• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - అలంకారాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కావ్యాలంకార సంగ్రహ కర్త - 
జ:  రామరాజభూషణుడు 

 

2. వృత్యనుప్రాస అంటే...? 
జ:  ఒకే హల్లు అనేకసార్లు రావడం

 

3. 'కందర్ప దర్ప' అనేది
జ: ఛేకానుప్రాస

 

4. అర్థభేదం లేకుండా తాత్పర్యభేదం ఉండేది -
జ:  లాటానుప్రాస

 

5. 'లేమా, దనుజుల గెలువగలేమా... ' ఇది దేనికి ఉదాహరణ? 
జ: యమకం 

 

6. ఒక పాదం చివరి పదం పట్టుకుని మళ్లీ ప్రారంభిస్తే అది-
జ: ముక్తపదగ్రస్తం

 

7. 'ఆపటేరాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశా చలంబుగన్...'  అనేది 
జ:  అంత్యానుప్రాస

 

8. లుప్తోపమ అంటే... 
జ:  ఉపమేయ, ఉపమాన, సమాన ధర్మ ఉపమావాచకాల్లో ఒకటి లేకపోవడం

 

9. 'నరసరాజు కీర్తి పాలసముద్రం' - ఏ అలంకారం? 
జ: రూపకం

 

10. ఆ రాజు కువలయానందకరుడు - ఇది ఏ అలంకారం? 
జ: శ్లేషాలంకారం

 

11. గోరంతలు కొండంతలుగా చెప్పడం - 
జ: అతిశయోక్తి 

 

12. దృష్టాంతాలంకారంలో 
జ:  బింబప్రతిబంబం ఉంటుంది

 

13. 'ఓ గంగా! పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు వివేకం ఎక్కడిది?' - ఏ అలంకారం? 
జ:  వ్యాజస్తుతి

 

14. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపిస్తే అది - 
జ:  రూపకం

 

15. 'ఈ మదించిన తుమ్మెద ఆమె ముఖాన్ని పద్మం అనుకుంటోంది' - అనేది
జ: భ్రాంతిమదలంకారం

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌