• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం

 ఒక పని చేశాక అది ఎంతవరకు ఫలవంతమైందో పరిశీలించుకోవడం అవసరం. పని ప్రారంభించడానికి ముందే కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించడానికి కృషి చేసి, వాటినెంత వరకు సాధించగలిగామో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మూల్యాంకనం. నికష, పరీక్ష, పరిగణన కంటే విశాలమైన అర్థం ఉన్న పదం మూల్యాంకనం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్దిని మాపనం చేసేది మూల్యాంకనం. పాఠ్యాత్మక సముపార్జనం చేయడానికి తోడ్పడేది పరీక్ష. ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా స్వల్ప వ్యవధిలో నిర్వహించేది నికష.

నికష (Test): Testum అనే లాటిన్ పదం నుంచి test అనే పదాన్ని స్వీకరించారు. Testum అంటే some special type of earthen pot (ఒక విధమైన మూస).
* స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైంది నికష.
* ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైంది నికష.
* బోధించినవి మాత్రమే అడగదగింది నికష.
* నికషలు సంప్రదాయబద్ధమైనవి కావు.
నికషలు - రకాలు
                      
సూత్రాధారిత            ప్రమాణాధారిత               సంకలన                  రూపణ
నికష                          నికష                       నికష                      నికష

 

పరీక్షలు (Examinations): Examen అనే లాటిన్ పదం నుంచి Examine అనే పదాన్ని గ్రహించారు. Examen అంటే the pointer of balance (త్రాసులోని ముల్లు).
* పూర్వకాలంలో పరీక్షలు మౌఖికంగా మాత్రమే ఉండేవి.
* కాంచీపురం, నలంద, తక్షశిల మొదలైన చోట్ల ఘటికా స్థానాలు (విద్యాపీఠాలు) ఉండేవి.
* ఆంగ్లేయుల రాకతో మన పరీక్షా విధానంలో అనేక మార్పులు వచ్చాయి.
* భాషా నైపుణ్యాల్లో మనం పరీక్షిస్తున్నది కేవలం లేఖనాన్ని మాత్రమే.
* పరీక్షలు సంప్రదాయబద్ధమైనవి.
* కేవలం పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేసేదే పరీక్ష.
* పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించేవిగా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో 'నిలుపుదలరహిత విధానాన్ని' (Non Detention System) 1971 లో ప్రవేశపెట్టారు. దీంతో నూతన మూల్యాంకనా విధానం అమల్లోకి వచ్చింది.

* విద్యార్థుల సముపార్జనను మదింపు చేయడంలో ఉపాధ్యాయుడు చేపట్టే చర్యల్లో ముఖ్యమైంది, సమగ్రమైందీ మూల్యాంకనం.
* విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక, వైజ్ఞానిక అభివృద్ధిని పరిగణించడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది.
* తరగతిలో ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఎంత వరకు గ్రహించారో తెలుసుకోవడానికి తీసుకునే చర్య - మూల్యాంకనం.

1. నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Evaluation): ఒక పాఠం పూర్తవగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరాయో లేదో తెలుసుకోవడానికి చేసేది.
* నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది భాషలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం మొదలైన నైపుణ్యాల్లో నిత్యం జరుగుతున్న మార్పులను నిర్ధారణ చేసి, విద్యార్థుల భాషావికాసానికి ఉపకరిస్తుంది.

 

2. సమగ్ర/ సంచిత మూల్యాంకనం (Summative Evaluation): విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం.
సంవత్సరంలో విద్యార్ధి అభ్యసించిన 'అన్ని' అంశాలను మదింపు చేసే మూల్యాంకనం. ఉదా: వార్షిక పరీక్షలు.

 

3. సామర్థ్యాధార మూల్యాంకనం (Competitive Evaluation): కనీస అభ్యసన స్థాయులను దృష్టిలో ఉంచుకుని చేసే మూల్యాంకనం.
 

లక్ష్యాధార మూల్యాంకనం - ఆధునికీకరణ
మూల్యాంకన ఆధునికీకరణ కింది మూడు అంశాలపై ఆధారపడుతుంది.
1. లక్ష్యాలు
2. అభ్యసనానుభవాలు
3. మూల్యాంకనం

               

ఉత్తమ నికష లక్షణాలు
1. ప్రామాణికత:
 ఉపాధ్యాయులు ఆశించిన ప్రయోజనాలను/ లక్ష్యాలను మాపనం చేయాలి.
2. విశ్వసనీయత: జవాబులకు 'ఎన్ని' పర్యాయాలు విలువ కట్టినా మార్కుల్లో మార్పు రాకూడదు.
3. సమగ్రత/ వ్యాపకత: 'అన్ని' బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి.
4. వస్తునిష్ఠత: సార్వజనీన లక్షణం కలిగి ఉండటం అవసరం. వ్యక్తులు, వస్తువుల ప్రభావం ఉండకూడదు.
5. ఔపయోగికత/ ఆచరణాత్మకత: తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌