• facebook
  • whatsapp
  • telegram

వినియోగం లేదా అనుప్రయుక్తం‌

1) లక్ష్యాల లక్షణాలను రూపొందించింది-
జ: ప్రాస్ట్

 

2) గణిత శాస్త్రవేత్తలు సమాజానికి చేసిన కృషిని విద్యార్థికొనియాడాడు - ఇది ఏ రంగానికి చెందిన స్పష్టీకరణ?
జ: భావావేశ రంగం

 

3) ఇచ్చిన భిన్నాలను వివిధ రకాలుగా విద్యార్థి వర్గీకరించాడు. ఇది ఏ లక్ష్యం?
జ: అవగాహన  

 

4) 'ఫలితాలను సరిచూడటం' అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: అవగాహన

 

5) భావావేశ రంగంలో సంక్లిష్టమైంది-
జ: లాక్షణీకరణం

 

6) లక్ష్యాల్లో క్లిష్టమైంది-
జ: మూల్యాంకనం

 

7) పరీక్షాంశాలను తయారు చేయడంలో ఉపయోగపడేవి-
జ: స్పష్టీకరణలు

 

8) ఇచ్చిన సమస్యను సాధించడానికి అనుసరించే సోపానాలను విద్యార్థి విశ్లేషించడం-  
జ: వినియోగం

 

9) విద్యార్థిలో నూతన ఆలోచనను పెంపొందించే విలువ-   
జ: క్రమశిక్షణా విలువ  

 

10) సమితుల బోధనలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ-
జ: సమితులను వర్గీకరించడం    

 

11) ఒక సూత్రాన్ని అవసరానికి తగినట్లుగా వివిధ రూపాల్లోకి మార్చడం అనేది-  
జ: అవగాహన

 

12) A: B = 3 : 5, B : C = 2 : 3 అయితే A : C ఎంత? అనే ప్రశ్న సాధించే బోధనా లక్ష్యం.
జ: వినియోగం

 

13) శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను విద్యార్థి కొనియాడాడు. విద్యార్థి ప్రవర్తనా పరివర్తన ఏ బోధనాభ్యసన రంగానికి చెందింది?
జ: భావావేశ రంగం

 

14) ఒక త్రిభుజాన్ని గీయడానికి విద్యార్థి గణిత ఉపకరణాల పెట్టె నుంచి సరైన పరికరాన్ని ఎన్నుకుంటాడు- అనే స్పష్టీకరణ సూచించే లక్ష్యం ఏది?
జ: నైపుణ్యం

 

15) బోధనా లక్ష్యం లక్షణం కానిది-
జ: అసంపూర్తి వాక్యాలు రాసి ఉంటాయి

 

16) పరీక్షాంశాల నిర్మాణానికి ఉపయోగపడేవి-
జ: స్పష్టీకరణలు

 

17) రాంబస్, చతురస్రాల మధ్య ధర్మాల్లోని భేదాలను విద్యార్థి తెలపగలగడం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
జ: అవగాహన  

 

18) 'సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం' అని పేర్కొన్నది-
జ: బేకన్

 

19) మేధోసంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలు ఏ విలువను సూచిస్తాయి?
జ: క్రమశిక్షణ విలువ
 

20) మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం-
జ: సునిశితత్వం

 

21) భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం-
జ: లాక్షణీకరణం  

 

22) మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం-
జ: సహజీకరణం

 

23) విద్య ప్రధాన లక్ష్యం-
జ: సంపూర్ణ మూర్తిమత్వం సాధించడం 

 

24) ఒక భిన్నానికి అనేక విధాలుగా భిన్నాలు రాయవచ్చని విద్యార్థి సామాన్యీకరణ చేస్తే, ఏ లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పవచ్చు?
జ: అనుప్రయుక్తం  

 

25) విద్యార్థి క.సా.గు., గ.సా.భా.కు చెందిన సమస్యల గణనలను కచ్చితంగా, వేగంగా చేయడం-
జ: నైపుణ్యం

 

26) భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చి కనిష్ఠ సామాన్య హారం తెలపడం-  
జ: అవగాహన

 

27) విశ్లేషణ చేయగలగడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: వినియోగం

 

28) రెండు లక్ష్యాల మధ్య ఉన్న భేదాన్ని విద్యార్ధి తెలియజేయడం అనేది ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది ?
జ: అవగాహన  

 

29) (a + b)2 = a2 +2ab + b2 అంటే రెండు రాశుల మీది వర్గం ఆ రాశుల వర్గాల మొత్తానికి, వాటి లబ్దం రెట్టింపు కలిపితే వచ్చే దానికి సమానం- అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ?
జ: అవగాహన  

 

30) ఒక చతురస్రం వైశాల్యం 4x2 + 4xy + y2 అయితే, ఆ చతురస్రం  చుట్టుకొలతను రాశుల్లో తెలపండి అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను తెలుపుతుంది?
జ: అనుప్రయుక్తం

 

31) 7 సెం.మీ., 14 సెం.మీ., వ్యాసార్ధాలతో వృత్తాలను గీసి, పరిధులను కొలిచి, రెండు వృత్తాల పరిధుల నిష్పత్తిని తెలపండి- అనే ప్రశ్న దేనికి చెందింది?
జ: నైపుణ్యం

 

32) గణిత పరికరాలను స్వయంగా సమకూర్చుకోవడం, చేతితో పనులను చేయడం మొదలైనవి ఏ రంగానికి చెందినవి?
జ: మానసిక చలనాత్మక రంగం

 

33) విద్యార్థి గణితంలో నేర్చుకున్న నియమాలు, సూత్రాలను ఒకచోట చేరుస్తూ, దత్తాంశం నుంచి ప్రారంభించి, సారాంశం వైపు వెళ్తే అది జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?

జ: సంశ్లేషణ
 

34) ఇచ్చిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా విద్యార్థి వర్గీకరిస్తాడు- అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది?
జ: అవగాహన

 

35) సరి సంఖ్యలన్నింటికీ '2' కారణాంకమనే సంబంధాన్ని విద్యార్థి గుర్తిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: అవగాహన

 

36) విద్యార్థి భాగహారాన్ని గుణకార పద్ధతిలో సరిచూడటం అనేది ఏ లక్ష్యానికి చెందింది?
జ: కౌశలం

 

37) ఒక విద్యార్థి ఇచ్చిన భిన్నాల్లో మిశ్రమ భిన్నాన్ని గుర్తించడం అనేది కిందివాటిలో-
జ: అవగాహన

 

38) విద్యార్థి సమస్యను విశ్లేషించి దత్తాంశాన్ని, సాధించాల్సిన అంశాన్ని గుర్తించి, సమస్యను తగిన పద్ధతి ద్వారా సాధించడం-  
జ: అనుప్రయుక్తం

 

39) విద్యార్థి విలువలను కచ్చితంగా, స్పష్టంగా మాపనం చేయడం-   

జ: నైపుణ్యం
 

40) విద్యార్థి 'ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలను వదిలేస్తాడు' - అనేది ఏ రంగానికి చెందింది?
జ: మానసిక చలనాత్మక

 

41) తెలిసిన యదార్థాల నుంచి సామన్యీకరణ చేయడమనేది ఏ లక్ష్యానికి చెందింది?
జ: వినియోగం

 

42) ఎవరి అభిప్రాయం ప్రకారం ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి?
జ: ఎగ్లెస్టన్

 

43) ''జ్యామితి బలీయమైంది కళతో కలిస్తే దానికెదురులేదు'' అని పేర్కొన్నది?
జ: యూరిపిడిస్

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌