• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర శాసన సభ - చట్టాల తయారీ

1. ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపే ధూమపానంపై నిషేధం విధించాలని 2001, నవంబర్ 2న ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?
జ: సుప్రీం కోర్టు

 

2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ధూమపాన నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేసింది?
జ: 2002

 

3. రాష్ట్ర స్థాయిలోని దిగువ సభను ఏమంటారు?
జ: విధానసభ, శాసనసభ
 

4. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో విధానసభ సభ్యుల (MLA) సంఖ్య?
జ: 294

 

5. విభజనానంతరం తెలంగాణ రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య?
జ: 119

 

6. రాష్ట్ర శాసనసభ పదవీకాలం ఎంత ?
జ: 5 సంవత్సరాలు

 

7. జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే రాష్ట్ర విధానసభ కాలపరిమితిని ఒక సంవత్సరం చొప్పున ఎవరు పొడిగిస్తారు?
జ: పార్లమెంటు

 

8. రాష్ట్ర శాసనసభ ఏడాదికి ఎన్ని సార్లు తప్పనిసరిగా సమావేశం కావాలి?
జ: 2

 

9. రాష్ట్ర శాసనసభ రెండు సమావేశాల మధ్య కాలపరిమితి గరిష్ఠంగా ఎంతకాలం మించరాదు?
జ: 6 నెలలు

 

10. కిందివారిలో విధానసభ సభ్యుడిని గుర్తించండి.
      ఎ) MLC       బి) MAL       సి) MLA       డి) MP
జ: సి(MLA)

 

11. కిందివారిలో విధానపరిషత్ / శాసనమండలి సభ్యుడు ఎవరు?
      ఎ) M.L.A       బి) M.L.C       సి) M.P.       డి) M.C.L
జ: బి(M.L.C)

 

12. విధానసభ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: స్పీకర్

 

13. ఏ రాజకీయ పార్టీకి చెందని వారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఏమంటారు?
జ: స్వతంత్ర అభ్యర్థులు

 

14. రాష్ట్ర విధానసభకు పోటీ చేయాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
జ: 25

 

15. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారు?
జ: ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీకి చెందిన వ్యక్తి

 

16. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు?
జ: గవర్నర్

 

17. ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే ఏర్పడే ప్రభుత్వాన్ని ఏమంటారు?
జ: సంకీర్ణ ప్రభుత్వం

 

18. మంత్రిమండలి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: ముఖ్యమంత్రి

 

19. మంత్రులకు రాష్ట్రస్థాయిలో శాఖలను కేటాయించే అధికారం ఎవరికి ఉంటుంది?
జ: ముఖ్యమంత్రి

 

20. మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయాలకు మంత్రులు ఏ విధంగా బాధ్యత వహిస్తారు?
జ: సమష్టిగా

 

21. విధానసభలో ఏదైనా బిల్లును ఆర్థికబిల్లా? కాదా? అని ఎవరు ధ్రువీకరిస్తారు?
జ: స్పీకర్

 

22. సభ ఆమోదం పొందక ముందు చట్టాన్ని ఏమంటారు?
జ: బిల్లు

 

23. శాసనసభ ఆమోదం పొందిన బిల్లు ఎవరి సంతకంతో చట్టంగా మారుతుంది?
జ: గవర్నర్

 

24. శాసనమండలి కాలపరిమితి ఎంత?
జ: శాశ్వతం

 

25. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యుల సంఖ్య?
జ: 40

 

26. శాసనమండలి సభ్యుల (MLC) పదవీ కాలం ఎంత?
జ: 6 సంవత్సరాలు

 

27. శాసనమండలి సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఎంతమంది పదవీ విరమణ చేస్తారు?
జ: 1/3వ వంతు

 

28. 1958లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సమయంలో ముఖ్యమంత్రి ఎవరు?
జ: నీలం సంజీవరెడ్డి

 

29. 1985లో ఆంధ్రప్రదేశ్‌లో విధానపరిషత్ / శాసనమండలిని రద్దుచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ: ఎన్.టి. రామారావు

 

30. 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని పునరుద్ధరించిన ముఖ్యమంత్రి ఎవరు?
జ: Y.S. రాజశేఖర్ రెడ్డి

 

31. శాసనమండలి సభ్యుడిగా పోటీచేయాలంటే ఉండాల్సిన కనీస వయసు ఎంత?
జ: 30 సంవత్సరాలు

 

32. విధానసభ సభ్యులు శాసనమండలికి ఎంతమందిని ఎన్నుకుంటారు?
జ: 1/3వ వంతు

 

33. శాసనమండలికి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంతమందిని ఎన్నుకుంటారు?
జ: 1/3వ వంతు

 

34. శాసనమండలికి ఉపాధ్యాయులు ఎంతమందిని ఎన్నుకుంటారు?
జ: 1/12వ వంతు

 

35. శాసనమండలికి పట్టభద్రులు ఎంతమందిని ఎన్నుకుంటారు?
జ: 1/12వ వంతు

 

36. శాసనమండలికి గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తారు?
జ: 1/6వ వంతు
 

37. శాసనమండలి అధిపతిని ఏమంటారు?
జ: ఛైర్మన్

 

38. తెలంగాణ శాసనమండలి ప్రస్తుత ఛైర్మన్ ఎవరు?
జ: స్వామిగౌడ్

 

39. ప్రస్తుతం తెలంగాణ విధానసభ స్పీకర్ ఎవరు?
జ: ఎస్. మధుసూదనాచారి

 

40. రాష్ట్రాధినేతగా ఎవరిని పరిగణిస్తారు?
జ: గవర్నర్

 

41. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధానసభలో SC వర్గాల వారికి కేటాయించిన సీట్ల సంఖ్య?
జ: 19

 

42. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధానసభలో ST వర్గాలకు కేటాయించిన సీట్ల సంఖ్య?
జ: 12

 

43. గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్రపతి

 

44. గవర్నర్‌గా నియమితుడయ్యే వ్యక్తికి ఎంత వయసు ఉండాలి?
జ: 35

 

45. ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత?
జ: 25

 

46. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
జ: 31

 

47. మనదేశంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను 1772లో ఎవరు ప్రవేశపెట్టారు?
జ: వారన్ హేస్టింగ్స్

 

48. గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యులు ఎవరు?
జ: గ్రామ రెవెన్యూ అధికారి

 

49. మండలస్థాయిలో భూసంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యులు ఎవరు?
జ: తహసీల్దార్
 

50. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల పరిరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
జ: 2002, ఏప్రిల్ 19

 

51. WALTA చట్టం ద్వారా దేన్ని పరిరక్షిస్తారు?
      ఎ) నీరు       బి) భూమి       సి) చెట్లు       డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

52. జిల్లా స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసే అత్యున్నత అధికారి ఎవరు?
జ: జిల్లా కలెక్టర్

 

53. కిందివాటిలో జిల్లా కలెక్టర్‌కు ఉన్న అధికారాలు?
      ఎ) న్యాయ, శాంతి భద్రతలకు సంబంధించిన అధికారం
      బి) అత్యవసర పౌర సరఫరా అధికారం
      సి) రెవెన్యూ అధికారం
      డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

54. కింది వాటిలో WALTA చట్టం పరిధిలోకి వచ్చే అంశం ఏది?
      ఎ) వర్షపు నీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం
      బి) భూగర్భ జలాల పెంపునకు కృషిచేయడం
      సి) సామాజిక అడవుల పెంపకాన్ని విస్తృతం చేయడం
      డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

55. భారత్‌లో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం?
జ: కర్ణాటక

 

56. మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీ?
జ: బల్వంత్‌రాయ్ మెహతా

 

57. మనదేశంలో రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీ?
జ: అశోక్ మెహతా

 

58. తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ మండలాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు?
జ: ఎన్.టి. రామారావు

 

59. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1980

 

60. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 1986లో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి?
జ: ఎన్.టి. రామారావు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌