• facebook
  • whatsapp
  • telegram

పట్టణ ప్రాంతంలో - స్థానిక స్వపరిపాలన

1. నగర పంచాయతీ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంత ఉండాలి?
జ: 20,000

 

2. మున్సిపాలిటీ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంత ఉండాలి?
జ: 40,000

 

3. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంతకు పైబడి ఉండాలి?
జ: 3 లక్షలు

 

4. మున్సిపాలిటీలో వార్డు ప్రతినిధిని ఏమంటారు?
జ: కౌన్సిలర్

 

5. కార్పొరేషన్‌లో డివిజన్ ప్రతినిధిని ఏమంటారు?
జ: కార్పొరేటర్

 

6. మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి ఎవరు?
జ: ఛైర్మన్

7. కార్పొరేషన్‌కు రాజకీయ అధిపతి ఎవరు?
జ: మేయర్

 

8. పురపాలక సంస్థలకు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరుగుతాయి?
జ: 5 సంవత్సరాలు

 

9. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
జ: 21

 

10. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపాలిటీ ఏది?
జ: భీమునిపట్నం

 

11. మున్సిపాలిటీలో కనిష్ఠ వార్డుల సంఖ్య
జ: 23

 

12. మున్సిపాలిటీలో గరిష్ఠ వార్డుల సంఖ్య ఎంత?
జ: 50

 

13. ప్రస్తుతం తెలంగాణలోని మున్సిపాలిటీల సంఖ్య ఎంత?
జ: 37

 

14. ప్రస్తుతం తెలంగాణలోని నగర పంచాయతీల సంఖ్య ఎంత?
జ: 26

 

15. ప్రాచీన భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలను అభివృద్ధి చేసిన రాజవంశం ఏది?
జ: మౌర్యులు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌