• facebook
  • whatsapp
  • telegram

ప్రక్రియలు - లక్షణాలు - వివరణలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1) ఆంధ్ర మహాభారతాన్ని విమర్శకులు ఏమంటారు?
జ: కావ్వేతిహాసం

 

2) శ్రీనాథుడి కావ్యాలకు మూలం ఏది?
జ: స్కాందపురాణం

 

3) పురాణంలో ఉన్నవేవి?
జ: సర్గ, వంశం, వంశానుచరితం

 

4) 'ఆంధ్ర వ్యాస' ఎవరు?
జ: ఏలూరిపాటి అనంతరామయ్య

 

5) ప్రబంధ లక్షణాల్లో అతి ముఖ్యమైందేది?
జ: వర్ణనాధిక్యత

 

6) 'ప్రబంధ యుగం' అంటే...?
జ: 15వ శతాబ్దం తరువాత

 

7) తొలి ప్రబంధంగా కొందరు దేన్ని భావించారు?
జ: కుమార సంభవం

 

8) ముక్తక లక్షణం ఉన్న ప్రక్రియ ఏది?
జ: శతకం

 

9) తొలి శతకకర్త ఎవరు?
జ: పాల్కురి సోమన

 

10) పిల్లీ శతకం రాసిందెవరు?
జ: బోయి భీమన్న

 

11) భర్తృహరి సుభాషితాలను అనువదించిందెవరు?
జ: ఏనుగు లక్ష్మణకవి

 

12) అంతర్జాతీయ బహుమతి పొందిన కథ ఏది?
జ: గాలివాన

 

13) 'కథానిక - స్వరూప స్వభావాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ: పోరంకి దక్షిణామూర్తి

 

14) 'గల్పిక'లో ముఖ్యమైంది ఏమిటి?
జ: సంఘటన

 

15) వ్యాసానికి మొదట ఉన్న పేరేంటి?
జ: ప్రమేయం, ఉపన్యాసం, సంగ్రహం

 

16) జాతీయోద్యమంలో సంపాదకీయాల ద్వారా చైతన్యపరచిందెవరు?
జ: ముట్నూరు కృష్ణారావు

17) 'వినాయక వీణ' వార్తా వ్యాఖ్య ఎవరిది?
జ: గోరాశాస్త్రి

 

18) 'ప్రథమాంధ్ర సాహిత్య విమర్శకుడు' - ఎవరు?
జ: కందుకూరి వీరేశలింగం

 

19) 'కవిసేన మానిఫెస్టో' ఎవరిది?
జ: శేషేంద్రశర్మ

 

20) కట్టమంచి రామలింగారెడ్డి విమర్శ గ్రంథం ఏది?
జ: కవితా తత్త్వ విచారం

 

21) 'నా కథ' ఎవరి స్వీయ చరిత్ర?
జ: జాషువా

 

22) సి.పి. బ్రౌన్ జీవిత చరిత్ర రాసిందెవరు?
జ: కొత్తపల్లి వీరభద్రరావు

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌