• facebook
  • whatsapp
  • telegram

ఆమ్లాలు, క్షారాలు

1. అయనీకరణం ప్రాతిపదికన ఆమ్లాలు, క్షారాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: అర్హీనియస్

 

2. బలహీన ఆమ్లాల అయనీకరణ పరిమాణ శాతం?
జ: 100% కంటే తక్కువ

 

3. ఆమ్లాలు నారింజ రంగులోని మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగులోకి మారుస్తాయి?
జ: ఎరుపు

 

4. pH + pOH విలువ ఎంత?
జ: 14

 

5. నీటి అయానిక లబ్ధం దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: ఉష్ణోగ్రత

 

6. pH విలువ '3' ఉన్న ద్రావణంలోని H+ అయాన్‌ల గాఢత ఎంత?
జ: 10-3

 

7. మానవ రక్తం pH విలువ సుమారు 7.4, ఇది.......
జ: బలహీన క్షారం

 

8. ఒక NaOH ద్రావణం గాఢత 10-4 M అయితే ఆ ద్రావణ pH విలువ ఎంత?
జ: 10

 

9. అన్ని ఆమ్లాలలో ఉండే మూలకం ఏది?
జ: హైడ్రోజన్

 

10. 'Kw' అంటే ఏమిటి?
జ: అయానిక లబ్ధం
 

11. పంటలు సరిగ్గా పండటానికి, మట్టిలో ఆమ్లత్వాన్ని నిరోధించడానికి కలిపేది?
జ: సున్నపురాయి

 

12. కిందివాటిలో అర్హీనియస్ క్షారం కానిది ఏది?
       ఎ) NH3     బి) NaOH      సి) Ca(OH)2     డి) Mg(OH)2
జ: NH3 

 

13. తటస్థీకరణ చర్యలో ఒక మోల్ నీటి అణువు ఏర్పడినప్పుడు వెలువడే ఉష్ణం ఎంత (కిలో కేలరీల్లో)?
జ: 13.7

 

14. ఆమ్లాలు కార్బొనేట్‌తో చర్య జరిపితే వెలువడే వాయువు ఏది?
జ: CO2

 

15. [H+] = 1 × 10-4 గా ఉన్న ఆమ్ల ద్రావణ pH ఎంత?
జ: +4

 

16. క్షార ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు ఏది?
జ: గులాబీ

 

17. గ్యాస్ట్రిక్ ఆమ్ల pH విలువ ఎంత?
జ: 1 - 2

 

18. 'NaCl' ద్రావణ pH విలువ ఎంత?
జ: 7

 

19. HCl, H2SO4, CH3COOH లను వాటి బాష్పశీలత క్రమంలో రాసినట్లయితే, కిందివాటిలో సరైంది ఏది?
ఎ) CH3COOH > HCl > H2SO4
బి) HCl > H2SO4 > CH3COOH
సి) H2SO4 > HCl  > CH3COOH
డి) ఏదీకాదు
జ: CH3COOH > HCl > H2SO4

20. 25ºC వద్ద 'Kw' విలువ ఎంత?
జ: 1.0 × 10-14

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌