• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో ఆర్థిక ప్రాముఖ్యత

1. ఏ గేదెల పాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టకపోయినా వారం రోజుల పాటు చెడిపోకుండా, ఉప్పగా ఉంటాయి?
జ‌: చిల్కా

 

2. కోడి మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
జ‌: 5

 

3. కిందివాటిలో సరికానిది
ఎ) తేనెటీగలు - ఎపీ కల్చర్           బి) పట్టుపురుగులు - సెరీకల్చర్
 సి) వర్మీ కల్చర్ - వానపాములు        డి) ఏదీకాదు
జ‌: డి (ఏదీకాదు)

 

4. 'ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి' అని నినాదం చేసింది
జ‌: NECC

 

5. కిందివాటిలో దేశీయ కోడి రకానికి చెందింది?
    ఎ) అసిల్       బి) చిత్తగాంగ్          సి) లాంగ్‌షాన్        డి) అన్నీ
జ‌: డి ( అన్నీ)

 

6. తేనెపట్టులో మగ ఈగల ప్రధాన విధి
జ‌: సంపర్కంలో పాల్గొనడం

 

7. సరికాని జత
ఎ) ఎద్దు మాంసం - బీఫ్          బి) పందిమాంసం - ఫోర్క్
సి) పొట్టేలు - మటన్                 డి) ఏదీకాదు
జ‌: డి (ఏదీకాదు)

 

8. పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం ఈ పథకం ఉద్దేశం
జ‌: ఆపరేషన్ ఫ్లడ్

 

9. కృత్రిమంగా గుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పరికరం
జ‌: ఇంక్యుబేటర్

 

10. పశువుల్లో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి
జ‌: గాలికుంటు వ్యాధి

 

11. ఏ జీవుల విషం నుంచి 'ఎపిస్ టింక్చర్' అనే ఉప ఉత్పత్తి తయారవుతుంది?
జ‌: తేనెటీగలు

 

12. నదీ నీరు, సముద్రపు నీరు కలిసే నదీముఖ ప్రదేశం
జ‌: ఎశ్చుయరీస్

 

13. పశువులు ఈనిన తర్వాత ఎన్ని గంటల వరకు ఇచ్చే పాలను 'జున్ను పాలు' అంటారు.
జ‌: 72 గంటలు

 

14. ఒక కకూన్ నుంచి లభించే పట్టుదారం పొడవు
జ‌: 1000 - 3000 అడుగులు

 

15. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రపంచంలో రెండో పెద్దపక్షి
జ‌: ఈమూ

 

16. 'పట్టు మాత్‌'లను అమ్మే కేంద్రాన్ని ఏమంటారు?
జ‌: గ్రైనేజస్

 

17. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఇచ్చే ముర్రా జాతి జన్మస్థలం
జ‌: భారతదేశం

 

18. కిందివాటిలో రైతు మిత్రుడిగా పరిగణించనిది
ఎ) చీమ          బి) సాలె పురుగు          సి) టైక్రోగ్రామా        డి) ఎలుక
జ‌: డి (ఎలుక)

 

19. భారతదేశం సముద్రతీరం పొడవు దాదాపుగా
జ‌: 7500 కి.మీ.

 

20. పరిశ్రమలో 'పైకో కొల్లాయిడ్‌'గా ఉపయోగపడే అగార్ అగార్ అనేది
జ‌: సముద్రంలోని కలుపు

 

21. 'కకూన్‌'లను వేడి నీటిలో ఉంచి డింభకాలను చంపే విధానాన్ని ఏమంటారు?
జ‌: స్టిప్పింగ్

 

22. చేప మాంసంలో లభించే విటమిన్స్
జ‌: A, D

 

23. కిందివాటిలో మంచినీటి చేప
ఎ) బాంబేతక్         బి) కాట్ ఫిష్           సి) సార్‌డైన్స్         డి) బొచ్చె
జ‌: డి(బొచ్చె)

 

24. పట్టు పురుగు జీవిత చరిత్రలో ఏ దశలో మార్కెట్‌కు తరలిస్తారు?
జ‌: కకూన్‌లను

 

25. తేనెపట్టులో అత్యధిక జీవితకాలం ఉండే ఈగలు
జ‌: రాణి ఈగలు

 

26. పోషక విలువలన్నీ ఉండి చౌకగా లభించే ఆహారం ఏది?
జ‌: గుడ్డు

 

27. వివిధ రకాల చేప జాతులను కలిపి ఒక ప్రదేశంలో పెంచడాన్ని ఏమంటారు?
జ‌: సమ్మిళిత చేపల పెంపకం

 

28. మానవుడు ఎన్ని సంవత్సరాల కిందట కుక్కను మచ్చిక చేసుకున్నాడు?
జ‌: క్రీ.పూ. 30000 - 7000

 

29. డాక్టర్ కురియన్ ......... పితామహుడు.
జ‌: శ్వేత విప్లవం

 

30. కోడిపందేల కోసం పెంచే కోడి
జ‌: ఆసిల్

 

31. పాశ్చరైజేషన్‌లో పాలను ఎంత ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు?
జ‌: 62ºC

 

32. ఏ ప్రాంత పట్టును 'టై అండ్ డై' అని పిలుస్తారు?
జ‌: పోచంపల్లి

 

33. ఏ తేనెటీగ సంవత్సరానికి 25 - 30 కిలోల తేనెను తయారు చేస్తుంది?
జ‌: ఎపిస్ మెల్లిఫెరా

 

34. కోడిగుడ్లను పొదిగించేందుకు అనువైన ఉష్ణోగ్రత
జ‌: 37 - 38ºC

 

35. కిందివాటిలో వెన్న శాతం ఎక్కువగా ఉండే పశుజాతి
      ఎ) హోలోస్టీన్              బి) జెర్సి
      సి) ఒంగోలు గిత్త            డి) ముర్రా
జ‌: డి (ముర్రా)

 

36. జున్ను పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం
జ: కోలోస్ట్రమ్

 

37. మానవుడికి మొదటగా మచ్చికైన జంతువు
జ‌: కుక్క

 

38. వరి పొలాల్లో చేపలను పెంచటం ద్వారా ఏ పురుగును అదుపులో పెట్టవచ్చు?
జ‌: కాండం తొలుచు

 

39. పాలలో లభించే విటమిన్
జ‌: A, D, E

 

40. నీటి ఉపరితలం నుంచి ఆహారాన్ని సేకరించే చేప
జ‌: జెల్ల

 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌