• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. విద్యార్థుల సృజనాత్మక శక్తిని, ఆసక్తిని, అభిరుచులను వెలికితీసి స్వయంకృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేలా చేయడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే మూల్యాంకనా అనుబంధ సాధనం?
జ: నియోజనం

 

2. పాఠ్యాత్మక సముపార్జనను మాపనం చేయడానికి తోడ్పడేది?
జ: పరీక్ష

 

3. నేడు భాషానైపుణ్యాల్లో పరీక్షిస్తున్నది?
జ: లేఖనం

 

4. విద్యార్థుల్లో దాగి ఉన్న సహజాతాలను బహిర్గతం చేసి నడవడికను, అలవాట్లను, హస్త నైపుణ్యాన్ని, సంప్రదాయసిద్ధంగా వస్తున్న జ్ఞాన సముపార్జనాభివృద్ధికి మూల్యాంకనం తోడ్పడుతుందని అభిప్రాయపడింది ఎవరు?
జ: ఆర్.కె. కపూర్

5. విద్యార్థి 'ప్రవర్తన' గురించి తెలుసుకోవడానికి ఏది మంచి సాధనం?
జ: పరిశీలన

 

6. విద్యార్థులు తప్పులను గ్రహించే సామర్థ్యాన్ని సాధించడం ఏ ప్రశ్నల ప్రధానోద్దేశం?
జ: తప్పొప్పుల ప్రశ్నలు

 

7. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా ఏ లక్ష్యాలను మాపనం చేయలేం?
జ: రసానుభూతి, వైఖరి, అభిరుచి

 

8. 3-4 వాక్యాల్లో సమాధానం రాయగోరే ప్రశ్నలు ఏవి?
జ: లఘుసమాధాన ప్రశ్నలు

 

9. స్వల్ప వ్యవధిలో ఎలాంటి సంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది?
జ: నికష

 

10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో 'నిలుపుదలరహిత విధానాన్ని' ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టింది?
జ: 1971

 

11. బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడేది?
జ: ఇంటిపని

 

12. అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాల్లో...
జ: ఆపేక్ష, నిరపేక్షలకు గురవుతుంది.

 

13. ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసుకున్న ప్రశ్నపత్రానికి వివిధ భారత్వ పట్టికలతోపాటు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సింది ఏది?
జ: మాదిరి సమాధాన పత్రం

 

14. తరగతిలో అందరు విద్యార్థుల ఆర్జనా స్థాయితో ప్రతి విద్యార్థి ఆర్జనా స్థాయిని పోల్చడానికి తోడ్పడే నికష?
జ: సూత్రాధారిత నికష

 

15. సామర్థ్యాధారిత మూల్యాంకన నిర్వహణలో బోధనకు ముందే నిర్వహించే నికష?
జ: పూర్వ నికష

 

16. రెండో తరగతిలో మౌఖిక పరీక్షకు ఎంత శాతం భారత్వాన్నివ్వాలి?
జ: 70%

 

17. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ఏ లక్షణం?
జ: సమగ్రత

 

18. వైయక్తికమైన నికష ఏది?
       1) సంకలన నికష               2) రూపణ నికష
       3) ప్రమాణాధారిత నికష      4) సూత్రాధారిత నికష
జ: 3 (ప్రమాణాధారిత నికష)

 

19. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో 3 సరైనవి, ఒకటి సరికానిది. సరికాని దాన్ని గుర్తించే ప్రశ్న?
      1) సహసంబంధ ప్రశ్న          2) విలోమరూప ప్రశ్న
      3) బహుళైచ్ఛిక ప్రశ్న          4) తప్పొప్పుల ప్రశ్న
జ: 2 (విలోమరూప ప్రశ్న)

 

20. పాఠశాలలో సాధారణంగా నిర్వహించే పరీక్షలో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షించే రంగం?
జ: జ్ఞాన రంగం

 

21. విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణ విధానం మొదలైన వాటిని పరీక్షించడానికి వీలైంది?
జ: మౌఖిక పరీక్షలు

 

22. అంతర్గత మూల్య నిర్ధారణ అంశాలను పాఠశాల స్థాయిలో ఎలా ఇస్తారు?
జ: గ్రేడుల రూపంలో

 

23. పాఠ్య ప్రణాళిక పూర్తయ్యాక నిర్వహించే మూల్యాంకనం ఏది?
జ: సమగ్ర మూల్యాంకనం

 

24. ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక పద్యం కంఠస్థం చేసుకురమ్మన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది....?
జ: ఇంటిపని

 

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌