• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ చరిత్ర

        భారత జాతీయోద్యమంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉంది. వీటికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, తేదీలను క్లుప్తంగా తెలుసుకుందాం...
 

రాజకీయ సంస్థల ఏర్పాటు
 

1851 - కలకత్తాలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్
1852 - బొంబాయిలో బాంబే అసోసియేషన్
1866 - లండన్‌లో ఈస్టిండియన్ అసోసియేషన్
1885 - బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్

 

ముఖ్యమైన తేదీలు
 

1885 - 1905 - మితవాదుల దశ
1905 - 1919 - అతివాదుల దశ
1919 - 1947 - గాంధీదశ
1905 - బెంగాల్ విభజన
1906 - ముస్లింలీగ్ స్థాపన
1907 - సూరత్ కాంగ్రెస్ సమావేశం
1909 - మింటోమార్లే సంస్కరణలు
1911 - బెంగాల్ విభజన రద్దు

1915 - గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు
1915 - హిందూ మహాసభ ఏర్పడింది
1916 - హోమ్‌రూల్ ఉద్యమం (అనిబిసెంట్), లక్నో ఒడంబడిక.
1917 - భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా అనిబిసెంట్ ఎన్నిక, బీహార్‌లో గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం.
1918 - గాంధీజీ అహ్మదాబాద్ (గుజరాత్)లోని నూలుమిల్లును సందర్శించారు
1919 మార్చి - రౌలత్ చట్టం
1919 ఏప్రిల్ 13 - జలియన్ వాలాబాగ్ దురంతం
1919 - మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు
1919 అక్టోబరు 17 - ఆల్ ఇండియా ఖిలాఫత్ డే
1920 - సహాయ నిరాకరణోద్యమం
1922 డిసెంబరు 31 - స్వరాజ్‌పార్టీ స్థాపన
1922 ఫిబ్రవరి 5 - చౌరీచౌరా సంఘటన
1927 - సైమన్ కమిషన్ ఏర్పాటు
1929 - లాహోర్ కాంగ్రెస్ సమావేశం
1930 - మార్చి 12: ఉప్పు సత్యాగ్రహం/ దండి సత్యాగ్రహం
1930 - మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం
1931 - గాంధీ - ఇర్విన్ ఒప్పందం
1931 - సెప్టెంబరు 7: రెండో రౌండ్‌టేబుల్ సమావేశం
1932 - నవంబరు 17: మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1932 - సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు, పుణె ఒడంబడిక.
1935 - భారత ప్రభుత్వ చట్టం 1935
1940 - ఆగస్టు ప్రతిపాదన, కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత సత్యాగ్రహాలు
1942 - క్రిప్స్ మిషన్ ఏర్పాటు
1942, ఆగస్టు 8 - క్విట్ఇండియా ఉద్యమం
1946 - క్యాబినెట్ మిషన్ ప్లాన్
1946 - తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు
1946 - జులై - రాజ్యాంగ సభకు ఎన్నికలు
1947 - మార్చి - మౌంట్‌బాటన్ ప్రణాళిక
1947 - ఆగస్టు 14 అర్ధరాత్రి - స్వాతంత్య్ర ప్రకటన

 

ముఖ్యమైన అంశాలు
 

* ప్రార్థన, అభ్యర్థన, నిరసన - మితవాదుల పద్ధతులు
* విభజించు, పాలించు - బ్రిటిషర్ల విధానం
* భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు - ఎ.ఒ.హ్యూమ్
* భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు - డబ్ల్యు.సి.బెనర్జీ
* బెంగాల్ విభజనకు కారకుడు - లార్డ్ కర్జన్
* అతివాద త్రయం - లాల్, బాల్, పాల్
* స్వరాజ్యం నా జన్మహక్కు - తిలక్
* ఇంక్విలాబ్ జిందాబాద్ - భగత్‌సింగ్
* సాధించు లేదా మరణించు - గాంధీ నినాదం
* కైజర్ - ఐ - హింద్ - గాంధీ బిరుదు
* మోప్లా తిరుగుబాటు - కేరళ
* హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపకులు - సచిన్ సన్యాల్, జోగేష్ చటర్జీ
* కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు - రాంప్రసాద్ బిస్‌మిల్
* లాహోర్ కుట్రకేసు - భగత్‌సింగ్
* సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో మరణించింది - లాలా లజపతిరాయ్
* లజపతిరాయ్ మరణానికి కారకుడు - సాండర్స్
* దక్షిణ భారతదేశంలో తిరుచినాపల్లి నుంచి వేదారణ్యం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్ర జరిపింది - రాజగోపాలాచారి
* వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ నాయకుడు - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
* గాంధీజీ రూపొందించిన విద్యావిధానం - బేసిక్ విద్య
* భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ప్రజల సహకారం పొందిన వ్యక్తి - వి.కె.కృష్ణమీనన్
* గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా - దాదాబాయ్ నౌరౌజీ
* 1927 లో బెల్జియంలోని బ్రెస్సెల్స్ పట్టణంలో జరిగిన 'అణచివేతకు గురైన జాతుల మహాసభ'కు హాజరైన నేత
- జవహర్‌లాల్ నెహ్రూ
* 1927లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు సెక్రటరీగా ఎన్నికైంది - బల్వంత్‌రాయ్ మెహతా
* 1939 లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది - నెహ్రూ
* వ్యక్తి సత్యాగ్రహం చేసిన మొదటివ్యక్తి - వినోబాభావే
* క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు - పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్
* తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెహ్రూను ఆహ్వానించిన వైస్రాయి - వేవెల్
మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి - కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌