• facebook
  • whatsapp
  • telegram

వరదలు - కరవు కాటకాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలు

1. పత్తి పరిశోధనా కేంద్రం - కర్నూలు జిల్లా నంద్యాల
2. చెరకు పరిశోధనా కేంద్రం - విశాఖపట్నం జిల్లా అనకాపల్లి
3. మిరప పరిశోధనా కేంద్రం - గుంటూరు జిల్లా లాం
4. పొగాకు పరిశోధన కేంద్రం - తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి

 

ఖనిజాలు - లభించే ప్రాంతాలు

1. బంగారం - అనంతపురం జిల్లాలోని రామగిరి
2. వజ్రాలు - అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్
3. రాగి - గుంటూరు జిల్లాలోని అగ్నిగుండాల
4. అభ్రకం - నెల్లూరు జిల్లాలోని గూడూరు, రాపూర్
          కురవాల్సిన దానికంటే ఎక్కువ వర్షం కురిస్తే అతివృష్టి అంటారు. అతివృష్టి వల్ల నదులకు వరదలు సంభవిస్తాయి. కురవాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని అనావృష్టి లేదా కరవు అంటారు.
సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని కరవుగా పేర్కొంటారు.
 రాయలసీమ ప్రాంతంలో తరచూ కరవు నెలకొంటుంది. రాష్ట్రం మొత్తం మీద 11 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

 

కరవు ప్రాంత జిల్లాలు

 

అడవులు- సహజ వృక్షజాలం

* ఆంధ్రప్రదేశ్ అడవుల వైశాల్యం: 44,637 చ.కి.మీ.
* జాతీయ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో అడవులు 33% శాతం ఉండాలి.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్యంలో అడవుల శాతం: 16.23%
* అడవుల విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో 19వ స్థానంలో ఉంది.
* అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా- ఖమ్మం.
* అత్యల్ప అటవీ ప్రాంతం ఉన్న జిల్లా- కృష్ణా.
* రాష్ట్రంలోని అడవులను నేలలు, వర్షపాతం, ఉష్ణోగ్రత ఆధారంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు.
1. ఆర్ధ్ర ఆకురాల్చే అడవులు (Moist Deciduous)
2. అనార్ధ్ర ఆకురాల్చే అడవులు (Dry Deciduous)
3. చిట్టడవులు (Throny Forests)
4. క్షారజల అడవులు (Tidal Forests)
* అడవుల విస్తరణ ముఖ్యంగా వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆకురాల్చే అడవులు 75 సెం.మీ నుంచి 200 సెం.మీ వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో పెరుగుతాయి.
బి) తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ముళ్లతో కూడిన పొద అడవులు పెరుగుతాయి. వీటిని చిట్టడవులు అంటారు. వీటిలో తుమ్మ, రేగు, చండ్ర, బలుసు లాంటి వృక్షజాతులు పెరుగుతాయి.
సి) సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే అరణ్యాలను టైడల్ అడవులు అని పిలుస్తారు. ఈ అరణ్యాల్లో పొన్న, మడ, మొగలి వృక్షజాతులు పెరుగుతాయి.
* ప్రపంచంలో ఎక్కడా లభించని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం కొండల్లోనే లభిస్తోంది.
* నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో దొరికే సువాసనభరితమైన రూసాగడ్డితో సుగంధ నూనెను తయారు చేస్తున్నారు.
* చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అడవుల్లో విలువైన గంధం చెట్లు పెరుగుతున్నాయి.

 

సామాజిక అడవుల కార్యక్రమం

సామాజిక అడవులు పెంచే కార్యక్రమాన్ని అయిదో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించినా, ఆరో పంచవర్ష ప్రణాళికలోనే ఎక్కువ ప్రోత్సాహం లభించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో అడవులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే నెలకొని ఉన్నాయి. దక్షిణాన తిరుపతి నుంచి ఉత్తరాన సింహాచలం వరకు విస్తరించిన కొండల్లో అడవులు వ్యాపించి ఉన్నాయి.
* నల్లమల అడవులు మన రాష్ట్రంలోనే అతిపెద్ద అడవులు.

 

మృత్తికలు

          శిలా శిథిలాలతో జంతు, వృక్ష సంబంధమైన శిథిలాలు కలిసినప్పుడు మృత్తికలు ఏర్పడతాయి. సాధారణంగా ఒక దేశ సౌభాగ్యం ఆ దేశ మృత్తికలపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 4 రకాల మృత్తికలు విస్తరించి ఉన్నాయి.
మృత్తికా క్రమక్షయం: సారవంతమైన మృత్తికల పైపొర కొట్టుకుపోవడాన్ని 'మృత్తికా క్రమక్షయం' అంటారు. వర్షం, ఉష్ణోగ్రత, గాలి, నదులు, సముద్ర తరంగాలు, ప్రవాహాలు లాంటి ప్రకృతి శక్తులు మృత్తికలను క్రమంగా శిథిలం చేసి, వేరే చోటికి తీసుకువెళ్లడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.

 

మృత్తికా క్రమక్షయం - కారణాలు

1. అడవులను విచక్షణారహితంగా నరికివేయడం
2. పచ్చికబయళ్లలో పశువులను అతిగా మేపడం.
3. అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించడం.

 

దుష్ఫలితాలు:

1. భూసారం తగ్గిపోతుంది
2. నీటిపారుదల కాల్వలు, నదీ మార్గాలు పూడుకుపోతాయి
3. నీటిపారుదల మార్గాలు పూడిపోయి, వాటి ఎత్తు పెరగడంతో వరదలు వచ్చి పంటలు, ఆస్తి నష్టాలు సంభవిస్తాయి.

 

సంరక్షణ చర్యలు

1. కాంటూరు బండింగ్ నిర్మించడం
2. సోపాన వ్యవసాయం చేయడం
3. కొండవాలు భాగంలో మొక్కలు, గడ్డి పెంచడం
4. చెట్లను నాటి, అడవులను అభివృద్ధి చేయడం

 

ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉన్న మృత్తికలు, పండే పంటలు
 

సామాజిక అడవుల పెంపకం ఉద్దేశాలు

*  వాతావరణ సమతౌల్యాన్ని సంరక్షించడం
* అటవీ సంపదను పెంచి, పలురకాల పరిశ్రమలను ప్రోత్సహించడం
* భూ క్రమక్షయాన్ని అరికట్టడం
* వాతావరణ కాలుష్యాన్ని నివారించడం
* పరిసరాలను సంరక్షించుకోవడం
* వంటచెరకు, పశుగ్రాసం, కలప అభివృద్ధి కోసం
* వన్యప్రాణులను సంరక్షించి జీవవైవిధ్యాన్ని కాపాడటం

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌