సమస్యలు
1. 0.24 గ్రా. సంయోగ పదార్థంలో 0.144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటనల శాతాన్ని భారం పరంగా కనుక్కోండి.
సాధన: బోరాన్ ఆక్సైడ్ బోరాన్ + ఆక్సిజన్
0.24 గ్రా. 0.096 + 0.144 గ్రా.
ఆక్సిజన్ భారశాతం = 100 - 40 = 60
2. 112 గ్రాముల కాల్షియం ఆక్సైడ్‌కు కార్బన్ డయాక్సైడ్‌ను కలిపితే 200 గ్రా. CaCO3 ఏర్పడింది. ఈ చర్యలో వాడిన కార్బన్ డయాక్సైడ్‌ను లెక్కించండి.
సాధన: CaO + CO2

112 గ్రా. + x 200 గ్రా.
x + 112 = 200
x = 200 - 112 = 88 గ్రా.
3. 0.5 మోల్‌ల N2 వాయువు ద్రవ్యరాశిని లెక్కించండి.
సాధన: N2 అణుద్రవ్యరాశి = 28
1 మోల్ N2 ద్రవ్యరాశి = 28
0.5 మోల్‌ల N2 ద్రవ్యరాశి = 0.5 × 28 = 14 గ్రా.
4. 3.011 × 1023 N పరమాణువుల ద్రవ్యరాశిని లెక్కించండి.
సాధన: 1 మోల్ N ద్రవ్యరాశి = 14
6.022 × 1023 పరమాణువుల ద్రవ్యరాశి = 14
5. సల్ఫ్యూరిక్ ఆమ్లం మోలార్ ద్రవ్యరాశిని లెక్కించండి.
సాధన: H2SO4 = 2 (H) + (S) + 4 (O)
= 2(1) + 32 + 4 (16)
= 2 + 32 + 64
= 98 U
మోలార్ ద్రవ్యరాశి = 98 గ్రా.
6. గ్లూకోజ్ మోలార్ ద్రవ్యరాశి లెక్కించండి.
సాధన: C6H12O6 = 6 (C) + 12 (H) + 6 (O)
= 6(12) + 12(1) + 6(16)
= 72 + 12 + 96
= 180 U
గ్లూకోజ్ మోలార్ ద్రవ్యరాశి = 180 గ్రా.
7. 8 గ్రాముల O2లో ఉన్న కణాల సంఖ్యను లెక్కించండి.
సాధన: O2 ద్రవ్యరాశి = 32 U, మోలార్ ద్రవ్యరాశి = 32 గ్రా.
32 గ్రా. ఆక్సిజన్‌లోని కణాలు = 6.022 × 1023
8 గ్రా. O2 లోని కణాల సంఖ్య = 8/32 × 6.022 × 1023
= 1.505 × 1023
8. 22 గ్రా. కార్బన్ డయాక్సైడ్‌ను మోల్‌లోకి మార్చండి.
సాధన: CO2 మోలార్ ద్రవ్యరాశి = 44 గ్రా.
44 గ్రా. CO2 = 1 మోల్ CO2
22 గ్రా. CO2 = 22/44 × 1 = 0.5 మోల్ CO2.