• facebook
  • whatsapp
  • telegram

యూనిట్ - I మానవ వికాసదశలు

1. 'పునీత్ అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో బోధించినా బరువు, కాలం లాంటి అమూర్త అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఏ అంశానికి సంబంధించిన 'మనోవైజ్ఞానిక జ్ఞానం' అవసరం?
జ: వికాస దశలు

 

2. లాస్య, జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు?
జ: తొలిబాల్య దశ

 

3. పూర్వబాల్య దశకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
జ: జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది

 

4. మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలసి 'ముఠా'గా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందినవాడై ఉంటాడు?
జ: ఉత్తరబాల్య దశ

5. ఒక విద్యార్థి 'గుర్తింపు' కోసం నిరంతరం శోధిస్తూ, అధికమైన ఒత్తిడిలో ఉన్నట్త్లెతే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు?
జ: కౌమార దశ

 

6. 'ఉద్వేగ కేథార్సిస్' అంటే...
జ: ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునే తనలోని నియంత్రణాస్థితి

 

7. ఒక బాలుడి వికాసదశకు సంబంధించి సరికాని వాక్యమేది?
జ: ఉత్తరబాల్య దశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు

 

8. ఆఫ్రికా ఖండంలోని ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు. కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండటం అనేది ఏ వికాస నియమానికి సంబంధించింది?
జ: సారూప్య సూత్రం

 

9. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన వద్ద ఉన్న బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేన్ని తెలుపుతుంది?
జ: సాంఘిక, ఉద్వేగ వికాసం

 

10. సాధారణంగా కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. దీన్ని ఏరకమైన ఆటంకంగా గుర్తించవచ్చు?
జ: మానసిక ఆటంకం

11. శిశువు మొదట స్త్రీలందరినీ 'అమ్మా' అని సంబోధించి, తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి?
జ: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది.

 

12. శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను అనుసరించి తనను తాను ప్రేమించుకునే గుణమైన 'ఉద్వేగ కేథార్సిస్‌'ను ప్రదర్శించే దశ?
జ: శైశవ దశ

 

13. పిల్లలు తరచుగా ప్రవర్తించే చలనాత్మక నైపుణ్యాల్లో ఏ రకమైన కృత్యం 'సూక్ష్మచలనాత్మక నైపుణ్యం'ను తెలియజేస్తుంది?
జ: అరచేతితో పట్టుకోవడం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌