• facebook
  • whatsapp
  • telegram

మాండలికాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. ప్రతివ్యక్తి మాట్లాడేది మాండలికమే కాని భాష కాదు అని చెప్పినవారు ఎవరు?
జ‌: మాక్స్‌ముల్లర్

 

2. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు మండలాలుగా ఎవరు విభజించారు?
జ‌: భద్రిరాజు కృష్ణమూర్తి

 

3. కృష్ణా జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ‌: మధ్యమండలం

 

4. ప్రకాశం జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ‌: దక్షిణ మండలం

 

5. విజయనగరం జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ‌: పూర్వమండలం

 

6. వంద అనేది ఏ భాషా పదం?
జ‌: తెలుగు

 

7. మాంసాన్ని 'నీసు' అని ఏ మాండలికంలో అంటారు?
జ‌: పూర్వమండలం

 

8. మంచాన్ని 'అరక' అని ఏ మాండలికంలో అంటారు?
జ‌: పూర్వమండలం

 

9. వార్తా పత్రికలు, కథలు, నవలల్లో ఉపయోగించే మాండలికం ఏది?
జ‌: మధ్యమండలం

 

10. మున్నూరు, నన్నూరు, ఐన్నూరు అని ఏ మాండలికంలో ఉపయోగిస్తారు?
జ‌: దక్షిణ మండలం

 

11. బేడ, బీగం, హొన్ను లాంటి కన్నడ పదాలు ఏ మండలంలో కనిపిస్తాయి?
జ‌: దక్షిణ మండలం

 

12. సలాం, షా, కాఫిర్, గులామ్ లాంటి ఉర్దూ పదాలు ఏ మాండలికానివి?
జ‌: ఉత్తర మండలం
 

13. బేసి, బంద, రుగత, పరుడు లాంటి పదాలు ఏ భాషా ప్రభావం వల్ల ఏర్పడ్డాయి?
జ‌: ఒరియా

 

14. ఉర్దూ పదాలు ఏ మండలంలోని జిల్లాల్లో చేరుతాయి?
జ‌: ఉత్తర మండలం

 

15. కిందివాటిలో మాండలికం లేని భాష?
     ఎ) ఒరియా                బి) తమిళం          సి) కన్నడ            డి) మళయాళం
జ‌: బి (తమిళం)

 

16. 'పుణ్యం - పుణ్నెం' పదాల మార్పు కిందివాటిలో దేనికి సంబంధించింది?
        ఎ) మూర్థన్యం మార్పు                            బి) ఊష్మాల మార్పు
        సి) సంయుక్తాక్షర ప్రయోగం                     డి) అంతస్థరాహిత్యం
జ‌: సి (సంయుక్తాక్షర ప్రయోగం)

 

17. 'తాళం - తాలం' అనే పదాల మార్పు కిందివాటిలో దేనికి సంబంధించింది?
        ఎ) మూర్థన్యంతో మార్పు                        బి) దంత్యమార్పు
       సి) ఊష్మాల మార్పు                               డి) అంతస్థరాహిత్యం
జ‌: ఎ (మూర్థన్యంతో మార్పు)

 

18. 'యజ్ఞం - ఎగ్గెం' అనేవి కిందివాటిలో దేనికి సంబంధించినవి?
       ఎ) అల్పప్రాణరాహిత్యం                            బి) అంతస్థరాహిత్యం
      సి) మూర్థన్యంతో మార్పు                          డి) దంత్యపు మార్పు
జ‌: బి (అంతస్థరాహిత్యం)

 

19. 'గాబు' అనేది ఏ మండల రూపం?
జ‌: పూర్వమండలం

 

20. 'చిలుకు' అనే పదం ఏ మాండలికంలోనిది?
జ‌: దక్షిణ మండలం

28. 'గోంగూర'ను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు?
జ‌: పుంటికూర

 

29. 'సొమ్ములు' అనే పదాన్ని పూర్వమండలంలో ఏమని పిలుస్తారు?
జ‌: పశువులు

 

30. 'బిడారు' అన్న పదాన్ని వాడిన కవి.
జ‌: దూర్జటి

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌