• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం

1. 'విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం' అన్నది ఎవరు?
జ: నార్మిన్ గ్రీన్లాండ్

 

2. మూల్యాంకనం లక్షణం ఏది?
1) నిరంతరం       2) శాస్త్రీయం       3) లక్ష్యాలను మాపనం చేయడం       4) పైవన్నీ
జ:  పైవన్నీ

 

3. భావావేశ రంగాన్ని మాపనం చేయడానికి తోడ్పడే పద్ధతి ఏది?
జ:  ఇంటర్వ్యూ

 

4. సాంఘిక ప్రవర్తనలతో ముడిపడిన లక్ష్యం ఏది?
జ:  వైఖరి

 

5. అనేక వ్యత్యాసాలున్న విద్యార్థుల అభ్యసన ప్రగతిని అంచనా వేయడానికి తోడ్పడే పరీక్షలు ఏవి?
జ:  సామర్థ్య పరీక్షలు

 

6. తరగతిలో నిరంతర మూల్యాంకనానికి దోహదపడే పరీక్షలు ఏవి?
జ:  మౌఖిక పరీక్షలు

 

7. ఒక విద్యార్థి సాధించిన ప్రగతిని తోటి విద్యార్థులు మదింపు చేయడాన్ని ఏమంటారు?
జ:  సమవయస్కుల మదింపు

 

8. విద్యార్థులకు వారి సామర్థ్యాల సాధనా స్థితిగతులను వివరణాత్మకంగా చెప్పి, వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి తోడ్పడే పద్ధతి ఏది?
జ:  రూపన పద్ధతి

 

9. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి, వాటిని ప్రదర్శించి, వాటి పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచే పద్ధతిని ఏమంటారు?
జ:  పోర్ట్‌ఫోలియో

 

10. రాతపూర్వకంగా కాకుండా 'అడిగే' రూపంలో ప్రశ్నించే విధానాన్ని ఏ రకం పరీక్షగా చెప్పవచ్చు?
జ:  మౌఖిక పరీక్ష

 

11. గుణాత్మక విద్యను సాధించిందీ, లేనిదీ తెలుసుకోవడానికి ఏ మూల్యాంకనం అవసరం?
జ:  సమగ్ర నిరంతర మూల్యాంకనం

 

12. భావావేశ రంగానికి చెందిన ఏ లక్ష్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేం?
1) ఆసక్తులు        2) వైఖరులు        3) ప్రశంసలు         4) పైవన్నీ
జ:  పైవన్నీ

 

13. విద్యార్థి సాధించిన ఫలితాలకు విలువ కట్టడమే...?
జ:  మూల్యాంకనం

 

14. మూడో తరగతి విద్యార్థి 'పరిసరాలు' అనే పాఠ్యాంశాన్ని గురించి అధ్యయనం చేసిన తర్వాత నీటిని పొదుపు చేయడం తన బాధ్యత అని గుర్తించాడు. దీని వల్ల విద్యార్థిలో సాధించిన లక్ష్యం ఏది?
జ:  వైఖరి

 

15. 'భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశం ఏది?' అనే ప్రశ్న విద్యార్థిలో ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించింది?
జ:  జ్ఞాన లక్ష్యం

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌