• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో ఆర్థిక ప్రాముఖ్యత

1. ఏ గేదెల పాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టకపోయినా వారం రోజుల పాటు చెడిపోకుండా, ఉప్పగా ఉంటాయి?
జ‌: చిల్కా
2. కోడి మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
జ‌: 5
3. కిందివాటిలో సరికానిది
    ఎ) తేనెటీగలు - ఎపీ కల్చర్        బి) పట్టుపురుగులు - సెరీకల్చర్
   సి) వర్మీ కల్చర్ - వానపాములు     డి) ఏదీకాదు
జ‌: డి (ఏదీకాదు)
4. 'ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి' అని నినాదం చేసింది
జ‌: NECC
5. కిందివాటిలో దేశీయ కోడి రకానికి చెందింది?
    ఎ) అసిల్             బి) చిత్తగాంగ్          సి) లాంగ్‌షాన్       డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

6. తేనెపట్టులో మగ ఈగల ప్రధాన విధి
జ‌: సంపర్కంలో పాల్గొనడం
7. సరికాని జత
    ఎ) ఎద్దు మాంసం - బీఫ్       బి) పందిమాంసం - ఫోర్క్
     సి) పొట్టేలు - మటన్        డి) ఏదీకాదు
జ‌: డి (ఏదీకాదు)
8. పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం ఈ పథకం ఉద్దేశం
జ‌: ఆపరేషన్ ఫ్లడ్
9. కృత్రిమంగా గుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పరికరం
జ‌: ఇంక్యుబేటర్
10. పశువుల్లో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి
జ‌: గాలికుంటు వ్యాధి
11. ఏ జీవుల విషం నుంచి 'ఎపిస్ టింక్చర్' అనే ఉప ఉత్పత్తి తయారవుతుంది?
జ‌: తేనెటీగలు
12. నదీ నీరు, సముద్రపు నీరు కలిసే నదీముఖ ప్రదేశం
జ‌: ఎశ్చుయరీస్

13. పశువులు ఈనిన తర్వాత ఎన్ని గంటల వరకు ఇచ్చే పాలను 'జున్ను పాలు' అంటారు.
జ‌: 72 గంటలు
14. ఒక కకూన్ నుంచి లభించే పట్టుదారం పొడవు
జ‌: 1000 - 3000 అడుగులు
15. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రపంచంలో రెండో పెద్దపక్షి
జ‌: ఈమూ
16. 'పట్టు మాత్‌'లను అమ్మే కేంద్రాన్ని ఏమంటారు?
జ‌: గ్రైనేజస్
17. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఇచ్చే ముర్రా జాతి జన్మస్థలం
జ‌: భారతదేశం
18. కిందివాటిలో రైతు మిత్రుడిగా పరిగణించనిది
       ఎ) చీమ       బి) సాలె పురుగు     సి) టైక్రోగ్రామా       డి) ఎలుక
జ‌: డి (ఎలుక)
19. భారతదేశం సముద్రతీరం పొడవు దాదాపుగా
జ‌: 7500 కి.మీ.

20. పరిశ్రమలో 'పైకో కొల్లాయిడ్‌'గా ఉపయోగపడే అగార్ అగార్ అనేది
జ‌: సముద్రంలోని కలుపు
21. 'కకూన్‌'లను వేడి నీటిలో ఉంచి డింభకాలను చంపే విధానాన్ని ఏమంటారు?
జ‌: స్టిప్పింగ్
22. చేప మాంసంలో లభించే విటమిన్స్
జ‌: A, D
23. కిందివాటిలో మంచినీటి చేప
       ఎ) బాంబేతక్     బి) కాట్ ఫిష్        సి) సార్‌డైన్స్      డి) బొచ్చె
జ‌: డి(బొచ్చె)
24. పట్టు పురుగు జీవిత చరిత్రలో ఏ దశలో మార్కెట్‌కు తరలిస్తారు?
జ‌: కకూన్‌లను
25. తేనెపట్టులో అత్యధిక జీవితకాలం ఉండే ఈగలు
జ‌: రాణి ఈగలు
26. పోషక విలువలన్నీ ఉండి చౌకగా లభించే ఆహారం ఏది?
జ‌: గుడ్డు

27. వివిధ రకాల చేప జాతులను కలిపి ఒక ప్రదేశంలో పెంచడాన్ని ఏమంటారు?
జ‌: సమ్మిళిత చేపల పెంపకం
28. మానవుడు ఎన్ని సంవత్సరాల కిందట కుక్కను మచ్చిక చేసుకున్నాడు?
జ‌: క్రీ.పూ. 3000 - 7000
29. డాక్టర్ కురియన్ ......... పితామహుడు.
జ‌: శ్వేత విప్లవం
30. కోడిపందేల కోసం పెంచే కోడి
జ‌: ఆసిల్
31. పాశ్చరైజేషన్‌లో పాలను ఎంత ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు?
జ‌: 62ºC
32. ఏ ప్రాంత పట్టును 'టై అండ్ డై' అని పిలుస్తారు?
జ‌: పోచంపల్లి
33. ఏ తేనెటీగ సంవత్సరానికి 25 - 30 కిలోల తేనెను తయారు చేస్తుంది?
జ‌: ఎపిస్ మెల్లిఫెరా
34. కోడిగుడ్లను పొదిగించేందుకు అనువైన ఉష్ణోగ్రత
జ‌: 37 - 38ºC
35. కిందివాటిలో వెన్న శాతం ఎక్కువగా ఉండే పశుజాతి
ఎ) హోలోస్టీన్ బి) జెర్సి సి) ఒంగోలు గిత్త డి) ముర్రా
జ‌: డి (ముర్రా)

36. జున్ను పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం
జ: కోలోస్ట్రమ్
37. మానవుడికి మొదటగా మచ్చికైన జంతువు
జ‌: కుక్క
38. వరి పొలాల్లో చేపలను పెంచటం ద్వారా ఏ పురుగును అదుపులో పెట్టవచ్చు?
జ‌: కాండం తొలుచు
39. పాలలో లభించే విటమిన్
జ‌: A, D, E
40. నీటి ఉపరితలం నుంచి ఆహారాన్ని సేకరించే చేప
జ‌: జెల్ల

 
రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌