• facebook
  • whatsapp
  • telegram

మొదటితరం అభ్యాసకులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఒకసారి విన్నదాని కంటే చూసింది ఎక్కువ రోజులు-
జ: జ్ఞాపకం ఉంటుంది

 

2. చిన్నారులైన బాలబాలికలకు-
జ: నిశిత పరిశీలనాశక్తి ఉంటుంది

 

3. సామాన్య శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు-
జ: ప్రయోగాలు చూపిస్తూ బోధించాలి

 

4. కఠినమైన పాఠ్యాంశాలను బోధించడానికి ఉపాధ్యాయులు-
జ: బోధనోపకరణాలను ఉపయోగించాలి

 

5. ఆంగ్లమాధ్యమ పాఠశాల ఆవరణలో తరగతి గదుల్లో విద్యార్థులు-
జ: ఆంగ్లంలోనే మాట్లాడేలా చూడాలి

 

6. ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చేరే విద్యార్థుల్లో అధికుల సామాజిక స్థాయి-
జ: ఉన్నత, మధ్య తరగతులు

 

7. ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చదివే పిల్లలు తమ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు?
జ: మమ్మీ- డాడీ అని పిలుస్తున్నారు

 

8. ఈ రోజుల్లో కనిపిస్తున్న ప్రతివారినీ అంకుల్- ఆంటీ అని పిలిచే సంస్కృతి-
జ: భారతీయ సంస్కృతిని కనుమరుగుచేస్తోంది

 

9. ఆంగ్లం బాగా రావాలంటే
జ: ఏ మాధ్యమంలో చదివినా ఆ భాషపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే సరిపోతుంది

 

10. పరభాషలెన్ని నేర్పినా వాటిలో-
జ: సంపూర్ణ ప్రావీణ్యాన్ని సాధించలేం

 

11. ఒక భాష నేర్చుకుని దానిలో జ్ఞానాన్ని పొందాలంటే-
జ: ఆ భాషలో విరివిగా మాట్లాడాలి

 

12. పాఠశాలల్లో చేరే మొదటి తరం అభ్యాసకుల తల్లిదండ్రులు-
జ: నిరక్షరాస్యులు

 

13. సహజప్రజ్ఞ ఉన్న బాలబాలికలు ఎక్కువగా ఏతరం అభ్యాసకులు?
జ: మొదటితరం

 

14. తల్లిదండ్రుల చదువు, పరిసరాల ప్రభావం ఉన్న పిల్లల్లో-
జ: ఎక్కువగా రెండో, మూడోతరాల వారుంటారు

 

15. రెండో, మూడో తరం అభ్యాసకుల ప్రజ్ఞ ఏ విధమైంది?
జ: కృత్రిమమైంది

 

16. తరగతి గదిలోని విద్యార్థులను వారి ప్రజ్ఞాస్థాయి ఆధారంగా ఎలా బోధించాలి?
జ: విడదీసి బోధించకూడదు

 

17. మొదటితరం అభ్యాసకులు ఎక్కువగా-
జ: గ్రామీణ ప్రాంతాలవారే

 

18. పరీక్షా ఫలితాలకు - విద్యార్థుల జ్ఞానసంపదకు లంకె పెట్టడం-
జ: సమంజసం కాదు

 

19. విద్యార్థుల్లో నైతికతను పెంచాలంటే ఉపాధ్యాయులు-
జ: పురాణ ఇతిహాసాల సారాన్ని కథలుగా చెప్పాలి

 

20. పిల్లల చదువు సంధ్యలపై ప్రభావం చేసేది ఏది?
జ: పిల్లల కుటుంబ పరిసరాలు - పాఠశాల పరిసరాలు

 

21. ప్రజల మన్ననలను అత్యధికంగా పొందాలనుకునే వ్యక్తి-
జ: ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌