• facebook
  • whatsapp
  • telegram

మూర్తిమత్వ వికాసం

1. ఒకటో తరగతి చదువుతున్న విజయ్ అనే విద్యార్థికి పాఠశాలలోని ఉపాధ్యాయులందరి నుంచి సరైన ప్రోత్సాహం అందినా, తోటి విద్యార్థులను సక్రమంగా ఆకర్షించలేకపోవడం వల్ల ఆ విద్యార్థి చదువు కొనసాగించడమా లేదా వదిలేయడమా అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఈ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏది?
జ: ఉపగమ - పరిహార సంఘర్షణ

 

2. కిందివాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికాని వాక్యం ఏది?
     1) మూర్తిమత్వం లక్ష్యసాధన వైపునకు మన భావనలను, చర్యలను మళ్లిస్తుంది.
     2) మూర్తిమత్వం వ్యక్తి అంతర్గత, బహిర్గత లక్షణాలతో కలిసి ఏర్పడుతుంది.
     3) మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలకు తావులేదు.
     4) వ్యక్తిలోని సమైక్య అంశాల మొత్తమే అతడి మూర్తిమత్వం.
జ: 3(మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలకు తావులేదు.)

 

3. డీఎస్సీలో తక్కువ మార్కులు పొందిన ఒక విద్యార్థి ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని ముందే తన తప్పిదం, బాధను వారికి చెప్పడంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏది?
జ: వ్యక్తీకరణం

4. వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించడాన్ని బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం
జ: మనోప్రక్షేపక నాటిక

 

5. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఇతర సంస్థలో పనిచేసే వారి వద్ద తన సంస్థ పేరును ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. ఈ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏది?
జ: తదాత్మీకరణం

 

6. ఒక ఉపాధ్యాయుడు తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ తన కొడుకు ఐఏఎస్ కావడంతో అది తానే సాధించినట్లు సంతృప్తి చెందడమనేది ఏ రకమైన రక్షకతంత్రం?
జ: తదాత్మీకరణం

 

7. సలీం అనే విద్యార్థి రన్నింగ్ రేస్‌లో ఓడిపోయాడు. ఓడిపోవడానికి కారణం అడగగా తన షూ సరిగాలేదని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెబితే అతడు వాడే రక్షకతంత్రం ఏది?
జ: ప్రక్షేపణం

 

8. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు పాఠం వినకుండా మాట్లాడటం, పరీక్ష రాస్తున్నప్పుడు కాపీ కొట్టడం, రైలు వెళ్తున్నప్పుడు రాళ్లు విసరడం లాంటి ప్రవర్తన గల విద్యార్థులను ప్రేరేపించే మనసు
జ: అచిత్తు

 

9. వ్యక్తిలో 'ప్రేరణాత్మక మరుపు'గా గుర్తించే రక్షకతంత్రం ఏది?
జ: దమనం

10. కిందివాటిలో వ్యక్తిలో విషమయోజన లక్షణం కానిది
     1) అధికమైన ఉద్రిక్తత కలిగి ఉండటం.
     2) నిరంతరం కుంఠనాలకు గురవడం.
     3) ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబులివ్వడం.
     4) కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండటం.
జ: 3(ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబులివ్వడం.)

 

11. ఒక వ్యక్తి తన పై అధికారి కోపానికి గురైనప్పుడు ఆ అధికారిపై తనకు ఏం కోపం లేదని, ఇంకా తనంటే చాలా అభిమానమని చెప్పడం
జ: ప్రతిచర్యానిర్మితి

 

12. రోషాక్ సిరా మరకల పరీక్ష కిందివాటిలో దేన్ని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది?
     1) మూర్తిమత్వం      2) ప్రజ్ఞ      3) వైఖరులు      4) సహజ సామర్థ్యాలు
జ: 1(మూర్తిమత్వం)

 

13. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనావేస్తే అది
జ: ప్రక్షేపక పరీక్ష

 

14. అవసరాలకు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడేది?
జ: విషమయోజనం

15. కిందివాటిలో అధివృక్క గ్రంథికి సంబంధించి సరైంది?
     1) స్త్రీలలో అధిక అడ్రినల్ రక్తంలో కలవడం వల్ల మీసాలు, గడ్డం వస్తాయి.
     2) స్త్రీలలో అధిక అడ్రినల్ రక్తంలో కలవడం వల్ల జననేంద్రియ వికాసం త్వరగా జరుగుతుంది.
     3) స్త్రీలలో అడ్రినల్ స్థాయి తగ్గడం వల్ల మగవారి గొంతులా బొంగురుపోవడం.
     4) ఈ హార్మోన్ వ్యక్తి ఉద్వేగంపై ప్రభావాన్ని చూపుతుంది.
జ: 3(స్త్రీలలో అడ్రినల్ స్థాయి తగ్గడం వల్ల మగవారి గొంతులా బొంగురుపోవడం.)

 

16. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ డబ్బు సంపాదించిన ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పకుండా కొంత సమయం తీసుకుని, గుర్తుకు తెచ్చుకొని చెప్పాడు. అయితే దానికి కారణమైన మనసు
జ: ఉపచేతనం

 

17. ప్రకాష్ తన చుట్టాలు పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా బహుమతి తీసుకెళ్లాలంటే డబ్బులు ఖర్చవుతాయని ఆలోచించి ఏదో ఒక కారణాన్ని సాకుగా చెప్పి వెళ్లలేదు. ఇక్కడ అతడు ఉపయోగించిన రక్షక తంత్రం?
జ: ఉపసంహరణ

 

18. చూడటానికి చిన్నగా ఉన్నా వ్యక్తి పొడవుగా పెరగడానికి, పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథి
జ: పీయూష గ్రంథి

19. మోహిత్ అనే బాలుడికి తన ఇంట్లోని చిన్న కుక్కపిల్లను తాకి దాంతో ఆడుకోవాలని ఉంది. కానీ తాకితే ఆ కుక్కపిల్ల కరుస్తుందనే భయంతో వెనక్కి వెళుతుంటే ఆ బాలుడిలోని సంఘర్షణ
జ: ఉపగమ - పరిహార

 

20. వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావితం చూపే గ్రంథి ఏది?
జ: అధివృక్క గ్రంథి

 

21. కిందివాటిలో సరికానిది.
     1) కెటినిజం - థైరాయిడ్ గ్రంథి           2) టిటాని - పార్శ్వ అవటు గ్రంథి
     3) మిక్సోడిమా - అడ్రినల్ గ్రంథి         4) జైగాంటిజం - పిట్యూటరీ గ్రంథి
జ: 3(మిక్సోడిమా - అడ్రినల్)

 

22. వ్యక్తి సమస్యాత్మక ప్రవర్తనకు కారణం
     1) పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరి                      
     2) చెడు ప్రవర్తన గల సమవయస్కుల బృందాలు
     3) ప్రతికూల ప్రవర్తనను కలిగించే పరిసరాలు        4) అన్నీ

జ: 4(అన్నీ)
 

23. ఆప్తులు మరణించినప్పుడు మంచిరోజు పువ్వులా రాలిపోయారు. అని చెప్తున్న వ్యక్తి ఉపయోగిస్తున్న రక్షకతంత్రం
జ: బౌద్ధీకరణం

 

24. వ్యక్తి మనసులోని 'ఉపచేతనం'లో ఉండే అంశాలు ఏవి?
జ: సమీప కాలంలో జరిగి కొంత ప్రయత్నంతో గుర్తుంచుకునే అంశాలు

25. కిందివాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరైన వాక్యం.
     1) వ్యక్తి మూర్తిమత్వాన్ని కచ్చితంగా కొలవగలం.
     2) వ్యక్తులందరిలో ఒకే మూర్తిమత్వం ఉంటుంది.
     3) వ్యక్తి మూర్తిమత్వం అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అంశాల కలయిక.
     4) వ్యక్తి మూర్తిమత్వాన్ని వారి పుట్టుకతోనే నిర్ణయిస్తారు.
జ: 3(వ్యక్తి మూర్తిమత్వం అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అంశాల కలయిక.)

 

26. ఒక వ్యక్తి తన తండ్రి మరణవార్త విన్న తర్వాత 'అతడు చాలా సుఖంగా బతికాడని, ప్రశాంతంగా అన్ని పనులు చక్కదిద్దుకొని దైవ సన్నిధికి వెళ్లాడని' చెప్పడం
జ: బౌద్ధీకరణం

 

27. అధ్యహం అనేది వ్యక్తిలో ఉన్నట్లు ఎలా గుర్తిస్తారు?
జ: నైతిక విలువలు పాటించినప్పుడు

 

28. రక్షకతంత్రం అనే భావన, పదాన్ని మొదట ఉపయోగించింది
జ: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

29. కిందివాటిలో సరైన ప్రవచనం.
     1) కుంఠనం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది.
     2) వ్యాకులత వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
     3) ఒత్తిడి వల్ల సమయోజనం ఏర్పడుతుంది.
     4) సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
జ: 4(సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.)

30. కిందివాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికాని వాక్యమేది?
     1) వ్యక్తి మూర్తిమత్వం శారీరక, మానసిక విధానాల కలయిక.
     2) మూర్తిమత్వానికి, వైయక్తిక భావాలకు తావులేదు.
     3) మూర్తిమత్వం అభ్యసనం, అనుభవం ద్వారా కలిగే భావన.
     4) వ్యక్తిలోని మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు.
జ: 2(మూర్తిమత్వానికి, వైయక్తిక భావాలకు తావులేదు.)

 

31. ఒక వ్యక్తి అన్యాయంగా సంపాదించిన తన సంపదను దాన - ధర్మాలు చేయడంలో ఉపయోగించిన రక్షకతంత్రం?
జ: ప్రాయశ్చిత్తం

 

32. ఉపాధ్యాయ వృత్తి మీద అభిరుచి లేనివాడు ఆ వృత్తి గొప్పదనం గురించి ఉపన్యాసాల్లో వివరించడానికి కారణం?
జ: ప్రాయశ్చిత్తం

 

33. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణ
జ: ఉపగమ - ఉపగమ

 

34. కిందివాటిలో మూర్తిమత్వాన్ని సూచించేది
     1) కొన్ని లక్షణాల సముదాయం
     2) దీన్ని కచ్చితంగా కొలవవచ్చు
     3) దీన్ని వివరించవచ్చు                
     4) అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది
జ: 4(అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది)

35. అనైతిక ఆలోచనలను కట్టడిచేసి, వాస్తవాలను గ్రహించి ఎల్లప్పుడూ మంచిపనులే చేయాలని ప్రోత్సహించే మనసు
జ: సూపర్ ఈగో

 

36. విశాల్ అనే వ్యక్తి భయానికి గురైనప్పుడు గుండె వేగం పెరిగి, రక్తపీడనం కూడా పెరిగింది. అయితే అతడిలో సంభవించే ఈ మార్పుకు కారణమైన గ్రంథి?
జ: అడ్రినల్ గ్రంథి

 

37. 'పులితో ఫొటో దిగాలని ఉంది కానీ చంపేస్తుందని భయంగా ఉంది. చెట్టెక్కి పండు కోసుకొని తినాలని ఉంది కానీ కింద పడతానేమోనని భయంగా ఉంది'. ఇది ఏ సంఘర్షణ?
జ: ఉపగమ - పరిహార

 

38. రక్షకతంత్రాలను ఉపయోగించి సమగ్ర మూర్తిమత్వాన్ని కాపాడేది
జ: ఈగో

 

39. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది
జ: ఉపచేతనావస్థ

 

40. కిందివాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది
     1) లక్ష్యం దిశగా సాగుతుంది.      2) మారుతూ ఉంటుంది.
     3) గతిశీలంగా ఉంటుంది.            4) ఎక్కువ అస్థిరంగా ఉంటుంది.
జ: 4(ఎక్కువ అస్థిరంగా ఉంటుంది.)

41. లిబిడో ఏ దశలో నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది?
జ: మౌఖిక దశ

 

42. క్లెఫర్డ్ బీర్స్ కృషి ఫలితంగా 1909లో అమెరికాలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి స్థాపించిన సంస్థ?
జ: నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్

 

43. 'డిక్షనరీ ఆఫ్ సైకాలజీ' గ్రంథ రచయిత ఎవరు?
జ: జె.పి. చాప్లిన్

 

44. 'ఫైట్ అండ్ ఫ్లైట్' అనే సామెతలో కనిపించే గ్రంథి
జ: అధివృక్క గ్రంథి

 

45. ఆటలు సరిగా ఆడలేని గోవింద్ తన తోటివారితో ఆటల వల్ల ఉపయోగం ఏమిటి, ఆ సమయాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చని సమర్థించుకుంటే అతడు ఉపయోగించిన రక్షకతంత్రం
జ: హేతుకీకరణం

 

46. అన్ని అంతఃస్రావిక గ్రంథులను నియంత్రించే 'అతి ప్రధాన గ్రంథి' అని దేన్ని పిలుస్తారు?
జ: పిట్యూటరీ గ్రంథి

 

47. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని కోరిక ఉన్నప్పటికీ సాధించలేని రాము, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించిన మరదలు చిత్రలో తనను చూసుకొని సంతృప్తి చెందుతుంటే అతడు ఉపయోగించుకున్న రక్షకతంత్రం
జ: తదాత్మీకరణం

48. స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు తినడానికి ఏవైనా పెడితే మనసులో తినాలని ఉన్నప్పటికీ ఇప్పుడే తిన్నాను, నాకు వద్దు అనడంలో వ్యక్తి ఉపయోగించిన రక్షకతంత్రం
జ: ప్రతిచర్యానిర్మితి

 

49. కోహ్లెర్ చింపాంజీపై, పావ్‌లోవ్ కుక్కపై, థార్న్‌డైక్ పిల్లిపై, స్కిన్నర్ ఎలుకపై చేసిన పరిశోధనల్లో జంతువులు, శాస్త్రజ్ఞులను ప్రయోగ పద్ధతి పరిభాషలో ఏమని పిలుస్తారు?
జ: ప్రయోక్తలు, ప్రయోజ్యులు

 

50. ఒక వ్యక్తి నేను ఎమ్ఎల్ఏ దగ్గర పనిచేస్తున్నానని గుర్తింపు పొందుతున్నాడు. అయితే అతడు ఉపయోగిస్తున్న రక్షకతంత్రం?
జ: తదాత్మీకరణం

 

51. కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు గ్రహించే దశ ఏది?
జ: గుప్త దశ

 

52. కిందివాటిలో స్త్రీ బీజకోశాలు విడుదల చేసే హార్మోన్ ఏది?
     1) ఈస్ట్రోజన్      2) థైరాక్సిన్      3) టెస్టోస్టిరాన్      4) ఆండ్రోజన్
జ: 1(ఈస్ట్రోజన్)

 

53. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది
జ: చేతనావస్థ

54. శ్రీకాంత్ ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు ఊహించుకొని తాను ఎలా ప్రవర్తిస్తాడో, ఇతరులు ఎలా గౌరవిస్తారో లాంటి ఊహలతో గడపడం
జ: స్వైరకల్పన

 

55. మోహన్‌కి ఒక వైద్యుడు అంటే ఇష్టం లేదు. కాబట్టి అతడి గురించి ఎవరైనా అడిగితే 'రోగులకు అతడంటే అస్సలు ఇష్టం ఉండదు' అని చెప్పడం ఏ రక్షకతంత్రం?
జ: ప్రక్షేపణం

 

56. సాయికృష్ణ అనే విద్యార్థి ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించాడు కానీ అతడికి ఎక్కువ ఇష్టమైన సివిల్ బ్రాంచ్ ఎంచుకోవాలా లేదా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎంచుకోవాలా అనే సంఘర్షణ ఏ రకమైంది?
జ: ఉపగమ - ఉపగమ

 

57. కిందివాటిలో హేతుకీకరణాన్ని సూచించేది
     1) పరుగు పందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షలను చూపించి అవి బాగలేవనడం
     2) ఒక విద్యార్థి తనకిష్టమైన ఉపాధ్యాయుడిని అనుసరించడం
     3) తన చెల్లి అంటే ఇష్టం లేనివాడు ఆమె పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం
     4) విద్యార్థులతో చిన్న పిల్లవాడిలా ఆడుకునే ఉపాధ్యాయుడు
జ: 1(పరుగు పందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షలను చూపించి అవి బాగలేవనడం)

58. కేవలం ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా రాసి, ఆ వ్యక్తికి సరిపోయే లేదా సరిపోని ప్రవచనాలను బట్టి అతడి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం
జ: శోధనాసూచికలు

 

59. కిందివాటిలో సరికాని జత?
     1) రోషాక్ సిరామరకల పరీక్ష - హెర్మన్ రోషాక్
     2) థీమాటిక్ అప్పర్ సెప్షన్ పరీక్ష - ముర్రే, మోర్గాన్
     3) చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ పరీక్ష - ఎస్.బెల్లాక్, కె.ఎల్. బెల్లాక్
     4) సాంఘికమితి పరీక్ష - ఫిలిన్ జాక్సన్
జ: 4(సాంఘికమితి పరీక్ష - ఫిలిన్ జాక్సన్)

 

60. శరీరంలోని అంతఃస్రావిక గ్రంథులకు సబంధించి సరైంది?
     1) పీయూష గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్‌ను ఉత్పతి చేస్తుంది.
     2) అతి దీర్ఘకాయత్వం అంటే శిశువు పొడవు పెరగకపోవడం.
     3) అధివృక్క గ్రంథి మెదడులో మధ్య భాగాన ఉంటుంది.
     4) అవటు గ్రంథి స్రావకానికి అయోడిన్ అవసరం.
జ: 4(అవటు గ్రంథి స్రావకానికి అయోడిన్ అవసరం.)

61. కిందివాటిలో సరికాని మూర్తిమత్వ అంచనా పద్ధతి
     1) స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి ద్వారా ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు.
     2) వ్యక్తి తనకు తానుగా రాసుకున్న అంశాల ఆధారంగా అంచనా వేయడం స్వీయ చరిత్ర.
     3) సమయానుకూలంగా ఒకే క్రమం పాటించకుండా ప్రశ్నలు తయారుచేసుకోవడం సంరచిత ప్రశ్నావళి.
     4) వ్యక్తిని లోతుగా, నిశితంగా అన్ని కోణాల్లో పరిశీలించి అంచనా వేయడం వ్యక్తి చరిత్ర పద్ధతి.
జ: 3(సమయానుకూలంగా ఒకే క్రమం పాటించకుండా ప్రశ్నలు తయారుచేసుకోవడం సంరచిత ప్రశ్నావళి.)

 

62. గణేష్ అనే వ్యక్తి ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు తిరస్కరించడంతో ఆమెను బలవంతంగా మర్చిపోవడం
జ: దమనం

 

63. బాగా సర్దుబాటు కాగలిగినవారు
జ: సమస్యా పరిష్కార పద్ధతులను ఆశ్రయిస్తారు.

 

64. రక్షకతంత్రాలు అనేవి?
జ: తాత్కాలికంగా మాత్రమే సమస్యలను ఎదుర్కొంటాయి.

 

65. పరీక్షలో బాగా తెలిసిన రెండు జవాబుల మధ్య ఎన్నికలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ
జ: ఉపగమ - ఉపగమ

 

66. సర్దుబాటు సమస్య అనేది?
జ: అంతర్గతం, బహిర్గతం

67. కుంఠనం అనేది?
జ: మానసిక ఉద్రిక్త పరిస్థితి

 

68. కిందివాటిలో విషమయోజనం లక్షణం కానిది?
     1) ఒంటరిగా ఉండాలనే ఆశ              2) చంచల స్వభావం
     3) అంతర్వర్తనులుగా ఉండటం          4) శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ప్రవర్తించడం
జ: 4(శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ప్రవర్తించడం)

 

69. సినిమాలోని తన ప్రత్యర్థి మీద ఉన్న కోపంతో పక్కనున్న సహాయకుడిని కత్తితో పొడవడం అనేది ఏ రక్షకతంత్రం?
జ: విస్తాపనం

 

70. విషమయోజనం గలవారు ఏవిధంగా ఉంటారు?
జ: అంతర్వర్తనులు

 

71. అవసరం - ఉత్సుకత - కదలిక - గమ్యం ఈ క్రమాన్ని ఏమని పిలుస్తారు?
జ: ప్రేరణ వలయం

 

72. కిందివాటిలో సరైన క్రమం.
     1) లక్ష్యం - అవసరం - ఉత్సుకత - గమ్యం
     2) అవసరం - ఉత్సుకత - కదలిక - గమ్యం
     3) ఉత్సుకత - అవసరం - కదలిక - గమ్యం
     4) గమ్యం - ఉత్సుకత - అవసరం - కదలిక
జ: 2(అవసరం - ఉత్సుకత - కదలిక - గమ్యం)

73. ఐఏఎస్ కావాలనుకున్న వ్యక్తి లక్ష్యం మార్చుకొని గ్రూప్ - 2 ఆఫీసర్ అవడం అనేది ఏ రకమైన సర్దుబాటు పద్ధతి?
జ: రాజీ విధానాలను అనుసరించడం

 

74. సర్దుబాటులో రక్షకతంత్రాల ఉపయోగం
జ: ఆత్మవిశ్వాసాన్ని కలగజేయడం

 

75. విద్యార్థిలో విషమయోజనానికి ప్రధాన కారణం
జ: సరైన ఆత్మభావన

 

76. 'ఎలక్ట్రా కాంప్లెక్స్' అంటే?
     1) మగ శిశువు తన తల్లితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం.
     2) ఆడ శిశువు తన తల్లితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం.
     3) మగ శిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం.
     4) ఆడ శిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం.
జ: 4(ఆడ శిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం.)

 

77. 'ఎడిపస్ కాంప్లెక్స్' అంటే
జ: అబ్బాయిలు తల్లి ప్రేమ, అనురాగం, అభిమానాన్ని కోరుకోవడం

 

78. ప్రవీణ్ అనే విద్యార్థి ప్రేరణ లేకపోవడం వల్ల విషమయోజనానికి గురైనట్లయితే అది ఏ రకమైన కారణం?
జ: పాఠశాల సంబంధ

79. ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అనేది
జ: వైఖరి

 

80. 'ఎడిపస్ కాంప్లెక్స్', 'ఎలక్ట్రా కాంప్లెక్స్‌'లు ఉన్న మనోలైంగిక వికాస దశ?
జ: శిశ్న దశ

 

81. కోపం, ధ్వంసం చేయడం, అవిధేయత, సహాయ నిరాకరణ లాంటివి దేని లక్షణాలు?
జ: ప్రవర్తనా అపవ్యవస్థ

 

82. మానసిక ఆరోగ్యం ఉండే వ్యక్తుల ప్రవర్తన
జ: సాంఘిక అనుకూలమైన ప్రవర్తన

 

83. 'ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలను సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో, ఆ శక్తుల గతిశీలక నిర్వహణలే వ్యక్తి మూర్తిమత్వం' అని పేర్కొన్నది
జ: ఆల్‌పోర్ట్

 

84. థైరాక్సిన్ స్రావం యవ్వన దశ, వయోజన దశలో లోపించినప్పుడు ఏర్పడే స్థితులు వరుసగా
జ: క్రెటినిజమ్, మిక్సోడిమా

 

85. కిందివాటిలో సరికాని ప్రవచనం
     1) అడ్రినల్ గ్రంథి అధికంగా స్రవిస్తే రక్తపోటు ఎక్కువ అవుతుంది.
     2) పీయూష గ్రంథి తక్కువగా పనిచేస్తే మందబుద్ధి, నిరాశతో ఉంటారు.
     3) థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవిస్తే ప్రభావశీలురుగా తయారవుతారు.
     4) బీజ గ్రంథులు జీవితం సంతోషంగా గడపడానికి సహకరిస్తాయి.
జ: 3(థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవిస్తే ప్రభావశీలురుగా తయారవుతారు.)

86. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవడం వల్ల చదువును కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేక పోతున్నాడు. అయితే ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ
జ: ఉపగమ - పరిహార

 

87. నవజాత శిశువు 'సాధారణ ఉత్తేజం', 'ఆర్తి', 'ఆహ్లాదం' ప్రతిస్పందనలుగా విడిపోవడాన్ని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?
జ: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది.

 

88. 'ప్రిన్స్‌పల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ' అనే పుస్తకాన్ని రచించింది
జ: ఓల్ఫ్‌గాంగ్, కోహ్లెర్

 

89. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఏమంటారు?
జ: ఎమోషనల్ కెథార్సిస్

 

90. నాని ఇంటిపని చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాని అకారణంగా తన చెల్లెలుపై అరిచాడు. ఇది ఏ రక్షకతంత్రం?
జ: విస్తాపనం

91. కిందివాటిలో గ్రంథి, దాన్ని ప్రభావితం చేసే వికాసాన్ని జతపరచండి.
i) పీయూష గ్రంథి    a) ఉద్వేగ వికాసం
ii) థైరాయిడ్ గ్రంథి    b) మానసిక వికాసం
iii) అడ్రినల్ గ్రంథి    c) ప్రజ్ఞా వికాసం
జ: i-b, ii-c, iii-a

 

92. ఫెటినిజం అనేది ఒక
జ: లైంగిక నేరం

 

93. ఒక ప్రత్యేక వృత్తిలో ఉన్న వ్యక్తి సాధనను ప్రాగుక్తీకరించేందుకు అతడిలో వేటిని ఎక్కువగా తెలుసుకోవాలి?
జ: సహజ సామర్థ్యాలు

 

94. నూతన సమాచారం, అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన
జ: స్కీమాటా

 

95. మూర్తిమత్వ సమాచార సేకరణలో వ్యక్తి బాహ్య రూపాన్ని చూసి వివరించే సిద్ధాంతాలను ఏమంటారు?
జ: రూపక సిద్ధాంతాలు

96. ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన CAT పరీక్ష ద్వారా దేన్ని మాపనం చేస్తారు?
జ: పిల్లల మూర్తిమత్వాన్ని

 

97. 'స్వప్న విశ్లేషణ' (ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్) గ్రంథకర్త ఎవరు?
జ: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

98. కిందివాటిలో కుంఠనానికి పర్యవసానాలు
     1) దౌర్జన్యానికి పాల్పడటం                                    2) స్వైరకల్పనలు చేయడం
     3) అధిక కుంఠనం వల్ల ఆత్మహత్యకు పాల్పడవచ్చు   4) అన్నీ
జ: 4(అన్నీ)

 

99. రోజా అనే బాలిక పాఠశాల విరామ సమయంలో తండ్రి ఇచ్చిన డబ్బులతో తనకు ఇష్టమైన చాక్లెట్, ఐస్‌ఫ్రూట్‌లలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే ఈ విద్యార్థిలో ఏర్పడే సంఘర్షణ ఏది?
జ‌: ఉపగమ - ఉపగమ సంఘర్షణ

 

100. వ్యక్తిలో ప్రేరణాత్మక మరుపుగా గుర్తించే రక్షక తంత్రం
‌: దమనం

 

101. ఫెటనిజం అనేది ఒక
జ‌: లైంగిక నేరం

 

102. రోషాక్ సిరా మరకల పరీక్ష కిందివాటిలో దేన్ని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది?
       ఎ) మూర్తిమత్వం        బి) ప్రజ్ఞ        సి) వైఖరులు        డి) సహజసామర్థ్యాలు
జ‌: ఎ(మూర్తిమత్వం)

 

103. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడి మూర్తిమత్వాన్ని అంచనావేస్తే అది ఎలాంటి పరీక్ష?
జ‌: స్థితి పరీక్ష

104. ఒక విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టడానికి, వెళుతున్న రైలుపై రాళ్లు విసరడానికి, పక్క విద్యార్థి బ్యాగులోంచి పెన్సిళ్లు దొంగతనం చేయడానికి కారణభూతమైంది
జ‌: అచిత్తు

 

105. పై అధికారితో నిందనకు గురైన ఒక వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందడానికి చేసే ప్రయత్నం
జ‌: పరిహారం

 

106. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి, వారు వాటితో ఆటలాడుతుండగా వారి ప్రవర్తనను అంచనా వేయడమనేది
జ‌: క్రీడా పద్ధతి

 

107. వికాస్‌కు మైదానానికి వెళ్లి ఆడుకోవాలని ఉన్నప్పటికీ దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్లనీయకపోవడం వల్ల అతడు కుంఠనానికి గురయ్యాడు. అతడికి కుంఠనాన్ని కలిగించిన కారకం ఎలాంటిది?
జ‌: మానసికమైంది

 

108. సంఘర్షణ అనేది
జ‌: మానసిక ఉద్వేగం

 

109. 'నల్లపిల్ల' అని అందరూ వెక్కిరించిన అమ్మాయి ఒక ప్రఖ్యాత వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం?
జ‌: పరిహారం

110. ఒక విద్యార్థికి పిల్లిని పట్టుకోవాలని ఉంది. అది కరుస్తుందేమోనని భయంతో దగ్గరకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ?
జ‌: ఉపగమ - పరిహార

 

111. పరీక్ష సరిగా రాయలేకపోవడానికి కారణం అడగగా 'పరీక్షల వల్ల ఉపయోగం లేదు' అని కుర్రవాడు ఉపయోగించే తంత్రం
జ‌: హేతుకీకరణం

 

112. డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ?
జ‌: ఉపగమ - పరిహార

 

113. మానవుడిలో అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథిని ఏమని పిలుస్తారు?
జ‌: పీయూష గ్రంథి

 

114. 'స్ప్రేంజర్' ప్రకారం ''ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఎల్లప్పుడూ ఏదీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవచేసేవారు"
జ‌: సాంఘిక విలువలు ఉన్నవారు

 

115. దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లిన వధూవరులు వారు చేసిన ఆహార పదార్థాలను తిని బాగాలేకపోయినా చాలా బాగా చేశారని చక్కగా ఉన్నాయని చెప్పడం
జ‌: ప్రతిచర్య నిర్మితి

116. ఐఏఎస్ కావాలనుకన్న ఉపాధ్యాయుడు తాను కాలేకపోయిన్పటికీ తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం?
జ‌: తదాత్మీకరణ

 

117. వరుణ్ అనే బాలుడిని అతడి తండ్రి ''ఎందుకు ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అని అడగగా ''మా తరగతిలో ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అనడం ఏ రక్షక తంత్రం?
జ‌: దమనం

 

118. పదోతరగతి ఫెయిలైన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్న పిల్లలా ఏడుస్తూ ప్రవర్తించడం అనేది ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు?
జ‌: ప్రతిగమనం

 

119. సరిగా చదవని వ్యక్తి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం
జ‌: ఉపసంహరణ

 

120. రెండుసార్లు డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన అతడిపై ప్రభావం చూపేది
జ‌: ఒత్తిడి

 

121. అవసరాలు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు వ్యక్తిలో ఏర్పడేది ఏది?
జ‌: విషమయోజనం

122. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన సంపదను దాన ధర్మాలు చేయడంలో దాగి ఉన్న రక్షకతంత్రం
జ‌: ప్రాయశ్చిత్తం

 

123. కిందివాటిలో వికాస సూత్రం కానిది
       ఎ) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది        బి) వికాసం నిరంతర ప్రక్రియ
       సి) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు                            డి) వికాసం సంచితమైంది
జ‌: ఎ(వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది)

 

124. 'వికాస కృత్యాల' భావనను మొదట ఎవరు ప్రవేశపెట్టారు?
జ‌: రాబర్ట్ హవిగ్‌హరస్ట్

 

125. ఏ గ్రంథి స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది?
జ‌: అధివృక్క గ్రంథి

 

126. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఏమంటారు?
జ‌: ఎమోషనల్ కెథార్సిస్

 

127. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించడానికి ఆ వ్యక్తిలోని వేటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?
జ‌: సహజసామర్థ్యం

 

128. వ్యక్తి మూర్తిమత్వం ముఖ్యంగా అతడి ఏ స్వభావం వల్ల ప్రభావితమవుతుంది?
జ‌: అభిరుచులు

129. నూతన సమాచారం అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన
జ‌: స్కీమాట

 

130. కిందివాటిలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి
     ఎ) వ్యక్తి అధ్యయన పద్ధతి      బి) అంతఃపరీక్షణ పద్ధతి     సి) పరిపృచ్ఛ పద్ధతి      డి) ప్రయోగాత్మక పద్ధతి
జ‌: ఎ(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

131. ''ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ‌: కర్ట్ కోఫ్‌కా

 

132. వ్యాకులత, కుంఠనాల నుంచి అహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని ఏమని పిలుస్తారు?
జ‌: రక్షక తంత్రం

 

133. రాజు ఇంటి పని పూర్తిచేయకపోవడంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు అతడిని మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు అకారణంగా తన చెల్లెలిపై అరిచాడు. ఇది
జ‌: విస్తాపనం

 

134. స్వప్న విశ్లేషణ (Interpretation of Dreams) గ్రంథకర్త ఎవరు?
‌: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

135. వ్యక్తి ఉద్వేగాలపై అధికంగా ప్రభావం చూపే గ్రంథి ఏది?
జ‌: పీయూష గ్రంథి

136. వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే గ్రంథి
జ‌: అవటు గ్రంథి

 

137. వ్యక్తి మూర్తిమత్వంలో దౌర్జన్యపూరిత కోర్కెలను రేపి, జంతువాంఛలను తీర్చుకోవడానికి పురికొల్పే అంశం
జ‌: అచిత్తు

 

138. వ్యక్తి ఇతరులకెప్పుడూ హాని తలపెట్టకుండా ఆదర్శతత్వాన్ని కలిగి ఉండాలనే మనసులోని భాగం?
జ‌: సూపర్ఇగో

 

139. 'Dictionary of Psychology' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: జె.పి.చాప్లిన్

 

140. పర్సోనా అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
జ‌: లాటిన్

 

141. వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమంలో సంఘర్షణకు గురవుతారని ఈ సంఘర్షణ క్రమాన్ని/ రకాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: కర్ట్ లెవిన్

 

142. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారుగా ఎవరిని గుర్తిస్తారు?
జ‌: ఉభయవర్తనులు

143. సరైన సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది
       ఎ) శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండటం       బి) భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం
       సి) చేస్తున్న పనిలో అభిరుచి ఉండటం                 డి) పరిసరాలతో మంచి సర్దుబాటు ఉండటం
జ‌: ఎ(శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండటం)

 

144. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి, మరో రంగంలో గుర్తింపు పొంది అహాన్ని సంతృప్తిపరుచుకోవడమనేది
జ‌: పరిహారం

 

145. 'మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా' అని పేర్కొన్నవారు?
జ‌: జె.ఎఫ్.బ్రౌన్

 

146. కిందివారిలో ఎవరి మూర్తిమత్వం ఒకేరకంగా ఉంటుంది?
   ఎ) ఒకే తరగతిలో చదువుకునే పిల్లలు   బి) ఒకే కుటుంబ సభ్యులు    సి) ఏక అండ కవలలు     డి) ఏదీకాదు
జ‌: డి(ఏదీకాదు)

 

147. సామాన్య గాయిటర్ వ్యాధి ......... లోపం వల్ల కలుగుతుంది.
జ‌: అయోడిన్

 

148. సర్దుబాటు సమస్య అనేది
జ‌: అంతర్గతం, బహిర్గతం

149. కుంఠనం అనేది
జ‌: మానసిక ఉద్రిక్త పరిస్థితి

 

150. మానసిక ఆరోగ్యాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త
జ‌: బెర్నార్డ్

 

151. మానసిక రుగ్మత చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టినవారు
జ‌: ఫినల్

 

152. కిందివాటిలో అసత్యం
        ఎ) జైగాంటిజం - పీయూష గ్రంథి         బి) క్రెటినిజం - థైరాయిడ్ గ్రంథి
        సి) టిటాని - పార్శ్వ అవటు గ్రంథి         డి) మిక్సోడిమా - అడ్రినల్ గ్రంథి
జ‌: డి(మిక్సోడిమా - అడ్రినల్ గ్రంథి)

 

153. పరిపక్వం చెందిన వ్యక్తి బాధ్యతారహితంగా వాహనం నడపడం
జ‌: ప్రతిగమనం

 

154. ఫైట్ & ఫ్లైట్ అనే సామ్యత కనిపించే గ్రంథి
జ‌: పిట్యూటరీ గ్రంథి

 

155. పర్సోనా అంటే ఏమిటి?
జ‌: ముసుగు

156. కిందివారిలో చొరవచూపే గుణం ఉన్నవారు
        ఎ) అంతర్వర్తనులు         బి) బహిర్వర్తనులు         సి) ఉభయవర్తనులు         డి) ఎవరూకాదు
జ‌: ఎ(అంతర్వర్తనులు)

 

157. సమగ్ర మూర్తిమత్వం గలవారు రక్షక తంత్రాలను ఎలా ఉపయోగిస్తారు?
జ‌: పరిమితంగా

 

158. కిందివాటిలో వ్యక్తిని తప్పు చేయాలని ప్రోత్సహించేది?
        ఎ) ఇడ్         బి) ఈగో         సి) సూపర్ ఈగో         డి) అచేతనం
జ‌: ఎ(ఇడ్)

 

159. 'ఎడిపస్ కాంప్లెక్స్', 'ఎలక్ట్రాకాంప్లెక్స్‌'లు ఉన్న మనోలైంగిక వికాసదశ
జ‌: శిశ్న దశ

 

160. ఉద్దేశ పూర్వకంగా విస్మృతికి ఉపయోగించే రక్షకతంత్రం
జ‌: దమనం

 

161. 'ఆడలేక మద్దెల ఓడ' అనడం ఏ రకమైన రక్షకతంత్రం?
జ‌: ప్రక్షేపణం

 

162. 'ఫైట్ అండ్ ఫ్లైట్' హార్మోన్ అని దేన్ని పిలుస్తారు?
జ‌: అడ్రినలిన్

163. అంతఃస్రావిక గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను ......... అంటారు.
జ‌: హార్మోన్‌లు

 

164. మూర్తిమత్వం ఒక
        ఎ) స్వీయ చేతనత్వం         బి) ఆత్మకేంద్రీకృతం         సి) గమ్యనిర్దేశకం         డి) అన్నీ
జ‌: డి(అన్నీ)

 

165. 'సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం' అని నిర్వచించినవారు
జ‌: ఇ.ఫారిస్

 

166. నాడీ రుగ్మత అనేది ఒక
జ‌: మానసిక రుగ్మత

 

167. వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన జనన పూర్వపరిసరాన్ని ప్రభావితం చేసే అంశం కానిది
        ఎ) తల్లి ఆహార అలవాట్లు         బి) తల్లిదండ్రుల వైఖరి         సి) తల్లి ఆరోగ్యం         డి) పాఠశాల
జ‌: డి(పాఠశాల)

 

168. కౌమార దశలోని పిల్లల మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపే అంశం
జ‌: సమవయస్కులు

 

169. థీమాటిక్ అప్పర్‌సెప్షన్ పరీక్ష ఒక
జ‌: మూర్తిమత్వ పరీక్ష

170. రాజుకు పరీక్ష ముందురోజు జ్వరం వచ్చింది. దీనికి కారణమైన గ్రంథి
జ‌: అధివృక్క గ్రంథి

 

171. అవసరాన్ని బట్టి సమాచారాన్ని పునఃస్మరణ చేయడం దేనిలోని అంశం?
జ‌: ఉపచేతనావస్థ

 

172. కిందివాటిలో ప్రాథమిక అవసరం
        ఎ) గాలి         బి) ప్రేమ         సి) సెక్స్         డి) డబ్బు
జ‌: ఎ(గాలి)

 

173. వ్యక్తిలో ఉత్సుకతని జనింపజేసేది
జ‌: అవసరం

 

174. రాత్రిపూట చదివేటప్పుడు కరెంటు పోవడమనేది ఏ చరం?
జ‌: స్వతంత్ర చరం

 

175. 'జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ చేయడం' అనేది దేనికి చెందింది?
జ‌: ఉపచేతనావస్థ

 

176. పదోతరగతి విద్యార్థి వరల్డ్ కప్ క్రికెట్ చూడాలని ఆశపడుతున్నాడు. కానీ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి అని భయపడుతున్నాడు. అతడిలో సంఘర్షణ
జ‌: ఉపగమ - పరిహార

177. తన లక్ష్యంలో రాజీపడకపోతే వ్యక్తి దేనికి లోనవుతాడు?
జ‌: సంఘర్షణ

 

178. కిందివాటిలో సరైన ప్రవచనం
        ఎ) కుంఠనం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది.           బి) వ్యాకులత వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
        సి) ఒత్తిడి వల్ల సమయోజనం ఏర్పడుతుంది.         డి) సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
జ‌: డి(సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.)

 

179. ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అనేది
జ‌: వైఖరి

 

180. అనాథ బాలలను గురించి మదర్ థెరిసా వారి దగ్గరి నుంచి సమస్యలు తెలుసుకోవడం
జ‌: పరిశీలన పద్ధతి

 

181. ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను పరిశీలించడం ఏ పద్ధతి?
జ‌: ప్రయోగాత్మక పద్ధతి

 

182. విద్యార్థి తరగతి గదికి ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నాడు. ఈ ప్రవర్తన సమస్యను అధ్యయనం చేయడానికి ఉ4యోగించే పద్ధతి ఏది?
జ‌: పరిశీలనా పద్ధతి

183. రాహుల్ తన స్నేహితుడి వద్దకు వెళ్లినప్పుడు దారి తప్పిపోయాడు. ఈ సందర్భంలో తను ఎలాంటి భయాందోళనకు గురయ్యాడో వివరించే పద్ధతి ఏది?
జ‌: ప్రయోగ పద్ధతి

 

184. విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణతో రవి చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతడికి అప్పుడప్పుడు కలిగే మానసిక అలసట అనేది?
జ‌: స్వతంత్ర చరం

 

185. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ
జ‌: ఉపగమ - ఉపగమ

 

186. రక్షకతంత్రం అనే భావన, పదం మొదట ఉపయోగించింది
జ‌: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

187. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి
జ‌: ఆల్‌పోర్ట్

 

188. కిందివాటిలో దేన్ని 'అంతరాత్మ'గా పిలుస్తారు?
        ఎ) అహం         బి) వాస్తవం         సి) అధ్యహం         డి) అచిత్తు
జ‌: సి(అధ్యహం)

189. కిందివాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది
        ఎ) ఇది గతిశీలమైంది                         బి) ఇది కొన్ని లక్షణాల సముదాయం
        సి) దీన్ని అంచనా వేయవచ్చు            డి) అన్నీ
జ‌: బి(ఇది కొన్ని లక్షణాల సముదాయం)

 

190. ఇవాన్ పావ్‌లోవ్ తన ప్రయోగంలో కుక్కను క్రమపద్ధతిలో పరిశీలించడం ఏ పద్ధతిగా పేర్కొనవచ్చు?
జ‌: అసహజ పరిశీలన

 

191. కింది పేర్కొన్న ఏ అధ్యయన పద్ధతిలో అత్యంత విశ్వనీయత ఉంది?
        ఎ) అంతఃపరీక్షణా పద్ధతి         బి) పరిశీలనా పద్ధతి         సి) పరిపృచ్ఛా పద్ధతి         డి) ప్రయోగ పద్ధతి
జ‌: సి(పరిపృచ్ఛా పద్ధతి)

 

192. వైద్యశాస్త్రం నుంచి స్వీకరించి, 'క్లినికల్ మెథడ్' గా పిలుస్తున్న పద్ధతి ఏది?
జ‌: ప్రయోగ పద్ధతి

 

193. ప్రత్యేకావసరాలున్న పిల్లవాడి గురించి అధ్యయనం చేసి తెలుసుకోవాలని భావించిన ఉపాధ్యాయుడికి ఉపయోగపడే పద్ధతి
జ‌: పరిపృచ్ఛ పద్ధతి

 

194. పిల్లల సర్దుబాటు సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలో వేటిని స్థాపించాలి?
జ‌: కంప్యూటర్ ల్యాబ్స్

195. ఏ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగా, అత్యాశపరుడుగా ఉంటారు?
జ‌: థైరాయిడ్ గ్రంథి


196. కిందివాటిలో స్త్రీ బీజకోశాలు విడుదల చేసే హార్మోన్
        ఎ) ఈస్ట్రోజన్         బి) థైరాక్సిన్         సి) టెస్టోస్టిరాన్         డి) ఆండ్రోజన్
జ‌: ఎ(ఈస్ట్రోజన్)

 

197. మానసిక వైద్యశాలలో దారుణ పరిస్థితులను వర్ణిస్తూ 1908లో క్లిఫర్డ్ బీర్స్‌చే ప్రచురించబడిన గ్రంథం
జ‌: ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్‌సెల్ఫ్

Posted Date : 25-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు