• facebook
  • whatsapp
  • telegram

వాక్యాలు - రకాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. కొన్ని అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాలను ఏమంటారు?
జ: సంశ్లిష్టవాక్యం

 

2. 'లత పువ్వులు తెచ్చి, అమ్మింది' అనే వాక్యంలో ఉపవాక్యాల సంఖ్య
జ: 1

 

3. హేతువును తెలియజేసే వాక్యం
జ: క్త్వార్థకం

 

4. 'నవీన్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు' అనేది ఏ వాక్యం?
జ: శత్రర్థకం

 

5. భవిష్యత్కాలిక అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం
జ: చేదర్థకం

 

6. 'షరత్తు' మీద పనిచేసే వాక్యం
జ: చేదర్థకం

 

7. నా, ఇనా ప్రత్యయాల వల్ల ఏర్పడే వాక్యాలను ఏమంటారు?
జ: అప్యార్థకం

 

8. ఒకదానికి మరొకటి పరస్పర విరుద్ధంగా ఉండే వాక్యాలు
జ: అప్యార్థకం

 

9. 'లహరీ పాట పాడుతుంది, నాట్యం చేస్తుంది' అనేది సంయుక్త వాక్యంలో ఏ రకం?
జ: సంకల్ప సంబంధం

 

10. 'మంజరి డాక్టరో, యాక్టరో' అనేది సంయుక్త వాక్యంలో ఏ రకం?
జ: వికల్ప సంబంధం

 

11. 'నేను ప్రేమించాను కానీ ప్రేమించబడలేదు' అనేది ఏ రకమైన సంయుక్త వాక్యం?
జ: వైరుద్య సంబంధం

 

12. తే, ఇతే లాంటి ప్రక్రియలు కలిగిన వాక్యాలు
జ: చేదర్థకం

 

13. వర్తమానకాలిక అసమాపక క్రియను ఏమంటారు?
జ: శత్రర్థకం

 

14. కర్తరీ వాక్యంలో కర్మ ఏ విభక్తిలో ఉంటుంది?
జ: ద్వితీయా

 

15. కర్మణీ వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుంది?
జ: తృతీయా

 

16. 'బడు' ప్రత్యయంగా ఉన్న వాక్యం
జ: కర్మణీ వాక్యం

 

17. 'రాముడు సీతను పెండ్లాడాడు' ఈ కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చండి.
జ: సీత రాముడిచే పెండ్లాడబడింది.

 

18. 'ఉద్యోగం బాగా చదువుకొన్నవారిచే పొందబడెను' అనే కర్మణీ వాక్యాన్ని కర్తరీ వాక్యంగా రాయండి.
జ: బాగా చదువుకొన్న వారు ఉద్యోగం పొందారు.

 

19. ప్రత్యక్ష కథనం ఏ పురుషంలో ఉంటుంది?
జ: ఉత్తమ పురుషం

 

20. పరోక్ష కథనం ఏ పురుషంలో ఉంటుంది?
జ: ప్రథమ పురుషం

 

21. 'నావి మాటలు కావు. జీవితానుభవ సత్యాలు' అని మేడం చెప్పారు. దీన్ని పరోక్ష కథనంలోకి మార్చండి.
జ: తనవి మాటలుకావు జీవితానుభవ సత్యాలని మేడం చెప్పారు.

 

22. తాను, తన పేరు, తమ ఊరిపేరు అంతా ఒక్కటేనని మంజరి చెప్పింది. పై పరోక్ష కథనాన్ని ప్రత్యక్ష కథనంగా మార్చండి.
జ: 'నేను, నా పేరు, మా ఊరిపేరు అంతా ఒక్కటే' అని మంజరి చెప్పింది.

 

23. 'జీవనము బుద్బుధ ప్రాయము' అనే గ్రాంథిక వాక్యాన్ని వ్యవహారిక రూపంలోకి మార్చండి.
జ: జీవనం నీటిబుడగతో సమానం

 

24. 'అర్థములు నిత్యములు గావు' అనే గ్రాంథిక వాక్యాన్ని వ్యవహారిక రూపంలోకి మార్చండి.
జ: అర్థాలు నిత్యాలు కావు

 

25. 'అబద్ధం ఆడడం కన్నా మౌనం మేలు' అనే వ్యవహారిక రూపాన్ని గ్రాంథిక రూపంలోకి మార్చండి.
జ: అనృత మాడుట కంటే మౌనము మేలు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌