• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధన లక్ష్యాలు

గమ్యాలు: గమ్యాలు విశాలమైన, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తాయి.
ఉదా: విద్యకు పరమార్థం మోక్షం - ఉపనిషత్తులు.

 

ఉద్దేశాలు: ఉద్దేశాలు గమ్యాల నుంచి ఏర్పడ్డాయి. ఇవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవే కాకుండా విద్య దిశలను కూడా సూచిస్తాయి. కాబట్టి వీటిని సాధించడానికి నిర్ణీత కాలవ్యవధి అవసరం.
ఉదా: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర జ్ఞానం కలిగించడం.

 

లక్ష్యాలు: అనతికాలంలో చేరగల గమ్యాలను లక్ష్యాలు అనవచ్చు.
ఉదా: బీఈడీ పరీక్ష పాసవడం
* గమ్యం ఉద్దేశం లక్ష్యం

 ప్రొఫెసర్ రిచర్డ్ వైట్‌ఫీల్డ్ ప్రకారం:
                 విద్యా వ్యవస్థలో విజ్ఞానశాస్త్ర స్థానం
                                    
                     విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు
                                   
                           కోర్సు లక్ష్యాలు
                                   
                       ప్రతి పాఠ్యాంశం లక్ష్యాలు

లక్ష్యాలకు ఆధారాలు

1. విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు

2. సామాజిక అవసరాలు

3. పాఠ్యాంశ స్వభావం, పరిధి

4. విద్యా విధానం స్థాయి, స్వభావం

5. లభించే వనరులు


లక్ష్యాలకు, అభ్యసనానుభవాలకు, మూల్యాంకనానికి ఉన్న సంబంధం
                                             


* స్పష్టీకరణలను నిర్దిష్ట అభ్యసన ఫలితాలు అని కూడా పిలుస్తారు.

జ్ఞానరంగం లక్ష్యాలు
* జ్ఞానం అనే లక్ష్యంలో ఉన్న స్పష్టీకరణలు - జ్ఞప్తి, గుర్తింపు.
* అవగాహన లక్ష్యంలోని స్పష్టీకరణలు - ఉదాహరణలు, వివరణ, భేదాలు, పోల్చడం, వర్గీకరించడం, సంబంధాలను గుర్తించడం, అనువదించడం, దోషాలను కనుక్కోవడం.
* వినియోగం లక్ష్యంలో ఉన్న స్పష్టీకరణలు - విశ్లేషించడం, జ్ఞానాన్ని నేరుగా వినియోగించడం, కారణాలు తెలపడం, కారణానికి- ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరచడం, అనుమతి రాబట్టడం, ప్రాగుక్తీకరణ, సామాన్యీకరించడం, సరైన ప్రయోగ విధానాలు, పరికరాలు సూచిస్తాడు; దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తాడు.

 

భావావేశ రంగంలోని లక్ష్యాలు
1. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి
2. అభిరుచి
3. అభినందన

 

మానసిక చలనాత్మకరంగం లక్ష్యాలు
1. చిత్రలేఖనా నైపుణ్యం
2. హస్తలాఘవ నైపుణ్యం
3. పరిశీలనా నైపుణ్యం
4. అభివ్యంజన నైపుణ్యం
5. నివేదనా నైపుణ్యం

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌