఆడుతూ, వారికి తెలియకుండా విషయాంశాలను సేకరించే పద్ధతి
జ: సంచరిత పరిశీలన

 

112. కిందివాటిలో అంతఃపరిశీలనా పద్ధతిలోని లోపం కానిది
    1) వ్యక్తి నిష్ఠత ఉంటుంది     2) చిన్నపిల్లలకు ఉపయోగపడేది     3) అధిక ఆర్థిక భారం     4) అన్నీ
జ: 3(అధిక ఆర్థిక భారం)

113. ఏ అధ్యయన పద్ధతికైనా అవసరమైన ప్రాథమిక పద్ధతి ఏది?
జ: పరిశీలనా పద్ధతి

 

114. తక్కువ సమయంలో అధిక సమాచారాన్ని సేకరించడానికి అనుకూలమైన పద్ధతి ఏది?
జ: సర్వే పద్ధతి

 

115. ప్రయోగాన్ని ప్రారంభించిన తర్వాత ప్రయోగంలో కనిపించే, ఊహించని ఫలితం ఏది?
జ: మధ్యస్థ చరం

 

116. ఒక రోగి వైద్యుడు వద్దకు వెళ్లి ''నా ఆరోగ్యం నిన్నటి కంటే ఈరోజు విషమించింది" అని చెబితే దీన్ని ఏ పద్ధతిగా పేర్కొంటారు?
జ: అంతపరిశీలనా పద్ధతి

 

117. అన్ని పద్ధతుల్లో కెల్లా అత్యంత విశ్వసనీయత కలిగిన పద్ధతి ఏది?
జ: ప్రయోగ పద్ధతి

 

118. 'గెస్సెల్' అబ్జర్వేషన్ డోమ్‌ను ఏ పరిశీలనలో ఉపయోగించాడు?
జ: సహభాగి పరిశీలన

 

119. ప్రయోగంలో పాల్గొన్న ప్రయోజ్యులు చెప్పే అనుభవాలు కిందివాటిలో వేటికి చెందినవి?
    1) మధ్యస్థ చరం     2) స్వతంత్ర చరం     3) జోక్య చరం     4) పరతంత్ర చరం
జ: 4(పరతంత్ర చరం)

120. కిందివాటిలో ఏ పద్ధతికి అత్యంత స్నేహపూరిత వాతావరణం అవసరం?
    1) పరిపృచ్ఛా పద్ధతి     2) అంతపరిశీలనా పద్ధతి     3) ప్రయోగ పద్ధతి     4) ఏదీకాదు
జ: 1(పరిపృచ్ఛా పద్ధతి)

 

121. ఒక వ్యక్తిలోని కచ్చితమైన, లోతైన విషయాలను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి
జ: కేస్‌స్టడీ

 

122. కింది పద్ధతుల్లో తక్కువ వ్యక్తి నిష్ఠత గల పద్ధతి ఏది?
    1) పరిపృచ్ఛ     2) పరిశీలనా పద్ధతి     3) అంతఃపరిశీలన     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 4(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

123. బాలుడు అక్వేరియంలోని చేపను పరిశీలించడం అనేది ఏ రకమైన అధ్యయనా పద్ధతి?
జ: కృత్రిమ పరిశీలన

 

124. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఏది?
జ: జోక్య చరం

 

125. విద్యామనోవిజ్ఞానశాస్త్రంలో ఏ పద్ధతిని అత్యంత విశ్వసనీయ పద్ధతిగా పేర్కొంటారు?
జ: ప్రయోగ పద్ధతి

126. కింది అల్ప విశ్వసనీయత కలిగి ఉన్నదేది?
    1) సంఘటనా రచనా పద్ధతి     2) ప్రయోగ పద్ధతి     3) పరిపృచ్ఛ     4) అంతపరిశీలనా పద్ధతి
జ: 4(అంతఃపరిశీలనా పద్ధతి)

 

127. ప్రతిస్పందనా చరం అని దేన్ని పేర్కొంటారు?
జ: పరతంత్ర చరం

 

128. ఉద్దీపనా చరం అంటే...
జ: పరతంత్ర చరం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌