• facebook
  • whatsapp
  • telegram

సంధులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భాను + ఉదయం కలిపితే ...?

జ: భానూదయం
 

2. పిత్రాజ్ఞ అనేది ....
జ: యణాదేశ సంధి

 

3. గుణములు అంటే ...
జ: ఏ ఓ అర్

 

4. కిందివాటిలో గసడదవాదేశ సంధికి ఉదాహరణ ....
1) నదివోలె             2) కాలుసేతులు                 3) కూరగాయలు             4) పైవన్నీ
జ: పైవన్నీ

 

5. దయంజేసి ఏ సంధి?
జ: సరళాదేశ సంధి

 

6. ఎయ్యది - విడదీయండి.
జ: ఏ + అది

 

7. 'పేదరాలు'లో ఆలు శబ్దానికి అర్థం ఏమిటి?
జ: స్త్రీ

 

8. కిందివాటిలో టుగాగమ సంధి కానిదేది?
1) నిగ్గుటద్దం             2) పొదరుటిల్లు                 3) ధీరురాలు                 4) పైవన్నీ
జ: ధీరురాలు

 

9. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ?
జ: సరసపు వచనం

 

10. ఆదేశం అంటే ...?
జ: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం

 

11. జలధరము అనేది ....
జ: ద్వితీయాతత్పురుష సమాసం

 

12. కిందివాటిలో సప్తమీతత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది?
1) మాటనేర్పరి          2) దొంగభయం              3) గురుదక్షిణ                 4) భూతబలి
జ: మాటనేర్పరి

 

13. గురువు కొఱకు దక్షిణ అనే విగ్రహవాక్యం దేనికి చెందుతుంది?
జ: చతుర్థీతత్పురుష సమాసం

 

14. ముక్కంటి ఏ సమాసం?
జ: బహువ్రీహి

 

15. సంభావనా పూర్వపద కర్మధారయానికి ఉదాహరణ ...
1) ద్వారకానగరం         2) శ్రీనాథకవి             3) హిమాలయ పర్వతం           4) పైవన్నీ
జ: పైవన్నీ

పార్ట్ - బి

1. జగజ్జననీ అనే ఉదాహరణ కిందివాటిలో ఏ సంధికి సంబంధించింది?
    ఎ) విసర్గసంధి      బి) జస్త్వ సంధి        సి) శ్చుత్వ సంధి             డి) యణాదేశ సంధి
జ‌: సి (శ్చుత్వ సంధి)

 

2. ఇస్, ఉస్ అంతమందు ఉన్న పదాల విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైతే విసర్గకు బదులు వచ్చే అక్షరం
జ‌:

 

3. విసర్గకు 'స' పరమైతే దాని బదులుగా వచ్చే అక్షరం
జ‌:

 

4. 'తపః + ఫలము' ను కలిపి రాయండి.
జ‌: తపఃఫలము

 

5. పయోనిధి పదంలో '' కు ముందున్న 'అ' కారం ఏ అక్షరంగా మారింది?
జ‌:

 

6. అంతరాత్మ పదంలో '' బదులుగా వచ్చిన అక్షరం?
జ‌: ర్

 

7. 'దిగంతం' పదం ఏ సంధికి ఉదాహరణ?
జ‌: జస్త్వసంధి

 

8. 'వాగ్వాదం'ను విడదీసి రాయండి.
జ‌: వాక్ + వాదం

 

9. 'ధనుష్టంకారం'ను విడదీయండి.
జ‌: ధనుః + టంకారం

 

10. 'రాణ్మణి' ఏ సంధికి ఉదాహరణ?
జ‌: అనునాసిక సంధి

 

11. అకారానికి 'ఋ' కారం పరమైతే ఏకాదేశంగా వచ్చే అక్షరం
జ‌: ఆర్

 

12. 'గంగౌఘం' పదాన్ని విడదీయండి
జ‌: గంగా + ఓఘం

 

13. 'ఋ'కు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఆదేశంగా వచ్చేది.
జ‌:

 

14. 'నివ్వెఱ' అనేది ఏ సంధికి ఉదాహరణ?
జ‌: ప్రాతాదుల సంధి

 

15. 'చెంగావి' అన్న పదాన్ని విడదీయండి.
జ‌: చెన్ను + కావి

 

16. కిందివాటిలో షష్ఠీ తత్పురుష సమాసంలో వచ్చే సంధి
       ఎ) గసడదవాదేశ సంధి                            బి) త్రికసంధి
       సి) ప్రాతాదుల సంధి                                డి) దుగాగమ సంధి
జ‌: డి (దుగాగమ సంధి)

 

17. 'వీడు + చక్రపాణి' పదాన్ని కలిపి రాస్తే
జ‌: వీడు చక్రపాణి

 

18. 'నిక్కముదప్పదు' అనేది ఏ సంధికి ఉదాహరణ?
జ‌: గసడదవాదేశ సంధి

 

19. కిందివాటిలో 'ము' వర్ణలోప సంధులు ఏవి?
       ఎ) లులనల సంధి                                 బి) పడ్వాదుల సంధి
       సి) పుంప్వాదేశ సంధి                             డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

 

20. ద్విరుక్తటకారంపై చేరే సంధి
జ‌: ఉకార సంధి

 

21. 'శకటరేఫము'పై జరిగే సంధి
జ‌: ద్విరుక్తటకార సంధి

 

22. కిందివాటిలో కర్మధారయ సమాసంలో వచ్చే సంధి
     ఎ) రుగాగమ            బి) దుగాగమ           సి) నుగాగమ         డి) యడాగామ
జ‌: ఎ (రుగాగమ)

 

23. 'పడక + ఇల్లు' కలిపి రాస్తే
జ‌: పడకటిల్లు

 

24. 'ఒక + ఒక  ఒకానొక' అనేది అకార సంధిలో ఏ భాగానికి సంబంధించింది?
జ‌: అన్యత్వం

 

25. 'భుజములనెక్కి' అనే ఉదాహరణ ఏ సంధికి సంబంధించింది?
జ‌: ఉకార సంధి

 

26. దుగాగమ సంధిలో ఆగమంగా వచ్చిన అక్షరం
జ‌: దు

 

27. 'జవరాలు' పదంలో ఆగమంగా వచ్చిన అక్షరం
జ‌: ర్

 

28. రుగాగమ సంధి ఏ మాసంలో వస్తుంది?
జ‌: కర్మధారయం

 

29. అకారానికి 'ఉ' పరమైనప్పుడు క్రమంగా ఏకాదేశంగా వచ్చే అక్షరం
జ‌:

 

30. పేరు + ఉరము  పేరుటురము కానప్పుడు వచ్చే సంధి
జ‌: ఉత్వసంధి


 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌