• facebook
  • whatsapp
  • telegram

తెలుగు సాహిత్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. శ్రీవాణీ గిరిజాశ్చిరాయదధతో.... అన్న ఆదిపద్యకర్త ఎవరు?
జ‌: నన్నయ

 

2. శారదరాత్రులుజ్జ్వల రసత్తర... అనే నన్నయ పద్యం కింది ఏ పర్వంలోనిది?
     ఎ) ఆదిపర్వం           బి) సభాపర్వం          సి) అరణ్యపర్వం          డి) ఉద్యోగపర్వం
జ‌: సి (అరణ్యపర్వం )

 

3. నన్నయ పూర్తిచేసిన పర్వాల సంఖ్య
జ‌: 2

 

4. ఆంధ్రకవితా విశారధుడు అని నన్నయను కీర్తించినవారు
జ‌: తిక్కన

 

5. 'ఆంధ్రకవితాగురుడు' అని నన్నయను కీర్తించినవారు
జ‌: మారన

 

6. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి.... పద్యరచయిత
జ‌: నన్నయ

 

7. భారత భారతీసముద్రము దరియంగనీదను... పద్యరచయిత
జ‌: నన్నయ

 

8. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... పద్యరచయిత
జ‌: నన్నయ

 

9. భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత
జ‌: శ్రీనాథుడు

 

10. బహువన పాదపాబ్ధికుల పర్వత... పద్య రచయిత
జ‌: నన్నయ

 

11. కిందివారిలో 'కవిరాక్షసుడు' అనే బిరుదు ఎవరిది?
     ఎ) వేములవాడ భీమకవి                      బి) నారాయణభట్టు
     సి) నన్నయ                                         డి) మారన
జ‌: ఎ (వేములవాడ భీమకవి )

 

12. తెలుగులో వెలసిన మొదటి ఛందోలక్షణ గ్రంథం
జ‌: కవిజనాశ్రయం

 

13. 'కవిజనాశ్రయుడు, శ్రావకాభరణుడు' అనే బిరుదు ఉన్న కవి
జ‌: మల్లియ రేచన

 

14. 'వార్తయందు జగము వర్థిల్లుచున్నది' అన్న మహాకవి ఎవరు?
జ‌: నన్నయ

 

15. నుతజల పూరితంబులగు నూతులు నూఱింటికంటె... పద్య రచయిత
జ‌: నన్నయ

 

16. నన్నెచోడుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
జ‌: 12

 

17. 'కవిరాజశిఖామణి' అనే బిరుదు ఎవరిది?
జ‌: నన్నెచోడుడు

 

18. నన్నెచోడుడు 'వస్తుకావ్యాబ్జరవి' అని ఎవరిని పొగిడాడు?
జ‌: వాల్మీకిని

 

19. 'జాను తెనుగు, వస్తుకవిత, దేశీయమార్గము' అనే శబ్దాలను ప్రయోగించినవారు
జ‌: నన్నెచోడుడు

 

20. ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినవారిలో ప్రథముడు
జ‌: నన్నెచోడుడు

 

21. కిందివారిలో శివత్రయంలో లేనివారు
      ఎ) పాల్కురికి సోమన                      బి) పండితారాధ్యుడు
      సి) నన్నెచోడుడు                            డి) మల్లికార్జున పండితుడు
జ‌: డి (మల్లికార్జున పండితుడు)

 

22. 'బసవపురాణం'లోని ఆశ్వాసాల సంఖ్య
జ‌: 6

 

23. పాల్కురికి సోమనాథుడి అలభ్యకృతి
జ‌: మల్లమదేవి పురాణం

 

24. పాల్కురికి సోమన 'అనుభవసారాన్ని' ఎవరికి అంకితం ఇచ్చారు?
జ‌: గొడగి త్రిపురాంతకుడు

 

25. వృషాధిపా శతకంలోని మకుటం
జ‌: బసవా! బసవా! బసవా! వృషాధిపా

 

26. తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువాదమైన సోమన రచన
జ‌: బసవ పురాణం

 

27. అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేయగల సమర్థుడు ఎవరు?
జ‌: పాల్కురికి సోమన

 

28. 'తెలుగు తోటలో తెలుగుకోసం, తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన కోకిల పాల్కురికి సోమన' అని ఎవరు అన్నారు?
జ‌: ఆరుద్ర

 

29. శివా, అజా, రుద్రా, మహేశా.... అనే మకుటంతో సాగే శతకం
జ‌: శివతత్త్వసారం

 

30. కిందివారిలో పండిత త్రయంలో లేనివారు
       ఎ) శ్రీపతి పండితుడు                                   బి) మంచన పండితుడు
       సి) మల్లికార్జున పండితుడు                          డి) పాల్కురికి
జ‌: సి (మల్లికార్జున పండితుడు)

 

31. 'నమశ్శివాయ' రగడను రచించింది
జ‌: చక్రపాణి రంగన

 

32. సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరు?
జ‌: యథావాక్కుల అన్నమయ్య

 

33. 'కావ్యాలంకార చూడామణి' అనే అలంకార గ్రంథ్రాన్ని రచించింది
జ‌: విన్నకోట పెద్దన

34. శ్రీరాముడి దయచేతను నారూఢిగ... అనే పద్యం గల శతకం
జ‌: సుమతీ

 

35. తిక్కన మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశాడు
జ‌: హరిహరనాథుడికి

 

36. తిక్కన అంకితం పొందిన గ్రంథం
జ‌: దశకుమార చరిత్ర

 

37. 'నానారసాభ్యుదయోల్లాసి' అని తిక్కన ఏ పర్వాన్ని పేర్కొన్నాడు?
జ‌: విరాట

 

38. కౌరవుల తరఫున పాండవుల వద్దకు మొదటిసారి రాయబారిగా వచ్చింది ఎవరు?
జ‌: సంజయుడు

 

39. 'తను గావించిన సృష్టి తక్కొరుల చేతగాదు' అని తిక్కనను పొగిడింది
జ‌: ఎర్రన

 

40. 'కవితఁజెప్పి ఉభయకవిమిత్రుమెప్పింపనరది బ్రహ్మకైన' అని చెప్పింది
జ‌: కేతన

 

41. 'అభినవ దండి' బిరుదు ఉన్న కవి
జ‌: కేతన

42. తెలుగులో వెలసిన మొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం
జ‌: ఆంధ్రభాషాభూషణం

 

43. మార్కండేయ పురాణం కృతిభర్త
జ‌: నాగయగన్నా

 

44. అష్టాదశ పురాణాల్లో 'మార్కండేయ పురాణం' ఎన్నోది?
జ‌: 7

 

45. మనుచరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానానికి మూలమైన పురాణం
జ‌: మార్కండేయ

 

46. కేయూర బాహుచరిత్ర గ్రంథకర్త ఎవరు?
జ‌: మంచన

47. రంగనాథ రామాయణం కృతిభర్త
జ‌: విఠల రంగనాథుడు

 

48. గోనబుద్దారెడ్డి కాలం
జ‌: 13వ శతాబ్దం

 

49. 'తల్లి సంస్కృతంబే యెల్ల భాషలకు' అని చెప్పింది
జ‌: కేతన

50. మంచన ఏ శతాబ్దానికి చెందిన కవి?
జ‌: 14

 

51. నన్నయభట్టు, తిక్కన కవినాథులు చూసిన త్రోవ పావనం.. అనే పద్య రచయిత ఎవరు?
జ‌: ఎర్రన

 

52. ఎర్రన అలభ్య రచన
జ‌: రామాయణం

 

53. 'శంభుదాసుడు మధ్యనాయకశ్రీ' అని వర్ణించింది
జ‌: చింతలపూడి ఎర్రన

 

54. 'పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరునిరేవ సూక్తి వైచిత్రినొక్కొక్కమాటు' అని అన్నది
జ‌: శ్రీనాథుడు

 

55. ఎర్రన హరివంశాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
జ‌: ప్రోలయ వేమారెడ్డి

 

56. భారతానికి పరిశిష్టగ్రంథం
జ‌: హరివంశం

 

57. తెలుగులో తొలి గోప కవిత్వం ఏ గ్రంథంలో కనిపిస్తుంది?
జ‌: హరివంశం

58. నాచన సోముడు ఏ శతాబ్దానికి చెందినవాడు?

జ‌: 14
 

59. నాచన సోముడి గ్రంథం
జ‌: ఉత్తర హరివంశం

 

60. సంవిధాన చక్రవర్తి, నవీనగుణసనాథుడు, సకల భాషాభూషణ తదితర బిరుదులు ఉన్న కవి
జ‌: సోమన

 

61. చంపూ పద్ధతిలో వెలువడిన మొదటి రామాయణం
జ‌: భాస్కర రామాయణం

 

62. కిందివారిలో సకల సుకవిజన వినుత యశస్కర బిరుదు గల కవి ఎవరు?
       ఎ) గోనబుద్దారెడ్డి                               బి) హుళ్లక్కి భాస్కరుడు
       సి) సోమన                                        డి) మల్లికార్జున భట్టు
జ‌: బి (హుళ్లక్కి భాస్కరుడు)

 

63. భాస్కర రామాయణ కృతిభర్త
జ‌: సాహిణిమారన

 

64. శ్రీనాథుడి చాటువులను సేకరించి 'శృంగార శ్రీనాథము' అని పేరు పెట్టింది ఎవరు?
జ‌: వేటూరి ప్రభాకరశాస్త్రి

65. శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించిన గ్రంథం
జ‌: మరుత్తరాట్చరిత్ర

 

66. వీరభద్రారెడ్డి దగ్గర ఆస్థాన కవి ఎవరు?
జ‌: శ్రీనాథుడు

 

67. నిండు జవ్వనములో రచంచిన ప్రౌఢ గ్రంథం
జ‌: శృంగారనైషధం

 

68. నూనూగుమీసాల నూత్నయౌవనంబులో శ్రీనాథుడు రచించిన గ్రంథం ఏది?
జ‌: కాశీఖండం

 

69. శ్రీనాథుడి 'పండితారాధ్య చరిత్ర' కృతిభర్త.
జ‌: ప్రెగడయ్య

 

70. హరవిలాసం కృతి భర్త
జ‌: అవచి తిప్పయ్యశెట్టి

 

71. కాశీఖండం గ్రంథానికి మూలం
జ‌: స్కందపురాణం

 

72. తెలుగులో వెలసిన మొదటి హేళన గ్రంథం
జ‌: క్రీడాభిరామం

73. కాశీఖండాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు?
జ‌: వీరభద్రారెడ్డి

 

74. సుకుమార చరిత్రకు ఉన్న మరో పేరు
జ‌: శివరాత్రి మహాత్మ్యం

 

75. ముమ్మడి శాంతయ్య అంకితం పొందిన గ్రంథం
జ‌: శివరాత్రి మహాత్మ్యం

 

76. దివిజ కవివరు గుండియలే దిగ్గురనగ......చాటువు రచయిత
జ‌: శ్రీనాథుడు

 

77. 'నా కవిత్వంబు నిజంబు కర్ణాట భాష' అన్నకవి
జ‌: శ్రీనాథుడు

 

78. భాగవతంలో పోతన అద్భుతంగా రచించిన స్కంధం ఏది?
జ‌: దశమ

 

79. భాగవతంలో ద్వాదశ స్కంధాన్ని ఎవరు రచించారు?
జ‌: వెలిగందలనారయ

 

80. భాగవతంలో ప్రథమస్కంధాన్ని రచించింది
జ‌: పోతన

81. 'పోతన తెలుగుల పుణ్యపేటి' అని పోతనను పొగిడింది ఎవరు?
జ‌: విశ్వనాథ సత్యనారాయణ

 

82. శ్రీ కైవల్యపదంబు చేరుటకై చింతించెదన్.. పద్య రచయిత
జ‌: పోతన

 

83. అలవైకుంఠపురములో నగరిలో... అనే పద్యాన్ని రాసింది ఎవరు?
జ‌: పోతన

 

84. మందార మకరంద మాధుర్యమును దేలు.. పద్య రచయిత ఎవరు?
జ‌: పోతన

 

85. జక్కన ఏ శతాబ్దానికి చెందిన కవి?
జ‌: 15

 

86. విక్రమార్క చరిత్ర కృతిభర్త
జ‌: వెన్నెలకంటి సిద్ధనామాత్యుడు

 

87. నాచికేతోపాఖ్యానము కృతికర్త
జ‌: దుగ్గన

 

88. బోజరాజీయము గ్రంథకర్త
జ‌: అనంతామాత్యుడు

89. బోజరాజీయము కృతిభర్త
జ‌: అహోబిలదేవుడు

 

90. 'ప్రతివాదమదగజ పంచానన' అనే బిరుదు గల కవి
జ‌: గౌరన

 

91. సింహాసన ద్వాత్రింశికలోని కథల సంఖ్య
జ‌: 32

 

92. సింహాసన ద్వాత్రింశిక కృతిభర్త
జ‌: హరిహరనాథుడు

 

93. పంచతంత్రాన్ని అంకితం పొందింది ఎవరు?
జ‌: బసవరాజు

 

94. కిందివాటిలో పిల్లలమర్రి పినవీరభద్రుడి కృతి ఏది?
       ఎ) శృంగార శాకుంతలం                           బి) పంచతంత్రం
       సి) ప్రమీలకథ                                        డి) చంద్రహాస చరిత్ర
జ‌: ఎ (శృంగార శాకుంతలం)

 

95. జైమినీ భరత కృతిభర్త
జ‌: సాళువ నరసింహరాయలు

96. తుళువ నరసరాయలు అంకితం తీసుకున్నపురాణం ఏది?
జ‌: వరాహపురాణం

 

97. 'శృంగార మంజరీ' అనే ద్విపద కావ్యాలను రచించింది ఎవరు?
జ‌: అన్నమయ్య

 

98. 'చప్పిడి పురాణం' అని ఏ పురాణానికి పేరు?
జ‌: వరాహపురాణం

 

99. 'కవితార్కిక కేసరి, వేదాంతా చార్య' అనే బిరుదు గల కవి
జ‌: పెద్దతిరుమలాచార్య

 

100. తెలుగులో వెలసిన మొదటి సంకలన గ్రంథం
జ‌: సకలనీతి శాస్త్రసమ్మతము

 

101. కిందివారిలో 'లీలావతి గణితం' గ్రంథకర్త ఎవరు?
        ఎ) అన్నమయ్య                                   బి) తాళ్లపాక తిమ్మక్క
        సి) తాళ్లపాక చిన్నన్న                          డి) పెద్ద తిరుమలాచార్యులు
జ‌: బి (తాళ్లపాక తిమ్మక్క)

 

102. 'అష్టభాషా చక్రవర్తి' అనే బిరుదు ఉన్న కవి ఎవరు?
జ‌: తాళ్లపాక చిన్నన్న

103. ఆముక్త మాల్యదలోని అశ్వాసాల సంఖ్య
జ‌: 7

 

104. శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తెలిపే గ్రంథం
జ‌: రాయవాచకం

 

105. విష్ణుచిత్తుని వృత్తాంతం, మాలదాసరి కథ లాంటివి ఉన్న ప్రబంధం ఏది?
జ‌: ఆముక్తమాల్యద

 

106. మార్కండేయపురాణం నుంచి స్వీకరించిన ప్రబంధం
జ‌: మనుచరిత్ర

 

107. పెద్దనవలె కృతిచెప్పిన పెద్దనవలె... అని అల్లసాని పెద్దనను కీర్తించింది ఎవరు?
జ‌: కవిచౌడప్ప

 

108. అల్లసాని పెద్దన అలభ్యగ్రంథం
జ‌: హరికథాసారం

 

109. పారిజాతాపహరణంలోని అశ్వాసాల సంఖ్య
జ‌: 5

 

110. పారిజాతాపహరణం కృతిభర్త
జ‌: శ్రీకృష్ణదేవరాయలు

111. పారిజాతాపహరణానికి మూలం
జ‌: హరివంశం

 

112. నంది తిమ్మన బిరుదు
జ‌: సకల విద్యా వివేక చతురుడు

 

113. ఎదురైనచో తన మదకరీంద్రము... పద్య రచయిత
జ‌: అల్లసాని పెద్దన

 

114. అనవిని వేటు వడ్డ యురగాంగన.... పద్య రచయిత ఎవరు?
జ‌: నంది తిమ్మన

 

115. నత్కీరుని కథ, సాలెపురుగు - పాములకథ, వశిష్టుడి వృత్తాంతం కలిగిన ప్రబంధం
జ‌: శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం

 

116. ధూర్జటి బిరుదు
జ‌: సాహిత్యశ్రీవర

 

117. స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనీ అనే పద్యాన్ని రచించింది ఎవరు?
జ‌: శ్రీకృష్ణదేవరాయలు

 

118. శ్రీకాళహస్తీశ్వరా మహాత్మ్యానికి మూలం
జ‌: స్కందపురాణం

119. రాజుల్ మత్తుల్ వారిసేవ నరక ప్రాయంబు.... పద్య రచయిత ఎవరు?
జ‌: ధూర్జటి

 

120. రాజశేఖర చరిత్ర కృతిభర్త
జ‌: మల్లన

 

121. రామాభ్యుదయం ఎన్ని అశ్వాసాల గ్రంథం?
జ‌: 8

 

122. సకల కథాసార సంగ్రహం కృతికర్త
జ‌: రామభద్రుడు

 

123. కావ్యాలంకార సంగ్రాహానికి మరో పేరు
జ‌: నరసభూపాలీయం

 

124. వసుచరిత్ర ఎన్ని ఆశ్వాసాల కావ్యం?
జ‌: 6

 

125. వసుచరిత్రను అంకితం పొందిన వారు
జ‌: ఆరవీటి తిరుమలరాయలు

 

126. వసుచరిత్రకు మూలం
జ‌: ఆంధ్రమహాభారతం

127. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య..... పద్య రచయిత ఎవరు?
జ‌: భట్టుమూర్తి

 

128. తెలుగు పద్యాల్లోని సత్తా తెలుసుకోవాలంటే వసుచరిత్ర చదవాలి అని చెప్పింది ఎవరు?
జ‌: కట్టమంచి రామలింగారెడ్డి

 

129. 'అల్లసాని అటు ఇటు ఏడ్చెను, తిమ్మన ముద్దుముద్దుగా ఏడ్చెను, భట్టుమూర్తి బావురమని ఏడ్చెను' అని చెప్పిన కవి
జ‌: తెనాలి రామలింగడు

 

130. 'రవి కాంచనిచో కవి కాంచునేగదా' అనే చాటువు చెప్పినకవి
జ‌: భట్టుమూర్తి

 

131. సూక్తిమతికోలాహల వృత్తాంతం, గిరికావసు రాజుల వృత్తాంతం ఉన్న కావ్యం
జ‌: వసుచరిత్ర

 

132. 'గరుడపురాణం' ఎవరి అలభ్య రచన
జ‌: పింగళిసూరన

 

133. తెలుగులో వెలసిన మొదటి ద్వర్థికావ్యం
జ‌: రాఘవ పాండవీయం

 

134. 'ఆకువీటి పెద్ద విరూపేశ్వరుడు' అంకితం పొందిన గ్రంథం
జ‌: రాఘవపాండవీయం

135. ఆ జాబిల్లి వెలుగు వెల్లికలు డాయంగలేర్ అనే పద్య రచయిత ఎవరు?
జ‌: భట్టుమూర్తి

 

136. 'కుమార భారతి' బిరుదు ఎవరికి ఉంది?
జ‌: తెనాలి రామలింగడు

 

137. పాండురంగ మహాత్మ్యానికి మూలం
జ‌: స్కందపురాణం

 

138. నిగమశర్మ కథ, పుండరీకుని కథ కలిగిన ప్రబంధం
జ‌: పాండురంగ మహాత్మ్యం

 

139. పాండురంగ మహాత్మ్యంలో దేని గురించి వర్ణించారు?
జ‌: తుంగభద్ర

 

140. పాండురంగ మహాత్మ్యం కృతిభర్త
జ‌: వీరూరి వేదాద్రి

 

141. ఉద్భటారాధ్య చరిత్రను అంకితం పొందినవారు
జ‌: ఊర దేచయ్య

 

142. కన్నాకటిలేదు గాని కంతుడవన్నా చాటువు రచయిత?
జ‌: తెనాలిరామలింగడు

143. 'రెండురెళ్ల ఆరు' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి

 

144. తెలుగులో వెలసిన మొదటి యక్షగానం
జ‌: సుగ్రీవ విజయం

 

145. సుగ్రీవ విజయాన్ని కిందివారిలో ఎవరికి అంకితం ఇచ్చారు?
         ఎ) సోమేశ్వరుడు                                 బి) జనార్దనస్వామి
         సి) కాసె సర్వప్ప                                 డి) సంకుసాలన్నసింహ కవి
జ‌: బి (జనార్దనస్వామి)

 

146. తెలుగులో వెలసిన మొదటి అచ్చు తెనుగు కావ్యం
జ‌: యయాతి చరిత్ర

 

147. యయాతి చరిత్రను అంకింతం పొందినవారు
జ‌: అమీరుఖాను

 

148. 'వైజయంతీ విలాసా'నికి ఉన్న మరో పేరు
జ‌: యయాతి చరిత్ర

 

149. 'లింగమగుంట తిమ్మకవి' రచించిన గ్రంథం ఏది?
జ‌: సులక్షణిసారం

150. 'అభినవ వాగన శాసనుడు' బిరుదు గల కవి
జ‌: కూచిమంచి తిమ్మకవి

 

151. 'నీలా సుందరి పరిణయం, అచ్చతెనుగు రామాయణం' గ్రంథాలను రచించింది ఎవరు?
జ‌: కూచిమంచి తిమ్మకవి

 

152. 'సుభద్రా పరిణయం' గ్రంథకర్త
జ‌: కూచిమంచి జగ్గకవి

 

153. 'ఆంధ్ర చంద్రాలోకము, కవిజనరంజనం' గ్రంథాలను రచించింది ఎవరు?
జ‌: అడిదం సూరకవి

 

154. ఉత్తర రామాయణం, విష్ణుమాయా విలాసం (యక్షగానం) గ్రంథాల రచయిత
జ‌: కంకంటి పాపరాజు

 

155. రాధికా స్వాంతనమునకు ఉన్న మరో పేరు
జ‌: ఇళయాదేవీయము

 

156. 'నీతులు బూతులు లోక ఖ్యాతులు' అని చెప్పిన కవి ఎవరు?
జ‌: కవి చౌడప్ప

 

157. 'నలయాదవ రాఘవ పాండవీయం' గ్రంథకర్త
జ‌: మరిగంటి సింగరాచార్యులు

158. 'శబ్ద శాసన, ఆశుకవి ప్రతివాద భయంకర' బిరుదు పొందిన కవి ఎవరు?
జ‌: మరిగంటి సింగరాచార్యులు

 

159. 'వాల్మీకి చరిత్ర' గ్రంథ రచయిత
జ‌: రఘునాథ నాయకుడు

 

160. 'అభినవ భోజుడు, అభినవ శ్రీకృష్ణదేవరాయలు' బిరుదు ఉన్న కవి ఎవరు
జ‌: రఘునాథ నాయకుడు

 

161. రఘునాథ భూపాలుడి కొలువు కూటమిని ఏమని పిలుస్తారు?
జ‌: ఇందిర మందిరం

 

162. విజయ విలాసం కృతిభర్త
జ‌: రఘునాథ నాయకుడు

 

163. కిందివారిలో ఉషాపరిణయం, సంగ్రహ భారతం, సంగ్రహ రామాయణం గ్రంథాలను రచించింది ఎవరు?
         ఎ) ముద్దు పళణి                                       బి) రంగాజమ్మ
         సి) చేమకూర వేంకటకవి                           డి) రఘునాథ నాయకుడు
జ‌: బి (రంగాజమ్మ)

164. రంగాజమ్మ బిరుదు
         ఎ) పదకవితా విశారద                         బి) అష్టభాషా కవితా విశారదా
         సి) సర్వంకషమనీషావ శేషశారద          డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

 

165. అపర శ్రీకృష్ణదేవరాయలు బిరుదాంకితుడు ఎవరు?
జ‌: విజయ రాఘవుడు

 

166. 'శ్లేషకవి చక్రవర్తి' బిరుదు ఉన్న కవి
జ‌: చేమకూర వేంకటకవి

 

167. 'మధురావిజయం' కృతికర్త
జ‌: గంగాదేవి

 

168. విజయ రాఘవుడి కొలువు కూటమి పేరు
జ‌: రాజగోపాల విలాసం

 

169. 'కవిమిత్ర' బిరుదు ఎవరికి ఉంది?
జ‌: పుష్పగిరి తిమ్మన

170. 'కువలయాశ్వ చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ‌: సవరంచిన నారాయణరాజు

171. లింగనముఖి కామేశ్వర కవి బిరుదు ఎవరిది?
జ‌: తిరుకాసు కవి

 

172. 'సత్యభామాసాంత్వనము' గ్రంథకర్త
జ‌: లింగనముఖి కామేశ్వర కవి

 

173. 'సారంగధర చరిత్ర' గ్రంథకర్త
జ‌: సుముఖం వేంకటకృష్ణప్ప

 

174. 'తారాశశాంకం' గ్రంథ రచయిత
జ‌: శేషము వేంకటపతి

 

175. శహాజీ బిరుదు ఎవరిది?
జ‌: అభినవ భోజరాజు

 

176. 'అష్టభాషా విశారద' బిరుదు ఉన్న కవి ఎవరు?
జ‌: నివర్తి శేషాచలపతి

 

177. ఘటికాచల మహాత్మ్యానికి పీఠిక రాసింది ఎవరు?
జ‌: వేంకటకవి

 

178. 'పంచరత్నకవి' బిరుదాంకితుడు ఎవరు?
జ‌: శరభోజి

179. 'సంగీత సారామృతం' గ్రంథకర్త
జ‌: తులజాజీ

 

180. శుకసప్తతిలోని కథల సంఖ్య
జ‌: 70

 

181. 'శుకస్తతి'కి మూలం
జ‌: కథా సరిత్యాగరం

 

182. 'శుకసప్తతి' కృతిభర్త
జ‌: శ్రీరాముడు

 

183. అంపశయ్య రచన ఎవరిది?
జ‌: నవీన్

 

184. నుదురుపాటి వెంకన్న రచించిన అచ్చతెనుగు నిఘంటువు
జ‌: ఆంధ్రభాషా వర్ణవం

 

185. కిందివాటిలో కాకమాని మూర్తికవి రచన ఏది?
         ఎ) ఉషాపరిణయం                                 బి) బహుళాశ్వ చరిత్ర
         సి) చంద్రికా పరిణయం                           డి) రాజవాహన విజయం
జ‌: డి (రాజవాహన విజయం)

186. 'అల్లసాని వానియల్లిక బిగిసొంపు, ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకు, పాండురంగ సుకవి పద్యంబు హరువును' అని కవితా లక్షణాలు చెప్పినకవి
జ‌: కాకమాని మూర్తికవి

 

187. అక్కమహాదేవి చరిత్రను రచించింది ఎవరు?
జ‌: బాల పాపాంబ

 

188. 'కవిజనమనోరంజనం' గ్రంథ రచయిత
జ‌: అడిదం సూరకవి

 

189. 'చంద్రికా పరిణయం' గ్రంథ రచయిత
జ‌: సురభి మాధవరాయులు

 

190. 'నాద బ్రహ్మం' బిరుదు ఎవరిది?
జ‌: త్యాగయ్య

 

191. 'ప్రహ్లాద భక్త విజయం' గ్రంథ రచయిత
జ‌: త్యాగయ్య

 

192. 'ఎంతనేర్చిన, ఎంతజూచిన ఎంతవారలైనా'... సంకీర్తనా రచయిత ఎవరు?
జ‌: రామదాసు

193. పలుకే బంగారమాయనా కోదండపాణి... రచయిత ఎవరు?
జ‌: త్యాగయ్య

194. 'వరదయ్య' మారుపేరుగా ఉన్న సంకీర్తనాచార్యుడు
జ‌: క్షేత్రయ్య

 

195. పద సంగీత పితామహుడు బిరుదాంకితుడు
జ‌: క్షేత్రయ్య

 

196. తేనెసోక నోరు తీయనగు రీతిలో కవిత్వం ఉండాలని చెప్పింది...
జ‌: మొల్ల

 

197. వేమన బిరుదు
       ఎ) ప్రజాకవి            బి) ఆంధ్రకబీరు         సి) లోకకవి             డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

 

198. ఆదికాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో మహాకవులు అని అన్నది ఎవరు?
జ‌: శ్రీశ్రీ

 

199. ఎరుకగలుగువాడే ఎచ్చయిన కులజుడు అనే పద్యాన్ని రచించింది ఎవరు?
జ‌: వేమన

 

200. క్షేత్రయ్య తెలుగులో చెప్పిన పదాల సంఖ్య
జ‌: 4000

201. కాలజ్ఞానం, గోవింద వాక్యాలు లాంటి అద్వైతాలను బోధించినవారు
జ‌: పోతులూరి వీరబ్రహ్మం

 

202. నీతి శతకాలలో ప్రౌఢమైనది
జ‌: భాస్కరా శతకం

 

203. తెలుగులో వెలసిన తొలి దృష్టాంత శతకం ఏది?
జ‌: భాస్కరా శతకం

 

204. 'పెదబాలశిక్ష'ను రచించింది ఎవరు?
జ‌: పూదూరు సీతారామశాస్త్రి

 

205. 'కాశీమజిలీ కథలు' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ‌: మధుర సుబ్బన దీక్షితులు

 

206. 'నిరాఘంట వచోదురంధరుడు' బిరుదు గల కవి ఎవరు?
జ‌: శంకర కవి

 

207. రామరాజీయానికి ఉన్న మరో పేరు
జ‌: నరపతి విజయం

 

208. ప్రౌఢ వ్యాకరణం, కవి జీవితాలు, కన్యాశుల్క నాటకం గ్రంథాలను ఎవరికి అంకితం ఇచ్చారు?
జ‌: ఆనంద గజపతి

209. తెలుగు సాహిత్యంలో 'సంధియుగము' అంటే ఎన్నో శతాబ్దం
జ‌: 19

 

210. తెలుగులో వెలసిన తొలి సాహిత్య పత్రిక
జ‌: సుజన రంజని

 

211. చిన్నయసూరి రచించిన అసంపూర్ణ వ్యాకరణ గ్రంథం
జ‌: పద్యాంధ్రవ్యాకరణం

 

212. ప్రౌఢ వ్యాకరణానికి ఉన్న మరో పేరు
జ‌: త్రిలింగ లక్షణ

 

213. బాల వ్యాకరణానికి 'రమణీయం' అనే వ్యాఖ్యానం రచించింది ఎవరు?
జ‌: దువ్వూరి వేంకటరమణశాస్త్రి

 

214. వీరేశలింగం పంచతంత్రములో పూరించిన భాగం

జ‌: విగ్రహ తంత్రము
 

215. 'షోడశ కుమార చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ‌: వెన్నెలకంటి అన్నయామాత్యుడు

 

216. చిన్నయసూరి పద్యాంధ్ర వ్యాకరణానికి మూలగ్రంథం ఏది?
జ‌: ఆంధ్రశబ్ద చింతామణి

217. కొక్కొండం వెంకటరత్న పంతులు స్థాపించిన పత్రిక ఏది?
జ‌: ఆంధ్రభాషా సంజీవిని

 

218. మహాశ్వేత నవల గ్రంథకర్త ఎవరు?
జ‌: కొక్కొండం వెంకటరత్నం

 

219. కొక్కొండం వెంకటరత్న పంతులు బిరుదు ఏది?
జ‌: ఆంధ్రభాషా జాన్సన్

 

220. బృహతంత్రాన్ని అంకితం పొందిన వారు
జ‌: రాబర్ట్ మెకంజీ

 

221. కందుకూరి వీరేశలింగాన్ని అభినవాంధ్ర ఆద్యబ్రహ్మ అని ప్రశంసించింది ఎవరు?

జ‌: ఆరుద్ర
 

222. సరస్వతీనారద సంవాదం, ఆంధ్రకవుల చరిత్ర తదితర రచనలను రచించింది ఎవరు?
జ‌: కందుకూరి వీరేశలింగం

 

223. కందుకూరి వీరేశలింగం పరిశోధనా శక్తికి తార్కాణం
జ‌: ఆంధ్రకవుల చరిత్ర

 

224. కందుకూరి వీరేశలింగం రచించిన జీవిత చరిత్ర
          ఎ) జీసస్ చరిత్ర                             బి) రామమోహన్‌రాయ్ చరిత్ర
          సి) విక్టోరియా మహారాణి చరిత్ర        డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

225. 'గలివర్స్ ట్రావెల్స్' ఆధారంగా కందుకూరి వీరేశలింగం రచించిన కావ్యం ఏది?
జ‌: సత్యరాజా పూర్వ దేశయాత్రలు

 

226. కందుకూరి వీరేశలింగం రచించిన శతకం ఏది?
జ‌: మార్కండేయ శతకం

 

227. 'అభినవాంధ్రకు ఆయన ఆధ్యబ్రహ్మ, ఆధునిక కవులకు పూజనీయుడు' అని కందుకూరి వీరేశలింగాన్ని కీర్తించింది ఎవరు?
జ‌: కడియాల రామమోహన్‌రావు

 

228. షేక్‌స్పియర్ రచించిన 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నాటకాన్ని ఏ పేరుతో అనువదించారు?
జ‌: చమత్కార రత్నావళి

 

229. 'నవయుగ వైతాళికుడు' బిరుదు ఉన్న కవి
జ‌: గురజాడ అప్పారావు

 

230. కిందివాటిలో గురజాడ అప్పారావు కథానిక
        ఎ) కొండు బట్టీయం           బి) బిల్హనీయం            సి) కన్యాశుల్కం               డి) దిద్దుబాటు
జ‌: డి (దిద్దుబాటు)

 

231. కన్యాశుల్కం నాటక కృతిభర్త
జ‌: ఆనంద గజపతిరాజు

232. తెలుగులో వెలసిన తొలి సాంఘిక, వ్యవహారిక భాషలో వెలువడిన నాటకం
జ‌: కన్యాశుల్కం

 

233. గిరీశం, మధురవాణి, అవధానులు పాత్రలు ఉన్న నాటకం
జ‌: కన్యాశుల్కం

 

234. బాల్యవివాహాల మీద గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక కథాకావ్యం
జ‌: పూర్ణమ్మ

 

235. 'మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడ రెండు కులములు' అని అన్నది
జ‌: గురజాడ అప్పారావు

 

236. అడుగు జాడ గురజాడది అది భావికి బాట అని చెప్పింది.
జ‌: శ్రీశ్రీ

 

237. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును... అన్నది 
జ‌: గురజాడ అప్పారావు

 

238. ఆధునిక వాల్మీకి అనే బిరుదు ఎవరికి కలదు 
జ‌: గురజాడ అప్పారావు

 

239. 'బుద్ధచరిత్ర'ను అంకితం పొందినవారు
జ‌: పోలవరపు జమీందారు

240. శ్రీదేవీ భాగవతం, శ్రవణానందం, పాండవోద్యోగ విజయాలు తదితర గ్రంథాలు రాసినవారు
జ‌: తిరుపతి వేంకటకవులు

 

241. తిరుపతి వేంకటకవులు పద్యరూపంలో రచించిన స్వీయచరిత్ర
జ‌: జాతకచర్య

 

242. 'లైట్ ఆఫ్ ఏసియా' గ్రంథానికి అనువాద గ్రంథం ఏది?
జ‌: బుద్ధ చరిత్ర

 

243. జెండాపై కపిరాజు పద్యరచయిత
జ‌: తిరుపతి వేంకటకవులు

 

244. అలుగుటయే యెరుంగని.. పద్య రచయిత
జ‌: తిరుపతి వేంకటకవులు

 

245. తొలకరి, పాలస్తహృదయం, సంక్రాంతి, గుడిగంటలు తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ‌: రాయప్రోలు సుబ్బారావు

 

246. పింగళి కాటూరి కవిత్వంలో నిక్కంపు నీలములున్నవి తళుకుబెళుకు రాళ్లులేవు అని ప్రశంసించింది ఎవరు?
జ‌: విద్వాన్‌విశ్వం

 

247. ఆధునిక యుగంలో వెలసిన ఉద్ధాత్త కావ్యాల్లో విశిష్టమైనవి
జ‌: సౌందరనందనం

248. అభినవ కవికుల గురువు, కోకిలస్వామి బిరుదులు ఉన్న కవి
జ‌: రాయప్రోలు సుబ్బారావు

 

249. 'భావకవిత్వము' అని పేరు పెట్టింది
జ‌: గాడిచర్ల హరిసర్వోత్తమరావు

 

250. టెన్నిసను రాసిన 'డోరా' కావ్యాన్ని ఏ పేరుతో రాయప్రోలు సుబ్బారావు అనువదించారు?
జ‌: అనుమతి

 

251. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా రాయప్రోలు రచించిన గ్రంథం
జ‌: అనుమతి

 

252. ఏ దేశమేగినా ఎందుకాలిడినా... గేయ రచయిత ఎవరు?
జ‌: రాయప్రోలు సుబ్బారావు

 

253. అమరావతి నగరంలో బౌద్ధుల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు?
జ‌: రాయప్రోలు సుబ్బారావు

 

254. 'గోల్డ్‌స్మిత్' రాసిన 'హెర్మిట్‌'ను సుబ్బారావు ఏ పేరుతో అనువదించారు?
జ‌: లలిత

 

255. ఆంధ్రాషెల్లీ, ఆంధ్రాకీట్స్, భావకవితా భాస్కరుడు బిరుదులు ఉన్న కవి ఎవరు?
జ‌: కృష్ణశాస్త్రి

256. బలిపీఠం గ్రంథ రచయిత
జ‌: ముప్పాళ రంగనాయకమ్మ

257. దుఃఖానికి, నిరాశకు ప్రతీకమైన కృష్ణశాస్త్రి కావ్యం ఏది?
జ‌: కృష్ణపక్షం

 

258. 'శుక్లపక్షం' గ్రంథ రచయిత
జ‌: అనంతం రామలింగ పంతులు

 

259. కృష్ణశాస్త్రి ఊహా సుందరి
జ‌: ఊర్వశి

 

260. నేను శోకభీకర తిమిర లోకైక పతిని అని చెప్పుకున్న కవి ఎవరు?
జ‌: కృష్ణశాస్త్రి

 

261. 'దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి' అన్న కవి
జ‌: కృష్ణశాస్త్రి

 

262. కృష్ణశాస్త్రి మరణించినప్పుడు షెల్లీ మళ్లీ మరణించాడు అని చెప్పింది ఎవరు?
జ‌: శ్రీశ్రీ

 

263. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ, శ్రీశ్రీ బాధ' అని చెప్పింది ఎవరు?
జ‌: చలం

264. 'సెలయేటి గానం' గ్రంథ రచయిత
జ‌: బసవరాజు అప్పారావు

 

265. శిథిలాలయమ్ములో శివుడు లేడోయి... గేయ రచయిత
జ‌: కృష్ణశాస్త్రి

 

266. కొల్లాయి కడితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి వాక్యం రచించినవారు
జ‌: బసవరాజు అప్పారావు

 

267. విశ్వనాథ సత్యనారాయణ బిరుదు ఏది?
జ‌: కవిసామ్రాట్

 

268. నర్తనశాల, అనార్కలి, త్రిశూలం, సాప్తిక ప్రళయం లాంటి నాటకాలను రచించింది ఎవరు?
జ‌: విశ్వనాథ సత్యనారాయణ

 

269. కిందివాటిలో విశ్వనాథ సత్యనారాయణ శతకం ఏది?
          ఎ) మాస్వామి శతకం                                  బి) కుప్పుస్వామి శతకం
          సి) చీపురుపుల్ల శతకం                               డి) విసనకర్ర శతకం
జ‌: ఎ (మాస్వామి శతకం)

270. విశ్వనాథ సత్యనారాయణ రచించిన విమర్శనా గ్రంథాలు
          ఎ) అల్లసాని వాని అల్లిక జిగిబిగి                బి) నన్నయ గారి ప్రసన్న కథా కవితార్థయుక్తి
          సి) ఒకడు నాచన సోమన                        డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

 

271. విశ్వనాథ సత్యనారాయణ మొదటి నవల ఏది?
జ‌: అంతరాత్మ

 

272. తెలుగులో వచ్చిన మొదటి కాల్పనిక నవల ఏది?
జ‌: ఏకవీర

 

273. 'విశ్వనాథ' వారి 'ఆంధ్రపశస్తి' కావ్యాన్ని అంకితం పొందినవారు ఎవరు?
జ‌: మల్లంపల్లి సోమశేఖర శర్మ

 

274. 'రామాయణ విషవృక్షం' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: ముప్పాళ్ల రంగనాయకమ్మ

 

275. విశ్వనాథవారు కోడాలి ఆంజనేయులుతో కలిసి సత్యాంజనేయులు పేరుతో రచించిన గ్రంథం
         ఎ) రాధ                              బి) ఆడపిల్ల
         సి) సన్యాసి                          డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

276. 'ఋషితుల్యుడైన నన్నయ రెండో వాల్మీకి' అని చెప్పింది

జ‌: విశ్వనాథ సత్యనారాయణ
 

277. 'దేశం పట్టనంతటి మహాకవి' అని విశ్వనాథ వారిని పొగిడింది ఎవరు?
జ‌: మల్లాది కృష్ణశాస్త్రి

 

278. అల నన్నయకు లేదు తిక్కనకు లేదు బోగస్మామదృశుండల..... పద్య రచయిత ఎవరు?
జ‌: విశ్వనాథ సత్యనారాయణ

 

279. విశ్వనాథవారి 'కిన్నెరసాని' రచనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అన్నదెవరు?
జ‌: శ్రీశ్రీ

280. కృషీవలుడు, పుష్పబాణవిలాసం, కవిరాయబారం, రుతు సంహారం తదితర గ్రంథాల రచయిత ఎవరు?
జ‌: దువ్వూరి రామిరెడ్డి

 

281. మాతృశతకం, మిత్రార్థశతకాన్ని రచించింది ఎవరు?
జ‌: దువ్వూరి రామిరెడ్డి

 

282. అడవి బాపిరాజు ఊహాసుందరి
జ‌: శశికళ

 

283. అడవి బాపిరాజు సంపాదకత్వం వహించిన పత్రిక ఏది?
జ‌: మీజా

284. భారత స్వాతంత్రోద్యమ ప్రశక్తి ఉన్న బాపిరాజు నవల ఏది?
జ‌: నారాయణరావు

 

285. 'లేపాక్షి బసవయ్య లేచి రావయ్య' అనే గేయ రచయిత
జ‌: అడవి బాపిరాజు

 

286. సవర భాషపై ప్రయోగాలు చేసి 'ఎమాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్‌'ను రచించింది ఎవరు?
జ‌: గిడుగురామ్మూర్తి

 

287. వ్వవహారిక భాషలో రచించిన తొలి శతకం 
జ‌: భారతీ శతకం

 

288. తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామ్మూర్తి వారి పుట్టిన రోజు)ఎప్పుడు?
జ‌: ఆగస్టు 29

 

289. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి
జ‌: నండూరి వేంకటసుబ్బారావు

 

290. నండూరి సుబ్బారావు అద్భుత కావ్యం
జ‌: ఎంకి పాటలు

 

291. 'భగ్న హృదయం' స్మృతికావ్యం ఎవరి రచన?
జ‌: దువ్వూరి రామిరెడ్డి

292. 'బాపూజీ' స్మృతికావ్యం ఎవరి రచన?
జ‌: గుర్రం జాషువా

 

293. 'హంస ఎగిరిపోయింది' ఎవరి రచన?
జ‌: కుందుర్తి ఆంజనేయులు

294. సంగీత, సాహిత్య, నాట్య సంకేతాల సలక్షణంగా కనిపించే పుటపర్తి నారాయణాచార్యుల రచన ఏది?
జ‌: శివతాండవం

 

295. విశ్వనాథ సత్యనారాయణ 'ఏకవీర' నవలను మళయాలంలోకి అనువదించింది ఎవరు?
జ‌: పుటపర్తి నారాయణాచార్యులు

 

296. కిందివాటిలో పుటపర్తి నారాయణాచార్యుల రచన ఏది?
         ఎ) అమృతం కురిసినరాత్రి                     బి) విరికన్నె
         సి) మేఘదూతం                                  డి) శివరాత్రి ప్రభ
జ‌: సి (మేఘదూతం)

 

297. అనుభూతి ప్రధానం గల కవి
జ‌: తిలక్

 

298. 'నా దేశాన్ని గురించి పాడలేను' అని అన్నది ఎవరు?
జ‌: తిలక్

299. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని అన్నది
జ‌: తిలక్

300. 'నవ్యసాహిత్యమాల' పత్రికకు సంపాదకత్వం వహించినవారు
జ‌: విద్వాన్ విశ్వం

301. విద్వాన్ విశ్వం రచించిన రాయలసీమ ప్రాంత కన్నీటి గాథ ఏది?
జ‌: పెన్నేటిపాట

302. 'కవికొండల వేంకటరావు' బిరుదు
జ‌: ఆంధ్రా వర్డ్స్‌వర్త్

303. 'గడ్డపరక' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ‌: కవికొండల వేంకటరావు

304. కవితా విశారద, మధుర శ్రీనాథ, కవికోకిల బిరుదులు ఉన్న కవి
జ‌: గుర్రం జాషువా

305. గుర్రం జాషువా స్వీయచరిత్ర
జ‌: నా కథ

306. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన జాషువా కావ్యం ఏది?
జ‌: క్రీస్తు చరిత్ర

307. ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు.... పద్యరచయిత
జ‌: గుర్రం జాషువా

308. గుర్రం జాషువా ఎవరితో కలిసి జంట కవిత్వం చెప్పారు?
జ‌: దీపాల పిచ్చయచౌదరి

309. అభినవ తిక్కన బిరుదు ఉన్న కవి
జ‌: తుమ్మల సీతారామమూర్తి చౌదరి

310. రాష్ట్రగానం, ధర్మజ్యోతి, ఉదయగానం, తెనుగు నీతి తదితర గ్రంథాలు రచించిన కవి ఎవరు?
జ‌: తుమ్మల సీతారామమూర్తి

311. రామలింగేశ్వర శతకం రచించింది
జ‌: తుమ్మల సీతారామమూర్తి

312. గాంధీ మహాత్ముడి చరిత్రను 'మహాత్మకథ'గా స్వతంత్ర కావ్యంగా రచించింది ఎవరు?
జ‌: తుమ్మల సీతారామమూర్తి

313. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బిరుదు ఏది?
జ‌: నవయుగ చక్రవర్తి

314. 'అనుభవాలు - జ్ఞాపకాలు' ఎవరి ఆత్మకథ?
జ‌: తుమ్మల సీతారామమూర్తి

315. శ్రీపాద వారి నవలలో మొదటిది ఏది?
జ‌: మిధునానురాగం

316. ఆంధ్రాస్కాట్, ఆంధ్రామిల్టన్ బిరుదులు ఉన్న కవి?
జ‌: చిలకమర్తి

317. చిలకమర్తి వారి హాస్య నవల
జ‌: గణపతి

318. చిలకమర్తి వారు రచించిన అద్భుత నాటకం
జ‌: గయోపాఖ్యానం

319. 'చిలకమర్తి వారు హాస్యానికి, కరుణానికీ పొత్తు కుదిర్చారు' అని ప్రశంసించినవారు
జ‌: మునిమాణిక్యం నరసింహరావు

320. చింతామణి నవలా పోటీల్లో మొదటి బహుమతి పొందిన నవల ఏది?
జ‌: రామచంద్ర విజయం

321. కిందివారిలో ఆంధ్రా అడిసన్, ఆంధ్రా షేక్‌స్పియర్, ఆంధ్రా కాళిదాసు అనే బిరుదులు ఉన్న కవి ఎవరు?
        ఎ) చిలకమర్తివారు                                          బి) కట్టమంచి వారు
        సి) పానుగంటి వారు                                        డి) మొక్కపాటి నరసింహారావు
జ‌: సి (పానుగంటి వారు)

322. సారంగధర, విప్రనారాయణ, పాదుకాపట్టాభిషేకం తదితర నాటకాలు రచించిన వారు
జ‌: పానుగంటివారు

323. ఎడిసన్ ప్రకటించిన స్పెక్టేటర్ ప్రేరణతో పానుగంటివారు రచించింది
జ‌: సాక్షివ్యాసాలు

324. నాటకాల్లో 'కన్యాశుల్కం' ఎట్టిదో గద్యరచనల్లో 'సాక్షి' అటువంటిది అని చెప్పింది
జ‌: మధునాపంతుల సత్యనారాయణ

325. భావకవిత్వానికి మార్గదర్శకంగా వెలువడిన కట్టమంచి వారి కావ్యం
జ‌: ముసలమ్మ మరణం

326. కట్టమంచి వారు కవిత తత్త్వ విచారములో విమర్శించిన గ్రంథం
జ‌: కళాపూర్ణోదయం

327. మొక్కపాటి నరసింహారావు రచించిన ఏకాంకిక
జ‌: మొక్కుబడి

328. ప్రజల మనిషి నవల రచయిత ఎవరు?
జ‌: వట్టికోట ఆళ్వారుస్వామి

329. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు ......
జ‌: శ్రీశ్రీ

330. 'మార్కిజాన్ని కథా సాహిత్యంలోకి ప్రవేశ పెట్టింది నేనే' అని చెప్పుకున్నది ఎవరు?
జ‌: చాగంటి సోమయాజులు

331. కుంకుడాకు, దుమ్మల గొండి, కుక్కుటేశ్వరం తదితర గ్రంథాలను రచించిన కవి
జ‌: చాగంటి సోమయాజులు

332. సంగీత రత్నాకర, సంగీత కళానిధి, గానకళా సింధూ, గానకళా ప్రపూర్ణ బిరుదులు గల కవి
జ‌: రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ

333. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ రచించిన విమర్శనా గ్రంథం
జ‌: వేమన

334. 'నిగమశర్మ అక్క' లాంటి ప్రద్ధ వ్యాసాన్ని రచించింది
జ‌: రాళ్లపల్లివారు

335. నార్ల వేంకటేశ్వరరావు తన నాటికలను ఏ పేరుతో వెలువరించాడు?
జ‌: కొత్తగడ్డ

336. నార్ల వేంకటేశ్వరరావు సంపాదకీయ వ్యాసం
జ‌: మూడు దశాబ్దాలు

337. వేదం వేంకట్రాయశాస్త్రి బిరుదు
జ‌: అపరమల్లినాథుడు

338. నాగానందం, బొబ్బిలియుద్ధం, ఉత్తర రామచరిత్ర తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ‌: వేదం వెంకట్రాయశాస్త్రి

339. సౌభద్రుడి ప్రణయయాత్ర, మాతృగీతాలు, విషాదమోహనం తదితర గ్రంథాలను రచించింది
జ‌: నాయని సుబ్బారావు

340. ఎవడా క్రూరకర్ముడెవడు, నీలజలద నిర్ముక్తశైశిర.... రచించిన వారు ఎవరు?
జ‌: నాయని సుబ్బారావు

341. తెలుగులో మొదట కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కావ్యం ఏది?
జ‌: ఆంధ్రుల సాంఘికచరిత్ర

342. 'ఇదా స్వరాజ్యం' ఖండకావ్యం రచించింది
జ‌: పుండరీకాక్షుడు

343. కవిసార్వభౌమ, కవిసింహ, కావ్య, కళానిధి బిరుదులు ఉన్న కవి
జ‌: దర్భాక రాజశేఖర శతావధాని

344. కొమ్మర్రాజు లక్ష్మణరావు తెలుగువారికి అందించిన గొప్పకావ్యం
జ‌: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం

345. 'రుధిరజ్యోతి' గ్రంథ రచయిత
జ‌: శ్రీరంగం నారాయణబాబు

346. 'కవిత్వంలోనే అరాచకవాది, సాహిత్యంలోనే విప్లవకారుడు' అని నారాయణ బాబు గురించి చెప్పింది ఎవరు?
జ‌: ఆరుద్ర

347. తెలుగులో చిత్ర వచన కవిత్వానికి ఆద్యుడు
జ‌: తిక్కవరపు పట్టాభి

348. పిడేలు రాగాల డజనుకు ఇంట్రో రాసినవారు
జ‌: శ్రీశ్రీ

349. 'చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను' అని చెప్పింది
జ‌: పట్టాభి సీతారామయ్య

350. 'అనుసరిస్తాను నవీన పంథా కానీ భావకవిని కాను అహంభావ కవిని' అని చెప్పింది
జ‌: పట్టాభి సీతారామయ్య

351. 'శ్రీనాథ కవితా సామ్రాజ్యం' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: గడియారం వేంకటశేషశాస్త్రి

352. గడియారం వేంకటశేషశాస్త్రి బిరుదులు
         ఎ) కవితావతంస           బి) కవిసింహ          

         సి) అవధాన పంచానన          డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

353. చెట్టు నా ఆదర్శం, మృత్యువృక్షం, చిలుకలు వాలిన చెట్టు తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ‌: ఇస్మాయిల్

354. కిందివాటిలో కుందుర్తి ఆంజనేయులు ఆత్మకథ ఏది?
         ఎ) తెలంగాణ                                     బి) నయాగార
         సి) నగరంలో వాన                             డి) బతుకుమాట
జ‌: డి (బతుకుమాట)

355. కుందుర్తి ఆంజనేయులు వారి ఏ రచనకు సోవియట్‌ల్యాండ్ అవార్డు లభించింది.
జ‌: నగరంలో వాన

356. 'వచనకవితా పితామహుడు' బిరుదు ఉన్న కవి
జ‌: కుందుర్తి ఆంజనేయులు

357. నెహ్రూ అవార్డు పొందిన కుందుర్తి వారి రచన
జ‌: నాలోనినాదాలు

358. 'పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం' అని చెప్పింది
జ‌: కుందుర్తి ఆంజనేయులు

359. 'కూనలమ్మ పదాలు' గ్రంథ రచయిత
జ‌: ఆరుద్ర

360. ఆరుద్ర, శ్రీశ్రీతో కలసి రచించిన శతకం
జ‌: కుక్కుటేశ్వర శతకం

361. ఆరుద్ర రచించిన 'త్వమేవహం'కు లఘుటిప్పణి రచించింది
జ‌: శ్రీశ్రీ

362. 'కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను' అన్న కవి ఎవరు?
జ‌: ఆరుద్ర

363. సోమసుందర్ సంపాదకత్వం వహించిన పత్రిక
జ‌: కళాకేళి

364. సోమసుందర్ రచనల్లో సుప్రసిద్ధమైంది

జ‌: వజ్రాయుధం

365. కాశ్మీరపట్టమహిషి నవలా రచయిత
జ‌: పిలకా గణపతిశాస్త్రి

366. కిందివారిలో ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోజనాలు సిద్ధాంత గ్రంథాన్ని రచించింది ఎవరు?
        ఎ) సినారె              బి) శ్రీశ్రీ            

       సి) నాళం కృష్ణారావు               డి) ఆరుద్ర
జ‌: ఎ (సినారె)

 

367. 'నాళం కృష్ణారావు' బిరుదు
జ‌: మధురకవి

368. 'సర్పయాగం' గ్రంథ రచయిత
జ‌: రెంటాల గోపాలకృష్ణ

 

369. ఆంధ్రకల్హణ, సాహితీ సామ్రాట్ బిరుదు గల కవి
జ‌: మదునా పంతుల సత్యనారాయణ

370. మధునా పంతుల సత్యనారాయణ అద్భుత కావ్యం
జ‌: ఆంధ్ర పురాణం

371. 'నవమి చిలుక, విష్ణు ధనువు' తదితర గ్రంథాలు రచించిన కవి
జ‌: శిష్ట్లా ఉమామహేశ్వరరావు

372. 'తెలుగు పద్యంలో జిలుగుదనం, మెత్తదనం ఉన్నంతకాలం కరుణ శ్రీవాణి చిరంజీవి' అని అన్నది
జ‌: జి.వి. సుబ్రహ్మణ్యం

373. పుష్ప విలాపం, కుంతీకుమారి, పాకిపిల్ల తదితర గ్రంథాలను రచించింది
జ‌: జంధ్యాల పాపయ్య

374. శివశంకర శాస్త్రి ఖండ కావ్యం
జ‌: హృదయేశ్వరి

375. 'దీపావళి' గ్రంథ రచయిత
జ‌: వేదుల సత్యనారాయణ

376. కిందివారిలో 'వైతాళికులు' గ్రంథ రచయిత
         ఎ) పురిపండల అప్పలస్వామి                       బి) వేదుల సత్యనారాయణ
         సి) ముద్దుకృష్ణ                                             డి) తెన్నేటి సూరి
జ‌: సి (ముద్దుకృష్ణ)

 

377. పులిపంజా గ్రంథ రచయిత
జ‌: పురిపండల అప్పలస్వామి

 

378. 'అరుణ రేఖలు' గ్రంథ రచయిత
జ‌: తెన్నేటి సూరి

379. 'అగ్నివీణ' గ్రంథ రచయిత
జ‌: అనిసెట్టి సుబ్బారావు

 

380. 'తాజ్‌మహల్ పడగొట్టండోయ్' గ్రంథ రచయిత
జ‌: ఆలూరి బైరాగి

 

381. 'గుడిసెలు కాలిపోతున్నాయి' గ్రంథ రచయిత
జ‌: బోయి భీమన్న

382. ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించినవారు
జ‌: దేవులపల్లి రామానుజరావు

383. 'అశోక సామ్రాట్' అనే నాటకాన్ని రచించింది ఎవరు?
జ‌: ఆత్రేయ

 

384. నండూరి రామ్మోహనరావు రచించిన వ్యంగ్య వ్యాసం ఏది?
జ‌: ఆశ నిరాశ

385. కొడవటిగంటి కుటుంబరావు రచించిన నవలల్లో ముఖ్యమైంది
జ‌: చదువు

386. వావి కొలను సుబ్బారావు బిరుదు ఏది?
జ‌: ఆంధ్రా వాల్మీకి

387. 'కప్పతల్లి పెళ్లి' గ్రంథ రచయిత
జ‌: చావలి బంగారమ్మ

388. తిరుపతి వేంకట కవుల 'కవితా వైభవం' గ్రంథ రచయిత
జ‌: జి.వి. సుబ్రహ్మణ్యం

389. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంథ రచయిత
జ‌: బండారు అచ్చమాంబ

 

390. 'స్వర్ణకమలాలు' గ్రంథ రచయిత
జ‌: ఇల్లిందుల సరస్వతి దేవి

391. 'అపశృతి' గ్రంథ రచయిత
జ‌: బెళ్లూరి శ్రీనివాసమూర్తి

392. విప్రనారాయణ చరిత్రను రచించింది ఎవరు?
జ‌: చదలవాడ మల్లన

 

393. 'మహాశ్వేత' గ్రంథ రచయిత
జ‌: స్ఫూర్తి శ్రీ

394. 'ఈ జంట నగరాలు - హేమంత శిశిరాలు' రచయిత ఎవరు?
జ‌: ఉత్పల సత్యనారాయణ

395. 'ఉదయని' గ్రంథ రచయిత
జ‌: గంగినేని వేంకటేశ్వరరావు

396. 'ఉద్యమం నెలబాలుడు' రచించినవారు
జ‌: శివసాగర్

397. 'నా చెల్లి చంద్రమ్మ' రచించిన వారు
జ‌: శివసాగర్

398. కిందివాటిలో జయధీర్ తిరుమలరావు రచన ఏది?
         ఎ) ఏరువాక              బి) కవి సమయాలు             సి) అరణ్యనేత్రం            డి) కవితావిపంచి
జ‌: సి (అరణ్యనేత్రం)

399. 'సంసారవృక్షం' గ్రంథ రచయిత
జ‌: ఆర్.ఎస్. సుదర్శనం

400. 'కవి సమయాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: ఇరివెంటి కృష్ణమూర్తి

401. 'తెలుగు జానపద గేయ గాథలు' గ్రంథ రచయిత
జ‌: నాయని కృష్ణకుమారి

402. బుచ్చిబాబు రచించిన మనో వైజ్ఞానిక నవల ఏది?
జ‌: చివరకు మిగిలేది

403. 'పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను' అని చెప్పింది ఎవరు?
జ‌: శ్రీశ్రీ

404. 'ఉదయిని' గ్రంథ రచయిత
జ‌: కొంపెల్ల జనార్దనరావు

405. 'జలపాతం' అనే అభ్యుదయ గ్రంథ రచయిత

జ‌: సినారె

406. 'రుద్రవీణ' గ్రంథ రచయిత

జ‌: దాశరథి కృష్ణమాచార్యులు

407. విప్లవ రచయితల సంఘం తొలి కవితా సంకలనం
జ‌: ఝంఝు

408. శ్రీశ్రీ రచించిన విప్లవ గ్రంథం
జ‌: మరో ప్రస్థానం

409. 'స్వేచ్ఛ' అనే విప్లవ కవితా సంపుటిని రచించింది
జ‌: వరవరరావు

410. భావ కవిత్వాన్ని దిక్‌దిగంతాలకు వ్యాపింపచేసిన వాడు
జ‌: కృష్ణశాస్త్రి

411. 'తూర్పు గాలి', 'జైల్లో సముద్రం' రచనలు ఎవరివి?
జ‌: నగ్నముని

412. 'వందేమాతరం' గ్రంథ రచయిత
జ‌: చెరబండరాజు

413. 'నన్నెక్కనివ్వండి - బోను' గ్రంథ రచయిత
జ‌: చెరబండరాజు

414. తొలి స్త్రీ వాద కవయిత్రి
జ‌: రేవతీదేవి

415. తెలుగులో తొలి స్త్రీవాద సంకలనం
జ‌: గురిచూసి పాడేపాట

416. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటిపైనా మా నాన్న పేరే అని చెప్పిన రచయిత్రి 
జ‌: విమల

417. మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందన్నది
జ‌: నిర్మల

418. 'అల్పాక్షరాలతో అనల్వార్థ రచన' చేసిన కవిత
జ‌: బందిపోట్లు

419. 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడిది' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: జయప్రభా

420. 'హృదయానికి బహువచనం' గ్రంథ రచయిత
జ‌: కొండేపూడి నిర్మల

421. 'తాళికట్టిన మృగం' గ్రంథ రచయిత
జ‌: తుర్లపాటి రాజేశ్వరి

422. 'ఆకురాలు కాలం' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: మహేజాబీన్

423. 'జానకి విముక్తి' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: రంగనాయకమ్మ

424. 'మా కొద్దీ నల్ల దొరతనం' అంటూ పంచముల పక్షాన గొంతెత్తి చాటిన వారు
జ‌: కుసుమ ధర్మన్న

425. కొలకలూరి ఇనాక్ రచించిన గ్రంథం
జ‌: ఊరబావి

426. దాశరథి రంగాచార్యులు రచించిన గ్రంథం
జ‌: చిల్లర దేవుళ్లు

427. 'శేషజ్యోత్స్న' గ్రంథ రచయిత
జ‌: గుంటూరు శేషేంద్ర శర్మ

428. దర్భాక రాజశేఖర శతావధాని రచించిన గ్రంథం
జ‌: రాణాప్రతాప సింహ

429. కిందివాటిలో కొడాలి వేంకట సుబ్బారావు రచించిన గ్రంథం ఏది?
         ఎ) అరుణరేఖలు                                బి) శ్రీగాంధీ భారతం
         సి) హంపీ క్షేత్రం                                 డి) ఆగస్టు గేయాలు
జ‌: సి (హంపీ క్షేత్రం)

430. 'చెయ్యెత్తి జై గొట్టు తెలుగోడా, గతమెంతో గణకీర్తి గలవాడా' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: వేములపల్లి శ్రీకృష్ణ

431. శ్రీనాథుడు ద్విపదలో రచించిన కావ్యం
జ‌: పల్నాటి వీరచరిత్ర

432. గౌరన రచించిన ద్విపద కావ్యం ఏది?
జ‌: హరిశ్చంద్రోపాఖ్యానం

433. తాళ్లపాక చిన్నన్న రచించిన ద్విపద కావ్యాలు
         ఎ) అష్టమహిషీకళ్యాణం                               బి) ఉషా పరిణయం
         సి) అన్నమాచార్య చరిత్ర                              డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

434. ముకుంద యోగి రచించిన ద్విపద కావ్యం
జ‌: శ్రీరంగ మహాత్మ్యం

435. కందుకూరి వీరేశలింగం రచించిన ద్విపద ఏది?
జ‌: సత్యా ద్రౌపదీ సంవాదం

436. 'హైకూ' కవిత్వం ఏ దేశం నుంచి తెలుగులోకి అనువాదమైంది.
జ‌: జపాన్

437. 'హైకూ'ని మొదట తెలుగులోకి అనువదించింది ఎవరు?
జ‌: ఇస్మాయిల్

438. కాశీనాథుని నాగేశ్వరరావు కింద ఇచ్చిన ఏ నవలకు పీఠికను రాశారు?
       ఎ) ధూమరేఖ          బి) హిమబిందు                 

సి) వేయిపడగలు            డి) మాలపల్లి
జ‌: డి (మాలపల్లి)

439. 'సుగ్రీవ విజయం' యక్షగానం రచించింది ఎవరు?
జ‌: కందుకూరి రుద్రకవి

440. పసుపులేటి రంగాజమ్మ రచించిన యక్షగానం
జ‌: మన్నారుదాసు విలాసం

441. 'ఆంధ్రయక్షగాన వాజ్ఞ్మయ చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ‌: ఎస్వీ. జోగారావు

442. 'అక్కమహాదేవి చరిత్ర' యక్షగాన కర్త
జ‌: టేకుమళ్ల రంగశాయి

443. పొన్నగంటి తెలగన రచించన కావ్యం
జ‌: యయాతి చరిత్ర

444. శుద్ధాంధ్ర భారత సంగ్రహం, శుద్ధాంద్ర రామాయణ సంగ్రహం ఇతర గంథ్రాల కర్త ఎవరు?
జ‌: వీరేశలింగం పంతులు

445. 'నీలా సుందరి పరిణయము' రచించింది ఎవరు?
జ‌: కూచిమంచి తిమ్మకవి

446. కిందివారిలో 'ఆంధ్రనామ శేషము' అచ్చ తెలుగు నిఘంటువును ఎవరు రచించారు?
         ఎ) కస్తూరి రంగకవి                                      బి) పైడిపాటి లక్ష్మణకవి
         సి) అడిదము సూరకవి                                డి) గణవరపు వేంకటకవి
జ‌: సి (అడిదము సూరకవి)

447. 'ఆంధ్రనామ సంగ్రహము' నిఘంటువు కర్త
జ‌: పైడిపాటి లక్ష్మణకవి

448. 'శతక వాఞ్మయ బ్రహ్మ'గా పేరు పొందింది ఎవరు?
జ‌: పాల్కురికి సోమన

449. సంస్కృతంలో మయూరుడు రచించిన శతకం ఏది?
జ‌: సూర్యశతకం

450. 'ఆంధ్రశతక సాహిత్య వికాశము' అనే పరిశోధనా గ్రంథకర్త ఎవరు?
జ‌: గోపాలకృష్ణారావు

451. తెలుగులో వెలసిన మొదటి శృంగార శతకం ఏది?
జ‌: వేంకటేశ్వర

452. దువ్వూరి రామిరెడ్డి రచించిన శతకం
జ‌: మాతృశతకం

453. 'క్రైస్తవ శతక' కర్త ఎవరు?
జ‌: జాన్ సుందరరావు

454. వీర నారాయణ, ముకుంద శతకాలను రచించింది ఎవరు?
జ‌: రావూరి సంజీవకవి

455. 'శారదాపతి శతకం'ను రచించింది ఎవరు?
జ‌: జొన్నలగడ్డ శారదాంబ

456. తెన్నేటి నారాయణ శర్మ రచించిన శతకం ఏది?
జ‌: మృత్యుంజయ శతకం

457. హంసలదీవి వేణుగోపాల శతకం, ఆంధ్రనాయకశతకం, మానవబోధ శతకాలు రచించింది ఎవరు?
జ‌: కాసుల పురుషోత్తమకవి

458. 'ఆరోగ్య కామేశ్వరీ శతకం' రచించింది
జ‌: చెళ్లపిల్ల వేంకటశాస్త్రి

459. కుప్పుస్వామి శతకాన్ని రచించింది ఎవరు?
జ‌: త్రిపురనేని రామస్వామి చౌదరి

460. 'హరబ్రహ్మేశ్వర' కవులు రచించిన శతకం
జ‌: విసనకర్ర శతకం

461. 'ఆంధ్ర నాటక చరిత్ర పితామహుడు' అని ఎవరిని అంటారు?
జ‌: కోలాచలం శ్రీనివాస్

462. తొలి సాంఘిక నాటకం 'నందక రాజ్యం'ను రచించింది ఎవరు?
జ‌: వావిలాల వాసుదేవ శాస్త్రి

463. మంజరీ మధుకరము, వేణీసంహారము అనే నాటకాలను రచించింది ఎవరు?
జ‌: కోరాడ రామచంద్రశాస్త్రి

464. 'నాగానందం' నాటకాన్ని రచించింది ఎవరు?
జ‌: వేదం వెంకటరాయశాస్త్రి

465. కిందివారిలో పానుగంటి లక్ష్మీనరసింహం రచించిన నాటకం ఏది?
        ఎ) విప్రనారాయణ చరిత్ర                             బి) పాదుకాపట్టాభిషేకం
        సి) రాధాకృష్ణ                                              డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

466. చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకాలు ఏవి?
         ఎ) కీచక వద           బి) గయోపాఖ్యానం           సి) ప్రహ్లాద చరిత్ర              డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

467. 'శంబూక వధ' ఎవరి ప్రసిద్ధ నాటకం?
జ‌: త్రిపురనేని రామస్వామి చౌదరి

468. నారాయణరెడ్డి ప్రసిద్ధ నాటకం ఏది?
జ‌: నవ్వని పువ్వు

 

469. 'ఆంధ్రనాటక పితామహ' అనే బిరుదు ఉన్న కవి ఎవరు?
జ‌: ధర్మవరం కృష్ణమాచార్య

470. తెలుగులో రాసిన తొలి చారిత్రక నాటకం ఏది?
జ‌: ప్రతాపరుద్రీయం

471. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన నాటకం ఏది?
జ‌: రాజరాజు

472. మిక్కిలి రాధాకృష్ణమూర్తి రచించిన ప్రసిద్ధ నాటకం
జ‌: నటరత్నాలు

473. మృచ్ఛకటికం, ముద్రారాక్షసం లాంటి అద్భుత నాటకాలను రచించింది
జ‌: తిరుపతి వేంకటకవులు

 

474. కాల్వానికోద్యమ ప్రభావంతో వెలువడిన తొలి చారిత్రక నవల ఏది?
జ‌: ఏకవీర

475. నైషధ పారిజాతాన్ని రచించింది ఎవరు?
జ‌: కృష్ణాధ్వరి

476. 'రాఘవ యాదవ పాండవీయము' అనుత్య్రర్థి కావ్య రచయిత
జ‌: నెల్లూరి వీరరాఘవ కవి

477. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్యానము రచించింది ఎవరు?
జ‌: యలకూచి బాలసరస్వతి

478. 'ఆముక్తమాల్యదకు 'సంజీవనీ' అనే పేరుతో వ్యాఖ్యానం రచించినవారు ఎవరు?
జ‌: వేదం వేంకటరాయశాస్త్రి

479. 'వాల్మీకి రామాయణా'నికి మంధరం అనే పేరుతో వ్యాఖ్యానం చేసినవారు ఎవరు?
జ‌: వావికొలను సుబ్బారావు

480. విశ్వనాథుని స్థానాపతి రచించిన వచన కావ్యం
జ‌: రాయవాచకం

481. తుపాకుల అనంతభూపాలుడు రచించిన వచన కావ్యం ఏది?
జ‌: విష్ణుపురాణం

482. 'కృష్ణరాయ విజయాన్ని' రచించింది ఎవరు?
జ‌: కుమార ధూర్జటి

483. 'మధురా విజయము'ను రచించిన కవి
జ‌: గంగాదేవి

484. ముద్దుపళణి రచించిన గ్రంథం
జ‌: రాధికాసాంత్వనము

485. 'వాశిష్టరామాయణం' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ‌: తరిగొండ వెంగమాంబ

486. 'మిత్రవిందా పరిణయము' గ్రంథ రచయిత
జ‌: శేషాంబ

487. 'మాధవ శతకము'ను రచించింది ఎవరు?
జ‌: వేమూరి శారదాంబ

488. 'కవిత్వ తత్వవిచారము' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ‌: కట్టమంచి రామలింగారెడ్డి

489. 'సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు' రచించింది ఎవరు?
జ‌: జి.వి. సుబ్రహ్మణ్యం

490. 'సాహిత్య మొర్మారాలు' రచించింది ఎవరు?
జ‌: తాపీ ధర్మారావు

491. మొదలి నాగభూషణ శర్మ రచించిన సాహిత్యవిమర్శనా గ్రంథం ఏది?
జ‌: తెలుగు నవలావికాసం

492. 'గురజాడ కవికాడు' సాహిత్య విమర్శనా గ్రంథం ఎవరిది?
జ‌: పొట్లపల్లి సీతారామరావు

493. 'హరికథా వాఞ్మయం' గ్రంథ రచయిత ఎవరు?

జ‌: తూమాటి దోణప్ప

494. 'మొక్కుబడి' ఏకాంకిక ఎవరి రచన?
జ‌: మొక్కపాటి నరసింహశాస్త్రి

495. కిందివాటిలో తిరుమల రామచంద్ర రచన ఏది?
         ఎ) వెన్నెలవాడ              బి) తీరని బాకీ        

 సి) చెప్పుడు మాటలు            డి) అప్సరస
జ‌: సి (చెప్పుడు మాటలు)

496. కథానికలను ప్రోత్సహించిన పత్రిక
జ‌: ఆంధ్రపత్రిక

497. కథక చక్రవర్తి అని పేరు పొందినవారు ఎవరు?
జ‌: చింతా దీక్షితులు

498. 'దిద్దుబాటు'కు ఉన్న మరో పేరు
జ‌: కమలిని

499. మెటిల్డా, మీపేరేమిటి, పెద్దమసీదు కథానికలు రచించింది ఎవరు?
జ‌: గురాజాడ అప్పారావు

500. ముగ్గురు బిచ్చగాళ్లు, మాక్సీదుర్గంలో కుక్క లాంటి కథలను రచించింది ఎవరు?
జ‌: విశ్వనాథ సత్యనారాయణ

501. తల్లావజ్జల శివశంకరశాస్త్రి రచించిన కథలు ఏవి?
జ‌: మురారి కథలు

502. ఓ పువ్వు పూసింది కథ ఎవరిది?
జ‌: చలం

503. 'ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి' రచించిన గ్రంథం ఏది?
జ‌: విజయదశమి

504. 'పరబ్రహ్మం' అనే కథను రచించింది ఎవరు?
జ‌: మధురాంతకం రాజారాం

505. కిందివాటిలో తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన కథలు ఏవి?
         ఎ) గోడల్లేని జైలు        బి) ఎర్ర జెండాలు    

 సి) పాపికొండలు          డి) మావూరి కథలు
జ‌: ఎ (గోడల్లేని జైలు)

506. జనతా ఎక్స్‌ప్రెస్ కథ ఎవరిది?
జ‌: ముళ్లపూడి వెంకటరమణ

507. యశోదారెడ్డి రచించిన కథలు ఏవి?
జ‌: మావూరి ముచ్చట్లు

508. 'అరచేతిలో గీత' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: పులికంటి కృష్ణారెడ్డి

509. కిందివాటిలో సత్యం శంకరమంచి రచించిన కథ ఏది?
         ఎ) యజ్ఞకథ                                                  బి) పరిచితరేఖ
         సి) అమరా కథలు                                          డి) సృష్టిరహస్యం
జ‌: సి (అమరా కథలు)

510. వ్యాసానికి మొదట ఉన్న పేర్లు
         ఎ) ప్రమేయం               బి) సంగ్రహం                

సి) ఉపన్యాసం         డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

511. కిందివారిలో తొలి వ్యాస రచయిత్రి ఎవరు?
        ఎ) పోతం జానకమ్మ       బి) జానకీరాణీ          

  సి) బీనాదేవి             డి) అచ్చమాంబ
జ‌: ఎ (పోతం జానకమ్మ)

512. 'తెలుగు మెరుగులు' వ్యాసాలను రచించింది.
జ‌: వేటూరి ప్రభాకర్ శాస్త్రి

513. 'సారస్వత సౌరభం' పుస్తకాన్ని రచించింది ఎవరు?
జ‌: జి.వి. సుబ్రహ్మణ్యం

514. సింగిరెడ్డి నారాయణ రెడ్డి రచించిన గ్రంథం ఏది?
జ‌: వ్యాసవాహిని

515. 'భానుమతీ రామకృష్ణ' రచించిన కథలు
జ‌: అత్తగారి కథలు

516. 'భద్రిరాజు కృష్ణమూర్తి' రచించిన పరిశోధనా గ్రంథం ఏది?
జ‌: తెలుగు భాషా చరిత్ర

517. తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని రచించిన వారు ఎవరు?
జ‌: బిరుదరాజు రామరాజు

518. 'ఆంధ్ర నవలా పరిణామం'ను రచించింది ఎవరు?
జ‌: బి.వి. కుటుంబరావు

519. 'తెలుగు కథానిక స్వరూప స్వభావాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: పోరంకి దక్షిణామూర్తి

520. ఆదిభట్ల నారాయణదాసు రచించిన స్వీయచరిత్ర
జ‌: నాఎరుక

521. 'హంపి నుంచి హరప్పా దాకా' స్వీయ చరిత్రను రచించింది ఎవరు?
జ‌: తిరుమల రామచంద్ర

522. కిందివాటిలో ఉప్పల లక్ష్మణరావు రచించిన స్వీయ చరిత్ర ఏది?
         ఎ) బతుకుమాట                                   బి) బతుకు పుస్తకం
         సి) రాళ్లు - రప్పలు                                డి) నాకథలు
జ‌: బి (బతుకు పుస్తకం)

523. నటస్థానం ఎవరి స్వీయచరిత్ర?
జ‌: స్థానం నరసింహారావు

524. గురజాడ శ్రీరామమూర్తి రచించిన జీవిత చరిత్ర
జ‌: కవి జీవితాలు

525. తిక్కన సోమయాజి జీవిత చరిత్రను రచించింది ఎవరు?
జ‌: చిలకూరి వీరభద్రారావు

526. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన లేదా స్థాపించిన పత్రిక ఏది?
జ‌: జ్వాల

527. కిందివాటిలో మరుగంటి సింగరాచార్యులు బిరుదు ఏది?
        ఎ) గౌతమి కోకిల                                          బి) కళామూర్తి
        సి) శతఘంటావధాన                                    డి) అభినవ పోతన
జ‌: సి (శతఘంటావధాన)

528. భమిడిపాటి కామేశ్వరరావు బిరుదు ఏది?
జ‌: హాస్య బ్రహ్మ

529. కావ్యాలంకార చూడామణి రచించింది ఎవరు?
జ‌: విన్నకోట పెద్దన

530. ఆంధ్రభాషా వర్ణము రచించింది ఎవరు?
జ‌: నుదురుపాటి వెంకన్న

531. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము రచించింది
జ‌: ఖండవిల్లి లక్ష్మీరంజనం

532. తెలుగులో తొలి చారిత్రక నవల
జ‌: శ్రీ రంగరాజు చరిత్ర

533. కొక్కొండం వెంకట రత్నం పంతులు రచించిన నవల
జ‌: మహాశ్వేత

534. కిందివాటిలో తెన్నేటి సూరి రచించిన నవల ఏది?
        ఎ) టిప్పుసుల్తాన్                                    బి) రెండు మహానగరాలు
        సి) పాతాళభైరవి                                     డి) ప్రపుల్లముఖి
జ‌: బి (రెండు మహానగరాలు)

535. రామచంద్ర విజయం, గణపతి, హేమలత, కర్పూరమంజరీ తదితర నవలలు రాసింది ఎవరు?
జ‌: చిలకమర్తి లక్ష్మీనరసింహం

536. మాలపల్లి నవలకు ఉన్న మరో పేరు ఏది?
జ‌: సంగవిజయం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌