• facebook
  • whatsapp
  • telegram

కొలతలు

1. 36 మీ. పొడవు, 24 మీ. వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలం చుట్టుకొలత ఎంత?
జ‌: 120 మీ.
 

2. ఒక దీర్ఘచతురస్రాకార పొలం పొడవు, వెడల్పులు వరుసగా 22.5 మీ, 14.5 మీ. దీని చుట్టూ కంచె వేయడానికి మీటరుకు రూ.6 వంతున ఎంత ఖర్చు అవుతుంది?
: రూ.444
 

3. చుట్టుకొలత 32 సెం.మీ. అయ్యే విధంగా వేర్వేరు పొడవు, వెడల్పులు ఉండే దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని నిర్మించగలం?
జ‌: 8
 

4. 250 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేసేందుకు మీటరుకు 20 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది?
జ‌: రూ.20,000
 

5. ఒక త్రిభుజ భుజాలు వరుసగా 12 సెం.మీ., 14 సెం.మీ. దాని చుట్టుకొలత 36 సెం.మీ. అయితే మూడో భుజం ఎంత?
జ‌: 10 సెం.మీ.

6. 24 సెం.మీ. పొడవు గల తీగతో పొడవు, వెడల్పులు పూర్ణ సంఖ్యలుగా ఉండే వేర్వేరు కొలతలు గల దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని ఏర్పర్చగలం?
జ‌: 6
 

7. 8 మీటర్ల పొడవు గల చతురస్రం వైశాల్యం ఎంత?
జ‌: 64 చ.మీ.
 

8. 4 మీటర్ల పొడవు, 68 సెం.మీ. వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం (చ.సెం.మీ.లలో) ఎంత?
జ‌: 27200
 

9. 40 మీటర్ల పొడవు గల ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం 1120 చ.మీ. అయితే దాని వెడల్పు ఎంత?
జ‌: 28 మీ.
 

10. ఒక దీర్ఘచతురస్రాకార పొలం పొడవు 60 మీ. దాని వెడల్పు దాని పొడవులో సగమైతే దాని వైశాల్యం ఎంత?
జ‌: 1800 మీ2
 

11. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాటు వైశాల్యం 2400 చ.మీ. దాని పొడవు, వెడల్పులు 3 : 2 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత ఎంత?
జ‌: 200 మీ.
 

12. చతురస్రం, దీర్ఘచతురస్రం చుట్టుకొలతలు సమానం. చతురస్ర భుజం 72 మీ., దీర్ఘచతురస్రం పొడవు 80 మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
జ‌: 5120 మీ2

13. ఒక దీర్ఘచతురస్రాకార నేల పొడవు, వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 280 మీటర్లు అయితే దాని పొడవు ఎంత?
జ‌: 80 మీ.
 

14. 120 మీ. భుజం గల ఒక చతురస్రాకార పొలాన్ని గడ్డి మైదానంగా మార్చేందుకు చదరపు మీటరుకు రూ.35 వంతున ఎంత ఖర్చవుతుంది?
జ‌: రూ.5,04,000
 

15. ఒక చతురస్ర వైశాల్యం 49 చ.సెం.మీ. దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం పొడవు 9.3 సెం.మీ. అయితే దీర్ఘచతురస్రం వెడల్పు ఎంత?
జ‌: 4.7 సెం.మీ.
 

16. సమాంతర చతుర్భుజం భూమి 4 మీ., ఎత్తు 3 మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
జ‌: 12 చ.మీ.
 

17. సమాంతర చతుర్భుజం భూమి 6 మీ., ఎత్తు 13 మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
జ‌: 78 చ.మీ.
 

18. ఒక సమాంతర చతుర్భుజం ఎత్తు దాని భూమిలో 1/3వ వంతు ఉంది. సమాంతర చతుర్భుజం వైశాల్యం 192 సెం.మీ.2 అయితే దాని ఎత్తు ఎంత?
జ‌: 8 సెం.మీ.

19. ఒక సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తులు 5 : 2 నిష్పత్తిలో ఉన్నాయి. సమాంతర చతుర్భుజం వైశాల్యం 360 చ.మీ. అయితే దాని భూమి, ఎత్తులు వరుసగా
జ‌: 30 మీ., 12 మీ.
 

20. ఒక త్రిభుజం భూమి 13 సెం.మీ., ఎత్తు (h) 6 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
జ‌: 39 చ.సెం.మీ.
 

21. ఒక త్రిభుజం భూమి 8 సెం.మీ., దాని వైశాల్యం 24 సెం.మీ.2 అయితే దాని ఎత్తు ఎంత?
జ‌: 6 సెం.మీ.
 

22. ఒక సమ చతుర్భుజం కర్ణాలు 7.5 మీ., 5.6 మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
జ‌: 21 చ.సెం.మీ.
 

23. ఒక సమచతుర్భుజం వైశాల్యం 60 సెం.మీ.2. దాని ఒక కర్ణం 8 సెం.మీ. అయితే రెండో కర్ణం ఎంత?
జ‌: 15 సెం.మీ.
 

24. ఒక భవన నేలపై సమచతుర్భుజాకారంలో ఉండే 300 టైల్స్‌ను పరిచారు. ఒక్కో టైల్ కర్ణాలు 45 సెం.మీ., 30 సెం.మీ. ఒక చదరపు మీటరు వైశాల్యం గల నేలను పాలిష్ చేయడానికి రూ.25 ఖర్చు అయితే మొత్తం పాలిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
జ‌: రూ.5062.50

25. ఒక సమచతుర్భుజం వైశాల్యం 216 చ.సెం.మీ. ఒక కర్ణం 24 సెం.మీ. అయితే ఆ చతుర్భుజం రెండో కర్ణం ఎంత?
జ‌: 18 సెం.మీ.
 

26. 10 సెం.మీ. వ్యాసం గల వృత్తం చుట్టుకొలతను కనుక్కోండి.
జ‌: 31.4 సెం.మీ.
 

27. 14 సెం.మీ. వ్యాసార్ధం గల వృత్తం చుట్టుకొలత ఎంత?
జ‌: 86 సెం.మీ.
 

28. ఒక వృత్తం చుట్టుకొలత 264 సెం.మీ. అయితే దాని వ్యాసార్ధం ఎంత?
జ‌: 42 సెం.మీ.
 

29. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3 : 4 అయితే దాని చుట్టుకొలతల నిష్పత్తి ఎంత?
జ‌: 3 : 4
 

30. ఒక రోడ్డు రోలరు 2200 మీటర్ల దూరాన్ని చదును చేయడానికి 200 చుట్లు తిరుగుతుంది. అయితే ఆ రోలర్
వ్యాసార్ధం ఎంత?
జ‌: 1.75 మీ.

Posted Date : 28-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌