• facebook
  • whatsapp
  • telegram

గణిత శాస్త్ర బోధన విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు

1. బ్లాక్‌హార్‌స్ట్ ప్రకారం విద్యా విలువ?
i) దృక్పథాలు
ii) భావనలు
iii) సామర్థ్యాలు
iv) సమాచారం
జ: i, ii, iv

 

2. 'విద్యార్థి గణిత అధ్యయనంలో ఒక క్రమపద్ధతిని పెంపొందించడం' ఏ విద్యా విలువను సూచిస్తుంది?
జ: క్రమశిక్షణ

 

3. 'హేతువాదంలో మానవుడి మేధస్సు స్థిరపడే మార్గమే గణితం' అని నిర్వచించింది
జ: లాక్

 

4. కిందివాటిలో క్రమశిక్షణ విలువను సూచించేది
i) గణిత అధ్యయనంలో సమస్యా సాధనకు సరైన పద్ధతులను ఎంపిక చేసుకోవడం.
ii) స్వేచ్ఛాయుతంగా ఆలోచించడం.
iii) సృజనాత్మక, విశ్లేషణాత్మక, నిశిత పరిశీలన, కల్పనాశక్తి లాంటి ఆలోచనా సంబంధమైన నైపుణ్యాలను కలిగి ఉండటం.
iv) హేతువాద ఆలోచనలను వినియోగించడం.
జ: i, ii, iii, iv

 

5. 'ఇందుకు చదవడం, రాయడం రాకపోయినా తన మనుగడ సాగించవచ్చు. కానీ లెక్కలు రానిదే నేటి సమాజంలో జీవించడం కష్టం'. ఇది ఏ విలువలను తెలియజేస్తుంది?
జ: ప్రయోజన విలువ

 

6. పదో తరగతి చదివే సౌమ్య అనే విద్యార్థి అయిదేళ్లలో తను సాధించిన ఉత్తీర్ణతా వివరాలతో ఒక దిమ్మరేఖా చిత్రాన్ని గీసింది. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: నైపుణ్యం

 

7. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థిని (a + b)3 సూత్రం చెప్పమంటే a3 + 3a2 b + 3ab2 + b3 అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: జ్ఞానం

 

8. 'దేశ బడ్జెట్‌ను తయారుచేయడం' ఏ విలువ?
జ: ప్రయోజన విలువ

 

9. కిందివాటిలో అవగాహనకు చెందిన స్పష్టీకరణ?
i) విద్యార్థి ఫలితాలను అంచనావేస్తాడు.
ii) విద్యార్థి ఫలితాలను సరిచూస్తాడు.
iii) విద్యార్థి ఫలితాలను తెలియజేస్తాడు.
జ: i, ii

 

10. విద్యార్థి ఒక త్రిభుజ వైశాల్యం దాని భూమి ఎత్తుల లబ్ధంలో సగం ఉంటుంది. అనే శాబ్దిక ప్రవచనాన్ని A = 1/2 bh అని అనువాదం చేస్తే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

11. 7వ తరగతి చదివే సాయి అనే విద్యార్థి సమాంతర చతుర్భుజాల, ఆసన్న కోణాల మొత్తాన్ని కనుక్కుంటుండగా, వాటి మొత్తం ప్రతిసారి 180o వస్తుంది. దీని ద్వారా ఆ విద్యార్థి సమాంతర చుతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180o కి సమానం అవుతుందని సాధారణీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం
జ: వినియోగం

 

12. 8వ తరగతి చదివే స్రవంతి అనే విద్యార్థిని ఒక లిఖిత సమస్యను సాధనలో 67ను 63తో గుణించాల్సి వచ్చినప్పుడు నోటి గణన సహాయంతో 4221 అని త్వరితంగా, కచ్చితంగా చెప్పింది. అయితే ఆ విద్యార్థిని సాధించిన లక్ష్యం
జ: నైపుణ్యం

 

13. విద్యార్థి సమాంతర చతుర్భజానికి, దీర్ఘ చతురస్రానికి తేడాలను తెలిపాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

14. విద్యార్థి ఇచ్చిన బిందువులు (0, 4), (-3, 0), (2, 0), (9, -2), (9, 4), (6, 0), (0, 5) లను X, Y అక్షాలపై బిందువులుగా వర్గీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

15. 40o, 50o, 60o లు ఒక త్రిభుజంలోని మూడు కోణాలను సూచించవు అనే దానికి కారణం చెప్పమంటే విద్యార్థి ఆ మూడు కోణాల మొత్తం 180oకి సమానం కాదు అని సమాధానం ఇస్తే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

16. విద్యార్థిని మూలబిందువు ద్వారా వెళ్లే సరళరేఖను చెప్పమంటే 3x - 2y + 5 = 0 అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ విద్యార్థిలో లోపించిన లక్ష్యం
జ: వినియోగం

 

17. విద్యార్థి C = 2r అనే సూత్రం ఒక వృత్తపరిధి వ్యాసార్ధానికి 2 రెట్లు ఉంటుందని శాబ్దిక ప్రవచనంగా అనువదిస్తే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

18. 'విద్యార్థులు పాల్గొనే అంశాలకు వారిలో మార్పు తీసుకొచ్చే అంశాలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ పాఠ్యాంశానికి, లక్ష్యసాధనకు కాదని' పేర్కొన్నవారు?
జ: జాక్సన్

 

19. 'విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరొక అంశంలోని సామర్థ్యాన్ని' పెంచుతుంది అని నిర్వచించింది.
జ: థారన్‌డైక్

 

20. కిందివాటిలో ప్రయోజన విలువను సూచించేది ఏది?
    1) పంచవర్ష ప్రణాళికలు                        2) రాష్ట్ర బడ్జెట్
    3) గృహిణి ఇంటి బడ్జెట్‌ను తయారు చేయడం    4) అన్నీ

జ: 4(అన్నీ)
 

21. 'ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరమే'. ఇది ఏ విద్యా విలువను సూచిస్తుంది?
జ: ప్రయోజన విలువ

 

22. లలిత కళల అభివృద్ధికి గణితమే ఆధారం. ఇది ఏ విలువను సూచిస్తుంది?
జ: కళాత్మక విలువ

 

23. విద్యార్థి ఒక వర్గసమీకరణానికి ఉదాహరణ ఇవ్వమంటే x2 + 2x + 1 = 0 అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

24. 'ఒక చింతనా సరళిగా గణితం'ను విద్యా విలువగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: యంగ్

 

25. కిందివాటిలో బ్రెస్లిచ్ ప్రకారం విద్యా విలువ కానిది?
జ: భావన

 

26. 'పరిసరాల్లో గణితం' ఏ విలువను సూచిస్తుంది?
జ: సాంస్కృతిక

 

27. నాగకృష్ణ అనే గణిత ఉపాధ్యాయుడు 9వ తరగతి చదివే సాయి అనే విద్యార్థిని ఒక వర్గసమీకరణానికి ఉదాహరణ చెప్పమంటే ఆ విద్యార్థి x2 + 5x + 4 = 0 అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం
జ: అవగాహన

 

28. ఒక గణిత ఉపాధ్యాయుడు 6వ తరగతి చదివే సాయి అనే విద్యార్థిని మన తరగతిలోని నల్లబల్ల పొడవు ఎంత అని చెప్పమంటే ఆ విద్యార్థి స్కేలును ఎన్నుకున్నాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం.
జ: నైపుణ్యం

 

29. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం
జ: మూల్యాంకనం

 

30. కిందివాటిలో భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ
జ: హస్తలాఘవం

 

31. విద్యార్థి తన సాధనలను తానే ప్రశ్నించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది?
జ: శాస్త్రీయ వైఖరి

 

32. కిందివాటిలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
i) దోషాలను గుర్తించి, సరిచేయడం
ii) ఫలితాలను సరిచూడటం
iii) ఫలితాలను అంచనావేయడం
iv) ఫలితాలను తెలపడం
జ: i, ii, iii

 

33. విద్యార్థి తన పరిసరాల్లో నిర్మించిన దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర శిల్ప నిర్మాణాలను పరిశీలించి వాటి నిర్మాణ సూత్రాలన్నీ గణిత ఆధారాలే అని తెలియజేస్తే, ఆ విద్యార్థిలో పెంపొందిన విలువ.
జ: సాంస్కృతిక విలువ

 

34. కిందివాటిలో చిత్ర లేఖనా నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ
i) విద్యార్థి పటాలను వేగంగా, శుభ్రంగా గీస్తాడు.
ii) విద్యార్థి పటాల్లో దోషాలను సరిచేస్తాడు.
iii) విద్యార్థి పటాల్లోని అతిక్రమాలను చూపిస్తాడు.
iv) విద్యార్థి ఇచ్చిన కొలతలను బట్టి రేఖాచిత్రాలను గీస్తాడు.
    1) i, ii, iii             2) i, ii, iv 
    3) ii, iii, iv           4) అన్నీ
జ: 4(అన్నీ)

 

35. 'బ్లూమ్ వర్గీకరణ కృత్రిమమైందని, సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని' భావించింది?
జ: కెల్లీ, ల్యూటోమ్

 

36. నిర్దిష్ట లక్ష్యాల మొత్తానికి, అంతిమ లక్ష్యాలకు ఎల్లప్పుడూ సమతౌల్యం సాధ్యం కాదని భావించినవారు?
జ: మోర్ మాక్స్‌వింగో

 

37. 'విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియలు లాంటి వాటిలోని దోషాలను సరిదిద్దుతాడు' అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: అవగాహన

 

38. బోధనా లక్ష్యాలను రూపొందించే నియమం
    1) లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి. 
    2) లక్ష్యాలు సాధించదగినవై ఉండాలి. 
    3) విద్యార్థుల ప్రవర్తనలో కలిగే మార్పులను సూచించగలిగేవిగా ఉండాలి. 
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

39. బోధనా లక్ష్యాల ఉపయోగం
    1) బోధనాభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు 
    2) విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులు కలగజేసేందుకు 
    3) కార్యక్రమయుత అభ్యసన తయారీకి 
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

40. గణిత బోధనలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
జ: విద్యార్థి కొన్ని సందర్భాల్లో గణిత సంబంధాలను కనుక్కుంటాడు.

 

41. గణిత బోధన లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలను పాటించాలని సూచించిన విద్యావేత్త
జ: ఫ్రస్ట్

 

42. 'సమితులు' అనే అధ్యాయం బోధనలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
జ: సమితులను వర్గీకరించడం.

 

43. విద్యార్థి గణిత ఉపకరణాల పెట్టె నుంచి ఒక వృత్తాన్ని గీయడానికి ఉపయోగించే పరికరాన్ని ఎన్నుకుంటాడు అనే స్పష్టీకరణను సూచించే లక్ష్యం
జ: నైపుణ్యం

 

44. శిల్పకళలు, చిత్రలేఖనం లాంటి లలిత కళల అభివృద్ధి గణిత బోధనలో ఏ విలువను తెలియజేస్తుంది?
జ: ప్రయోజన విలువ

 

45. పరీక్షాంశాలను తయారుచేయడంలో ఉపయోగపడేవి
జ: స్పష్టీకరణలు

 

46. విద్యార్థి దత్త వివరాల నుంచి అనుమతి, ముగింపులను రాబడతారు. ఈ ప్రక్రియలో విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: వినియోగం

 

47. విద్యార్థి ఇచ్చిన దత్తాంశానికి సరైన రేఖాచిత్రాన్ని గీయగలిగాడు. ఈ చర్యలో సాధించిన బోధనా లక్ష్యం
జ: నైపుణ్యం

 

48. విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు, చార్టులను తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది?
జ: ఆసక్తి

 

49. 'విద్యార్థి ఇచ్చిన సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎన్నుకుంటాడు' ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది?
జ: వినియోగం

 

50. 'ఒక పాఠశాలలో ప్రతిభావంతులైన పిల్లల ద్వారా మంద అభ్యాసకులకు పర్యవేక్షిత అధ్యయనాన్ని నిర్వహించారు'. దీనివల్ల విద్యార్థుల్లో పెంపొందిన ముఖ్య విలువ?
జ: ప్రయోజన

 

51. గత నాలుగు దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదల రేటును గణించాడు. ఈ స్పష్టీకరణ దేనికి చెందుతుంది?
జ: విశ్లేషణ

 

52. విద్యార్థికి నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ
జ: క్రమశిక్షణ విలువ

 

53. 'సమితి పరిక్రియలు' అనే 9వ తరగతి పాఠ్యపథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ.
జ: సమితి పరిక్రియలను, అంకగణిత పరిక్రియలతో పోల్చుతుంది.

 

54. విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
జ: నైపుణ్యం

Posted Date : 25-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు