1. 'విజ్ఞాన శాస్త్రం కంటె మిన్న అయింది, అద్భుతమైంది, మానవుడి నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంశనీయమైంది, ప్రదర్శించదగినదే గణితం' అని నిర్వచించినవారు
జ: బెంజిమన్ ఫ్రాంక్లిన్
2. 'గణితశాస్త్ర ఫలితాలు సరైనవి, సరికానివి అనే రెండు వర్గాలుగానే ఉంటాయి. పరిస్థితులు, వ్యక్తులు, వ్యవస్థలను బట్టి అవి మారవు'. ఇది గణితశాస్త్ర ఏ స్వభావాన్ని తెలుపుతుంది?
జ: కచ్చితత్వం
3. కిందివాటిలో గణిత స్వభావం
i. హేతువాదం ii. సరిచూసే పద్ధతి iii. నమూనాల అధ్యయన శాస్త్రం iv. వివరణాత్మకం
జ: i, ii, iii
4. కిందివాటిలో తార్కికవాదాన్ని తెలియజేసే గ్రంథం
1) గ్రండ్లా గెన్‌డెర్ మేథమెటికా 2) అరిథ్‌మెటికా
3) ఆక్టా మేథమెటికా 4) ప్రిన్స్‌పియా మేథమెటికా
జ: 4 (ప్రిన్స్‌పియా మేథమెటికా)
5. 'సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం' అని నిర్వచించినవారు (డీఎస్‌సీ - 2012)
జ: ఫ్రాన్సిస్ బేకన్
6. విద్యార్థి 1 నుంచి 20 వరకు సంఖ్యల కారణాంకాలను పరిశీలించిన పిదప 'ప్రతి సహజసంఖ్యకు '1' తప్పకుండా కారణాంకం అవుతుంది' అని నిర్ధరించడాన్ని ఏమంటారు?
జ: ఆగమన హేతువాదం
7. Mathematics అనే పదం ఏ గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది?
జ: Manthanein, Techne
8. తార్కికవాదాన్ని ప్రచారం చేసినవారు
జ: బెర్ట్రాండ్ రస్సెల్, ఎ.ఎన్. వైట్‌హెడ్
9. సాంప్రదాయక వాదాన్ని ప్రచారం చేసినవారు
జ: డేవిడ్ హిల్‌బర్ట్
10. విద్యార్థుల్లో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య
జ: గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయడం
11. 'గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇలాంటి ప్రయత్నం వల్ల నష్టపోదు అని నేను దృఢంగా చెప్పగలను' అని పేర్కొన్న వ్యక్తి?
జ: డబ్ల్యు.గ్లైషర్
12. పంచ సిద్ధాంతిక (Panch Siddantika) గ్రంథ రచయిత ఎవరు?
జ: వరాహమిహిర
13. యూక్లిడ్‌కి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
i. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ii. కరణీయ సంఖ్యలు
iii. ఆధునిక గణిత పితామహుడు iv. పైథాగరియన్ త్రికాలు
జ: i, ii, iv
14. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
i. సిద్ధాంత శిరోమణి - భాస్కరాచార్య
ii. ఆర్యభట్టీయం - ఆర్యభట్ట
iii. డిస్‌కోర్స్ ఆన్ మెథడ్ - రెనె డెకార్టె
iv. ది మెథడ్ - అరిస్టాటిల్
జ: ఏదీకాదు
15. కిందివాటిలో రామానుజన్ సంఖ్య ఏది?
1) 1769 2) 1729 3) 1739 4) 1749
జ: 2 (1729)
16. ఆర్యభట్ట ప్రకారం Π విలువ ఎంత?
జ: 3.1416
17. 'ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం' అని ఎవరు సిద్ధాంతీకరించారు?
జ: పైథాగరస్
18. సహజ జ్ఞానవాదం ప్రకారం గణిత స్వభావం ఏది?
i. గణితం అంతా తర్కమే.
ii. గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ.
iii. గణితం తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది.
iv. గణిత భావనలన్నీ మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి.
జ: ii, iii, iv
19. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఎవరి పేరు పెట్టారు?
జ: ఆర్యభట్ట

జ: ఈజిప్షియన్లు
21. కిందివాటిలో ఆర్కిమెడిస్ రచనను గుర్తించండి.
i. Centre of Plane Gravities ii. Quadrature of Parabola
iii. Rising of the Stars iv. Introductio Arithmetica
జ: i, ii
22. 'లీలావతి' ముఖ్య అధ్యాయంగా గల గ్రంథం
1) ఆర్యభట్టీయం 2) పంచ సిద్ధాంతిక 3) సిద్ధాంత శిరోమణి 4) కరణ కుతూహలం
జ: 3 (సిద్ధాంత శిరోమణి)
23. ఆధునిక గణిత శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడైన శ్రీనివాస రామానుజన్ పరిశోధనలు వేటికి సంబంధించినవి?
జ: సంఖ్యావాదం
24. నిగమన తర్కాన్ని (Deducting) క్రమబద్ధం చేసిన శాస్త్రవేత్త
జ: అరిస్టాటిల్
25. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు
జ: శ్రీనివాస రామానుజన్
26. 'సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం' అని నిర్వచించింది ఎవరు? (డీఎస్సీ - 2012)
జ: ఫ్రాన్సిస్ బేకన్
27. ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం - అని నిర్వచించింది? (డీఎస్సీ - 2008)
జ: బెంజిమన్ పీర్స్
28. గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన శాస్త్రవేత్త? (డీఎస్సీ - 2008)
జ: హెన్రీ పాయింకేర్
29. 'గణితాన్ని ఆలోచనల, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి' అని నిర్వచించింది? (డీఎస్సీ - 2006)
జ: లైబ్నిజ్
30. గణితం స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడిన నిగమన పద్ధతి అని నమ్మిన వాదం? (డీఎస్సీ - 2006)
జ: సాంప్రదాయిక వాదం
31. గణితశాస్త్ర ఫలితాలు 'సరైనవి', 'సరికానివి' అనే రెండు వర్గాలుగానే ఉంటాయి. ఇది గణితశాస్త్ర ఏ స్వభావాన్ని తెలుపుతుంది?
జ: కచ్చితత్వం
32. తార్కిక వాదాన్ని తెలియజేసే గ్రంథం?
జ: ప్రిన్స్‌పియామెథమెటికా
33. గణిత పునాదులు (గ్రండ్లాగెన్‌డెర్ మేథమెటికా) గ్రంథ రచయిత ఎవరు?
జ: డేవిడ్ హిల్‌బర్ట్
34. ఏ వాదం ప్రకారం, 'గణిత భావనలన్నీ మానవుడి ఆలోచనల్లో లీనమై ఉంటాయి కానీ వేరుగా బయటి ప్రపంచంలో వాటికి ఉనికి లేదు?'
జ: సహజజ్ఞాన వాదం
35. ఏ వాదం ప్రకారం, 'గణితం అనేది నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత, నియమావళుల ప్రకారం ఆడే ఆట'?
జ: సాంప్రదాయిక వాదం
36. సహజజ్ఞాన వాదానికి సంబంధించింది -
(i) గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ.
(ii) గణితం తర్కంతో సమానం.
(iii) గణితం తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది.
(iv) గణితం అంటే ఆట.
జ: i, iii
37. 'గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇలాంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను' అని పేర్కొన్నది?
జ: డబ్ల్యు. గ్త్లెషర్
38. గణిత స్వభావం కానిది? (టెట్ - 2011)
జ: వర్ణనాత్మకం
39. కిందివాటిలో గణిత స్వభావం -
(i) గణిత భావనలు తాత్కాలికమైనవి.
(ii) సరిచూసే పద్ధతిని కలిగి ఉంటుంది.
(iii) సౌందర్య లక్షణం.
(iv) సహజసిద్ధమైన ఆలోచనా విధానం
జ: ii, iii, iv
40. గణితానికి మూలమైంది?
(i) హేతువాదం (ii) కచ్చితత్వం (iii) తార్కికత (iv) విశ్లేషణ
జ: i