• facebook
  • whatsapp
  • telegram

జంతు ప్రపంచం-మానవునిలో ప్రత్యుత్పత్తి

1. కిందివాటిలో సరికానిది (గర్భావది కాలాలు)
      ఎ) కుక్క - 63       బి) పిల్లి - 83       సి) గుర్రం - 330       డి) ఎలుక 20 - 22
జ: బి(పిల్లి - 83)
2. ఉభయ లైంగిక జీవికి ఉదాహరణ
జ: వానపాము
3. స్త్రీలలో ప్రతి రుతుచక్రంలో విడుదలయ్యే అండాల సంఖ్య
జ: 1
4. గర్భధారణ జరిగిన తర్వాత ఎన్నో వారంలో పిండం లింగాన్ని నిర్ధారిస్తారు.
జ: 6వ
5. గర్భధారణ జరిగిన ఎన్ని వారాలకు ముఖ్యమైన భాగాలు ఏర్పడతాయి?
జ: 12

6. మానవుల్లో శుక్రకణం, అండాన్ని ఫలదీకరణం చెందించే భాగం ఏది?
జ: పాలోపియన్ నాళం
7. బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు
జ: కప్ప, చేప, వానపాము
8. పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం కానిది
జ: పాలోపియన్‌నాళం
9. కార్పస్ లూటియం అని కిందివాటిలో దేన్ని పిలుస్తారు?
        ఎ) విడుదలైన అండాన్ని                         బి) గ్రాఫియన్ పుటికను
        సి) పగిలిన గ్రాఫియన్ పుటికను               డి) పగిలిన స్త్రీ బీజవాహికను
జ: సి(పగిలిన గ్రాఫియన్ పుటికను)
10. అంతర ఫలదీకరణం జరుపుకోని జీవి
జ: వానపాము
11. స్త్రీ ప్రత్యుత్పత్తిలోని ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి?
జ: స్త్రీ బీజకోశం
12. గర్భధారణ జరిగిన మూడో నెల నుంచి పిండాన్ని ఏమంటారు?
జ: భ్రూణం

13. శుక్రకణానికి ఉండే ఏక్రోసోమ్ ఏ చర్యలో తోడ్పడుతుంది?
జ: ఫలదీకరణ
14. వైరస్ ద్వారా సంక్రమించని లైంగిక వ్యాధులు
జ: గనేరియా సిపిలిస్
15. మన రాష్ట్రంలో పెంచే ముర్రాజాతి పశువులు ఇచ్చే పాలు
జ: 8 లీ/రోజు
16. యాంత్రిక అఘాతాల నుంచి పిండాన్ని రక్షించేది?
జ: ఉల్బం
17. ఇయాన్ విల్మట్ క్లోనింగ్ ద్వారా 'డాలీ' అనే గొర్రె పిల్లను సృష్టించిన సంవత్సరం?
జ: జులై 5, 1996
18. పిండంలో హృదయస్పందన ప్రారంభమయ్యే రోజు
జ: 21వ రోజు
19. శుక్రకణాన్ని అండంతో కలిపే 'ఏక్రోసోమ్' శుక్రకణంలో ఏ భాగంలో ఉంటుంది?
జ: తల
20. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థతో ''శుక్ర కణాలు" దేని నుంచి ఉత్పత్తి అవుతాయి?
జ: శుక్రోత్పాదక నాళికలు

21. పిండ కణాలు, తల్లి కణాలు కలిసి మూడో నెలలో ఏర్పడే నిర్మాణం పేరు?
జ: జరాయువు
22. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కౌపర్ గ్రంథులు, పౌరుష గ్రంథుల సంఖ్యలు వరుసగా
జ: 2, 1
23. టెస్ట్‌ట్యూబ్ బేబి విధానం రూపకర్త?
జ: పాట్రిక్‌స్టెప్టో
24. అండం జీవితకాలం?
జ: 1 రోజు
25. మానవుడి శరీరంలో అత్యంత చిన్న కణం
జ: శుక్రకణం


రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌