• facebook
  • whatsapp
  • telegram

సాహిత్య ప్రక్రియలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1.  కార్యక్రమయుత బోధనలోని మొదటి సూత్రం-
జ:  చిన్న సోపానాల సూత్రం

 

2.  క్రీడా పద్ధతికి పితామహుడు-
జ:  కాల్డ్ వెల్‌కుక్

 

3. పాఠశాలను ప్రయోగశాలగా, విద్యార్థులను పరికరాలుగా భావించి బోధించే పద్ధతి-
జ:  డాల్టన్ పద్ధతి

 

4. 'కవికి గీటురాయి పద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం' అనేది ఎవరి అభిప్రాయం?
జ:  రామచంద్ర శుక్ల 

 

5. 'ఎత్తుగడల పద్ధతి' అని దేన్నంటారు?
జ:  ఉద్యమ పద్ధతి

 

6. 'ఏదైనా ఒక అంశంపై విరివిగా రాయడం  వ్యాసం' అని నిర్వచించింది-
జ:  శబ్ద రత్నాకరం 

 

7. 'కిండర్', 'గార్టెన్' అనేవి ఏ భాషా పదాలు?
జ:  జర్మనీ 

 

8. ఏ పద్ధతిలో బోధనాంశం మొత్తం 'నియోజనాలు'గా తయారుచేసి వాటిని విద్యార్థులతో పూర్తి చేయిస్తారు?
జ:  డాల్టన్ పద్ధతి

 

9. 1955లో ఉపాధ్యాయ విద్యలో భాగంగా ఏ విశ్వ విద్యాలయం మొదటిసారిగా 'బృంద బోధన'ను ప్రవేశపెట్టింది?
జ:  హార్వర్డ్ విశ్వవిద్యాలయం 

 

10. నాటక బోధనను జరపాల్సిన పద్ధతి-
జ:  ప్రదర్శన పద్ధతి 

 

11. 'ఆచార్యుడానందమయుడు - విద్యాశాల వినోదారామం' అనే భావనను విద్యార్థులకు కలిగించే పద్ధతి-
జ:  క్రీడాపద్ధతి

 

12. పాఠశాల నిర్వహణకు 'దర్శకురాలు' ఉండే పద్ధతి-
జ:  కిండర్‌గార్టెన్ పద్ధతి

 

13. బోధన - పునః బోధన ఉన్న బోధనా పద్ధతి-
జ:  సూక్ష్మబోధన

 

14. గుణాత్మక విద్యలో భాగంగా ప్రాథమిక విద్యా పథకం-
జ:  కృత్యాధార బోధన

 

15. 'తీరికగా ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా చేసే పనియే క్రీడ'- అన్నది
జ:  గల్లిక్

 

16. అందుబాటులో ఉన్న 'వనరులను', 'నైపుణ్యాలను' వినియోగించుకుని బోధించే బోధనా విధానం-
జ:  బృంద బోధన

 

17. హెలెన్ పార్క్ హర్ట్స్ పద్ధతిని ప్రారంభించిన పట్టణం-
జ:  డాల్టన్

 

18. సూక్ష్మబోధనలో ఒక నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు బోధన చేయాలి?
జ:  4 

 

19. పాఠశాలలో పనిగంటల తర్వాత అదనంగా కేటాయించిన సమయంలో ఉపాధ్యాయుడి సమక్షంలో ఆరోజు చెప్పిన పాఠాలు విద్యార్థులు చేసే అధ్యయనం-
జ:  పర్యవేక్షణాత్మక అధ్యయనం

 

20. 'ది టెక్టాలజి ఆఫ్ టీచింగ్' గ్రంథాన్ని రచించింది-
జ:  స్కిన్నర్ 

 

21. స్వీయ గమనంలో నేర్చుకోనిస్తే విద్యార్థి త్వరగా నేర్చుకుంటాడనే ప్రమేయంమీద ఆధారపడిన సూత్రం-
జ:  స్వీయగమన సూత్రం

 

22. ఆధునిక బోధనాపద్ధతులన్నింటికీ మూలాధారమైన పద్ధతి-
జ:  క్రీడా పద్ధతి 

 

23. 'వైయక్తిక, సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ది పరచడం'- అనేది తన సూత్రాల్లో ఒకటిగా ఉన్న పథకం-
జ:  ఎ.పి.పి.ఇ.పి.

 

24. కార్యక్రమయుత అభ్యసనకు మూలమైన అభ్యసన సిద్ధాంతం-
జ:  కార్యసాధక నిబంధన 

 

25. సంకీర్ణ ఉద్యమానికి సంబంధించిన అంశం-
జ:  తోటపని 

 

26. 'వ్యాస చంద్రిక' కర్త-
జ:  గురజాడ

 

27. 'కృత్యాధార పద్ధతి'ని మొదట ప్రస్తావించిన కమిటీ -
జ:  ఈశ్వరీభాయి 

 

28. మాంటిస్సోరి పద్ధతిలో విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం-
జ:  పీడోమీటర్

 

29. 'సూక్ష్మబోధన' అంటే-
జ:  బోధనా మెలకువ

 

30. గరిష్ఠ స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని ఏ విధానంలో పెంపొందించవచ్చు?
జ:  బృంద బోధన

 

31. ఏ పద్ధతిలో కల్పించిన ప్రత్యక్ష అనుభవాలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గుర్తింపు నోచుకున్నాయి?
జ:  మాంటిస్సోరి పద్ధతి

 

32. ఏ పద్ధతిలో జరిగే బోధనలో 'భాషా బోధన'కు 90 నిమిషాలు కేటాయించుకోవచ్చు?
జ:  బహుళ తరగతి బోధన 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌