• facebook
  • whatsapp
  • telegram

స్థానిక సంస్థలు - జిల్లా పరిషత్ 

1. మనదేశంలో స్థానిక సంస్థలకు మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:  1884

 

2. జిల్లా పరిషత్ సమావేశాలకు ఓటుహక్కు లేకుండా హాజరయ్యేవారు?
జవాబు:  జిల్లా కలెక్టరు

 

3. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలా ఎన్నికవుతారు?
జవాబు:  జిల్లా పరిషత్‌కు ఎన్నికైన సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.

 

4. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, విశాఖ‌ప‌ట్టణం - వీటిలో జిల్లా పరిషత్ లేని జిల్లా ఏది?
జవాబు:  హైదరాబాద్

 

5. నగర కార్పొరేషన్‌కు కళ్లు, చెవులుగా ఎవరిని/ దేన్ని పేర్కొంటారు?
జవాబు:  స్థాయీసంఘం

 

6. మేజర్ పంచాయతీ పురపాలక సంస్థగా ఎంపికవడానికి ఉండాల్సిన కనీస జనాభా ఎంత?
జవాబు:  20 వేలకు మించి

 

7. జిల్లా పరిషత్ జిల్లా స్థాయిలో ఏ పాఠశాలలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది? 
జవాబు:   సెకండరీ , వృత్తివిద్యా , పారిశ్రామిక

 

8. మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్థాయీ సంఘాల సభ్యులు ఎంతకాలం పదవిలో ఉంటారు?
జవాబు:  రెండేళ్లు

 

9. జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించేది?
జవాబు:  జిల్లాపరిషత్ ఛైర్మన్

 

10. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎన్ని నెలలకు ఒకసారి జిల్లా పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేయాలి?
జవాబు:  3 

 

11. నగరపాలక సంస్థ రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకునే సభ్యులనేమంటారు?
జవాబు:  కార్పొరేటర్లు

 

12. మున్సిపాలిటీ లేదా నగరపాలక సంస్థ తప్పక నిర్వహించాల్సిన విధులో ఏవైనా మూడింటిని తెలపండి? 
జవాబు: జ‌న‌న, మ‌ర‌ణ న‌మోదు; స్మశానాల నిర్వహ‌ణ‌; మార్కెట్ నిర్వహ‌ణ‌.

 

13. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘాల సభ్యులను  ఎవరు ఎన్నుకుంటారు?
జవాబు:  కార్పొరేటర్లు

 

14. జిల్లాలోని మండల పరిషత్తుల పనిని సమన్వయ పరిచి, జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేసేది?
జవాబు:  జిల్లా పరిషత్

 

15. జిల్లాస్థాయిలో వివిధ విభాగాధిపతుల పనితీరును సమన్వయపరిచి, పర్యవేక్షించే అధికారం ఎవరిది?
జవాబు:  కలెక్టర్

 

16. జిల్లా ప‌రిష‌త్‌, గ్రామ పంచాయ‌తీ, మండ‌ల ప‌రిష‌త్, పుర‌పాల‌క సంఘం - వీటిలో రాజ్యాంగ చట్టబద్ధత ఉన్న పరిపాలనా విభాగం ఏది?
జవాబు:  జిల్లా పరిషత్

 

17. ఏ స్థానిక సంస్థ అంశాల్లో కలెక్టర్ భాగస్వామిగా ఉంటారు?
జవాబు:  జిల్లా పరిషత్

 

18. కిందివాటిలో జిల్లా స్థాయీ సంఘాల్లో లేనిది ఏది?
1) వ్యవ‌సాయ స్టాండింగ్ క‌మిటీ
2) గ్రామాభివృద్ధి స్టాండింగ్ క‌మిటీ
3) ర‌క్షిత మంచినీటి క‌మిటీ
4) విద్య, వైద్య స్టాండింగ్ క‌మిటీ
జవాబు:  రక్షిత మంచినీటి కమిటీ

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌