• facebook
  • whatsapp
  • telegram

నిష్పత్తి - అనుపాతం 

ముఖ్యమైన ప్రశ్నలు 

1. ఒక సంఖ్య 42 ను 3 : 4 నిష్పత్తిలో విభజిస్తే వచ్చే రెండు సంఖ్యల వర్గాల మొత్తం ఎంత?
జ. 900
 

2. ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణేలు 1 : 2 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ 30 రూపాయలు అయితే ఆ సంచిలో ఉన్న 5 పైసల నాణేలు ఎన్ని?
జ. 150
 

3. 84 రూపాయలను A, B లు    నిష్పత్తిలో పంచుకుంటే వారికి లభించిన వాటాల భేదం ఎంత?
జ. రూ.12
 

4. A : B = 3 : 5, B : C = 4 : 7  అయితే A : B : C = ?
జ. 12 : 20 : 35
 

5. A : B = 8 : 15, B : C = 5 : 8, C : D = 4 : 5 అయితే A : D = ?
జ. 4 : 15
 

6. a : b =  , b : c =  

 అయితే a : b : c = ?
జ. 63 : 75 : 40

7. ఒక పాఠశాలలో 6655 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలు 2420 అయితే, బాలబాలికల నిష్పత్తి ఎంత?
జ. 7 : 4
 

8. 6 లీటర్ల పెట్రోలుతో ఒక కారు 112 కి.మీ. ప్రయాణించగలదు. అయితే 272 కి.మీ. ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోలు అవసరం?
జ. 17 లీటర్లు
 

9. రోజుకు   గంటల వంతున పనిచేస్తే ఒక పని 45 రోజుల్లో పూర్తవుతుంది. రోజుకు   గంటలు పనిచేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?
జ. 33 రో.
 

10. ఒక హాస్టల్‌లో రోజూ 120 లీటర్ల పాలు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 250 మి.లీ. ఇస్తే ఆ పాలు ఎంతమందికి సరిపోతాయి?
జ. 480
 

11. 624 రూపాయలను A, B, C లు  నిష్పత్తిలో పంచుకున్నారు. B కు లభించిన వాటా ఎంత?
జ. 208 రూ.
 

12. 11 ని. 55 సెకన్లకు; 2 గం. 11 ని. 5 సెకన్లకు మధ్య నిష్పత్తి?
జ. 1 : 11

13. రెండు సంఖ్యల నిష్పత్తి 5 : 8. ప్రతి సంఖ్యకు 12 కలిపితే ఆ సంఖ్యల నిష్పత్తి 3 : 4 అయితే ఆ సంఖ్యలు?
జ. 15, 24
 

14. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన, హాజరుకాని వారి నిష్పత్తి 15 : 2. అయితే ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య?
జ. 375
 

15. 80 యాపిల్ పండ్లను A, B, C లు 2 : x : 4 నిష్పత్తిలో పంచితే A , C లకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చాయి. అయితే x విలువ?
జ. 2
 

16. కారు పార్కింగ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
a) 4 గంటలకు రూ.60     b) 8 గంటలకు రూ.100    c) 24 గంటలకు రూ.260    d) 12 గంటలకు రూ.180
కిందివాటిలో అనుపాతంలో ఉన్న జత
1) b, c      2) a, d      3) a, b       4) a, c
జ. a, d
 

17. x : y = 8 : 9, x : z = 6 : 5 అయితే y, z ల నిష్పత్తి ?
జ. 27 : 20

18. 5 మామిడి, 4 నారింజ పండ్ల ధర : 3 మామిడి, 7 నారింజ పండ్ల ధరకు సమానం. అయితే ఒక మామిడి, ఒక నారింజ ధర నిష్పత్తి ఎంత?
జ. 3 : 2

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌