• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్రం - బోధన సామగ్రి  

1. పటాల్లో సముద్రాలను ఏ రంగుతో సూచిస్తారు?
జ: నీలం

 

2. కింది పటాల్లో సమతల పటం ఏది?
1) గ్లోబు              2) రిలీఫ్ పటం           3) స్లైడులు           4) రాజకీయ పటం
జ: రాజకీయ పటం

 

3. 'పటాల ద్వారా 90% శాతం భౌగోళిక సమాచారాన్ని తెలుసుకోవచ్చు' అని పేర్కొన్న రచయిత ఎవరు?
జ: ఫెయిర్ గ్రీన్

 

4. 'మ్యాపు' అనేది ఏ రకపు ఉపకరణం?
జ: గ్రాఫిక్స్

 

5. మ్యాపుల్లో యుద్ధక్షేత్రాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు?
జ: 
 
 

6. ప్రత్యేకించి ఎత్తుపల్లాలను స్పష్టంగా చూపడానికి ఉపయోగించే ఉపకరణం ఏది?
జ: రిలీఫ్ ఉపకరణం

 

7. దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులను చూపడానికి తరగతి గదిలో వినియోగించే పటం ఏది?
జ: రాజకీయ పటం

 

8. 'విద్యార్థి భారతదేశ చిత్రపటాన్ని గీసెను' అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: నైపుణ్యం

 

9. 'పటాల్లో వివిధ భాగాలను గుర్తించడం' అనేది ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?
జ: నైపుణ్యం

 

10. పటంలో కుడిభాగం ఏ దిక్కును సూచిస్తుంది?
జ: తూర్పు

 

11. కిందివాటిలో పట నైపుణ్యానికి సంబంధించిన కృత్యమేది?
1) పటం చదవడం        2) పటాన్ని భద్రపరచడం        3) పటంలో రంగులు వేయడం         4) పైవన్నీ
జ: పైవన్నీ

 

12. పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి బోధించడానికి ఉపయోగించే పటం ఏది?
జ: భౌతిక పటం

 

13. ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, పంటలు మొదలైన వాటిని సూచించే పటాలను ఏ రకపు పటాలని పిలుస్తారు?
జ: ప్రత్యేక ప్రయోజనం ఉండే పటాలు

 

14. విద్యార్థుల్లో సాంఘికశాస్త్ర బోధన అనంతరం లేదా పరీక్షల సంధర్భంలో పట నైపుణ్యాలను పరీక్షించడానికి వినియోగించే పటాలేవి?
జ: ఆవరణ రేఖా పటాలు

 

15. కాగితం, గుడ్డ లేదా అట్టపై పరిచినట్లుగా సూచించే పటాలను ఏమంటారు?
జ: ఫ్లాట్ మ్యాపులు

 

16. భూస్వరూపాలను నిర్దిష్ట ఎత్తులు, రంగుల్లో సూచించడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే మ్యాపులు ఏవి?
జ: రిలీఫ్ పటాలు

 

17. ఒకే పటంలో భౌగోళిక, రాజకీయ అంశాలను చూపడానికి వినియోగించే మ్యాప్ ఏది?
జ: భౌతిక - రాజకీయ పటం
 

18. ఒక ప్రాంత నైసర్గిక రూపం, ప్రజల భాష, ఆర్థిక కార్యకలాపాలు, అక్షరాస్యత లాంటి అంశాలను చూపడానికి ఉపయోగించే పటాలేవి?
జ: విషయ నిర్దేశిత పటాలు

 

19. ప్రజలు భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే పటాలను ఏమని పిలుస్తారు?
జ: భూమి వినియోగ పటాలు

 

20. అక్బర్ పరిపాలనా కాలాన్ని (1556- 1605) బోధించడానికి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా నీవు ఏ పటాన్ని వినియోగిస్తావు?
జ: చారిత్రక, సమకాలీన, అవుట్‌లైన్ మ్యాపులు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌