• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలన...

1. మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ ఏది?
జ:  బల్వంత్‌రాయ్‌మెహతా

 

2. గ్రామ ఓటర్లు గ్రామ సర్పంచ్‌ను ఎన్నుకొనే పద్ధతి-
జ:  రహస్య ఓటింగ్ పద్ధతి

 

3. మనదేశంలో 'మూడంచెల పంచాయతీరాజ్' వ్యవస్థను మొదట ఏర్పాటు చేసిన రాష్ట్రమేది?
జ:  రాజస్థాన్

 

4. గ్రామ పంచాయతీ ఆవశ్యకతను తెలిపే ఆదేశ సూత్రాల్లోని అధికరణ-
జ:  40

 

5. గ్రామీణ స్వపరిపాలనా సంస్థల్లో దేన్ని ప్రాథమిక స్వపరిపాలనా సంస్థ అని పిలుస్తారు?
జ:  గ్రామ పంచాయతీ

 

6. ఒక గ్రామంలోని మొత్తం వయోజనులు 500 మంది. ఈ గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో కలిపి ఎంతమంది సభ్యులను ఎన్నుకోవాలి?
జ:  7

 

7. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న మండల పరిషత్‌ల సంఖ్య-
జ:  1125

 

8. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎలా ఎన్నుకుంటారు?
జ:  మండల పరిషత్ సభ్యులు

 

9. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి, ఓటుహక్కులేనివారు ఎవరు?
జ:  మండలానికి చెందిన గ్రామ సర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి

 

10. ఏ చట్టం ద్వారా మండల పరిషత్ ఏర్పడింది?
జ:  1986 చట్టం

 

11. మండలంలోని ప్రభుత్వ సిబ్బంది మొత్తం ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారు?
జ:  మండల పరిషత్ అభివృద్ధి అధికారి

 

12. మండల స్థాయిలో పాఠశాల మధ్యాహ్న ఉచిత భోజనం ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది?
జ:  తహశీల్దారు 

 

13. గ్రామసభ సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి?
జ:  రెండు

 

14. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించారు?
జ:  73

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌