మాదిరి ప్రశ్నలు
1. యోహిహో వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: నోరి
2. భాషా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రపంచ భాషలు ఉన్నాయని పేర్కొన్నారు?
జ: 2796
3. పూపూ వాదానికి మరో పేరు?
జ: టట్ టట్ వాదం
4. 'భాష' అనే పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది?
జ: భాష్
5. నటరాజ 'ఢమరుక' శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య?
జ: పద్నాలుగు
6. ధ్వనికీ, భావానికీ అనురూపమైన సంబంధం ఉంటుందని, ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థం ప్రకంపనలను కలిగి ఉంటుందని, ఆ ప్రకంపనలకు అనుగుణంగానే వ్యక్తి నోట శబ్దాలు వెలువడతాయని చెప్పే భాషోత్పత్తి వాదం ఏది?
జ: డింగ్ డాంగ్ వాదం
7. విశ్వాసంపై ఆధారపడిన భాషోత్పత్తి వాదం-
జ: దైవదత్త వాదం
8. హిబ్రూను 'దేవతల భాష'గా భావించినవారు-
జ: క్రైస్తవులు
9. మానవుడు శ్రమిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసాల వల్ల నాదతంత్రులు కంపించి భాష ఏర్పడుతుంది - ఏ వాదాన్ని సూచిస్తుంది?
జ: యోహిహో వాదం
10. నోమ్ ఛామ్స్కీ ప్రతిపాదించిన వాదమేది?
జ: స్వతస్సిద్ధ వాదం
11. భాషోత్పత్తి వాదాల్లో సమంజసమైందిగా చెప్పేది?
జ: ధాతు వాదం
12. 'బౌవౌ వాదం' అని పరిహాసపూర్వకంగా పిలిచింది?
జ: మాక్స్‌ముల్లర్
13. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది-
జ: భాష
14. గుసగుస, కటకట, జిగ్ జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే వాదం?
జ: డింగ్ డాంగ్ వాదం
15. పడవలు నడిపే వాళ్లు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అనే వాదం-
జ: యోహిహో వాదం
16. ''ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష" అని పేర్కొన్నది
జ: వ్యాకరణకారులు
17. ''Pool, tut tut'' వాదమని శాస్త్రవేత్తలు ఏ వాదాన్ని తిరస్కరించారు?
జ: సాంకేత వాదం
18. 'తిను' అనే ధాతువు నుంచి తినుట, తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపే వాదం-
జ: ధాతువాదం
19. భాష శరీరం లాంటిదైతే ప్రాణం లాంటిది?
జ: భావం
20. 'అరబ్బీ'ని దేవభాషగా పేర్కొన్నది-
జ: మహ్మదీయులు
21. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది-
జ: యాస్కాచార్యుడు
22. ''అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష" అని పేర్కొన్నదెవరు?
జ: సఫీర్
23. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం-
జ: వివక్షాప్రేరణ వాదం
24. Man is man because of his speech- అని భాష ప్రాధాన్యాన్ని పేర్కొన్నది?
జ: షేక్స్పియర్
25. తత్వశాస్త్రంలోని 'అనుభవ వాదం' నేపథ్యంగా ఏ వాదాన్ని ప్రతిపాదించారు?
జ: సంపాదన వాదం
26. 'ధాతువు' అంటే-
జ: క్రియ
27. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష- అని నిర్వచించింది?
జ: హాకెట్
28. మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం?
జ: భాషా శాస్త్రం
29. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదం దేన్ని బలపరుస్తుంది?
జ: సంపాదన వాదం
30. భాషాస్వరూపం ఎన్ని రకాలు?
జ: 6
31. మానవ భాషా లక్షణాలు ఎన్ని?
జ: 7
32. మానవుడు భూత భవిష్యత్తుల గురించి, వర్తమానం గురించి మాట్లాడగలగడం ఏ మానవ భాషా లక్షణం?
జ: ప్రేరణ దూరత
33. భాష ఒకరి నుంచి వేరొకరికి ప్రసరించడం ఏ మానవ భాషా లక్షణం-
జ: సాంస్కృతిక ప్రసరణం